సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజార్టీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. దీంతో దేశంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 13కు చేరుకుంది. అలాగే, ఆ పార్టీ మిత్రపక్షం టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. ఎన్డీయే కూటమి 164 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కమలదళం ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనా మిత్రపక్షాల మద్దతుతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దపడుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 240 స్థానాలు గెలుచుకుందని ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో దేశ రాజకీయాలను శాసించిన అధికార పార్టీ…
Author: Editor's Desk, Tattva News
ఒడిశాలో బిజూ జనతా దళ్ కోటను బద్దలుకొట్టింది బీజేపీ. వరుసగా ఆరు సార్లు అధికారం చేపట్టిన బీజేడీకి చెక్ పెడుతూ కమలం పార్టీ విజయ దుందుభి మోగించింది. దీంతో ఏడోసారి అధికారం చేపట్టి ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించాలనుకున్న ఆయన కలలపై కమలం పార్టీ నీళ్లు చల్లింది. నిజానికి, మొదట కూటమిగా వెళ్లాలనుకున్న ఇరు పార్టీలు సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరక విడివిడిగా పోటీ చేశాయి. ఇన్నాళ్లు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేడీ అదే పార్టీ చేతిలో ఓటమి పాలైంది. 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీ 51 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 14 చోట్ల, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేడీ చతికిలపడింది. 21 స్థానాల్లో బీజేపీ 20 సీట్లలో ఘన విజయం సాధించగా, కాంగ్రెస్ ఒక స్థానంలో…
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది. ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో టీడీపీ కూటమే విజయం సాధించింది. వైసీపీ ఒక్క ప్రాంతంలో కూడా మెజారిటీ స్థానాలు పొందలేక 11 సీట్లకు పరిమితమైంది. టిడిపి 135 సీట్లలో గెలుపొందగా, మిత్రపక్షాలైన జనసేన 21, బిజెపి 8 స్థానాలలో గెలుపొందాయి. పరాజయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. వీటితో పాటు శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, , కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు, తిరుపతిలో 1, చిత్తూరులో…
మెక్సికో తదుపరి అధ్యక్షురాలిగా ప్రగతిశీలవాది డా. క్లాడియా షీన్‌బామ్ తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. సైంటిస్టు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, హక్కుల కార్యకర్త అయిన ఆమె మెక్సికోను నయా ఉదారవాద విధానాలకు తావులేని ప్రత్యామ్నాయ ఆర్థికాభివృద్ధి నమూనాతో ముందుకు సాగుతానని ప్రకటించారు. తన సహచరుడు, ప్రస్తుత అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రడార్ (ఆమ్లో) అనుసరించిన ప్రజానుకూల విధానాలను కొనసాగిస్తానని చెప్పారు. అక్టోబర్ 1న నూతన అధ్యక్ష బాధ్యతలను ఆమె చేపడతారు. మొరెనా (మూవ్‌మెంట్ ఫర్ నేషనల్ రిజనరేషన్) పార్టీకి చెందిన 61 ఏళ్ల షీన్‌బామ్ లేబర్ పార్టీ (పిటి), గ్రీన్ ఎకాలజిస్ట్ పార్టీ ఆఫ్ మెక్సికో కలిసి ‘లెట్స్ కంటిన్యూ మేకింగ్ హిస్టరీ’ అనే కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమి తరపున బరిలోకి దిగి 58 శాతం ఓట్లతో విజయపతాక ఎగురవేశారు. ఆమె ప్రధాన ప్రత్యర్థి, మితవాద కూటమి (పిఆర్‌ఐ, పిఎఎన్, పిఆర్‌డి) కి చెందిన సోచితిల్ గాల్వెజ్ 28 శాతం…
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న తెలుగు విద్యార్థులు వరుసగా అదృశ్యమవటం, హత్యకు గురవుతుండటం కలకలం రేపుతోంది. గత నెల తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర అనే విద్యార్థి షికాగోలో అదృశ్యమవగా.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల నితీశ కందుల అనే తెలుగమ్మాయి.. కాలిఫోర్నియాలో అదృశ్యమైంది. వారం రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు మిస్సింగ్ ప్రకటన విడుదల చేయటం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. నితీశ.. మే 28వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. చివరిసారిగా ఆమె లాస్ ఏంజిల్స్‌లో కన్పించినట్లు యూనివర్సిటీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత నుంచి నితీశ అదృశ్యమైనట్లు తెలిపింది. ఇదే విషయంపై తోటి విద్యార్థులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. వారం రోజులుగా గాలిస్తున్నా ఎలాంటి ఆచూకీ దొరకకపోవటంతో.. పోలీసులు మిస్సింగ్ ప్రకటన…
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయ్యారు. రేవ్ పార్టీ కేసులో హేమను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. మంగళవారం హేమను కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. గత నెల 20న బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెండు సార్లు హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా అనారోగ్య కారణాలు చూపుతూ హేమ విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు హైదరాబాద్ వచ్చి హేమను అరెస్టు చేశారు. గత నెల 20న బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఈ పార్టీకి టాలీవుడ్ నటి హేమ కూడా హాజరయ్యారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించాలని పోలీసులు…
పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ కోసం పని చేసిన బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. కీలకమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణల కేసులో 14 ఏళ్లు కఠిన కారాగార శిక్షతోపాటు రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర నాగపూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇంజినీర్‌గా నిశాంత్ అగర్వాల్ గతంలో పని చేశాడు. బ్రహ్మోస్ కేంద్రంలో నాలుగేళ్లు విధులు నిర్వహించాడు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)కు కీలకమైన సాంకేతిక సమాచారాన్ని అతడు లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ (ఏటీఎస్) సంయుక్త ఆపరేషన్‌లో అతడ్ని అరెస్టు చేశారు. కాగా, అధికారిక రహస్యాల చట్టం, ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో నిశాంత్ అగర్వాల్‌ను దోషిగా నాగపూర్ జిల్లా కోర్టు నిర్ధారించింది. 14 సంవత్సరాల కఠిన కారాగార…
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో మంగళవారం (జూన్ 4న ) ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించింది. దేశంలో 64.2 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది. ఇదో ప్రపంచ రికార్డు అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. వీరిలో 31 కోట్ల మందికిపైగా మహిళా ఓటర్లు ఉన్నారని ప్రకటించిన సీఈసీ.. ఈ సందర్భంగా లేచి నిలబడి ఈసీ బృందం వారిని అభినందిస్తూ చప్పట్లు కొట్టింది. ఐరోపాలోని 27 దేశాల మహిళా ఓటర్ల కంటే ఇది 2.5 రెట్లు అధికమని పేర్కొన్నారు. ‘642 మిలియన్లు మంది ఓటేసి ప్రపంచ రికార్డు సృష్టించడం భారతీయులుగా గర్వించదగ్గ విషయం.. ఇది మనందరికీ చారిత్రాత్మక ఘట్టం.. కొన్ని చిన్న గణాంకాలను అందించడానికి మాత్రమే ఇది.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ,…
పోస్టల్ బ్యాలెట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను సుప్రీంలో సవాల్ చేసిన వైసీపీకి చుక్కెదురైంది. వైసీపీ పిటిషన్‍ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో తమ వాదన విన్నాకే నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు కేవీయట్ దాఖలు చేవారు. తప్పులు ఉన్నాయనుకుంటే ఎన్నికల తర్వాత పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు సూచించిందని, కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసిందని గుర్తించారు. దీంతో డివిజన్ బెంచ్ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీకి అక్కడ కూడా నిరాశ తప్పలేదు. పోస్టల్ బ్యాలెట్ కి సంభందించి ఎలెక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కోర్టు కొట్టి వేసింది. హైకోర్టు ఉత్తర్వలపై ఈ రోజు సుప్రీంకోర్టు జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చెబట్టింది. వైసిపి…
మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నెల 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనలో అడ్డుకునేందుకు యత్నించిన నంబూరి శేషగిరిరావు తనకు ప్రాణభయం ఉందని, పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాలని, అరెస్టుకు హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలని నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈనెల 6 వరకు అరెస్టు చేయవద్దన్న వెసులుబాటు ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేయగా, ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని సుప్రీం ఆదేశించింది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా.. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన వీడియో గురించి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ ఘటనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయగా పిటిషనర్ తరఫు లాయర్లు ఈవీఎంవను…