Author: Editor's Desk, Tattva News

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేసిన జైరాం రమేశ్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఇసి ఆయనకు నోటీసులు జారీ చేసింది. అమిత్ షాపై ఆరోపణల తాలూకు ఆధారాలు చూపాలని కోరింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్‌లకు ఫోన్ చేశారని జై రామ్ రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు. “మీరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. ఒక జాతీయ పార్టీలో సీనియర్ నాయకులు. మీరు చేసే ఆరోపణలు ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తాయి. వాటిపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు సమర్పించండి. కౌంటింగ్ కు ముందు 150 మంది జిల్లా కలెక్టర్లకు హోం మంత్రి ఫోన్ కాల్స్ చేశారనడానికి తగిన ఆధారాలు చూపండి. ఆ తరువాత తగిన చర్యలు తీసుకుంటాం” అని ఇసి తన లేఖలో పేర్కొంది. “హోం మంత్రి ఇప్పటివరకూ 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై నిఘా పెట్టారు.…

Read More

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థ ల ఎంఎల్‌సి ఉ ప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. బిఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 109 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శాసనసభ ఎ న్నికల్లో పరాజయం తర్వాత జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయం సాధించడం గులా బీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ్యునిగా ఎన్నిక కాగా, ఆయన రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. మార్చి 28న పోలింగ్ జరగగా, 1439 ఓటర్లకు గానూ 14 37 మంది ఓటు హక్కు వినియోగించుకున్నా రు. ఈ ఓట్లను మహబూబ్‌నగర్ బాలుర జూ నియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రంలో లెక్కించారు. పోలైన ఓట్లను సరిచూసుకుని చెల్లుబాటు కాని ఓట్లను వేరుచేశారు. మొత్తం 21 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. చెల్లుబాటైన…

Read More

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌పై వచ్చిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు. మధ్యాన్నం ఇంటి నుంచి బయలుదేరిని కేజ్రీవాల్, రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత హనుమాన్ మందిర్‌ని దర్శించారు. ఆ తర్వాత పార్టీ ఆఫీస్‌కి వెళ్లి నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడిన కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ”21 రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోలేదు.. అన్ని పార్టీలకు ప్రచారం చేశాను.. దేశాన్ని కాపాడేందుకే ప్రచారం చేశాను.. దేశం ముఖ్యం ఆ తర్వాతే ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇది మరచిపోలేని అనుభూతి” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదని ఒప్పుకున్నారని, ఇది ఈ ప్రచారంలో గొప్పతనం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని మండిపడుతూ అఖండ మెజారిటీతో గెలిచిన…

Read More

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను తమ భూభాగం కాదని దాయాది ఎట్టకేలకు అంగీకరించింది. పీఓకే విదేశీ భూభాగమని, దానిపై పాకిస్థాన్‌కు ఎలాంటి అధికార పరిధి లేదని కోర్టుకు స్పష్టం చేసింది. కశ్మీరీ కవి, జర్నలిస్ట్ అహ్మద్‌ ఫర్హాద్‌ షా కిడ్నాప్‌ కేసు విచారణ సందర్భంగా ఇస్లామాబాద్‌ హైకోర్టులో పాక్‌ అదనపు అటార్నీ జనరల్‌ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం.  గత నెల 15న రావల్పిండిలో ఫర్హాద్ షాను ఆయన ఇంటి వద్ద పాక్ నిఘా వర్గాలు అపహరించాయి. ఇస్లామాబాద్ హైకోర్టు‌లో షా భార్య పిటిషన్ వేయడంతో దీనిపై విచారణ జరుగుతోంది. శుక్రవారం నాటి విచారణలో భాగంగా ఫర్హాద్‌ షాను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని జస్టిస్‌ మొహిసిన్ అఖ్తర్ కయానీ ఆదేశించారు. దీనికి అటార్నీ జనరల్‌ బదులిస్తూ.. ఫర్హాద్‌ షా పీవోకేలో పోలీసుల కస్టడీలో ఉన్నారని తెలిపారు. కశ్మీర్‌ ప్రత్యేక రాజ్యాంగం, కోర్టులు కలిగిన విదేశీ భూభాగమని, అక్కడ పాక్‌ చట్టాలు…

Read More

అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ,  సిక్కిం క్రాంతి కారీ మోర్చా (ఎస్​కేఎమ్)​ మారోసారి ఘనవిజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ మొత్తం 60 స్థానాల్లో 46 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్​ ఫిగర్​ దాటింది. దీంతో అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పార్టీ శ్రేణులు ఈటానగర్​తో​ సహా పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 19న మొదటి దశ లోక్​సభ ఎన్నికలతో పాటు 50 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు. మొత్తం 50 స్థానాల్లో బీజేపీ 36 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నేనషల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్​సీపీ మూడు, పీపుల్స్…

Read More

ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం తెగిపోయింది. పదేండ్ల ఉమ్మడి కథ ముగిసింది. జూన్‌ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన జరిగి శనివారానికి పదేండ్లు పూర్తయ్యాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రం కథకు శాశ్వత ముగింపు పడింది. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ను తెలంగాణకు శాశ్వత రాజధానిగా, ఏపీ రాష్ర్టానికి పదేండ్ల పాటు తాత్కాలిక, ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ గడువు శనివారంతో ముగిసింది. ఇక నుంచి హైదరాబాద్‌ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనున్నది. విభజన చట్టం సెక్షన్‌-8 ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల రక్షణ బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. దీంతోపాటు, ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల ప్రాణ, ఆస్తి, రక్షణ భద్రతలను కాపాడే బాధ్యతలను గవర్నర్‌ చేతికిచ్చారు. తాజాగా ఈ గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ చేతికి ఈ బాధ్యత అందుతుంది. ఇప్పటికే అత్యంత కీలకమైన…

Read More

ఆరు నెలల క్రితమే తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలలో బిజెపి చెక్ పెడుతున్నట్లు వెల్లడవుతుంది. తెలంగాణలో లోక్‌సభ పోరు కాంగ్రెస్, బిజెపి నడుమే నువ్వా నేనా అన్నట్లుగా సాగినట్లు ఎగ్జిట్‌పోల్స్‌ను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇద్దరికి సమాన సంఖ్యలో సీట్లు దక్కుతాయని చెబుతుండగా, మరికొన్ని మాత్రం ఓ అడుగుముందుకేసి కాంగ్రెస్‌తో పోల్చితే కమలం పార్టీ ఒకటి, రెండు స్థానాలు ఎక్కువ సాధించినా ఆశ్చర్య పోనక్కర్లేదని స్పష్టం చేశాయి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్ ఒకటి లేదా సున్నా, ఎంఐఎం ఒక స్థానానికి పరిమితమవుతాయని వెల్లడించాయి. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎగ్జిట్‌పోల్స్ కాస్త గందరగోళానికి గురిచేశాయి. కొన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెబుతుండగా.. మరికొన్ని మళ్లీ జగన్ అధికార పీఠాన్ని తిరిగి దక్కించుకోబోతున్నారని చెప్పాయి. మెజారిటీ సంస్థలు మాత్రం టిడిపి,జనసేన,బిజెపి కూటమివైపే మొగ్గు చూపాయి. ఆరా, ఇండి యా టివి,…

Read More

లోక్‌సభ 2024 ఎన్నికల ఏడో దశ పోలింగ్ శనివారం ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరగనుంది. వీటి ఫలితాల కోసం పౌరులతోపాటు రాజకీయ పార్టీల నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపునకు ఇప్పుడు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈవీఎంలు ఉంచిన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్‌ పూర్తయింది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఇప్పుడు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. కానీ ఆదివారం (జూన్ 2న) ఉదయం 6 గంటలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల…

Read More

రెండు సార్లు అధికార పీఠంపై కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే వరుసగా మూడోసారి కైవసం చేసుకోబోతున్నారని మెజారిటీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. కమలం పార్టీని ఈ సారి ఎలాగైనా కట్టడి చేయాలన్న లక్షంతో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడినప్పటికీ ఓటర్లు విశ్వసించలేదని ఘంటా పథంగా చెప్పాయి. 400 సీట్లే లక్షంగా ఈ సారి బరిలోకి దిగిన కమల దళం నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి ఎక్కువలో ఎక్కువ 390 సీట్లు సాధిస్తుందని, అయితే ‘చార్ సౌ’ సాధ్యం కాదని కుండబద్ధలు కొట్టాయి. దైనిక్ భాస్కర్, జన్‌కీ బాత్, న్యూస్ నేషన్, రిపబ్లిక్ భారత్‌మాట్రిజ్, రిపబ్లిక్ పి మార్క్, ఇండియా న్యూస్‌డి డైనమిక్స్ తదితర సంస్థలు మళ్లీ బిజెపిదే అధికారమని చాటి చెప్పాయి. ఒక్క దైనిక్‌ భాస్కర్‌ మినహా మిగిలిన అన్ని సంస్థలు ఎన్డీయే కూటమికి 350 సీట్లకు పైనే వస్తాయని; ఇండియా కూటమికి 200 స్థానాల్లోపు వస్తాయని అంచనా వేశాయి. ఎన్డీటీవీ…

Read More

లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ముగిశాయి.. దేశవ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని విశ్లేషించి pఆంధ్రప్రదేశల్‌లొ ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీంతో పలు సర్వే సంస్థలు ఏపీలో అధికారం కూటమిదేని స్పష్టం చేశాయి. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఏపీలో అధికారం కూటమిదేనంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 106-119 సీట్లను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంటుందని బిగ్ టీవీ తేల్చి చెప్పింది. ఇక అధికార వైసీపీకి 56-69 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది బిగ్…

Read More