Author: Editor's Desk, Tattva News

తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. జూన్‌ 2న జయ జయహే తెలంగాణ గేయం జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. 2.30 నిమిషాలు, 13.30 నిమిషాల నిడివితో జయ జయహే తెలంగాణ గేయం ఉంటుందన్నారు. మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గేయమని తెలిపారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర గీతాన్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం ఆలపించింది. ఈ గీతంపై సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.అంతకు ముందు ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, తెలంగామ జాగృత సమితి నేతలతో సమావేశమయ్యారు. సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన బృందం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించి వినిపించారు. గీతంలో చేసిన…

Read More

ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ చిన్న ఇబ్బంది కలిగించినా ఉపేక్షించబోమని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ ఏజెంట్లు అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.  ‘కౌంటింగ్ రోజు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదని మరోసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా పోలీసుల నిఘా కొనసాగుతుందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు.  రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం నడచుకోవాలని సీఈవో  మీనా సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీమ్ అస్మితో కలిసి గురువారం ఆయన…

Read More

సెంట్రల్ ముంబైలోని గాందేవిలో గోల్డెన్ క్రౌన్ హోటల్ నిర్వహిస్తున్న జాయా షెట్టిని 2001లో హత్య చేసిన కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జయా షెట్టి హత్య కేసులో చోటా రాజన్‌ను దోషిగా మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్(ఎంసిఓసిఎ) కింద నమోదయ్యే కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. చోటా రాజన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎఎం పాటిల్ తీర్పు వెలువరించారు. 2001 మే 4న చోటా రాజన్‌కు చెందిన ముఠా సభ్యులు హోటల్‌లోని మొదటి అంతస్తులో జయా షెట్టిని కాల్చి చంపారు. హోటల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.  చోటా రాజన్ గ్యాంగు సభ్యుడైన హేమంత్ పూజారి నుంచి జయా షెట్టికి డబ్బు కోసం బెదిరింపు కాల్స్ వచ్చాయని, డబ్బు చెల్లించకపోవడంతో ఆయనను…

Read More

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్‌ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  అలాగే, కౌంటింగ్‌ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించోద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇక, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ 4వ తేదీన ఉదయం 8 గంటలకు స్టార్ట్‌ కానుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ సిస్టమ్‌లో వచ్చిన ఓట్లను లెక్కించి ఆ తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నారు.  ఈ లెక్కింపునకు అర్థగంట కంటే ఎక్కువ టైం పడితే ఓ వైపు వాటిని లెక్కిస్తూనే 8. 30నిమిషాలకు ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం స్టార్ట్‌ చేస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు…

Read More

కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో తాజాగా రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్‌లో రూ.87 కోట్ల స్కామ్‌ వెలుగుచూసింది. కార్పొరేషన్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యాయి. ఈ ఏడాది మార్చిలో అక్రమ మార్గంలో నిధులు ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు తెలుస్తున్నది.  ఈ కుంభకోణంలో ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి బీ నాగేంద్ర హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్టీ కార్పొరేషన్‌లో పనిచేసే అకౌంట్స్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొన్న నేపథ్యంలో ఈ స్కామ్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్‌ ఆత్మహత్య నోట్‌లో మంత్రి నాగేంద్రతో పాటు పలువురు కార్పొరేషన్‌ ఉన్నతాధికారుల పేర్లను ప్రస్తావించారు. తన చావుకు కార్పొరేషన్‌ ఎండీ జేజీ పద్మనాభం, అకౌంట్స్‌ ఆఫీసర్‌ పరుశురాం దురుగన్నవర్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్‌ సుచిస్మిత రావల్‌ కారణమని చంద్రశేఖర్‌ తన సూసైడ్‌ నోట్‌లో రాశాడు. ఎస్టీ…

Read More

దేశంలో ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతంలో ఇదివరకెన్నడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ముంగేష్‌పుర్‌లో 52.3 డిగ్రీల సెల్షియన్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత వాతావరణ విభాగం (ఐఎండి) ప్రాంతీయ అధిపతి కులదీప్ శ్రీవాస్తవ అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలు వివరించారు. రాజస్థాన్ నుంచి వీచే వేడిగాలుల తాకిడికి ఢిల్లీ శివారు ప్రాంతాలే మొదట గురవుతుంటాయని చెప్పారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే అత్యంత వేడితో అధ్వాన్నంగా తయారయ్యాయని, తీవ్రమైన వేడిగాలులకు మొదట బలయ్యేవి ముంగేష్‌పుర్, నారెల, నజఫ్‌గడ్, ప్రాంతాలని తెలిపారు. అనుకున్నదాని కన్నా తొమ్మిది డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండగా , రెండోరోజు మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. మంగళవారం నార్త్ వెస్ట్ ఢిల్లీ ప్రాంతంలో 49.9 డిగ్రీలుగా నమోదు కాదా, ఆ మరుసటి రోజే మరింతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2002లో 49.2 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు…

Read More

ఒడిశాలో ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేసేటట్లయితే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్య స్థితి ‘అకస్మాత్తుగా’ క్షీణించడం వెనుక కారణం నిర్ధారణకై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వాగ్దానం చేశారు. నవీన్ ఆరోగ్యం క్షీణత వెనుక ‘కుట్ర’ ఉండవచ్చునని ఆయన సూచించారు. బారిపడలో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘పట్నాయక్ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడం వెనుక ఏదైనా కుట్ర ఉన్నదా? పట్నాయక్ తరఫున ప్రభుత్వాన్ని ప్రస్తుతం నడుపుతున్న లాబీ ఆయన ఆరోగ్యం అకస్మాత్ క్షీణతకు బాధ్యురాలా?’ అని ప్రశ్నించారు. ‘ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఒడిశాలో ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేసేటట్లు అయితే పట్నాయక్ ఆరోగ్యం క్షీణత వెనుక కారణం నిర్ధారణకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది’ అని ప్రధాని తెలిపారు. తమిళనాడుకు చెందిన, పట్నాయక్‌కు సన్నిహితునిగా భావిస్తున్న బిజెడి నేత వికె పాండియన్‌ను దృష్టిలో పెట్టుకుంటూ, ‘మొత్తం ఒడిశా ఒక ఒడియా…

Read More

లోక్‌సభకు జూన్‌ 1వ తేదీన జరిగే ఏడవ, చివరి విడత ఎన్నికల్లో 904 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) నివేదిక ప్రకారం వీరిలో 22% మంది అంటే 199 మందికి నేర చరిత్ర ఉంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగే ఏడో విడత ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్లను ఎడిఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ విశ్లేషించాయి.  తుది దశలో బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఒడిషా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లోని 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. కేసుల స్వభావం తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని 151 మంది (17%) అభ్యర్థులు తమ అఫిడవిట్లలో ప్రకటించారు. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలుశిక్ష పడుతుంది. ఇవి నాన్‌ బెయిలబుల్‌ కేసులు.  ఏడో దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 13…

Read More

ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. ఢిల్లీలోని బిజెపి ఎంపి లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కెసిఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ ప్రభుత్వం ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తోందని అడిగారు. కాంగ్రెస్ పెద్దల ఒత్తిడితో కేసును నీరుగార్చవద్దని సూచించారు. గత పది సంవత్సరాల నుంచి పోలీస్ వ్యవస్థ బిఆర్‌ఎస్ నాయకులకు అనుకూలంగా పని చేసిందని, ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని ఎంపి లక్ష్మణ్ మండిపడ్డారు. అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ నాయకులను ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఆర్థిక వనరులను దెబ్బతీసిందని దుయ్యబట్టారు. వాంగ్మూలంలో హరీష్ రావు, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పేర్లు బయటకు వస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ డిసెంబర్ 9 నుంచి అగష్టు 15కు వాయిదా వేయడంతో తెలంగాణ ప్రజలు…

Read More

దేశ ప్రజానీకంపై మరోమారు టోల్‌ఛార్జీ భారం పడనుంది. ప్రస్తుత ధరలపై ఐదు నుండి ఏడు శాతం పెంచడానికి కసరత్తు జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టోల్‌ ఛార్జీలను బాదేయాలని చూసిన ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల దరిమిలా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జాన్‌ మొదటి వారంలోనే టోల్‌ పెంపు నిర్ణయాన్ని అమలులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ప్రస్తుతం ఏపీలో 55 జాతీయ రహదారుల్లో 8683.15 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వీటిపై సుమారు 72 వరకూ టోల్‌గేట్లు ఉన్నాయి. ఇచ్ఛాపురం నుండి తడ వరకూ ఉన్న 16వ నెంబరు జాతీయ రహదారిపై 16 టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేశారు. 1997లో కిలోమీటర్లుకు రూ.1.50 పైసలు మాత్రమే వసూలు చేస్తామని కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్న కేంద్రంలోని జాతీయ రహదారుల విభాగం ఇప్పుడు కిలోమీటరుకు లారీకి అయితే ఆరు నుండి ఎనిమిది రూపాయలు వరకూ వసూలు చేస్తోంది.  కార్లు, బస్సులు, ఇతర వాహనాలకు…

Read More