శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గేమింగ్ జోన్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నుంచి దేశం తేరుకోక ముందే మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ఏరియాలోని బేబీ కేర్ న్యూ బోర్న్స్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు పసికందులు అగ్నికి ఆహుతయ్యారు. మరో ఐదుగురు చిన్నారులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరుగురు పసికందులు అక్కడికక్కడే చనిపోగా, మరో నవజాత శిశవు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హృదయవిదారకమైన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ ప్రమాదానికి ఆక్సిజన్ సిలిండర్ పేలుడే కారణమని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నా యి..దర్యాప్తులో కానీ, అసలు విషయం తేలదని పోలీసులు పేర్కొన్నారు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలియగానే 16 అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే యత్నం చేశాయి. ఆసుపత్రిలో ఒక…
Author: Editor's Desk, Tattva News
ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నెల పాటు పొడిగించింది. పాండే పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. ఆయన 25 నెలల పాటు సేవలందించారు. ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా జనరల్ మనోజ్ సి పాండేని ఒక నెల పాటు అదే పదవిలో కొనసాగించేందుకు అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రటకనలో పేర్కొంది. దీంతో ఆర్మీ రూల్స్ 1954లోని రూల్ 16 ఎ (4) ప్రకారం ఆయన తన పదవిలో ఈ ఏడాది జూన్ 30 వరకు కొనసాగుతారని తెలిపింది. 1982లో కార్పస్ ఆఫ్ ఇంజనీర్స్ ( ద బాంబే సాప్పర్స్) ద్వారా ఆర్మీలో చేరిన పాండే 40 ఏళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నారు. అత్యంత కీలకమైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో సరిహద్దు రక్షణకు సంబంధించిన ఈస్టరన్ ఆర్మీ కమాండ్‌గా ఆయన పని చేశారు.…
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గుట్కా, పాన్ మాసాలపై మరో ఏడాది నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పొగాకు, నికోటిన్ తో తయారు చేసే గుట్కా, పాన్ మసాలా తయారీ, అమ్మకంపై నిషేధం విధించారు. మే 24, 2024 నుంచి ఒక సంవత్సరం పాటు గుట్కా, పాన్ మసాలాపై నిషేధం అమల్లో ఉంటుందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు అధికారులు. గుట్కా, పాన్ మసాలా తయారీ, అమ్మకం, సరఫరా, స్టోరేజీ, పంపిణీపై ఏడాది పాటు నిషేధం విధించినట్లు ప్రకటించారు. గుట్కా, పాన్ మసాలాల్లోని పొగాకు, నికోటిన్ ఆరోగ్యానికి అత్యంత హానికరం. వీటి వినియోగంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయి. వీటితో నోటి క్యాన్సర్, ఫైబ్రోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా వాడకంతో క్యాన్సర్లు వస్తున్నాయన్నారు. వారణాసిలో నమోదు…
ఐపీఎల్ 2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడారు. మెంటార్‌గా గౌతమ్ గంభీర్ రీఎంట్రీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టింది. మరోసారి పేలవ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తయ్యింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆరెంజ్ ఆర్మీకి నిరాశ తప్పలేదు. హోరాహోరీ పోరు తప్పదనుకున్న ఈ ఫైనల్ మ్యాచ్.. సన్‌రైజర్స్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఎయిడెన్ మార్క్‌రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20), ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు…
హమాస్ గాజా నుంచి రాకెట్ల పరంపరను ప్రయోగించగా కొన్ని నెలల్లో మొదటిసారిగా టెల్ అవీవ్‌తో సహా మధ్య ఇజ్రాయెల్ వ్యాప్తంగా రాకెట్ సైరన్లు వినిపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. టెల్ అవీవ్‌పై ‘భారీ క్షిపణి దాడి’కి ఉపక్రమించినట్లు హమాస్ సాయుధ దళ విభాగం ది అల్ కస్సమ్ బ్రిగేడ్స్ ప్రకటించింది. రాయిటర్స్ వార్త ప్రకారం, ఇజ్రాయెల్ సైన్యం వెంటనే స్పందించి రాకెట్ల రాక పట్ల హెచ్చరికగా మధ్య నగరంలో సైరన్లను మోగించింది. ‘పౌరులపై యూదుల మారణకాండ’కు ప్రతీకారంగా రాకెట్లు ప్రయోగించినట్లు అల్ కస్సమ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ చానెల్‌లో వెల్లడించింది. గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లు ప్రయోగించినట్లు హమాస్ అల్ అక్సా టివి ధ్రువీకరించింది. టెల్ అవీవ్‌లో రాకెట్ సైరన్లు వినిపించడం నాలుగు నెలల్లో మొదటిసారి. అయితే, సైరన్లకు కారణం ఏమిటో ఇజ్రాయెలీ మిలిటరీ వెంటనే స్పష్టం చేయలేదు. ప్రాణ నష్టం గురించిన సమాచారం ఏదీ తమకు రాలేదని ఇజ్రాయెలీ…
తెలంగాణలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో 12 మంది మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల ఫారం గోడ కూలి నలుగురు కార్మికులు మరణించారు. అదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు లక్ష్మణ్(12) మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడటంతో నాగిరెడ్డి రామ్ రెడ్డి మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ శివారులో నిర్మాణంలో ఉన్న డైరీ షెడ్డు భారీ ఈదురుగాలులకు రేకులు ఎగిరిపడి గోడ కూలడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రానికి శివారు లో అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో బెల్లె మల్లేష్…
గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌కోట్ నగరంలోని టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘోరకలిలో ఇప్పటివరకు 27 మంది సజీవ దహనం అయ్యారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆకాశాన్ని అంటేలా పొగ ఆ ప్రాంతం మొత్తం విస్తరించింది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. భారీగా ఫైరింజన్లను ఘటనా స్థలికి తరలించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. ఆ గేమింగ్ జోన్‌లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. శనివారం కావడంతో చాలా మంది జనం ఆ టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో ఆటలు ఆడేందుకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ గేమింగ్ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని.. అవి క్రమంగా వ్యాపించి భారీ ప్రమాదానికి కారణం అయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గేమింగ్ జోన్‌లో చాలా…
తెలంగాణ రాష్ట్ర గీతంగా అందె శ్రీ రచించిన `జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (డిసిఎంఏ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. మన రాష్ట్ర గీతాన్ని వేరే వాళ్లతో పాడించడం, సంగీతం కూర్చడసం సరికాదని అభిప్రాయపడింది. “అందెశ్రీ రచించిన గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు ప్రకటించి విడుదల చేయబోతున్నందుకు తెలంగాణ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా తెలంగాణ సినీ మ్యూజిషియస్ అసోసియేషన్ (డిసిఎంఏ) కూడా గర్వపడుతున్న గొప్ప సందర్భం ఇది. పదేళ్ల క్రితమే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే ఎంతో బాగుండేది. అలా జరగకపోవడం దురదృష్టకరం” అని పేర్కొన్నది. గత ప్రభుత్వం…
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా సాగుతోంది. ఇందులో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించారు. ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ విభాగంలో ఉత్తమ నటి గా అవార్డు అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించారు. బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటిన్ బొజనోవ్ తెరకెక్కించిన ది షేమ్‌లెస్ చిత్రానికి గానూ ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఇందులో ‘రేణుక’ అనే సెక్స్ వర్కర్ పాత్ర పోషించారు. ఈ సినిమాను భారత్, నేపాల్‌లో నెలన్నర రోజుల పాటు చిత్రీకరించారు. తాజాగా జరుగుతున్న కేన్స్ ఉత్సవానికి ఈ చిత్రం ఎంపికయింది. ఈ వేడుకల్లో దీన్ని ప్రదర్శించగా.. వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన అనసూయ కొన్నేళ్ల నుంచి సినీ రంగంలో ఉన్నారు. ముంబయిలో ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించేవారు. దర్శకుడు బొజనోవ్ ఆమెకు ఫేస్‌బుక్ స్నేహితులు. ఒకసారి ఆడిషన్ టేప్ పంపమని…
సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీ కేసు విచారణలో భాగంగా కర్ణాటక పోలీసులు హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో పాల్గొన్న 101మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్ష చేయగా అందులో 86మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందులో 59మంది పురుషులు, 27మంది మహిళలు ఉన్నారు. పాజిటీవ్ వచ్చిన వారందరికీ సిసిబి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారిలో హేమతోపాటు కాంతి, సుజాత్, రాజశేఖర్, చిరంజీవి, ఆషీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివాని, జైశ్వాల్, వ్రుణ్ చౌదరి, తదితరులకు ఉన్నారు. వీరందరు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరిని డ్రగ్స్ గురించి విచారించనున్నట్లు తెలిసింది. ఎవరు డ్రగ్స్ విక్రయించారు,…