Author: Editor's Desk, Tattva News

ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించిన ఆరు నూతన పాలసీలు తయారు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఎంఎస్ఎంఈ, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వాహనాల సవరించిన విధానాలు రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు. టెక్స్ టైల్స్ రంగానికి సంబంధించి పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా పాలసీలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీలకు సంబంధించి సమీక్ష…

Read More

లోక్‌సభ ఎన్నికలకు చెందిన ఐదు దశలు పూర్తయిన తర్వాత బిజెపి ఇప్పటికే 310 సీట్లు గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. బాబూ అధికారుల రాజ్యం) నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసి కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడేందుకు అనుమతించాలని ఒడిశా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం సంబల్‌పూర్‌లో రెండు ఎన్నికల ప్రచార సభలలో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ఒడిశాలో కమలం వికసిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరవ విడత, ఏడవ విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత బిజెపి 400కి పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఒడిశాలో కొద్ది మంది అధికారుల చేతుల్లో అధికార పగ్గాలు ఉన్నాయని అమిత్ షా ఆరోపించారు. ప్రస్తుతం సాగుతున్న అధికారుల పాలన ఈ ఎన్నికలతో అంతం అయిపోతుందని ఆయన చెప్పారు. కియోంఝర్ జిల్లాలో ఉన్న గనులు, ఖనిజ నిక్షేపాలు చాలావరకు లూటీ అయిపోయాయని, అయినప్పటికీ…

Read More

వరంగల్ కు చెందిన రోజు వారీ కూలి కుమార్తె ప్రపంచ పారా 400 మీటర్ల రికార్డును బద్దలు కొట్టింది. జపాన్‌లోని కోబ్‌ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్‌ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో వరంగల్ కు చెందిన యువ స్ప్రింటర్‌ దీప్తి జివాంజీ రికార్డు సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీలో దీప్తి జివాంజీ 55.06 సెకన్లలోనే పరుగును పూర్తి చేసి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. దీంతో పాటు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది దీప్తి. ఈ పోటీలో అసైల్‌ ఒండర్‌ (55.19 సెకన్లు), లిజాన్‌శెలా అంగులో (56.68 సెకన్లు) సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించారు. గతేడాది అమెరికా పారా అథ్లెట్‌ బ్రియాన్నా క్లార్క్‌ 55.12 సెకన్ల రికార్డును వరంగల్ అమ్మాయి బద్దలుకొట్టింది. త్వరలో జరిగే పారిస్‌ పారా ఒలింపిక్స్‌ కు కూడా జివాంజీ అర్హత సాధించింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో వరంగల్‌…

Read More

కలకత్తా హైకోర్టు జడ్జీగా సోమవారం రిటైర్​ అయిన జస్టిస్​ చిట్ట రంజన్​ దాస్​ ఆర్​ఎస్​ఎస్​ (రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​)పై తన ప్రేమను చాటుకున్నారు. ‘ఇప్పటికీ, ఎప్పటికీ నేను ఆర్​ఎస్​ఎస్​ సభ్యుడినే. అవసరమైతే ఆర్​ఎస్​ఎస్​లోకి తిరిగి వెళ్లిపోతాను,’ అంటూ ఇతర న్యాయమూర్తులు, బార్​ సభ్యుల సమక్షంలో చేసిన వీడ్కోలు ప్రసంగంలో వ్యాఖ్యానించారు జస్టిస్​ చిట్ట రంజన్​ దాస్​. “నేను ఇప్పుడు చెప్పేది కొందరికి నచ్చకపోవచ్చు. కానీ.. నేను ఇప్పటికీ, ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ సభ్యుడినే. ఇప్పుడు రిటైర్​ అవుతున్నాను. నేను చేయగలిగినది ఏమైనా ఉంటే, ఆర్​ఎస్​ఎస్ ​ నాకు బాధ్యతలు అప్పగిస్తే.. కచ్చితంగా చేస్తాను,” అని చెప్పుకొచ్చారు జస్టిస్​ చిట్ట రంజన్​ దాస్​. ఒడిశా హైకోర్టు నుంచి ట్రాన్స్​ఫర్​ మీద కలకత్తా హైకోర్టుకు వెళ్లిన జస్టిస్​ దాస్​.. సోమవారం రిటైర్​ అయ్యారు. “నేను ఆర్​ఎస్​ఎస్​కి చాలా రుణపడి ఉన్నాను. నా బాల్యం, యుక్త వయస్సు అంతా అందులోనే గడిపాను. ధైర్యంగా, నిజాయతీగా ఎలా ఉండాలో…

Read More

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)పై మరో ఉచ్చు బిగిస్తున్నది. ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ, పంజాబ్‌లలో అధికార పార్టీ ఆప్‌కు రూ.7 కోట్లకుపైగా విదేశీ నిధులు అందాయని ఈడీ ఆరోపించింది. ఈమేరకు కేంద్ర హోంశాఖకు సోమవారం లేఖ రాసింది. ఈ వ్యవహారంపై ఎఫ్‌సీఆర్‌ఏ, ప్రజా ప్రాతినిథ్యం చట్టం కింద విచారణ చేపట్టాలని ఈడీ కోరింది. ‘2015, 2016లలో అమెరికా, కెనడాలో నిధుల సేకరణ చేపట్టిన ఆప్‌కు రూ.7.08 కోట్లు విదేశీ నిధులు అందాయి. దీంట్లో విదేశీ దాతల గుర్తింపు, జాతీయతలను తారుమారు చేసింది. అలాగే ఇతర వివరాలు మార్చింది’ అని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కెనడాకు చెందిన కొంతమంది దాతల పేర్లను పార్టీ ఫైనాన్షియల్‌ రికార్డ్స్‌లో ఆప్‌ దాచిపెట్టిందని హోం శాఖకు ఈడీ తెలిపింది. ‘ఎఫ్‌సీఆర్‌ఏ ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్ని సాధారణంగా సీబీఐ విచారిస్తుంది. ఆప్‌ను ఉద్దేశించి ఈడీ చేసిన ఆరోపణలపైనా కేంద్ర హోంశాఖ చర్యలు…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ, సిబిఐ కేసుల్లో ఇప్పటికే ఆమె కస్టడీలో ఉండగా పొడిగించాలని దర్యాప్తు సంస్థ లు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత సహా నలుగురిపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై సోమవారం కోర్టులో వాదనలు జరిగాయి. ఐదుగురు నిందితుల పాత్రపై ఆధారాలు పొందుపరిచామని కోర్టులో ఇడి వెల్లడించింది. కవిత, దామోదర్, ప్రిన్స్ కుమా ర్‌తో పాటు మరో ఇద్దరిపై ఏడో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపింది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధమవ్వగా ఆమె పాత్ర మినహా మిగతా నలుగురి పాత్ర గురించి వివరించాలని జడ్జి ఆదేశించారు. ఈ నెల 14న కూడా ఎంఎల్‌సి కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియగా…

Read More

ఒడిశా లోని బిజూ జనతాదళ్ ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను మాత్రమే ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ద్వారా ప్రజలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కటక్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని మీడియా చెబుతోందని, కానీ అది నిజం కాదని స్పష్టం చేశారు. “మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేశారు. మొదటిసారి ప్రజల్లో ఎంతో ఉత్సుకత కనిపిస్తోంది. 25 ఏళ్ల తర్వాత కనిపిస్తున్న ఈ ఉత్సాహం చూస్తుంటే ఒడిశా కొత్త చరిత్రను సృష్టించడం ఖాయమైనట్టే” అంటూ చెప్పుకొచ్చారు. జూన్ 10న ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయడం తధ్యం అని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. మీ అందరి ఆశీస్సులతో మోదీ ప్రభుత్వం…

Read More

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ సోమవారం అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై రెండ్రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. 150 పేజీలతో ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాధమిక ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ సమర్పించారు. అనంతరం డీజీపీ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించినట్లు చెప్పారు. నిందితుల అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు…

Read More

హైదరాబాద్ లో చేపమందు పంపిణీకి బత్తిని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. చేప మందు కోసం వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉబ్బసం, ఆస్తమా, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప మందు లేదా చేప ప్రసాదాన్ని ఏటా బత్తిని కుటుంబ సభ్యులు ఉచితంగా పంపిణీ చేస్తారు. చేప మందుతో శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయని చాలా మంది నమ్ముతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చేప మందు కోసం వస్తారు. ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తుంటారు. 1847లో హైదరాబాద్‌ సంస్థానంలో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. అప్పట్లో…

Read More

తెలుగు యువకుడు గోపీచంద్‌ తోటకూర అరుదైన ఘనత సాధించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఆరిజిన్‌ ఎన్‌ఎస్‌ 25 మిషన్‌ ద్వారా ఆయన ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చారు. పశ్చిమ టెక్సాస్‌ నుంచి ఆరుగురు సభ్యులతో తమ ఏడో మానవ సహిత వ్యోమనౌక(న్యూ షెఫర్డ్‌) రోదసిలోకి వెళ్లినట్టు బ్లూ ఆరిజిన్‌ సంస్థ సోషల్‌ మీడియాలో ప్రకటించింది. పర్యటన తర్వాత వీరు వెళ్లిన కాప్సూల్‌ పారాచూట్‌ సాయంతో తిరిగి భూమి మీదకు చేరుకుంది. భూవాతావరణం, అంతరిక్ష సరిహద్దుగా భావించే కర్మన్‌ రేఖ ఎగువకు, భూవాతావరణం నుంచి 105.7 కిలోమీటర్ల ఎత్తుకు ఈ వ్యోమనౌక వెళ్లి వచ్చింది. అక్కడ కొన్ని నిమిషాల పాటు వీరు భారరహిత స్థితిని అనుభూతి పొంది తిరిగొచ్చారు. అంతరిక్ష పర్యటన కోసం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ బ్లూ ఆరిజిన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గోపీచంద్‌ అమెరికాలో స్థిరపడ్డారు.…

Read More