Author: Editor's Desk, Tattva News

లైంగిక దౌర్జన్యం కేసులో తప్పు చేసిన వారిని వదిలిపెట్టొద్దంటూ జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోరారు. తన మనవడు, హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల వ్యవహారంలో తొలిసారి స్పందించిన దేవెగౌడ, ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇందులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదంటూ వ్యాఖ్యానించారు. “ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడు. చట్టప్రకారం చర్యలు ఉండాలని ఇప్పటికే హెచ్‌డీ కుమారస్వామి చెప్పాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు చెప్పను కానీ వారిపై కూడా చర్యలు ఉండాలి” అని దేవెగౌడ అన్నారు. ఇదిలా ఉంటే ప్రజ్వల్‌తో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో ఉన్న సమయంలో కూడా టచ్‌లో లేనన్నారు. అతడి వెంట పరిగెత్తాలా ఏంటి?” అని ప్రశ్నించారు. మరోవైపు కిడ్నాప్‌ కేసులో ‌అరెస్టైన కర్ణాటక మాజీ మంత్రి, ప్రజ్వల్ తండ్రి…

Read More

తెలంగాణాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. వడ్లు కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎప్పుడు పడిపోతుందో తెలియని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కాదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బిజెపితో టచ్‌లో ఉన్నారని సంచనల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖ నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని దయ్యబట్టారు. ధాన్యాన్ని కొనుగోలు చేయించలేని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తమ్‌కు రైతాంగ సమస్యలపై ఏమాత్రం అవగాహన…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ వలె ఇటాలియన్ కాదని, ఆమెకు హిందీ రాదని నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ సీటుకు బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్ శుక్రవారం తెలిపారు. మోదీ భూమి పుత్రుడు అని, ఆయన దేశ ప్రగతి కోసం పాటుపడుతున్నారని కంగన చెప్పారు. కులూ జిల్లా జగత్ ఖానాలో ఒక ర్యాలీలో కంగన ప్రసంగిస్తూ, మోదీ సత్పరిపాలనకు ప్రతీక అని, పహాడీతో సహా పలు భాషలు ప్రధానికి తెలుసునని చెప్పారు. ‘సోనియా గాంధీ వలె ప్రధాని మోదీ ఇటాలియన్ కారు. ఆమెకు హిందీ తెలియదు. ఆయన భూమి పుత్రుడు, ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు, దేశ సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు. ఒక వైపు మోదీ సత్పరిపాలన ఉందని, మరొక వైపు కాంగ్రెస్ అవినీతి ఉందని, జూన్ 1న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి విజయం…

Read More

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ను ఈడీ నిందితురాలిగా చేరింది. ఈ మేరకు శుక్రవారం ఇడి మరో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను రాస్‌ అవెన్యూ కోర్టులో దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ ని నిందితులుగా పేర్కొంది. ఈ కేసులో ఈడీ  దాఖలు చేసిన ఎనిమిదో ఛార్జ్‌షీట్‌ ఇది. అయితే, ఈ కేసులో కేజ్రీవాల్‌పైనా, ఆప్‌పైనా ఇడి అభియోగాలు మోపడం ఇదే తొలిసారి. ఈ కేసులో ఇప్పటివరకు 18 మందిని ఈడీ  అరెస్టు చేసింది. ‘ ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్‌ కీలక పాత్ర పోషించారు. ఈ స్కామ్‌లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ. 100 కోట్ల ముడుపులను ఆమ్‌ ఆద్మీ పార్టీ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించింది. ఆ సమయంలో కేజ్రీవాల్‌ బస చేసిన ఒక స్టార్‌ హోటల్‌ బిల్లులను ఈ కేసుకు సంబంధించిన నిందితుడు చెల్లించినట్లు…

Read More

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ దండె విఠల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. పిటిషన్ పై తదుపరి విచారణ జులై నెలకు వాయిదా వేసింది. ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్‌ ఎన్నికయ్యారు. అయితే, తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని కాంగ్రెస్‌ పార్టీ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్‌ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు నామినేషన్ డాక్యుమెంట్లను కేంద్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరికీ పంపించాలని విన్నవించారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ ఉన్నత న్యాయస్థానం, విఠల్‌ ఎన్నికను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. తాజాగా…

Read More

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం నాడు రాయ్‌బరేలీ ప్రజలకు ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీకి వారు తన పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలను అందించాలని కోరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన కుమారుడిని ప్రజలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీలతో కలిసి రాయ్‌బరేలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. “నా జీవితమంతా మీ ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిపోయింది. మీ ప్రేమ నన్ను ఒంటరిగా భావించనీయదు. మీరు నాకు అన్నీ ఇచ్చారు. నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను. మీరు నన్ను మీ స్వంతంగా భావించినట్లే, రాహుల్‌ను మీ స్వంతంగా పరిగణించండి. రాహుల్ మిమ్మల్ని నిరాశపరచడు” అని భావద్వేగ విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై పోటీ చేస్తున్నారు. సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లడానికి ముందు రెండు దశాబ్దాల పాటు ఈ…

Read More

భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి సవరిస్తూ దాదాపు 7 శాతానికి పెంచింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పెరగడమే అందుకు కారణమని తెలిపింది. 2024లో భారత్‌ 6.9 శాతం, 2025లో 6.6 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తుందని ఐరాస అంచనా వేసింది. బహిర్గత డిమాండ్‌ తక్కువగా ఉంటుందని.. దీనివల్ల సరుకుల ఎగుమతిలో వృద్ధి దెబ్బతింటుందని తెలిపింది. అదే సమయంలో ఔషధ, రసాయన ఎగుమతులు బలంగా పుంజుకుంటాయని పేర్కొంది. జనవరిలో 2024 భారత వృద్ధిరేటును ఐరాస 6.2 శాతంగా పేర్కొంది. దాన్ని ఇప్పుడు ఏకంగా 0.7 శాతం పెంచడం విశేషం. 2025 అంచనాలను మాత్రం సవరించలేదు.\ భారత్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023 నాటికి 5.6 శాతం నుంచి 2024లో 4.5 శాతానికి దిగొస్తుందని ఐరాస నివేదిక అంచనా వేసింది. దక్షిణాసియా ప్రాంతవ్యాప్తంగా ఇదే ధోరణి ఉంటుందని తెలిపింది. ద్రవ్యోల్బణం గరిష్ఠంగా ఇరాన్‌లో 33.6 శాతం, మాల్దీవుల్లో అత్యల్పంగా 2.2…

Read More

ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దాడి ఘటనపై స్వాతి మలివాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫిర్యాదులో స్వాతి మలివాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. బిభవ్‌ కుమార్‌ తనపై భౌతిక దాడికి పాల్పడినట్లు స్వాతి మలివాల్‌ పేర్కొన్నారు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆరోపించారు. 7-8 సార్లు చెంపదెబ్బలు కొట్టి, కడుపుపై బలంగా కొట్టాడని, పొత్తికడుపుపై పదేపదే తన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో తాను పీరియడ్స్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కర్రతో పలు మార్లు బాదినట్లు తెలిపారు. కాగా, మే 13న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఈ దాడి ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఉదయం…

Read More

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400కంటే ఎక్కువ లోక్‌ సభ స్థానాలను గెలవాలనుకుంటుందని ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. గత పదేళ్లుగా తమకు పార్లమెంట్​లో పూర్తి మెజారిటీ ఉందని, కానీ ఎప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలనుకోలేదని గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో సుస్థిరతను తీసుకువచ్చేందుకు ఎన్​డీఏ 400కంటే ఎక్కువ సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తమకు ఎలాంటి ప్లాన్​ బీ లేదని, అద్భుతమైన మెజారిటీతో మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. “గత 10 ఏళ్లుగా ఎన్​డీఏకు పార్లమెంట్​లో రాజ్యాంగాన్ని మార్చే మెజారిటీ ఉంది. కానీ మేము ఎప్పుడూ అలా ఆలోచించలేదు. రాహుల్ బాబా అండ్ కంపెనీ ఇలా దుష్ప్రచారం చేస్తుంది. దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి, భారత్​ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు, మరికొంత…

Read More

ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తరువాత పెద్ద ఎత్తున హింస చెలరేగడంపై సీరియస్‌ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన అధికారులపై కొరడా ఝుళిపించింది. పలువురిపై కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తాల వ్యవహార సరళిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌ ( ఎన్నికల సంఘ కార్యాలయం)లో రాష్ట్ర సిఎస్‌, డిజిపిలతో సిఇసి రాజీవ్‌కుమార్‌తో పాటు, ఇతర ఎన్నికల కమిషనర్లు గురువారం భేటీ అయ్యారు. అనంతరం పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన పలువురు అధికారులపై చర్యలు తీసుకుంటూ ఇసి ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం ఎస్‌పిలపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఇసి, వారిని తక్షణం విధుల నుండి తొలగించడంతో పాటు, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌ను, తిరుపతి…

Read More