Author: Editor's Desk, Tattva News

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేయగా, మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేదం విధించారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది.  హైదరాబాద్ మొఘల్ పురా పోలీసు స్టేషన్‌లో పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మే ఒకటవ తేదీన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత తరపున నిర్వహించిన ప్రచారంలో భాగంగా పాతబస్తీలో పర్యటించిన సందర్భంగా నిర్వహించిన సభలో అమిత్ షా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదనని, చిన్నారులతో ప్రచారం చేయించారని ఫిర్యాదులో ఆరోపించారు. రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో.. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత…

Read More

దేశవ్యాప్తంగా కలకలంరేపిన  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా సాగుతున్న రోహిత్ వేముల కేసును మూసివేస్తున్నట్లు  పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడగా, దానికి ఎవరూ కారణం కాదని పోలీసులు తేల్చారు. పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. పోలీసులు హైకోర్టుకు మార్చి 21న ఇచ్చిన ఈ కేసు క్లోజర్‌ రిపోర్టులో పేర్కొన్నారు. తన కులధ్రువీకరణ పత్రం సరైనది కాదనే విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భావనతోనే అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రోహిత్‌ ఎస్సీ కాదని.. అతడు, అతడి కుటుంబసభ్యులు బీసీ-ఏ (వడ్డెర) కులానికి చెందినవారని.. వారు అక్రమ మార్గంలో ఎస్సీ సర్టిఫికెట్లు పొందారని.. జిల్లా స్థాయి స్ర్కూటినీ కమిటీ…

Read More

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు.. ఎన్నికల వేళ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా?తాజాగా కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడంతో అందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే విచారణ జరిపిన తర్వాత కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయవచ్చు లేదా మంజూరు చేయకపోవచ్చు అని కూడా పేర్కొంది. దీనిపై అటు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది గానీ, ఇటు ఈడీ తరఫు న్యాయవాది గానీ ఆశ్చర్యపోనక్కర్లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణకు సంబంధించి వాదనలకు సిద్ధంగా ఉండాలని ఈడీ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సూచించింది. ప్రస్తుతం…

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ప్రకటించింది. రూ.50 వేలు జరిమానా కూడా విధించింది. దండె విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆ తర్వాత ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలో దండె విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ను తాను ఉపసంహరించుకోలేదని పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తనను ప్రతిపాదించిన కిషన్ సింగారి తన సంతాలను ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను సమర్పించారని రాజేశ్వర్ రెడ్డి వాదించారు. రాజేశ్వర్ రెడ్డి పిటిషన్పై సంతకాలను, నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకాలను హైకోర్టు కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించి నివేదిక తెప్పించింది. అడ్వకేట్ కమిషన్ నివేదిక,…

Read More

కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీని ఉద్దేశించి) వయనాడ్లో ఓడిపోతాననే భయంతో రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అమేఠీ నుంచి పోటీ చేయడానికి భయపడి రాయ్ బరేలీ నియోజకవర్గానికి రాహుల్ పారిపోయారని ఎద్దేవా చేశారు. శుక్రవారం బంగాల్లోని బర్ధమాన్-దుర్గాపుర్లో ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్, టీఎంసీ సర్కార్ పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ అగ్ర నాయకురాలు (సోనియా గాంధీని ఉద్దేశించి) ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాడే ధైర్యం చేయరని నేను ఎప్పుడో పార్లమెంటులో చెప్పాను. ఆమె ప్రత్యక్ష ఎన్నికల నుంచి పారిపోయి రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వయనాడ్లో రాహుల్ ఓడిపోతారని ముందే చెప్పాను. అందుకే యువరాజు రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. అమేఠీలో పోటీకి కూడా రాహుల్ భయపడ్డారు” అంటూ విమర్శించారు. “మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వమని నేను కాంగ్రెస్కు సవాల్ చేశాను. కానీ వారు మౌనంగా ఉన్నారు. నాకు…

Read More

పాంచ్ న్యాయ్… పచ్చీస్ గ్యారంటీలో భాగంగా మేనిఫెస్టో తయారు చేశామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. మేనిఫెస్టో తెలుగు ప్రతిని దీపాదాస్ మున్షీ విడుదల చేశారు. ఐదు న్యాయాలు, తెలంగాణ ప్రత్యేక హామీ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, అన్ని వర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశామని మున్షీ వివరించారు. మేనిఫెస్టో కమిటీలో ఉన్న అందరికీ అభినందనలు తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదని, బిజెపి నేతల నినాదాలు చూసి ప్రజలు భయపడుతున్నారని, సిబిఐ, ఇడి, ఐటి దాడులతో విపక్ష నేతలు అందోళనకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. న్యాయం కొరుతూ రాహుల్ జోడో యాత్ర చేపట్టారని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో…

Read More

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందర్నీ ఆకర్షిస్తున్న సీటు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్ని పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ జనసేనాని గెలుపై అందరిలో చర్చ జరుగుతోంది. పవన్‌ను ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్‌సీపీ.. సమస్య లేదు గెలిపించి తీరుతామని జనసైనికులు, అభిమానులు పోటీ పడుతున్నారు. దీంతో పిఠాపురంలో ఎన్నికలు హోరా హోరీగా ఉన్నాయి.  వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలకు మండలాలవారీగా బాధ్యతలు అప్పగించింది. ఒక మండలానికి ఇటీవల పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభంను ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. పవన్ కళ్యాణ్‌ను ఓడించడమే తన లక్ష్యమంటూ పద్మనాభం కూడా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఆయన్ను ఓడించకపోతే తన పేరును కూడా మార్చుకుంటానని సవాల్ చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం చేసిన ఛాలెంజ్‌పై ఆయన కుమార్తె క్రాంతి స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ‘పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించటానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్న పద్మనాభం బాధాకరమైన ఛాలెంజ్ చేశారు.…

Read More

ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలీ, అమేథీ స్థానాలకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారంతో నామినేషన్ ముగియనుండగా.. చివరి నిమిషం వరకూ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగించింది.  రాయబరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, అమేథీ నుంచి కిషోర్‌లాల్ శర్మకు టిక్కెట్లు ఇచ్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రెండు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. రాయబరేలీ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్ కావడంతో.. అక్కడ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక, అమేథీలో గాంధీల కుటుంబానికి వీర విధేయుడు, నమ్మినబంటు కేఎల్ శర్మకు టిక్కెట్ దక్కింది. రాయబరేలీలో ప్రియాంక గాంధీ పోటీచేస్తుందని ప్రచారం జరిగినా.. చివరకు రాహుల్ వైపే మొగ్గు చూపారు. రెండు స్థానాలకు ఈ రోజే కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఐదో దశలో ఈ…

Read More

ఢిల్లీ లిక్కర్‌ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ పక్క అరెస్టు అయి తీహార్ జైలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేజ్రీవాల్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆప్ ప్రభుత్వం నియమించిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌కు చెందిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తన ఆదేశాలు అమలులోకి రానున్నట్లు తెలిపారు. గతంలో ఢిల్లీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన స్వాతిమాలివాల్ అక్రమాలకు పాల్పడ్డారని.. అనుమతి లేకుండా ఉద్యోగులను నియమించారని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 40 మంది ఉద్యోగుల నియామకానికి మాత్రమే అనుమతి ఇస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని, కానీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా 223 కొత్త పోస్టులను అంగీకరించారని ప్రధాన ఆరోపణ. కాంట్రాక్టు పద్ధతిలో…

Read More

కొవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న‌ట్లు ఇటీవ‌ల ఆ టీకా త‌యారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకున్న‌ది. కోవిడ్‌19 టీకా తీసుకున్న వారికి ఇచ్చే కోవిన్ స‌ర్టిఫికేట్‌లో ఉండే ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఫోటోను ఆ స‌ర్టిఫికేట్ నుంచి తొల‌గించారు. చాలా అరుదైన కేసుల్లో కొవిషీల్డ్ వ‌ల్ల .. ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ ఇటీవ‌ల అంగీక‌రించింది. కానీ భార‌త్‌లో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని దృష్టిలో పెట్టుకుని కోవిన్ స‌ర్టిఫికేట్‌లో మోదీ ఫోటోను తొల‌గించిన‌ట్లు అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈసీఐ ఇచ్చిన ఆదేశాల మేర‌కు కోవిన్ స‌ర్టిఫికేట్ నుంచి మోడీ ఫోటోను తొల‌గించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వెల్ల‌డించారు. బ్రిట‌న్‌కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ యూరోప్ దేశాల్లో వాక్స్‌జెవేరియా పేరుతో టీకాను స‌ర‌ఫ‌రా చేస్తున్నది. ఆ టీకానే…

Read More