Author: Editor's Desk, Tattva News

కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని యావత్మల్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వెంటనే ఆయనకు చికిత్స అందడంతో కొద్ది నిమిషాల్లోనే తేరుకుని మళ్లీ వేదికపై నుంచి ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభ ముగిసిన తరువాత ఇందుకు సంబంధించిన వివరాలను గడ్కరీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మహారాష్ట్రలోని పుసద్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న తాను ఎండ తీవ్రత కారణంగా ఇబ్బందికి గురయ్యానని గడ్కరీ తన పోస్టులో తెలిపారు. ఇప్పుడు తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, తదుపరి సభలో పాల్గొనేందుకు వరుద్‌కు వెళుతున్నానని ఆయన తెలిపారు. తన పట్ల ప్రమేఆభిమానాలు చూపించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా..ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రసంగిస్తూ కుప్పకూలిపోయిన గడ్కరీని స్టేజీ మీద ఉన్న పార్టీ కార్యకర్తలు…

Read More

మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్కండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బుధవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జార్కండ్‌ హైకోర్టు తన పిటిషన్‌పై ఫిబ్రవరిలోనే విచారణ పూర్తి చేసినప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసిందని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హేమంత్‌ సోరెన్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ చెప్పారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించగా, ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్‌కు తెలియజేయాలని కోరారు.  దీన్ని ఏప్రిల్‌ 26న విచారించాలని కపిల్‌ సిబల్‌ కోర్టును కోరగా, జస్టిస్‌ ఖన్నా, ‘తాను ఏమీ చెప్పడం లేదు. ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్‌ తేదీని తెలియజేస్తారు’ అని పేర్కొన్నారు.  ఈడీ సోరెన్‌ను జనవరి 31న అరెస్టు చేసింది. భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సోరెన్‌ ప్రస్తుతం రాంచీలోని…

Read More

ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చి, ఆపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన యోగా గురు రాందేవ్ బాబకు చెందిన ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ క్షమాపణలు కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో ప్రకటనలు ఇచ్చింది.  రాందేవ్ బాబా సహచరుడు ఆచార్య బాలకృష్ణ పేరుతో మంగళ, బుధ వారాలలో దినపత్రికల్లో ఈ బహిరంగ క్షమాపణలకు సంబంధించని ప్రకటన వచ్చింది. మొత్తం పేపరులో ఈ ప్రకటన పావువంతు భాగం ఉంది. ఈ ప్రకటనపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ క్షమాపణ ప్రకటన.. గతంలో మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇచ్చిన ప్రకటనల పరిమాణంలోనే ఉందా? అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు పాటించనందుకు/ ఉల్లంఘించినందుకు వ్యక్తిగత హోదాతోపాటు కంపెనీ తరపున తాము బేషరుతుగా క్షమాపణలు చెబుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్, ఆచార్య బాలకృష్ణ, స్వామి రాందేవ్ పేరుతో ఈ…

Read More

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు.. ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా ఇచ్చారంటూ సోనియా గాంధీ కుటుంబంపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. కానీ భారతీయులు మాత్రం తమ వంశపారం పర్యంగా వచ్చిన ఆస్తిని.. వారి పిల్లలకు చెందకుండా ప్రయత్నం చేస్తుందంటూ ఆ పార్టీపై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలోభాగంగా బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుగుజాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ప్రజల సంపదపై సర్వే నిర్వహిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై అధిక పన్నులు భారం మోపడం ద్వారా వారి పిల్లలకు ఆస్తుల లేకుండా చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. త‌ల్లితండ్రుల‌కు చెందిన ఆస్తులు.. త‌మ పిల్ల‌ల‌కు కేవ‌లం 50 శాతం మాత్రం వెళ్లాల‌ని, మిగితా 50 శాతం ప్ర‌భుత్వం ఆధీనంలోకి వెళ్లాల‌ని పిట్రోడా ఇటీవ‌ల కామెంట్ చేశారు. ఆ…

Read More

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్‌ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్‌‌, సెకండ్‌ ఇయర్స్‌కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫస్టియర్‌లో 60.01 శాతం, సెకండియర్‌లో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌ పరీక్షలకు మొత్తం 4.78 లక్షల విద్యార్థులు హాజరుకాగా.. 2.87 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌ పరీక్షలకు మొత్తం 5.02 లక్షల మంది హజరవగా.. 3.22 లక్షల మంది పాసయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలుర కంటే బాలికలదే పైచేయిగా ఉంది. బాలికల కేటగిరీలో ఫస్టియర్‌లో 68.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలుర కేటగిరీలో కేవలం 51.5 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌ బాలికల కేటగిరీలో 72.53 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. బాలుర కేటగిరీలో…

Read More

హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన ఆయన ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. గత రెండు ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన బాలకృష్ణ ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలకృష్ణ గెలుపు సునాయాసమే అనుకున్నప్పటికీ తాజాగా, స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేయడంతో కూటమి ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది. తనకు…

Read More

గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ బరిలో కాంగ్రెస్‌ తరుఫున నిలబడ్డ అభ్యర్థి నీలేశ్‌ కుంభని కనిపించట్లేదని స్థానిక మీడియా తెలిపింది. రేపోమాపో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడించింది. దీంతో కుంభని ఇంటిముందు చేరిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ‘ప్రజాద్రోహి’ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సూరత్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కుట్రలకు పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కాగా, సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురవడం, నామినేషన్ల చివరి రోజు మిగతా అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఎన్నికను ఏకగ్రీవం చేస్తూ ఎన్నికల కమిషన్‌ సోమవారం ప్రకటించడం తెలిసిందే. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానం ఏకగ్రీవంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారితో తమ పార్టీనే సంప్రదింపులు జరిపి, నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేలా చేసిందని వెల్లడించారు. మంగళవారం ముంబైలో…

Read More

ఆంధ్రప్రదేశ్ లో రాబోవు ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతున్నామని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. ఈనెల గుంటూరులో జరిగిన ఓటర్ల చైతన్య సమావేశంలో ప్రసంగిస్తూ  రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున ఎన్నికల  నిఘాలో భాగంగా పరిశీలకులు మే 9వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో పనిచేస్తారని తెలిపారు.  రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు, శ్రీకారం కళాపరిషత్ లు ఓటర్లను చైతన్యపరచడానికి రూపొందించిన ఐదు లఘు చిత్రాలను రమేష్ కుమార్ ఆవిష్కరించారు. లఘు చిత్రాల ద్వారా ఓటర్ల ఆలోచనల, వారి భావాల్లో పెను మార్పులు తీసుకురావచ్చునని ఆలోచింపజేసేవిగా ఉన్నాయని ఆయన కొనియాడారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కృషి ఫలితంగా వాలంటీర్లను ఎన్నికల విధుల నుండి దూరం చేయగలిగామని, రాజకీయ అబ్ధికోసం…

Read More

ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌‍లోని ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాలను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  వీరిద్దరిని తక్షణమే విధుల నుంచి తప్పించాలని.. వీరి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు పేర్లు సూచించాలని కేంద్ర ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. `మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల విజయవాడలో పర్యటించారు. అయితే విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్ మీద రాయితో దాడి చేశారు.  ఈ ఘటనలో సీఎం ఎడమకన్ను పై భాగంలో గాయం కాగా.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తీవ్రగాయమైంది. ఈ ఘటన రాష్ట్ర…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో మరోసారి వాలంటీర్ల అంశం చర్చకు వచ్చింది. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోకూడదంటూ ఇప్పటికే హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశాయి. అయితే తాజాగా ఏపీ హైకోర్టు వాలంటీర్ల అంశంలో కీలక ఆదేశాలు ఇచ్చింది.  వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో వారి రాజీనామాలు ఆమోదించవద్దని ఆదేశించాలంటూ బీసీ యువజనపార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా అధికార పార్టీకి మేలు చేయడానికే వాలంటీర్ల వేలసంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని.. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్ పూర్తయ్యేవరకూ వారి రాజీనామాలను ఆమోదించవద్దని ఆదేశించాలని కోరారు.  వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే అధికార వైసీపీకి అనుకూలంగా…

Read More