భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా తయారైంది. తాజాగా ఆ జనాభా 144 కోట్లకు చేరినట్టు అంచనా. ఇందులో 0-14 ఏళ్ల మధ్య వయస్సున్న వారు 24 శాతంగా ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ (యుఎన్‌ఎఫ్‌పిఎ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదిక ”ఇంటర్‌వోవెన్ లైవ్స్, థ్రెడ్స్ ఆఫ్ హౌప్: ఎండింగ్ ఇనాక్విలిటీస్ ఇన్ సెక్సువల్ అండ్ రి అండ్ ప్రొడక్టివ్ హెల్త్ అండ్ రైట్స్” వెల్లడించింది. ఇది భారతదేశ జనాభా 77 ఏళ్లలో రెట్టింపవుతుందని అంచనా వేసింది. 144.17 కోట్ల మంది జనాభాతో ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రస్థానంలో ఉండగా, చైనా 142.5 కోట్లతో రెండో స్థానంలో ఉన్నదని నివేదిక పేర్కొన్నది. 2011లో భారత ప్రభుత్వం నిర్వహించిన చివరి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లుగా నమోదైంది. ఇక భారత్‌లో 17 శాతం మంది 10-19 ఏళ్లలోపు వారు ఉన్నారని యూఎన్ నివేదిక వివరించింది.…
Author: Editor's Desk, Tattva News
* తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండే నామినేషన్స్లునాలుగో విడుత సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. పది రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలతోపాటు తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను 29న ప్రకటిస్తారు. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్ముకశ్మీర్ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజక వర్గాలతో పాటు, 175…
మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఎడారి నగరమైన దుబాయ్ స్తంభించిపోయి ప్రధాన రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమయ్యాయి. దుబాయ్ విమానాశ్రయంలో 25 నిమిషాల పాటు కార్యకలాపాలను నిలిపివేశారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నీటితో మునిగి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేకరించిన వాతావరణ డేటా ప్రకారం.. ఏడాదిన్నర కాలంలో కురిసేంత వర్షపాతం దుబాయ్ నగరంలో 24 గంటల్లోనే నమోదైందని తేలింది. సోమవారం రాత్రి ఈ వర్షం ప్రారంభమైంది. ఆ రోజు అర్థరాత్రి వరకు 20 మిల్లీమీటర్ల (0.79 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. దాంతో, దుబాయిలోని రహదారులు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయానికి ఇది మరింత తీవ్రమైంది. ఆ రోజు చివరి నాటికి, మొత్తంగా 142 మిల్లీమీటర్ల (5.59 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. దాంతో, దుబాయ్ నగరం జలమయమైంది. రహదారులు వరద నీటిలో మునిగాయి. సాధారణంగా, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సగటున…
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ప్రతిపాదించిన కూచ్ బెహర్ పర్యటననను రద్దు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన ఆయన పర్యటన మోడల్ కోడ్‌ను ఉల్లంఘించినట్లువుతుందని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని, అందుకే కూచ్ బెహర్‌ను సందర్శిస్తున్నారని బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ అక్కడ పర్యటించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఈసీకి లేఖ రాసింది. స్పందించిన ఈసీ ఈ నెల 18, 19 తేదీల్లో కూచ్ బెహర్‌లో పర్యటించవద్దని గవర్నర్‌కు సూచించింది. లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగనున్నది. దీంతో బుధవారం సాయంత్రంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. అలాగే 48 గంటలపాటు సైలెంట్ సమయాన్ని పాటించాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఓటర్లు కాని వీఐపీలు, నాయకులు ఆ ప్రాంతాన్ని వీడాల్సి ఉంటుంది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా…
అయోధ్యలో మరో మహా ఘట్టం పూర్తి అయింది. శ్రీరామనవమి సందర్భంగా గర్భగుడిలో ఉన్న అయోధ్య రాముడి నుదుటిపై సూర్య తిలకం కనువిందు చేసింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3-3.5 నిమిషాల పాటు.. ఇలా బాలరాముడికి సూర్య తిలకంలా సూర్యుడి కిరణాలు ప్రసరించాయి. రాముడి విగ్రహం నుదుటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో.. 3-3.5 నిమిషాలపాటు ప్రసరించాయి. అయోధ్య రామాలయ నిర్మాణం చేపట్టే సమయంలోనే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుల కోరిక మేరకు కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ-సీబీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ఇలా శ్రీరామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం పూట సూర్యతిలకం వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సూర్యతిలకం ఏటా శ్రీ రామనవమి రోజున అయోధ్యలో కనువిందు చేయనుంది. ఇక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం పూర్తి చేసుకున్న తర్వాత తొలిసారి ఈ అపూర్వ ఘట్టం చోటు చేసుకోవడం విశేషం. మరో 19 సంవత్సరాల పాటు శ్రీరామనవమి…
యూపీపీఎస్సీ ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించింది. తొలి ప్రయత్నంలోనే అసమాన్య ప్రతిభతో విజేతగా నిలిచింది. అనన్య స్వగ్రామం అడ్డాకుల మండలం పొన్నకల్. తల్లి గృహిణి కాగా, తండ్రి చిరు వ్యాపారి. చదువువిలువ తెలిసిన ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను బాగా చదివించారు. అనన్య ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మహబూబ్‌నగర్‌లోని గీతం హైస్కూల్‌లో సాగింది. పదో తరగతి వరకు అక్కడే చదివిన అనన్య ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో, డిగ్రీ ఢిల్లీలో చేసింది. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో చదివే సమయంలోనే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించింది. కఠినమైన సివిల్స్ ఎగ్జామ్ కోసం చాలామంది కోచింగ్ తీసుకుంటారు. కానీ అనన్య కోచింగ్‌ను నమ్ముకోలేదు. కేవలం ఆప్షనల్ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీపై పట్టు సాధించేందుకు హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నారు. మిగతా అన్ని సబ్జెక్ట్స్ సొంతంగానే ప్రిపేర్ అయ్యింది. రోజుకు 12 నుండి 14 గంటలు చదువుకు కేటాయించానని…
ఒకప్పుడు గూగుల్ మూడోకంటికి కూడా అందని విధంగా.. నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్‌రావు ఉన్నారు. ఆయన భార్య, ఆదిలాబాద్ జిల్లా హత్నూర్‌కు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్‌కుమార్, కాంకేర్ సీనియర్ ఎస్పీ ఐ.కళ్యాణ్ ఎలిసెల కథనం ప్రకారం.. ఈ నెల 19న మొదటి దశ లోక్‌సభ పోలింగ్‌లో భాగంగా బస్తర్ రీజియన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కాంకేర్‌లో ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరించాలని కొన్ని రోజులుగా మావోయిస్టులు కరపత్రాలు, లేఖలను విడుదల చేస్తున్నారు. సోమవారం దండకారణ్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఎన్నికల రోజు కుట్రలు పన్నారనే సమాచారంతో చోటాబేటియా ఠాణా పరిధిలోని…
బాలీవుడ్ నటి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై ‘అభ్యంతరకర’ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాపై భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై వేటు వేసింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది ”భారత రాజ్యాంగంలోని 324వ అధికరణ, ఇతర అధికారాల కింద 16 ఏప్రిల్ 2024 సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ఎలాంటి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనరాదు. ఊరేగింపులు, పబ్లిక్ ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటర్వ్యూలు, మీడియాకు దూరంగా ఉండాలి” అని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. మధుర ఎంపీ హేమమాలినిని అగౌరవపరచేలా సూర్జేవాలా వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి బీజేపీ ఇటీవల ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం గత నెలలో సూర్జేవాలాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది.
కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుతున్నదని చెబుతూ కాంగ్రెస్ తీరు చూస్తుంటే కొన్నిసార్లు బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని అనుమానం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ‘డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి)’ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారని, కానీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వారి మాటలు వినిపించుకోలేదని ఆయన తెలిపారు. సమస్యలు లేవనెత్తినప్పుడు తామంతా బీజేపీ భాష మాట్లాడుతున్నామని హైకమాండ్ విమర్శించేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ హైకమాండే బీజేపీ గెలుపును కోరుకుంటున్నట్లు తనకు చాలాసార్లు అనిపించిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ దేశంలో పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలని గులాం నబీ ఆజాద్ చెప్పారు. సుమారు రెండేళ్ల క్రితం ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడారు. అప్పట్లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన…
ప్రజలను తప్పుదారి పట్టించే విధమైన వాణిజ్య ప్రకటనలను ప్రచురించినందుకు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కొంటున్న పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా హాజరై చేతులు జోడించి బేషరతు క్షమాపణలు కోరారు. అయితే వారి క్షమాపణలను పరిశీలించడానికి అంగీకరించిన సుప్రీంకోర్టు వారిపై కేసును పూర్తిగా కొట్టివేయలేదని స్పష్టం చేసింది. బేషరతుగా క్షమాపణలు చెబుతూ వారిద్దరూ దాఖలు చేసిన అఫిడవిట్లను ఏప్రిల్ 10న తోసిపుచ్చిన జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహ్సముద్ద౨ఈన్ అమానుల్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి కార్యాచరణను నిర్ణయించడానికి ఏప్రిల్ 23న తిరిగి వారిద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని మంగళవారం ఆదేశించింది. మిమల్ని క్షమిస్తామని మేము చెప్పడం లేదు. మీ క్షమాపణ గురించి మేము ఆలోచిస్తాము. ఏం జరుగుతోందో తెలియనంత అమాయకులేం కాదు మీరు అంటూ రాందేవ్, ఆచార్య బాలకృష్ణలను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమ తరఫున జరిగిన తప్పులను మన్నించాలని…