లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకొని, రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని నిర్ణయించుకోవడం ద్వారా ఇక ఉత్తర ప్రదేశ్ లో బిజెపిని కట్టడి చేయడం పట్ల దృష్టి సారిస్తానని స్పష్టమైన సంకేతం ఇచ్చిన సమాజావాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను కట్టడి చేయడం కోసం బిజెపి మరో రాష్ట్రం ప్రయోగించనున్నట్లు తెలుస్తున్నది.
అఖిలేష్ వ్యవహారం పట్ల తొలినుండి అసంతృప్తిగా ఉంటున్న ఆయన బాబాయి శివపాల్ యాదవ్ ను బీజేపీలో చేర్చుకొని రాజ్యసభకు పంపే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను శివపాల్ కలవడంతో ఇటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పైగా, రెండు రోజులుగా ఢిల్లీలో ఉంది పలువురు బిజెపి నేతలను ఆయన కలుస్తున్నట్లు తెలుస్తున్నది. 2017లో శివపాల్ యాదవ్ బిజెపితో చేతులు కలిపి, సమాజవాద్ పార్టీ నుండి బైటకు వచ్చి, సొంతంగా ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ పేరుతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు ద్వారా అఖిలేష్ ఓటమికి కారకుడయ్యారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల ముందు తిరిగి అఖిలేష్ తో చేతులు కలిపి, ఎన్నికలలో పోటీ చేసినా పార్టీలో తగు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
పైగా, ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ శివపాల్ మద్దతు దారులు పలువురిని అఖిలేష్ పార్టీ నుండి బహిష్కరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సమాజవాద్ పార్టీని `కుటుంభం రాజకీయాలు’ అంటూ విస్తృతంగా ప్రచారం చేసిన బిజెపి అఖిలేష్ మర్యాదలును పార్టీలో చేర్చుకొని, సీట్ ఇవ్వడమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకోండి. ఇప్పుడు బాబాయికి గాలం వేస్తున్నది.
యుపి అసెంబ్లీ ఎన్నికల అనంతరం అఖిలేష్ యాదవ్, ఆయన బాబాయి శివపాల్ యాదవ్‌ల మధ్య మళ్లీ పొరపచ్ఛాలు మొదలయ్యాయి. యుపి ఎన్నికల్లో ఎస్పి కూటమి ఓటమి చెందిన తర్వాత వీరిద్దరూ ఎడమొహం-పెడమొహంగా ఉంటున్నారు. ఇటీవల తన పార్టీ ఎమ్మెల్యేలను అఖిలేష్ సమావేశానికి ఆహ్వానించి, శివపాల్‌కు ఆహ్వానం పంపలేదని వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై శివపాల్ అఖిలేష్‌ను అడగ్గా త్వరలో మిత్ర పక్షాల సమావేశానికి ఆహ్వానిస్తామని చెప్పారని సమాచారం. కాగా, చివరిగా ఈ నెల 24న అఖిలేష్‌తో బాబాయి శివపాల్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎస్పిలో కీలక పదవి అప్పగించడంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
అయితే మీరు ఎస్పి నేత కాదని, మిత్రపక్షమని అఖిలేష్… తన బాబాయికి సమాధానం ఇచ్చారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కారణాలేమైనప్పటికీ.. ఎస్పితో పొత్తును బాబాయి తెగతెంపులు చేసుకోబోతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.