Author: Editor's Desk, Tattva News

తిరుమ‌ల శ్రీవారి ప్ర‌స్తాదం ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ఏపీ ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ 11 రోజుల పాటు ప్రాశ్చిత్త దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. బుధవారం ఆయ‌న శ్రీవారిని ద‌ర్శించుకుని దీక్ష‌ను విర‌మింఛాయారు. ఇక మంగ‌ళ‌వారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు చేరుకున్నారు. ఉద‌యం స్వామివారిని ద‌ర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య‌, చిన్న కూత‌రు పొలెనా అంజ‌ని కొణిదెల‌తో క‌లిసి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ప‌వ‌న్ చిన్న కుమార్తె క్రిస్టియ‌న్ కావ‌డంతో టీటీడీ అధికారులు డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాలు తీసుకున్నారు. ఆమె మైన‌ర్ కావ‌డంతో తండ్రిగా ప‌వ‌న్ కూడా ఆ ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం…

Read More

పశ్చిమాసియా భగ్గుమంటోంది. హెజ్‌బొల్లా స్థావరాలే లక్షంగా లెబనాన్‌పై ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చే పట్టింది. దీంతో ఇజ్రాయెల్ అధికారులు త మ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. సైర న్ల మోత మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఇరాన్ దాదాపు 500 క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. టెల్‌అవీవ్, జె రూసలెం లక్షంగా ఈదాడులకు దిగినట్లు తెలిసింది.అయితే ఇజ్రాయెల్‌కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థ ఇరాన్ క్షిపణి దాడులు ఎదుర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది. మరోవైపు ఈ పరిణామాల నడుమే ఇజ్రాయెల్ రాజధాని లో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా, పలువురు మృతి చెందినట్టు సమాచారం. ఇదిలావుండగా ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అందుకోసం పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించుకునేందుకు…

Read More

అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓఎం బిర్లా, ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి నివాళులర్పించారు. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన బాపు జీవితం, ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని ఎక్స్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. జాతిపితగా కీర్తించబడిన గాంధీ, సత్యం, అహింస సూత్రాలను దృఢంగా అనుసరించారని, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలకు తరతరాలు స్ఫూర్తినిస్తారని అన్నారు. అలాగే ఈ రోజున జన్మించిన భారతదేశ రెండవ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి కూడా ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జీ సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, సహా…

Read More

దేశవ్యాప్తంగా 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ తక్షణ సాయంగా రూ.5858.60 కోట్లు విడుదల చేశారు. ఇటీవల వరదలకు ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో కేంద్ర బృందాలు వరద ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి కేంద్ర హోంశాఖకు నివేదిక అందించాయి. ఈ మేరకు కేంద్రహోంశాఖ తక్షణ సాయంగా ఈ నిధులు విడుదల చేసింది. 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అడ్వాన్స్‌ నుంచి రూ.5858 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర బృందాలు పూర్తిస్థాయి నివేదిక అందించిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. తాజా నిధుల్లో ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు మంజూరు చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1492 కోట్లు ప్రకటించింది. అస్సాంకురూ. 716 కోట్లు, బీహార్ కు రూ. 655.60కోట్లు, గుజరాత్‌కు రూ. 600 కోట్లు, పశ్చిమ…

Read More

భవనాల కూల్చివేతల అంశంపై పౌరులు అందరికీ తాము మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు మంగళవారం ప్రకటించింది. నేర నిందితుల ఇళ్లతో సహా ఆస్తులను పలు రాష్ట్రాల్లో కూల్చివేస్తున్నారనే ఆరోపణలతో దాఖలైన పిటిషన్లపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. తన ఆదేశాలు దేశం అంతటికీ వర్తిస్తాయని సర్వోన్నత న్యాయస్థానం చెబుతూ, ఒక వ్యక్తి నిందితుడు లేదా నిర్ధా.రిత దోషి కావడం ఆస్తి కూల్చివేతకు కారణం కాజాలదని స్పష్టం చేసింది. కాగా, సుప్రీంకోర్టు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా కూల్చివేతలపై స్టే ను సుప్రీంకోర్టు మంగళవారం పొడగించింది ‘మేము ఏది నిర్దేశిస్తున్నా మనది సెక్యులర్ దేశం. ఏ ఒక్క వర్గానికో కాకుండా పౌరులు అందరికీ, సంస్థలు అన్నిటికీ మేము ఉత్తర్వు జారీ చేస్తున్నాం’ అని న్యాయమూర్తులు బి ఆర్ గవాయ్, కె వి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. భారత్ లౌకిక దేశమని…రోడ్లను ఆక్రమించి కట్టిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు వంటి ఏ…

Read More

ప్రస్తుతం తెలంగాణలో ఓవైపు.. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన వేళ బాధితులకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కగా.. వారి విమర్శలకు కౌంటర్లు ఇస్తూ కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇవన్నింటి మధ్యలో.. మంత్రి కొండా సురేఖపై నెట్టింట కొందరు ఆకతాయిలు చేసిన ట్రోలింగ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  ఈ ట్రోలింగ్ మీద మంత్రి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి లోను కాగా.. మాజీ మంత్రి హరీష్ రావు దాన్ని ఖండిస్తూ ట్వీట్ కూడా చేశారు. అయితే.. ఇప్పుడు కొండా సురేఖకు ఒక తమ్ముడిగా అండగా ఉంటానంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు భరోసా ఇచ్చారు. ఇటీవల దుబ్బాకలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఆమెను స్వాగతిస్తూ చేనేతలు తయారు చేసిన నూలు దండను రఘనందన్ రావు స్వయంగా మెడలో వేశారు. అందుకు సంబంధించిన…

Read More

హైదరాబాద్ నగరంలో నిర్వహించే ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ను నిషేధిస్తూ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయిల్ 100కు ఫిర్యాదులు పెరగడంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల అంశంపై ఇటీవల బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజాసింగ్, పాషాఖాద్రీ, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాచకొండ సీపీ సుధీర్బాబు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  సీవీ ఆనంద్ డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండేళ్లుగా డీజేలతో పెద్దయెత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, ఈసారి శృతిమించి జరిగిందని, సీఎం రేవంత్రెడ్డి సైతం దీన్ని గమనించి ఆరా…

Read More

బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందాకు బుల్లెట్ గాయం అయ్యింది. గన్ చెక్ చేస్తోండగా గాయం అయ్యిందని తొలుత వార్తలు వచ్చాయి. లేదు.. గోవిందా కాల్చుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో గోవిందా భార్య సునీత ఇంట్లో లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ‘తెల్లవారు జామున 4.45 గంటల సమయంలో గోవిందా ఇంటి నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. ఆ సమయంలో గోవిందా, పని మనిషి ఇద్దరూ ఉన్నారు. గోవిందా భార్య కోల్ కతాలో ఉన్నారు. కోల్ కతాలో షో ఉండటంతో ఉదయం 6 గంటలకు గోవిందా కూడా వెళ్లాల్సి ఉంది. ఎయిర్ పోర్టు బయల్దేరే ముందు లైసెన్స్‌డ్ రివాల్వర్ తీశారు. కప్ బోర్డు నుంచి గన్ తీసే సమయంలో కిందపడింది. ఆ తుపాకీ మిస్ ఫైర్ అయ్యి కాలికి బుల్లెట్ గాయం అయ్యింది. అందేరిలో గల క్రిటిక్ కేర్ ఆస్పత్రికి ఇంట్లో పనిచేసే సిబ్బంది తరలించారు అని’ పోలీసులు తెలిపారు.…

Read More

తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ దరిమిలా సిట్‌ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీ డీజపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న రాష్ట్ర లాయర్ల సూచన మేరకు విచారణను నిలిపివేశామని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. తిరుమలలో ఈనెల 4 నుంచి 12వ తేదీవరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలుకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. మంగళవారం తిరుమలలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమలలో దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అందుబాగులో 2 వేలకు పైగా సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తామన్నారు. తిరుమాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు…

Read More

కర్ణాటకలోని ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే లోకాయుక్త కేసు నమోదు చేయడం, విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రికి మరో బిగ్ షాక్ తగిలింది. కర్ణాటకలోకి సీబీఐ రావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ఈడీ రంగంలోకి దిగింది.  మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ-ముడా భూముల వ్యవహారానికి సంబంధించి భారీగా డబ్బులు చేతులు మారాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి.. సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.  కాగా, ఈ కేసు నమోదు చేసిన గంటల లోగా తనకు ముడా కేటాయించిన ప్లాట్లను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు తెలుపుతూ ముడా కమిషనర్ కు సిద్దరామయ్య భార్య ఓ లేఖను వ్రాసారు. ముడా భూముల స్కామ్‌లో కర్ణాటక లోకాయుక్త నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. సిద్ధరామయ్య, సహా పలువురిపై కేసు పెట్టింది. ఇప్పటికే సెప్టెంబర్…

Read More