ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పై విచారణ మంగళవారం మరోసారి వాయిదా పడింది. న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవులో ఉండటంతో బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఈనెల 22వ మధ్యాహ్నం పిటిషన్‌పై విచారణ జరుగనుంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లో భాగంగా కవిత ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పారు. అలాగే, నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత ఆరోపించారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని, ఆప్-సౌత్ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారని, లిక్కర్ స్కాంలో భాగంగా రూ.100కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని…
Author: Editor's Desk, Tattva News
ఏపీలో గత వారం కలకలం రేపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో క్రమంగా పురోగతి లభిస్తోంది. ఈ కేసులో జగన్ పై రాయి విసిరిన ఘటనకు కారకులుగా భావిస్తున్న ఐదుగురు అనుమానితుల్ని సెంట్రల్ నియోజకవర్గంలోని వడ్డెర కాలనీ నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరిలో సతీష్ ఏ వ్యక్తి రాయి విసిరిన్నట్లు గుర్తించారు. అయితే, ఎందుకు విసిరాడో ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అతనితో పట్టున్న మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విజయవాడ వన్ టౌన్ లోని సీసీఎస్ లో వీరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే వీరిలో ఓ అనుమానితుడిని సీఎం జగన్ తో పాటు దాడికి గురైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు చూపించారు. వడ్డెర కాలనీకి చెందిన యువకులే సీఎం జగన్ పై రాయి విసిరినట్లు విజయవాడ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కోణంలోనే ఇప్పుడు కేసును దర్యాప్తు చేస్తున్నారు. …
ఆంధ్రప్రదేశ్ సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అలాగే మరో సెక్షన్ కింద ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు లక్షా 50 వేల జరిమానాను అట్రాసిటీ కోర్టు విధించింది. ఈ కేసులో మొత్తం 10 మందిని కోర్టు దోషులుగా గుర్తించింది. ఈ పది మందిలో ఒకరు మృతి చెందారు. తీర్పు సమయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోర్టులోనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో పోటీపై త్రిమూర్తులకు భారీ ఊరటే లభించింది. ఎందుకంటే.. రెండేళ్లలోపే శిక్ష పడటంతో పోటీకి అడ్డంకులు తొలిగాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ కేసులో…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఇంటి వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల అనంతరం ముంబై నుంచి పరారైన వారిని గుజరాత్‌లోని భుజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విక్కీ సాహబ్ గుప్తా, సాగర్ శ్రీజోగేందర్ పాల్‌గా గుర్తించారు. వీరిద్దరు నవీ ముంబైలోని పన్వెల్‌లో ఉన్న హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నట్లు అధికారులు చెప్పారు. సల్మాన్ ఖాన్‌కు పన్వెల్‌లోనే ఫాంహౌస్ ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 4.51 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్‌మెంట్స్ వద్ద సీసీటీవీ ఫుటేజీని…
ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలోని 68 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్టు 15వ తేదీలోపు వారందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పంట నుంచి రూ.500 బోనస్ ఇచ్చి పండిన చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతూ బీఆర్‌ఎ్‌సపై నిప్పులు చెరిగారు. ‘‘తన బిడ్డ బెయిల్ కోసం మాజీ సీఎం కేసీఆర్ బీఆర్‌ఎ్‌సను బీజేపీకి తాకట్టు పెట్టారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం మోదీతో చీకటి ఒప్పందం చేసుకొని సుపారీ తీసుకున్నారు” అంటూ విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్, భువనగిరి లోక్‌సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే.. ఆయా నియోజకవర్గాల పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు…
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పాలనలో సామర్ధ్యం కనబరిచిన బీజేపీ మోడల్, విఫలమైన కాంగ్రెస్ మోడల్‌లో ఏది ఎంచుకుంటారనేది ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు స్పష్టమైన విజన్‌తో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని విపక్షాలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు తనకు భారీ ప్రణాళికలు ఉన్నాయని చెబితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఎవరినీ భయపెట్టే నిర్ణయాలు తాను తీసుకోనని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధికి బాటలువేసే నిర్ణయాలనే తాను తీసుకుంటానని చెప్పారు. ప్రతి పనినీ సరైన దిశలో తీసుకోవాలని తాను ప్రయత్నిస్తానని పేర్కొంటూ తాను ఇంకా చేయాల్సింది ఎంతోఉందని, దేశ అవసరాలు ఎన్నో ఉన్నాయనే విషయం తనకు తెలుసునని చెప్పారు. ప్రతి కుటుంబం కలలు ఎలా నెరవేర్చాలనేదే తన ఆకాంక్ష అని, అందుకే…
ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగించే వార్త ఇచ్చింది భారత వాతావరణశాఖ ఐఎండీ. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అంటే.. ఈసారి.. సాధారణ కన్నా అధికంగా వర్షాలు పడనున్నాయి. “భారత్ లో రుతుపవనాల ప్రభావం ఈసారి సాధారణం కన్నా ఎక్కువగానే ఉంటుంది. లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్పీఏ) 106శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాము,” అని ఐఎండీ వెల్లడించింది. భారత వాతావరణశాఖ ప్రకారం రుతుపవనాల తొలినాళ్లల్లో ఎల్ నీనో బలహీనపడుతుంది. ఫలితంగా.. ఆ తర్వాతి రోజుల్లో దేశంలో జోరుగా వర్షాలు కురుస్తాయి. “1971 నుంచి 2020 వరకు ఉన్న డేటాను పరిగణలోకి తీసుకుని కొత్త లాంగ్ పీరియడ్ యావరేజ్ని, నార్మల్ స్టాండర్డ్ని ప్రవేశపెట్టాము. దీని ప్రకారం.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు.. దేశవ్యాప్తంగా వర్షపాతం 87 సెంటీమీటర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాము,” అని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ సెక్రటరీ…
లోక్‌సభ ఎన్నికల్లోనగదు ప్రవాహం జోరుగా సాగుతోంది. మొదటి దశ పోలింగ్‌కు ముందే ఇప్పటివరకు గతంలో ఎన్నడూ ఎరుగనంత భారీస్థాయిలో సుమారు రూ. 4,650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) ప్రకటించింది. ఎన్నికల చరిత్రలో సీజ్ చేసిన నగదులో ఇదే అత్యధిక మొత్తమని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మార్చి 1నుండి ప్రతి రోజూ రూ. 100 కోట్లకు పైగా నగదును సీజ్ చేస్తున్నట్లు ఇసి తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జప్తు చేసిన మొత్తం రూ.3,475 కోట్లు కాగా, ఈ ఎన్నికల్లో నగదు జప్తు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే .. డ్రగ్స్‌ను కూడా భారీగా సీజ్ చేసినట్లు ఇసి తెలిపింది. 2019 ఎన్నికల సమయంలో రూ.1,279.9 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేయగా, ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు రూ.2,068.8 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అంటే మొత్తం స్వాధీనం…
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్‌పై తక్షణ విచారణకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై వివరణ ఇవ్వలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక న్యాయస్థానం విధించిన 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ సోమవారం ముగియాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ కోర్టులోని సీబీఐ, ఈడీ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. విచారణ కీలక దశలో ఉందని, మరో…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో రాయితో దాడి జరిగి, గాయపరచి రెండు రోజులు అవుతున్నా ఇంకా పోలీసులు దాడి చేసిన వారి ఆచూకీ తెలుసుకోలేక పోయారు. దానితో సిఎం జగన్ పై దాడి చేసినవారి వివరాలను తెలిపినవారికి నగదు బహుమతి ఇస్తామని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎన్‌టిఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌వారి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై శనివారం జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకోవడానికి దోహదపడే కచ్చితమైన సమాచారమును, దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చని తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారమును అందించవచ్చునని తెలిపారు. ఈ విధముగా కేసుకు దోహదపడే సమాచారం అందించినవారికి 2 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ సమాచారమును అందించిన వారి…