Author: Editor's Desk, Tattva News

ఎయిరిండియాలో ‘విస్తారా’ విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించడాన్ని నిరసిస్తూ పైలెట్లు విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో మంగళవారం నాటికి విమానయాన సంస్థ విస్తారాలో పైలెట్ల సంక్షోభం మరింత ముదిరింది. అనారోగ్య కారణాల సాకుతో పైలెట్లు విధులకు దూరంగా ఉంటున్నారు. పైలెట్లు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం కీలక నగరాల నుంచి బయలుదేరాల్సిన 38 విస్తారా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబై నుంచి వెళ్లాల్సిన 15 సర్వీసులు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన 11 సర్వీసులను రద్దు చేసినట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. సోమవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 50కిపైగా సర్వీసులు రద్దవ్వగా దాదాపు 160 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు వేర్వేరు కారణాలతో గత కొన్ని రోజులుగా గణనీయ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేశామని ప్రకటనలో విస్తారా పేర్కొంది. పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని సోమవారం ఒక ప్రకటనలో…

Read More

మాజీ ఉపసభాపతి, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్, పాలకొండ నియోజక వర్గానికి చెందిన నిమ్మక జయకృష్ణలు సోమవారం జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలోని జ‌న‌సేన కార్యాల‌యంలో వారిద్దరిని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మాట్లాడుతూ అవనిగడ్డలో తనను నిలబడాలని పవన్ కోరారని తెలిపారు. చంద్రబాబు కూడా దీనికి మద్దతు ఇచ్చారని చెప్పారు. తనకు టికెట్ ఖాయం అయిందని, ఈరోజు అధికారికంగా తన పేరు ప్రకటిస్తారని వెల్లడించారు. ఐదేళ్లుగా ఏపీలో జరగని అరాచకం లేదని అన్నారు. వేలకోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. తెలుగు భాష అభివృద్ధికు తాము చేసిన కృషిని ఎన్నోసార్లు మెచ్చుకున్నారని తెలిపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మండలి బుద్ధప్రసాద్ భావించారు. అయితే టీడీపీ – బీజేపీ పొత్తులో భాగంగా అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించారు.…

Read More

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జ‌రిగే సీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలను భక్తులకు అందజేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇళ్లకు చేరవేసే పుణ్యకార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రత్యేక తలంబ్రాలు కావాలనుకునే భక్తులు రూ.151 చెల్లించి టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ సెంటర్లలో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్‌ను ఆయన ప్రారంభించారు. భద్రాద్రిలో ఈ నెల 17వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ 040-23450033, 040-69440000, 040-69440069 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.…

Read More

ఢిల్లీలో ఆదివారం ‘ఇండియా’ కూటమి ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు, ఇతర వ్యాఖ్యలకు గాను ఆయనపై ‘కఠిన చర్య’ తీసుకోవలసిందిగా ఎన్నికల కమిషన్ (ఇసి)కి భారతీయ జనతా పార్టీ (బిజెపి) సోమవారం విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్‌లతో కూడిన పార్టీ ప్రతినిధివర్గం రాహుల్ గాంధీపై ఇసికి ఫిర్యాదు దాఖలు చేసింది. ఇసి అధికారులతో సమావేశం అనంతరం మంత్రి పూరి మీడియాతో మాట్లాడుతూ, బహిరంగ సభలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుని వ్యాఖ్యలు ‘అత్యంత అభ్యంతరకరం’ అని, అవి ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమైనవే కాకుండా తీవ్ర విపరిణామాలకు దారి తీయగలవని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆదివారం బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, ఇవి (లోక్‌సభ ఎన్నికలు) ఫిక్స్‌డ్ మ్యాచ్ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తమ మనుషులను ఇసిలో నియమించిందని కూడా చెప్పారు.…

Read More

అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని వాదిస్తున్న చైనా తాజాగా ఆ రాష్ట్రంలోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వంబడి ఉన్న 30 ప్రదేశాలకు నామకరణం చేసింది. పరిపాలనా పరమైన విభాగాలకు పేర్లు పెట్టే చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వశాఖ అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రదేశాలకు తమ సొంత పేర్లు పెడుతూ నాలుగవ జాబితాను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తన సొంత భాషలో జాంగ్‌నాన్ అని వ్యవహరిస్తోంది. చైనా విడుదల చేసిన తాజా జాబితాలో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, ఒక పర్వత కనుమ, కొంత భూమి ఉన్నాయి. ఆ పేర్లు చైనీస్ పదాలు ఉన్నాయి. అక్షాంశం, రేఖాంశంతో కూడిన జాంగ్‌నాన్ చిత్రపటాన్ని కూడా మంత్రిత్వశాఖ విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో పేర్ల మార్పునకు సంబంధించి చైనా ఆరు ప్రదేశాల పేర్లతో 2017లో మొదటి జాబితాను, 15 ప్రదేశాల పేర్లతో 2021లో రెండవ జాబితాను, 22 ప్రదేశాల పేర్లతో 2023లో…

Read More

బీఆర్ఎస్ పార్టీ అత్యంత వేగంగా పతనం అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేసీఆర్ సహకరించలేదని విమర్శించారు. ప్రారంభోత్సవానికి మాత్రమే కేసీఆర్ వచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఎప్పుడూ కేసీఆర్ దానిని పట్టించుకోలేదని విమర్శించారు. తండ్రీ, కొడుకులతోనే తెలంగాణ నాశనమయిందని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను చూసి జాలిపడాలని అంటూ ఓటమి తర్వాత కూడా ఆయన సీఎం అయినట్టు ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపైనే బీజేపీ ప్రచారం ఉంటుందని వెల్లడించారు. సీఎం‌ కావాలనుకున్న కేటీఆర్ ఆశలయ అడియాశలు అయ్యాయని తెలిపారు. అవినీతి ఆరోపణలు లేకుండా మోదీ పాలన సాగిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందని, ప్రజల బ్రతుకులు మారలేదని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఓట్లు పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందని విమర్శించారు. ప్రపంచానికే సాయం…

Read More

మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని మరోసారి కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఆయన 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ రౌజ్‌ అవెన్యూ కోర్టు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఆయనను తిహార్ సెంట్రల్ జైలుకు తరలించారు.  మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. సోమవారం ఆయన కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో 9 సార్లు ఈడీ సమన్లను జారీచేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  అనంతరం ఆయన కోర్టులో హాజరుపర్చగా ఏడు రోజులు, ఆ తర్వాత నాలుగు రోజుల కస్టడీకి అప్పగించింది. సోమవారంతో ఆయన కస్టడీ ముగియడంతో కోర్టులో…

Read More

లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ రేగింది. కేంద్రంలోని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్తూ ఎక్స్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. కచ్చైతీవును శ్రీలంకకు ఇవ్వడం ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని ధ్వజమెత్తారు. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌.. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను దెబ్బతీసిందని విమర్శించారు. తమిళ జాలర్లను తరచూ శ్రీలంక నేవీ అరెస్ట్‌ చేస్తుండటం, బోట్లు, ఇతర విలువైన మెషినరీని స్వాధీనం చేసుకుంటుండటంపై మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్న క్రమంలో కచ్చైతీవు అంశం రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉన్నది. తమిళనాడులో ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కచ్చైతీవుపై తాజాగా రేగిన రాజకీయ దుమారంపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే స్పందించింది. శ్రీలంకకు కచ్చతీవు అప్పగింతను తమ పార్టీ వ్యతిరేకించిందని…

Read More

రాబోయే లోక్‌సభ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్నవి కాదని, ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా సాగుతున్న ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడోసారి పాలన సాగించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మోదీ ఆదివారంనాడు శ్రీకారం చుట్టారు. అవినీతిపై తమ ప్రభుత్వం కొరడా తీసినందుకే కొందరు వ్యక్తులు కుతకుతలాడుతున్నారంటూ విపక్షాలు, అవినీతి నేతల అరెస్టులపై ప్రధాని విమర్శలు గుప్పించారు. గత పదేళ్లుగా అవినీతిపై తాము పోరాటం సాగిస్తున్న విషయం యావద్దేశానికి తెలుసునని, పేద ప్రజల సొమ్మును దళారులు దోచుకోకుండా చూశామని చెప్పారు. అవినీతిపై తాను సాగిస్తున్న పోరాటం కొందరికి ఇబ్బందిగా మారిందని ఎద్దేవా చేశారు. ‘భ్రష్టాచార్ హఠావో’ అనేది మోదీ మంత్రమని, ‘భ్రష్టాచార్ బచావో’ అనేది వాళ్ల (విపక్షాల) మంత్రమని విమర్శించారు. అవినీతిపై పోరాడుతున్న ఎన్డీయేకు, అవినీతికి కొమ్ముకాసే వర్గానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని చెప్పారు.…

Read More

లిక్కర్‌ పాలసీ కేసులో ఈడీ అరెస్ట్‌ వల్ల జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నుండే 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఆరు హామీలను ప్రకటించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన ప్రతిపక్షాల కూటమి ‘లోక్‌తంత్ర బచావో’ బహిరంగసభలో ఆయన చేసిన ఆరు హామీలను ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ చదివి వినిపించారు.  దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్, దేశంలో పేదలకు ఉచిత విద్యుత్, ప్రతి గ్రామం, మొహల్లాకు మంచి ప్రభుత్వ పాఠశాల, మొహల్లా క్లినిక్, స్వామినాథన్ కమిటీ నివేదిక ప్రకారం రైతులకు మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. గడిచిన 75 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ రాజధానికి పూర్తి స్థాయి రాష్ట్రహోదా కల్పిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నట్టు సునీత వెల్లడించారు. విద్య, వైద్యంతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, విపక్ష…

Read More