ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. నకిలీ వార్తల సమస్యను పరిష్కరించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో (పిఐబి) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు బాంబే హైకోర్టు తీర్పుని పక్కన పెట్టింది. భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసు అర్హత గురించి ప్రస్తావించలేదు. కిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకుగాను ఫ్యాక్ట్‌చెక్ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం గతే డాది ఏప్రిల్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు సవరణలు చేసింది. అయితే, ఈ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌పై కేంద్రం నోటిఫికేషన్‌ను అడ్డుకోవాలని కోరుతూ..…
Author: Editor's Desk, Tattva News
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవికి సుప్రీంకోర్టు గురువారం చీవాట్లు పెట్టింది. డిఎంకె నేత కె. పొన్ముడి మంత్రిగా తిరిగి నియమించడాన్ని తిరస్కరించడంపై ఆయనను తీవ్రంగా మందలించింది. తమిళనాడు గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరించారని చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. డిఎంకె నేత పొన్ముడిని మంత్రిగా చేర్చుకునేందుకు ఒక్కరోజు గడువు ఇస్తున్నామని, శుక్రవారం నాటికి నియామకం జరగాలని చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గవర్నర్‌ను ఆదేశించింది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని గవర్నర్‌ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేస్తామని, గవర్నర్ తీరుపట్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని మండిపడింది. రాష్ట్ర గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం సరికాదని దుయ్యబట్టింది. పొన్ముడిని రాష్ట్ర కేబినెట్‌లో చేర్చడానికి గవర్నర్ నిరాకరించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉపశమనం ద్వారా సుప్రీంకోర్టు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసిందని …
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని కలిసిన కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి దిశ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ (పీసీ – 2514) అన్నమయ్య జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వరి తిరుపతి జిల్లా భాకరాపేట మీదుగా వెళ్తుండగా కలిశారు. కానిస్టేబుల్‌పై ఫిర్యాదులు రావడంతో విచారణ అనంతరం ఆయనను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతం చేయడం.. రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలు-2024 షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధులను…
గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన ఘటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన కీలక అధికారులను గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగం గా ఉన్న మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు జరిగిన నష్టాలకు కారణాలను వెలికి తీసి వాటి సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు నిపుణుల కమిటి రెండవ పర్యాయం రాష్ట్రానికి వచ్చింది. ఢిల్లీనుంచి బుధవారం మధ్యాహ్నం హై దరాబాద్‌కు చేరుకున్న కమిటి జలసౌధలోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో సమావే శం నిర్వహించింది. ఈ సమావేశంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు సంబంధించిన ఇంజనీర్లను వేర్వేరుగా పిలిచి తగిన సమాచారం రాబట్టేందుకు ప్రశ్నలు వేసింది. సుమారు పుష్కరకాలం పాటు నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా కీలక స్థానంలో ఉంటూ కాళేశ్వరం ,మేడిగడ్డ బ్యారేజిలకు పునాదుల నుంచి పనులు పూర్తయ్యేదాక బాధ్యతలు నిర్వహించి ఇటీవలే…
రామేశ్వరం కెఫే పేలుడు ఘటనపై వివావాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేసు నమోదైంది. రెండు రాష్ర్టాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఫిర్యాదు మేరకు మదురై పోలీసులు కేసు నమోదు చేశారు. కరంద్లాజే ఇటీవల మాట్లాడుతూ తమిళనాడులో శిక్షణ పొంది, అక్కడ నుంచి కర్ణాటకకు వచ్చిన వ్యక్తులు బాంబులు పెట్టారని ఆమె పేర్కొనడం వివాదంకు దారితీసింది. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రం గా మండిపడ్డారు. కరంద్లాజే నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తమిళనాడు ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమెపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఈవోను ఎన్నికల కమిషన్ బుధవారంనాడు ఆదేశించింది. కరంద్లాజే ఇటీవల చేసిన వివాదాస్పద ప్రకటనపై డీఎంకే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలకు దిగింది. అయితే తన వ్యాఖ్యలు వివాదం కావడంలో ఆమె బుధవారంనాడు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ…
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమికి లోక్‌సత్తా మద్దతు ప్రకటించింది. ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ బుధవారం ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందన్న జేపీ.. ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలని కోరారు. భయం లేకుండా అందరూ పోలింగ్‌లో పాల్గొని.. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా పాలన సాగించేవారిని ఎన్నికోవాలని సూచించారు. “ఏపీలో రాజకీయ పరిస్థితులు దిగజారాయి. రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోంది. మంచి పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు. దానితో పాటు అభివృద్ధి కూడా కావాలి. అప్పులు తీసుకువచ్చి సంక్షేమం కోసం ఖర్చుపెట్టడం మంచిదికాదు.సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనం, అభివృద్ధి అంటే దీర్ఘకాలికంగా సంపద సృష్టించడం” అని జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎన్నికలు సజావుగా సాగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఒడిశా…
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, రిటైర్డ్ లెప్టినెంట్ జనరల్ బిపిన్ సూరి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నాలుగు వారాలుగా ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, ఆ నొప్పితోనే తమిళనాడులోని కోయంబత్తూరులో మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. నొప్పి మరింత తీవ్రం కావడంతో ఈ నెల 15వ తేదీన ఢిల్లీ ఇంద్రప్రస్థలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వివరించారు. సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. సబ్- డ్యూరల్ హెమటోమాతో జగ్గీ వాసుదేవ్ బాధపడుతున్నట్లు గుర్తించారు డాక్టర్లు. అప్పటికప్పుడు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించారు. మెదడులో బ్లీడింగ్ జరుగుతున్నట్లు రిపోర్టుల్లో తేలింది.…
చంద్రుడిలోని చీకటి భాగంలోకి చైనా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీనికి సంబంధించి లాంగ్‌మార్చ్ 8 రాకెట్‌పై క్యూకియావ్ 2 అనే 1.2 టన్నుల శాటిలైట్‌ను హైపాను ప్రావిన్స్ నుంచి బుధవారం ఉదయం ప్రయోగించింది. భవిష్యత్తులో చైనా చంద్రుడిపై చేసే ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని భూమి పైకి పంపేందుకు దీనిని వాడనున్నారు. సాధారణంగా చంద్రుడిపై మనకు కనిపించే భాగం నుంచి భూమిపైకి డేటా పంపడం సులువు. కానీ అవతలి భాగం నుంచి కమ్యూనికేషన్లను నెలకొల్పడం అసాధ్యం. తాజాగా ప్రయోగించిన క్యూకియాన్ 2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ మేలో ప్రయోగించనున్న ఛాంగి 6 మిషన్ నుంచి సంకేతాలను భూమి పైకి ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఛాంగి ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి ఆవలివైపు ఉన్న మట్టి ఇతర ఖనిజాలను చైనా సేకరించనుంది. 2026లో ప్రయోగించాలనే లక్షంతో పెట్టుకున్న చాంగి 7, 2028 లోని ఛాంగి 8 కు కూడా ఈ ఉపగ్రహం సహకరించనుంది. అంతేకాదు చంద్రుడి పైకి…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్ సభ అభ్యర్థిని ప్రకటించారు. కాకినాడ నుండి పార్టీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ‘టీ టైమ్’ యజమాని ఉదయ్ శ్రీనివాస్ 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం దుబాయ్ లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్ లెట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 3,000కు పైగా టీ టైమ్ ఔట్లెట్లు ఉన్నాయి. టీటైమ్ తో ఏడాదికి రూ.300 కోట్ల టర్నోవర్ ఉంటుందని అంచనా. ఉదయ్ శ్రీనివాస్ ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ ఎంపీ బరిలో దించినట్లు తెలుస్తోంది. మంగళవారం మంగళగిరి పార్టీలో కార్యాలయంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాను ఎక్కడ పుట్టినా, ఎక్కడ…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో మంగళవారం మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది కోరారు. తన అరెస్ట్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు. తన అరెస్ట్ చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆమె చెప్పుకొచ్చారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు కవిత తెలిపారు. అందుకే ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని, ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో వివరించారు. కాగా, కవిత ఈడీ కస్టోడియల్ విచారణ మూడో రోజు ముగిసింది. ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్న కవితను అధికారులు…