Author: Editor's Desk, Tattva News

రానున్న లోక్‌సభ ఎన్నికలను దృ ష్టిలో పెట్టుకుని ఎలాంటి విధ్వంస కాండ జరగకుండా నివారించడానికి నక్సల్ ప్రభావి త ప్రాంతాల్లో గాలింపు చర్యలు పోలీస్‌లు ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర లోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్ లోని దంతెవాడ జిల్లాల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌కుసంబంధించి తెలంగాణ సరిహద్దు నుం చి మావోయిస్టులు మహారాష్ట్ర లోకి ప్రవేశిస్తుండగా, భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు హ తమయ్యారు. వీరంతా తెలంగాణ కమిటీకి చెందిన వారిగా పోలీస్‌లు గుర్తించారు. వీరి పై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం. మృతులు మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తు , కుర్సింగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌లుగా గుర్తించారు. సంఘటన స్థలం నుంచి ఏకే 47, తు పాకులు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.మిగతా వా రి…

Read More

రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాడులో పాట్టాళి మక్కళ్ కట్చి(పిఎంకె)తో బిజెపి పొత్తు మంగళవారం ఖరారైంది. సీట్ల సర్దుబాటు ఒప్పందంలో భాగంగా తమిళనాడులో 10 లోక్‌సభ స్థానాలను పిఎంకెకు బిజెపి కేటాయించింది. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎలో చేరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షను పిఎంకె వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. దేశ ప్రయోజనాల కోసం, ప్రధాని మోడీ పాలన కొనసాగింపు కోసం ఎన్‌డిఎ శక్తులతో చేతులు కలపాలని తాము నిర్ణయించుకున్నట్లు పిఎంకె అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అసంతృప్తితో ఉన్న తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తమిళనాడులో తమ కూటమి భారీ విజయాన్ని అందుకుని ప్రధాని మోడీ మూడవ పర్యాయం బాధ్యతలు చేపట్టేందుకు మార్గాన్ని సుగమం చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాందాస్ నివాసంలో ఎన్నికల పొత్తు ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు వర్గాలు తెలిపాయి.…

Read More

కేంద్ర మంత్రి పశుపతి పారస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ నుంచి తన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జెపి)ని ఉపసంహరించుకున్నారు. తన అన్న రాంవిలాస్ విశ్వాన్ కుమారుడైన చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)తో బీహార్‌లో బిజెపి లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల పొత్తు కుదుర్చుకున్న దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. పారస్ పార్టీని పూర్తిగా విస్మరించిన బిజెపి చిరాగ్ పాశ్వాన్ పార్టీతో సీట్ల పొత్తు పెట్టుకుంది. చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జెపికి ఐదు సీట్లను బిజెపి కేటాయించింది. అందులో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పారస్ గెలుపొందిన హాజీపూర్ కూడా ఉంది. ప్రధాని మోదీకి ధన్యవాదాలని, తనకు, తన పార్టీకిఎన్‌డిఎలో తీరని అన్యాయం జరిగిందని, అందుకే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని పారస్ తెలిపారు. అయితే తన భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయన వెల్లడించలేదు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్- ఆర్‌జెడి…

Read More

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్ధీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో దాఖలైన 230 పిటిషన్లపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక ఏప్రిల్ 8వ తేదీలోగా కేంద్రం తన స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 9 వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే తదుపరి విచారణ వరకు సిఎఎ ప్రకారం పౌరసత్వం జారీ చేయమని సుప్రీంకోర్టులో ప్రకటన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. కేంద్రం ప్రకటన చేయాల్సిందేనని పిటిషనర్లు వాదించారు. ఒకవేళ ప్రకటన చేయకుంటే న్యాయపరమైన ఉత్తర్వును ఆమోదించాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే…

Read More

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రాజీనామా నేపథ్యంలో కేంద్రం కొత్త గవర్నర్ నియామకాన్ని ప్రకటించింది. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను కొత్త గవర్నర్ గా అదనపు బాథ్యతలు కట్టబెట్టింది. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా మరో అదనపు బాధ్యత ఇచ్చింది.  అలాగే తమిళి సై సౌందర రాజన్ చేసిన రాజీనామాను కూడా ఆమోదిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రెగ్యులర్ గవర్నర్లను నియమించే పరిస్దితి లేదు. దీంతో జార్ఖండ్ గవర్నర్ కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు.  2023 నుంచి జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ గతంలో బీజేపీలో క్రియాశీల నేతగా పనిచేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దీంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జార్ఖండ్ తో…

Read More

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యానికి బాధ్యులైన పోలీస్‌ అధికారులపై చర్యలకు ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మోదీ పాల్గొన్న సభను భగ్నం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆకాశంలో వెళుతుంటే కింద రోడ్ల మీద పోలీసులు ట్రాఫిక్‌ ఆపుతారని, దేశ ప్రధాని పాల్గొన్న సభకు భద్రత కల్పించలేదని విమర్శించారు.డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్సార్‌ ఆంజనేయులు, గుంటూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ వైసీపీకి తొత్తుల్లా మారారని, కావాలని సభకు అటంకాలు సృష్టించారని ఆరోపించారు. సభలో పదేపదే మైకులకు అంతరాయం కలిగేలా జనాన్ని నియంత్రించకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రధాని పాల్గొన్న సభ విషయంలో ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని నిలదీశారు. పల్నాడు ఎస్పీ అనవసరంగా ఖాకీ చొక్కా వేసుకున్నారని,…

Read More

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులకు రూ.100 కోట్ల మేర ముడుపులను బదలాయించడంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఆ తరువాత కూడా మద్యం హోల్‌సేల్ అమ్మకం దారుల నుంచి సేకరించిన నిధుల పంపిణీ కొనసాగినట్లు వివరించారు.  కవిత అరెస్ట్, తదుపరి పరిణామాలపై విడుదల చేసిన ఓ ప్రకటనలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు, తనిఖీలను నిర్వహించామని పేర్కొన్నారు. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి పలు ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ ఎంపీ సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌ను అరెస్ట్ చేశామని అన్నారు. ప్రస్తుతం ఆమె ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది. ఈ కేసులో…

Read More

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఘన విజయం సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ముగిసింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తున్నది. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తేలింది. దీంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్‌.. తాజా విజయంతో మరో ఆరేండ్లపాటు అదే పదవిలో ఉండనున్నారు. దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్‌ స్టాలిన్‌ను అధిగమించనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పుతిన్‌తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. అయితే ప్రధాన ప్రధ్యర్థి అయిన నావల్నీ ఎన్నికలకు ముందే చనిపోవడంతో ఆయనకు అసలు పోటీయే లేకుండా పోయింది. కాగా, …

Read More

ఎన్నికల బాండ్లకు సంబంధించిన యునిక్ సీరియల్ నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 21వ తేదీలోగా తమ వద్ద ఉన్న అన్ని వివరాలను ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారో తెలియజేసే నంబర్లతోపాటు అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి ఇచ్చి తీరాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఎలక్టోరల్‌ బాండ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు సమర్పించలేదని ఎస్‌బిఐను సుప్రీంకోర్టు నిలదీసింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందజేసిన విరాళాలపై ఎస్‌బిఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్‌లపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ”వివరాలు సమర్పించమని చెప్పండి అప్పుడు చూస్తాం. అన్నట్లుంది మీ వైఖరి. ఎస్‌బిఐ సెలక్టివ్‌గా ఉండకూడదు. కోర్టుపట్ల నిజాయితీగా వ్యవహరించాలి” అని డి.వై. చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ”ప్రతి సమాచారం వెల్లడి కావాలి.  బాండ్ల విషయంలో ఎస్‌బిఐ సెలెక్టివ్‌గా…

Read More

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ శాసనసభాపక్షం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌ హైదర్‌గూడలోని స్పీకర్‌ నివాసానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్‌ను అందజేశారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆ పార్టీ ఎమ్మె్ల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్పించుకొని ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. ‘నువ్వు కొట్టినావ్ మేము తీసుకున్నాం.. మేము కొట్టినప్పుడు రేవంత్ రెడ్డి.. నువ్వు లేవకుండా పొతావ్.’ అని ఘూటు వాఖ్యలు చేశారు. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే.. తిరిగి నాలుగు అడుగు ముందుకు దూసుకు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాగా, ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి…

Read More