Author: Editor's Desk, Tattva News

త్వరలోనే అర్హులైనవారందరికీ తెల్లరేషన్ కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. అనంతరం మీడియా ద్వారా కేబినేట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వివరించారు. 16 కొత్త కార్పొరేషన్లు, హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్దరణ, మహిళా సంఘాలకు రూ.10లక్షల వరకు బీమా, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మహిళా రైతు బజార్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. తొలి విడుతలో మొత్తం నాలుగున్న లక్షల ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు కోసం రూ.22,500కోట్ల నిధులు విడుదల చేశామని…

Read More

దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌  ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌- విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా, మంగళవారం  నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి- బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ  మంగళవారం పచ్చజెండా ఊపారు. వీటితో పాటు మొత్తం 10 వందేభారత్‌లను ప్రధాని తాజాగా వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 50 దాటడం విశేషం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేశారు. వీరిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్‌ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్‌ రెస్టారంట్లను ప్రధాని నేడు…

Read More

హర్యానాలో బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా నేపథ్యంలో హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీని ఎంపిక చేసినట్లు బిజెపి ప్రకటించింది. సైనీ సాయంత్రం 5 గంటలకు హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న హర్యానాకు కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పని చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్.. తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త సారథిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఖట్టర్ రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీని లోక్‌సభ సభ్యుడు నాయబ్ సింగ్ సైనీతో భర్తీ చేసింది బీజేపీ హైకమాండ్. ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఈ మేరకు చండీగఢ్‌లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో ఈ ప్రక్రియ పూర్తయింది. నాయబ్ సింగ్ పేరును ఎమ్మెల్యే కిషన్ లాల్ మిధ్నా ప్రతిపాదించారు. అనంతరం మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఆయనను తమ…

Read More

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు తెరపైకి వచ్చింది. రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు.  అసైన్డ్‌ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ యల్లమాటి ప్రసాద్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో 2020 ఫిబ్రవరి 27న పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. అలాగే నల్లూరు రవికిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2020 మార్చి 3న మరోకేసు నమోదుచేసి, పలువురిని నిందితులుగా పేర్కొంది. అమరావతి నిర్మాణంలో అసైన్డ్‌ భూముల కుంభకోణంలో టిడిపి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకూ రూ.4,400 కోట్ల స్కామ్‌ చేసినట్లు ఎపి సిఐడి పేర్కొంది. టిడిపి ప్రభుత్వం జిఓ నెంబరు 41 ద్వారా మందడం, వెలగపూడి. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లో 1,100 ఎకరాల మేర…

Read More

రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ‘మిషన్‌ దివ్యాస్త్ర పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 (ఎంఐఆర్‌ వి) క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్‌ వి) సాంకేతికతతో అభివృద్ధి చేశారు.  దీనిద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్‌హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. ఆసియా యావత్తూ దీని పరిధిలోకి వస్తుంది. అగ్ని-5 విజయవంతంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలకు ‘ఎక్స్‌’ వేదికగా అభినందనలు తెలిపారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు.  మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వీ) సాంకేతికతతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం.. దేశ రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని మోదీ కొనియాడారు.  అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని-5’కి.. ఐదు…

Read More

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం. సూర్య కిరణ్‌ తెలుగులో 2003లో వచ్చిన ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదట మలయాళంలో కెరీర్‌ను ప్రారంభించిన సూర్య కిరణ్‌ తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాలను తెరకెక్కించారు. సత్యం, ధన 51 చిత్రాలతో సుమంత్‌ని మాస్ హీరోగా నిలబెట్టారు. దాంతో పాటు తనని తాను దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు. సూర్య కిరణ్‌ చైల్డ్ ఆర్టిస్ట్‌గాను పని చేశారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఇప్పటి వరకు ఆయన ఆరు సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్‌ చిత్రాలున్నాయి. వీటితో పాటు చాప్టర్‌6, నీలిమలై చిత్రాలను తెరకెక్కించారు.  మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగమొగుడు, ఖైదీ, కొండవీటి దొంగ చిత్రాలతోపాటు…

Read More

తెలంగాణాలో మెజార్టీ పార్లమెంటు స్ధానాల్లో విజయం సాధించేందుకు కమలనాథులు ఎన్నికల ప్రచారానికి నడుం బిగించారు. అందులో భాగంగా ఆపార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 15వ తేదీ నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఈ నెల 16,17,18వ తేదీల్లో మోదీ పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మూడు బహిరంగ సభల్లో పాల్గొనేలా పార్టీ వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిలో సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. మూడు లోక్‌సభ స్థానాలు సమన్వయం చేసేలా ఒక్కో సభ పెట్టాలని పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 4,5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పర్యటన బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఎన్నికల షెడ్యూల్ తరువాత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. ఏయే తేదీల్లో పర్యటించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. మోదీ …

Read More

లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం  నియమ నిబంధనలను కేంద్ర హోంశాఖ సోమవారం నోటిఫై చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం 2019 డిసెంబర్‌లోనే పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకొన్నది.  మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్‌ 31 కంటే ముందు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్‌ మతస్తులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా ఈశాన్య రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌ను బీజేపీ సర్కారు తెరపైకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో…

Read More

ఎలక్టోరల్‌ బాండ్స్‌ కేసులో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. గడువు పొడిగించే ప్రసక్తే లేదని చెబుతూ రేపటిలోగా బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఎస్‌బీఐకి స్పష్టం చేసింది. అలాగే మార్చి 15 లోగా బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీని ఆదేశించింది.  ఇక ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్‌ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్‌బీఐ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపే టైంలోఎస్‌బీఐ వాదనలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాతల వివరాల్ని సరిపోల్చుకోవడానికి సమయం పడుతుందని చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఎదుట ఎస్‌బీఐ వాదన వినిపించింది. అయితే గత 26 రోజులుగా ఏం చేశారని బెంచ్‌ ఈ సందర్భంగా ఎస్‌బీఐని ప్రశ్నించింది.  గత నెలలో రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల…

Read More

తెలంగాణలో ప్రముఖ క్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయం యాదాద్రి క్షేత్రంలో నేటి నుంచి కొండంత పండుగ వేడుకగా జరగనుంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి 21 వరకు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే ఉత్సవాలకు, వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ ఇఒ రామకృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లు తెలియజేస్తూ బ్రహ్మోత్సవాలకు రూ.కోటి 60 లక్షలు కేటాయించామని, ఉత్సవాల సమయంలో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుం డా భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్ర ధాన ఘట్టాలైన 17న ఎదుర్కోళ్లు, 18న తిరుకల్యాణం, 19 దివ్యవిమాన రథోత్సవం జరుగుతుందని, 13 నుంచి 19వ తేదీ వరకు స్వామివారి అలంకార సేవలు అత్యంత వైభవంగా జరుగుతాయని, 15 నుంచి 20 వరకు భక్తుల కోసం ధార్మిక సంగీత మహాసభలు, సాంస్కృతిక…

Read More