పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తమ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, రైతులందరికీ రుణమాఫీ అమల్జేయాలని కోరుతూ అన్నదాతలు ఆందోళనలను ఉధృత్వంగా కొనసాగిస్తున్నారు. పంజాబ్‌లో 62 ప్రాంతాల్లో రైతులు రైలు రోకో నిర్వహించారు. రైల్వే స్టేషన్లలోకి దూసుకెళ్లి పట్టాలపై కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మరోవైపు హర్యానాలోనూ వివిధ రూపాల్లో ఆందోళనలకు సిద్ధమైన అన్నదాతలను అక్కడి బిజెపి ప్రభుత్వం నిర్బంధించింది. పలుచోట్ల 144 సెక్షన్ విధించి అణిచివేతకు పాల్పడింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు రైలురోకో నిర్వహించారు. ఈ ఆందోళనల్లో వేలాది మంది పాల్గన్నారు. పంజాబ్‌లో 62 ప్రాంతాల్లో రైలు రోకో చేపట్టగా 49 రైలు సర్వీసులు రద్దు అయ్యాయి. ఇంటర్ సిటీ లైన్లతో పాటు ప్రధాన లైన్లు కూడా రైలు రోకో ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో వందలాది మంది రైతులను అక్కడి…
Author: Editor's Desk, Tattva News
బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గొడెం నగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ లు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. వాస్తవానికి వీరు ముందుగానే పార్టీ మారుతారని తెలిసినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నుంచి ఎలాంటి స్పందన లేక పోవడం గమనార్హం. కాగా, హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన సైదిరెడ్డి టీఆర్ఎస్ లో కీలక నాయకుడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ముఖ్యంగా కె టి ఆర్ కు అంత్యంత సన్నిహితుడిగా సైదిరెడ్డికి పేరుంది. ఆయన పార్టీ మారేందుకురెడీ అవుతున్నట్టు తెలిసినా కేటీఆర్…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోరాటానికి సిద్ధపడిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పశ్చిమ్ బెంగాల్లోని మొత్తం లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. 42మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు మమతా బెనర్జీ. తీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ప్రతిపక్షాల వేదిక ఇండియా వ్యవహరించాలనే సంకల్పానికి ఈ పరిణామం చిక్కుముళ్లకు దారితీసింది. ప్రత్యేకించి ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టిఎంసిల నడుమ బెంగాల్‌లో ఇక సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ నిలిచిపోయినట్లే అయింది. ఒంటరిపోరే తమ వైఖరి అని, మొత్తం 42 స్థానాలకు పోటీ చేస్తున్నామని మమత స్పష్టం చేశారు. జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కూడా ఉన్నారు. ఇక లోక్సభ నుంచి బహిష్కారానికి గురైన మహువా మోయిత్రాపై దీదీ మరోమారు నమ్మకం ఉంచారు. ఆమెకు మళ్లీ టికెట్ ఇచ్చారు.…
కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలను భర్తీ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం సీఈసీ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ఇంతకు ముందు కమిషనర్లుగా కొనసాగిన అనూప్ చంద్రపాండే పదవీ విరమణ చేయగా అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించే తరుణంలోనే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ఆమోదం తెలిపారు. ఈ ఖాళీలను మార్చి 13లోగా భర్తీ చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నది. హోం సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డివోపిటి) సెక్రటరీతో కూడిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ మొదట రెండు పోస్టులకు ఐదుగురి పేర్లతో రెండు వేర్వేరు పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రధాని మంత్రి నేతృత్వంలోని కమిటీ ఇద్దరు కమిషనర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో…
ప్రపంచం మొత్తాన్నీ కట్టిపడేసే కాంపిటీషన్స్ మిస్ వరల్డ్. ప్రతి సంవత్సరం వేర్వేరు దేశాల్లో ఈ పోటీలు జరుగుతుంటాయి. గత ఏదాది ఈ అందాల పోటీలకు ప్యూర్టోరికో ఆతిథ్యాన్ని ఇచ్చింది. కరేబియన్ ఐలండ్స్‌లోని శాన్ జువాన్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ 2022 పోటీల్లో పోలెండ్ సుందరి కరోలినా బిలావ్స్కా విజేతగా నిలిచారు. ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఇది 71వ ఎడిషన్. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో కలర్‌ఫుల్‌గా సాగిన ఈ పోటీల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టీనా సిజ్కోవా మిస్ వరల్డ్ 2024 టైటిల్‌ను ఎగరేసుకెళ్లారు. 12 మంది సభ్యులతో కూడిన ప్యానెల్.. ఆమెను విజేతగా ప్రకటించింది. ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా బిలావ్స్కా ఆమెకు కిరీటాన్ని ధరింపజేశారు. లెబనాన్‌కు చెందిన యాస్మిన్ జాయ్‌టన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. భారత్ తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న సినీ షెట్టి నిరాశపరిచారు. టాప్ 10లో చోటు…
2024 లోక్ సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించగా, ఆమె అరుణ్ గోయల్ రాజీనామాను ఆమోదించారు. ఎన్నికల సంఘానికి ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (రాజీవ్ కుమార్) మాత్రమే నేతృత్వం వహిస్తారు తప్ప ఎన్నికల కమిషనర్లు లేరు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సర్వీసు నిబంధనలు, పదవీకాలం) చట్టం 2023లోని సెక్షన్ 11లోని క్లాజ్ (1)కు అనుగుణంగా 2024 మార్చి 9 నుంచి ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదిస్తున్నట్లు శనివారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అరుణ్ గోయల్ 2022 నవంబర్ 21న ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషనర్ ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్…
పాకిస్థాన్ దేశానికి 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) సహ వ్యవస్థాపకుడు ఆసిఫ్ అలీ జర్దారీ శనివారం ఎన్నికయ్యారు. జర్దారీ పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి.పిపిపి, పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్( పిఎంఎల్‌ఎన్) సంయుక్తంగా పాక్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అధికార కూటమి తరఫున 68 ఏళ్ల జర్దారీ అధ్యక్ష పదవికి బరిలో నిలిచారు. జర్దారీకి ప్రత్యర్థిగా సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ పార్టీకి చెందిన 75 ఏళ్ల మహమూద్ ఖాన్ అచక్‌జాయ్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. రాజ్యాంగం ప్రకారం నేషనల్ కౌన్సిల్, నాలుగు ప్రొవెన్షియల్ అసెంబ్లీలకు కొత్తగా ఎన్నికయిన సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జర్దారీకి 255 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థికి 119 ఓట్లు వచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది. వ్యాపారంనుంచి రాజకీయాల్లోకి వచ్చిన జర్దారీ దివంగత పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త. పాకిస్తాన్ 13వ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్…
ఈశాన్య ప్రాంతంలో గడచిన ఐదు సంవత్సరాలలో తన ప్రభుత్వం సాగించిన తరహా అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో రూ. 55600 కోట్లు విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభించిన తరువాత ప్రధాని అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో ‘వికసిత్ భారత్ వికసిత్ ఈశాన్యం’ కార్యక్రమంలో మాట్లాడారు. ‘దక్షిణాసియా, తూర్పు ఆసియాతో భారత వాణిజ్య, పర్యాటక, ఇతర సంబంధాలలో ఈశాన్య ప్రాంతం దృఢమైన అనుసంధానం కాబోతున్నది. ఇప్పుడు ఇక్కడ రూ. 55600 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను ఆవిష్కరించడమైంది’ అని ప్రధాని తెలియజేశారు. ‘ఈశాన్య ప్రాంతంలో గడచిన ఐదు సంవత్సరాలలో మేము చేసిన తరహా పనికి కాంగ్రెస్‌కు 20 సంవత్సరాల వ్యవధి పట్టి ఉండేది’ అని మోదీ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ సందర్శించేవారికి ‘మోడీ గ్యారంటీ’ అంటే ఏమిటో స్పష్టం అవుతుందని ప్రధాని పేర్కొన్నారు. ‘మోడీ గ్యారంటీ పని ఎలా…
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడులోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో పొత్తులు కొలిక్కి వచ్చాయి. చిన్న చిన్న భాగస్వామ్య పార్టీలకు సీట్లను డీఎంకే ఇప్పటికే ఖరారు చేయగా, కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల ఒప్పందం శనివారం ఖరారయింది. కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు జరిగితే 9+1 సీట్లు ఆ పార్టీకి వదిలేందుకు డీఎంకే అంగీకరించింది. తమిళనాడులో 9 సీట్లలో, పుదుచ్చేరిలో 1 సీటులో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. పొత్తుల్లో భాగంగా ఎండీఎంకే, ఐయూఎంఎల్, కేఎండీకేలకు ఇప్పటికే ఒక్కో లోక్‌సభ స్థానాన్ని డీఎంకే కేటాయించింది. ఎండీఎంకే, ఐయూఎంఎల్ తమ తమ గుర్తులతో పోటీ చేయనుండగా, కేఎండీఎంకే మాత్రం డీఎంకే గుర్తుపై పోటీకి దిగనుంది. చర్చల్లో కుదరినట్టు చెబుతున్న ఏకాభిప్రాయం ప్రకారం, సీపీఐ, సీపీఎం, విడుదలై చిరుతైగళ్ కట్చి (వీసీకే)లు తలో రెండు సీట్లలో తమ పార్టీ గుర్తులతో పోటీచేయనున్నారు. ఇలా ఉండగా, నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ సారథ్యంలోని మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) శనివారం డిఎంకె…
సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితుడి కొత్త ఫోటోలను దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారంనాడు విడుదల చేసింది. మార్చి 1న జరిగిన ఈ పేలుడులో సుమారు 10 మంది గాయపడ్డారు. 3వ తేదీన కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. కేఫ్‌లో పేలుడు జరిగిన సుమారు ఒక గంటకు నిందితుడు ఒక బస్సు ఎక్కుతుండటం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. టైమ్‌స్టాంప్ మధ్యాహ్నం 2.03 గంటలుగా వీడియోలో ఉండగా, 12.56 గంటలకు కేఫ్‌లో పేలుడు జరిగింది. అనుమానితుడు టీ-షర్డ్, టోపీ, ఫేస్ మాస్క్ వేసుకుని కనిపించాడు. కాగా, అదే రోజు (మార్చి1) మరో ఫుటేజిలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక బస్సు స్టేషన్ లోపల అతను తిరుగుతున్నట్టుగా ఉంది. అనుమానితుడికి సంబంధించి సమాచారం తమకు తెలియజేస్తే రూ.10 లక్షలు రివార్డుగా ఇస్తామని కూడా ఎన్ఐఏ ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరును గోప్యంగా ఉంచుతామని హామీ…