Author: Editor's Desk, Tattva News

ఈ ఏడాది దేశంలో ఎండలు మరింతగా మండుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ వేసవి కాలమంతా కూడా ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే అవకాశం వుందని, వేడిమి భరించలేని స్థాయిలో ఉండొచ్చని ఐఎండి తెలిపింది.  సాధారణంగా ఊహించిన దానికన్నా ఈశాన్య భారతంలో, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో, మహారాష్ట్ర, ఒడిశాల్లో పలుచోట్ల వడగాడ్పులు ప్రచండంగా ఉండొచ్చని పేర్కొంది. మార్చిలో సాధారణం కన్నా అధికంగా (సుదీర్ఘ కాల సగటు 29.9 మిలీమీటర్ల కన్నా 117శాతం ఎక్కువ) వర్షపాతం వుండొచ్చని, మార్చి – మే మధ్య దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజరు మహాపాత్రో మీడియాకు తెలిపారు.  ఎల్‌నినో పరిస్థితులు ఈ వేసవి అంతా కొనసాగే అవకాశముందని అన్నారు. వర్షాకాలం రెండో అర్ధభాగంలో ‘లా నినా’ నెలకొనే అవకాశమున్నందున వర్షాలు బాగా కురియవచ్చని ఐఎండి తెలిపింది.

Read More

బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్‌కు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోగల ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించి 9 మంది గాయపడ్డారు. తొలుత ఈ ప్రమాదానికి ఎల్‌పిగ్లీకేజి కారణమని భావించినప్పటికీ ఆ అవకాశం లేదని అగ్నిమాపక శాఖ తోసిపుచ్చింది. ఘటనా స్థలంలో ఒక మహిళకు చెందిన హ్యాండ్‌బ్యాగ్ లభించిందని, పేలుడుకు అసలు కారణాన్ని నిర్ధారించే ప్రయత్నంలో ఫోరెన్సిక్ బృందాలు ఉన్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. పేలుడులో గాయపడిన వారిలో ఇద్దరు సిబ్బంది, ఏడుగురు కస్టమర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని నగరంలోని వివిధ ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందచేస్తున్నారు. కేఫ్‌లో మహిళ తెచ్చిన బ్యాడులోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేఫ్ లోపల, వెలుపల అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సిసి టివి ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల దిగ్బంధంలో ఉన్న కేఫ్‌ను కర్నాటక డిజిపి అలోక్ మోహన్, బెంటళూరు పోలీసు కమిషనర్ బి దయానంద పరిశీలించారు. ఎన్‌ఐఎ,…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఝార్ఖండ్ ఢన్‌బాద్‌లో ఎన్నికల శంఖం పూరించారు. దేశం మోడీ గ్యారంటీపై ఆధారపడినందున రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ 400 సీట్లు గెలుపొందుతుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ‘జల్ జీవన్ మిషన్’, ‘ఆవాస్ యోజన’ పథకాల అమలుకు అడ్డంకులు సృష్టిస్తున్నదని కూడా ప్రధాని ఆరోపించారు. బర్వాడలో ‘విజయ్ సంకల్ప్ ర్యాలీ’లో మోడీ ప్రసంగిస్తూ, ‘దేశానికి మోడీ గ్యారంటీపై విశ్వాసం ఉన్నందున రానున్న లోక్‌సభ ఎన్నికలలో అబ్‌కీ బార్ 400 పర్ (ఈదఫా మేము 400 పైచిలుకు సీట్లు గెలుపొందుతాం). ఇతరుల నుంచి ఆశలు అన్నీ ముగిసే చోట మోడీ గ్యారంటీ మొదలవుతుంది’ అని చెప్పారు. ‘సింద్రీ ఎరువుల కర్మాగారం, ఉత్తర కరణ్‌పురా విద్యుత్ ప్రాజెక్ట్ వంటి ప్లాంట్‌ల పునఃప్రారంభం మోడీ గ్యారంటీ వల్ల నెరవేరిందనడానికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లో జెఎంఎం నేతృత్వంలోని కూటమిపై మోడీ తీవ్రంగా విరుచుకుపడుతూ, అది…

Read More

సాధారణంగా హత్య కేసు నాలుగు, ఐదు రోజుల్లో తేలుతుందని, వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతోందని ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు కావాలని, హత్య కేసు దర్యాప్తు ఇప్పటికే అక్కడే ఉందని బాధను వ్యక్తం చేశారు. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితే తనకు న్యాయం జరుగుతుందని, ఒక్కోసారి హంతకులు మన మధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందని, వాళ్లను కనుక్కోవాలి కదా? అని సునీతా రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య కేసును ఇంతవరకు ఎందుకు తేల్చలేకపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 ఎంఎల్‌సి ఎన్నికల్లో నాన్న ఓటమి పాలయ్యారని, సొంతవాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నానని, ఓటమి పాలైన తన తండ్రిని మరింత అణచాలని చూశారని ఆమె దుయ్యబట్టారు. మా నాన్న హత్య కేసులో సిబిఐ దర్యాప్తునకు…

Read More

సివిల్‌ లేదా క్రిమినల్‌ కేసుల్లో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతట అవే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.  రాజ్యాంగ న్యాయస్థానాలు (సుప్రీంకోర్టు, హైకోర్టులు) సాధారణంగా కింది కోర్టుల్లో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. అసాధారణ కేసుల్లో మాత్రమే విచారణను ముగించడానికి గడువును కింది కోర్టులకు ఉన్నత న్యాయస్థానాలు నిర్ణయించవచ్చునని తెలిపింది. కేసుల విచారణకు ప్రాధాన్యమిచ్చే విషయాన్ని ఆ కేసులు ఏ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయో, అదే కోర్టు విచక్షణకు వదిలిపెట్టడం ఉత్తమమని వివరించింది. 2018లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఓ కేసులో ఇచ్చిన తీర్పును తాజా తీర్పు కొట్టి వేసింది.  కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసిన స్టే…

Read More

తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని కోరుతూ, అందుకు అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం ప్రభుత్వ పక్షాన అందిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం సచివాలయంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందంతో ఆయన సమావేశం అయ్యారు. బిఇఎంఎల్ కంపెనీ బేస్ ఎక్కడ, ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తులు సృష్టిస్తుందో అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైల్ కోచ్ లు, రక్షణ, మైన్స్ వంటి రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని సీఎండీ శంతను రాయ్ డిప్యూటీ సీఎం వివరించారు. బెంగళూరు కేంద్రంగా తమ కంపెనీ పని చేస్తుందని, రక్షణ రంగానికి సంబంధించి కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్‌లో, సింగరేణిలో ఎర్త్ మూవర్స్ రంగాల్లో పనిచేస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయం ఉన్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి…

Read More

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఎస్‌డీఆర్‌ఐ) డిప్యూటీ డైరెక్టర్‌ చేసిన ఫిర్యాదుపై మాచవరం పోలీసులు కేసునమోదు చేశారు. గురువారం తెల్లవారుజామున శరత్‌ను అరెస్టుచేసి విజయవాడ తీసుకొచ్చారు. అయితే ఆయన్ను ఎక్కడ ఉంచిందీ ఆచూకీ చెప్పలేదు. దీంతో ఆందోళన చెందిన పుల్లారావు, టీడీపీ నేతలు పట్టాభి, పిల్లి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, కార్యకర్తలు పోలీసుకమిషనర్‌ కార్యాలయం వద్ద గురువారం రాత్రి ఆందోళన చేశారు. కార్యాలయం లోపలకు వెళ్లడానికి యత్నించగా.. పోలీసులు గేటు మూసివేశారు. దీంతో వారు అక్కడే బైఠాయించారు. శరత్‌ ఆచూకీ తెలపాలని నినాదాలు చేశారు. గంట తర్వాత రూరల్‌ డీసీపీ కంచి శ్రీనివాసరావు వచ్చి పుల్లారావుతోపాటు ముగ్గురు నేతలను లోపలకు తీసుకెళ్లి మాట్లాడారు. మరో గంటలో శరత్‌ను న్యాయాధికారి ఎదుట హాజరుపరుస్తామని డీసీపీ హామీ ఇవ్వడంతో వారు…

Read More

దేశ భవిష్యత్తును ప్రగతి పదంలోకి తెచ్చేది  బీజేపీ యేనని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. కాంగ్రెస్.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అమెరికాకు దీటుగా తెలంగాణలో రోడ్లు తీర్చిదిద్దుతామని తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగు పడినప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ది చెందుతా యని పేర్కొన్నారు.  గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన విజయ సంకల్పయాత్ర ముగింపు సభ కార్య క్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొంటూ, కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అద్వాన్నంగా తయారయ్యాయని, రోడ్లు, తాగు నీరు సౌకర్యాలు లేక ప్రజలు పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారురు. సర్కారు ఆసుపత్రులలో సౌకర్యాలు లేక అందుబాటు లో అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయని వాపోయారు. కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి బాగా లేదని, 25 శాతం…

Read More

రూ.75,021 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ను ఏర్పాటు చేసే పీఎం-సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ‘‘నేడు ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకు ఈ రోజు కేబినెట్ ఆమోదం లభించింది. ఈ పథకం కింద కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ భేటీ అనంతరం విలేకరులకు వివరించారు. ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలోని కోటి కుటుంబాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘సుస్థిర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభిస్తున్నాం. రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడితో, ప్రతి నెలా…

Read More

మహిళలపై అత్యాచారం, భూ కబజ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ గత 55 రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్‌ను గుఉవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖలీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాఖాన్‌లోని ఒక ఇంట్లో తలదాచుకున్న షాజహాన్ షేక్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొందరు అనుచరులతో కలసి షాజహాన్ షేక్ ఆ ఇంట్లో తలదాచుకున్నట్లు వారు చెప్పారు. అరెస్టు అనంతరం అతడిని బసీర్‌హట్ కోర్టుకు రరలించినట్లు వారు వివరించారు. షాజహాన్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులతోపాటు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) కూడా అరెస్టు చేయవచ్చని కలకత్తా హైకోర్టు ప్రకటించిన 24 గంటల్లోపలే అతడిని పోలీసులు అరెస్టు చేసినట్లు వారు ఎప్పారు. షాజహాన్‌ను 72 గంటల్లో అరెస్టు చేయాలని, అలా చేయని పక్షంలో అందుకు కారణాలు వివరిస్తూ ఒక నివేదికను ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ మమతా…

Read More