Author: Editor's Desk, Tattva News

తమ ఔషధ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు ప్రచారం చేయవద్దని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. తాము గత నవంబర్ లో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గానూ పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణన్ లపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు చేపట్టకూడదో చెప్పాలని షొ కాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అల్లోపతి వైద్య విధానాన్ని విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయవద్దని పతంజలి ఆయుర్వేద సంస్థకు చెందిన బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణన్ లను ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అల్లోపతికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయొద్దని సూచించింది. అల్లోపతి ని విమర్శించడాన్ని అడ్డుకోవాలని, అలాగే, తమ వద్ద అన్ని జబ్బులను నయం చేయగల ఔషధాలు ఉన్నాయని ప్రచారం చేసుకోవడాన్ని నిరోధించాలని కోరుతూ…

Read More

లోక్ పాల్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ ఖన్విల్కర్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి జస్టిస్ ఖన్విల్కర్ 2022 జులైలో పదవీ విరమణ చేశారు. జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ ఖన్విల్కర్ ను లోక్ పాల్ ఛైర్ పర్సన్ గా నియమించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. లోక్ పాల్ కు చైర్ పర్సన్ తో పాటు ముగ్గురు సభ్యులను కూడా రాష్ట్రపతి నియమించారు. జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రీతూ రాజ్ అవస్థిలను జ్యుడీషియల్ సభ్యులుగా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ముగ్గురు జ్యుడీషియల్ సభ్యులు కాకుండా సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కే కూడా సభ్యులుగా ఉన్నారు. అంటే, ప్రస్తుతం లోక్ పాల్ లో ఒక చైర్ పర్సన్, ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ…

Read More

గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు ఎఫ్ఐఆర్‌లో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చిన పోలీసులు, ఆయనను 8 వ నిందితుడిగా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పార్టీ జరిగిన రూమ్‌లో క్రిష్ అరగంట పాటు కూర్చున్నాడని, డ్రైవర్ లేని సమయంలో వివేకానందతో కాసేపు మాట్లాడారని తెలిపారు. అయితే, హోటల్ యజమానితో తనకు అప్పుడే పరిచయం ఏర్పడిందన్న క్రిష్ చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై దర్శకుడు క్రిష్ స్పందిస్తూ తాను రాడిసన్ హోటల్‌కు వెళ్లినట్టు తెలిపారు. సాయంత్రం స్నేహితులను కలవడానికి వెళ్లానని, అరగంట పాటు గడిపానని చెప్పారు. పోలీసులు తనను ప్రశ్నించారని, ఎందుకు వెళ్లానో.. ఎవర్ని కలిశానో స్టేట్‌మెంట్ ఇచ్చానని చెప్పారు. డ్రగ్స్ కేసులో బీజేపీ నేత కుమారుడు గజ్జల వివేకానంద, వ్యాపారవేత్త కేదార్‌నాథ్‌లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సినీ నటి లిషి గణేష్‌, శ్వేత పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు. డ్రగ్స్‌ పార్టీకి లిషి గణేష్‌ వెళ్లినట్లు తెలుస్తోంది.…

Read More

భారత తీర రక్షక దళంలో శాశ్వత మహిళా కమిషన్ ఏర్పాటులో ఎందుకీ ఆలస్యం? వెంటనే స్పందిస్తారా? లేక మీరు చేయలేకపోతే, ఈ పనిని మేం చేస్తాం అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చురకలు పెట్టింది. కోస్ట్‌గార్డు దళంలో మహిళలను తీసుకోవడాన్ని వ్యతిరేకించే ధోరణితో ఉందని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. కోస్ట్ గార్డు మహిళా అధికారులకు కమిషన్ ఏర్పాటు తంతుపై ఎంతకాలం మీనమేషాలు అని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం కేంద్రాన్ని మందలించింది. మహిళలను అలానే వదిలేయలేమన్న సర్వోన్నత న్యాయస్థానం.. మహిళలకు శాశ్వత కమిషన్‌ కల్పించాల్సిందేని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోకపోతే తామే (సుప్రీంకోర్టు) ఆ పని చేస్తుందని ధర్మాసనం తెలిపింది. సంబంధిత విషయంపై కేంద్రంతరఫున న్యాయస్థానానికి వచ్చిన అటార్నీ జనరల్‌ను నిలదీశారు. దీనితో తాము ఈ విషయంలో అఫిడవిట్‌తో వివరణ ఇచ్చుకోవాలని చెపుతామని కేంద్రం న్యాయవాదులు తెలిపారు.…

Read More

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదులతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో ఈ ఎనిమిది స్థానాలూ ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారాన్ని పంపారు. వైఎస్సార్‌సీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి… టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌, వాసుపల్లి గణేష్‌లపై అనర్హత వేటు పడింది. సోమవారం గెజిట్‌ వెలువడనుండగా.. మరో పది రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో అనర్హత వేటు ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్‌సీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు నలుగురిపై శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ రెబల్ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని…

Read More

బాణ సంచా నిషేధంలో క్రైస్తవ మిషనరీల పాత్రపై విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణలకు సంబంధించి తమిళనాడు బిజెపి అధ్యక్షుడు, మాజీ ఐపిఎస్ అధికారి అన్నామలైపై చట్టపరమైన చర్యలను చేపట్టకుండా సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. పిటిషనర్ అన్నామలై తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించిన తర్వాత ఫిర్యాదుదారుడికి, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయమూర్తి సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ ఇంటర్వూకు చెందిన ప్రతిని న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. ఇందులో ఎటువంటి విద్వేషపూరితమైన వ్యాయలు వేవని వారు వాదించారు. అన్నామలై వ్యాఖ్యలలో ప్రాథమికంగా చూస్తే ఐపిసిలోని సెక్షన్ 153ఎ కింద ఎటువంటి నేరంగా పరిగణించలేమని పేర్కొన్న ధర్మాసనం ఫిర్యాదుదారు పియూష్ మానుష్, తమిళనాడు ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ నోటీసులు జారీచేసింది. ఏప్రిల్ 29లోగా నోటీసులకు జవాబివ్వాలని కోరిన ధర్మాసనం అప్పటివరకు దీనిపై దిగువ కోర్టు…

Read More

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ మొదటి గ్యారంటీ ప్రకటించింది. ‘ఇందిరమ్మ అభయం’ పేరుతో మొదటి గ్యారెంటీని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా పేరు మీదనే చెక్కు పంపిణీ చేస్తామని ప్రకటన చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘న్యాయ సాధన’ సభ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొంటూ ప్రధాని మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ బలహీనం అయిందంటున్నారని చెబుతూ అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకు కూల్చుతున్నాడని మండిపడ్డారు.  అంతేకాకుండా.. ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నియంత మోదీ వల్లనే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని ధ్వజమెత్తారు. మరోవైపు.. రాహుల్, సోనియా గాంధీపై తిట్ల దండకం చేస్తున్నారని.. తనను కూడా వదలడం లేదని విమర్శించారు. దేశం అంతా…

Read More

షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం ముగియడంతో పాకిస్తాన్ రావి నది నుంచి నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు మీడియా వార్తల ద్వారా తెలియవచ్చింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో షాపూర్ కంది బ్యారేజ్ ఉన్నది. ఈ చర్య వల్ల పాకిస్తాన్‌కు ఇంతకుముందు కేటాయించిన 1150 క్యూసెక్కుల నీరు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి లభ్యం అవుతుంది. ఈ జలాలను నీటిపారుదల అవసరాలకు వినియోగిస్తారు. కథువా, సాంబా జిల్లాల్లో 32 వేల హెక్టార్ల భూమికి దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది. నీటిపారుదలకు, జల విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన షాపూర్ కంది బ్యారేజ్ ప్రాజెక్టుకు గత మూడు దశాబ్దాలలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. జమ్మూ కాశ్మీర్‌లో వేలాది ఎకరాల వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం కలిగించే అవకాశం ఉన్నందున షాపూర్ కంది డ్యామ్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. గడచిన 40 ఏళ్లుగా పెండింగ్‌లో…

Read More

భార‌త్‌ను అంత‌ర్జాతీయ ఎగుమ‌తుల హ‌బ్‌గా మారుస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. సోమ‌వారం ఢిల్లీలోని భార‌త్ మంట‌పంలో భార‌త్ టెక్స్ 2024ను ప్రారంభిస్తూ రాబోయే పాతికేండ్ల‌లో భార‌త్‌ను తాము విక‌సిత్ రాజ్యంగా ఆవిష్క‌రించేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. పేద‌లు, యువ‌త‌, రైతులు, మ‌హిళ‌ల సంక్షేమం ల‌క్ష్యంగా విక‌సిత్ భార‌త్ స్వ‌ప్నం సాకార‌మ‌వుతుంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం చేపడుతున్న చ‌ర్య‌ల ఫ‌లితంగా భార‌త టెక్స్‌టైల్ రంగంలోకి విదేశీ పెట్టుబ‌డుల ప్ర‌వాహం పెరిగింద‌ని ప్రధాని చెప్పారు. 2014తో పోలిస్తే ప్ర‌స్తుతం టెక్స్‌టైల్ రంగంలో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు (ఎఫ్‌డీఐ) రెట్టింప‌య్యాయ‌ని ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. దేశంలో జౌళి ప‌రిశ్ర‌మ అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ద‌ని వివ‌రించారు. 2014లో దేశంలో టెక్స్‌టైల్ మార్కెట్ విలువ రూ. 7 ల‌క్ష‌ల కోట్ల కంటే త‌క్కువ‌గా ఉండ‌గా, ప్ర‌స్తుతం ఆ విలువ రూ. 12 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింద‌ని చెప్పారు. గ‌త పదేండ్ల‌లో నూలు, దుస్తులు,…

Read More

పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి తొలి మహిళా సిఎంగా పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ – నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) పార్టీ అభ్యర్థి మర్యమ్‌ నవాజ్‌ చరిత్ర సృష్టించారు. ఆమె పంజాబ్‌ అసెంబ్లీలో తన ప్రత్యర్థి సున్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐసి)కి చెందిన రాణా అఫ్తాబ్‌పై ఆమె విజయం సాధించింది. అసెంబ్లీలో ఎస్‌ఐసి సభ్యుల బహిష్కరణ కారణంగా రాణా అఫ్తాబ్‌కి ఒక్క ఓటూ పడలేదు. దీంతో 220 ఓట్లను సాధించి పూర్తి మెజారిటీతో మర్యమ్‌ సిఎంగా ఎన్నికయ్యారు. కాగా, ఈరోజు కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ మాలిక్‌ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ సెషన్‌లో సున్నీ ఇత్తెహద్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐసి)కి చెందిన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని వాకౌట్‌ చేశారు. అసెంబ్లీని బహిష్కరిస్తున్న సభ్యులను తిరిగి అసెంబ్లీకి వచ్చేలా ఒప్పించేందుకు స్పీకర్‌ ఖాన్‌ ఖవాజా సల్మాన్‌ రఫీక్‌, సల్మాన్‌ నజీర్‌, సమీవుల్లా, ఖలీల్‌ తాహిర్‌ సింధులతో సహా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సిఎం అభ్యర్థిగా మర్యమ్‌…

Read More