తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ఉండనుందని, మెజార్టీ సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, బిజెపి విజయం సాధించదని కుమ్మక్కు అవుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేసిన బిఆర్‌ఎస్‌కు ఓటేసిన ఒక్కటేనని స్పష్టం చేస్తూ బిఆర్‌ఎస్ నాయకులంతా బిజెపిలో చేరాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు బిజెపికి ప్రధాన పార్టీ అని, బిఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండదని తేల్చి చెప్పారు. బిఆర్‌ఎస్ అరకొర సీట్లు గెలిచినా, ఓడినా తెలంగాణకు ఒరిగేది, పోయేది ఏం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఎంఐఎం సీటుతో పాటు తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తామని, ఈసారి అసదుద్దీన్‌ను ఓడిస్తామని సవాల్ విసిరారు. సర్వేలు వాస్తవాలు కావని, తెలంగాణలో మెజార్టీ సీట్లు బిజెపి గెలిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు డూప్ ఫైటింగ్ చేస్తున్నారని, వంద…
Author: Editor's Desk, Tattva News
ఇన్నర్ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్) కేసులో ఎ-1 ముద్దాయిగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును పేర్కొంటూ ఎసిబి కోర్టులో సిఐడి గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఎ-2గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితోపాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్‌ను ముద్దాయిలుగా సిఐడి పేర్కొంది. సింగపూర్‌తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని తెలిపింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్టు సిఐడి తెలిపింది. అయితే జి2జి ఒప్పందమే జరగలేదని సిఐడి నిర్ధారించింది. సింగపూర్‌తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని పేర్కొంది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్‌లు రూపొందించినట్టు పేర్కొంది. ఇన్నర్ రింగ్‌రోడ్డును లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సిఐడి ఛార్జిషీట్‌లో వెల్లడించింది. ’58…
రాజ్యసభలో త్వరలో 56 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.ఈ నేపథ్యంలో గురువారం సభలో వారికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ = మాట్లాడుతూ మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఎంపీలందరికీ ఆదర్శమని కొనియాడారు. ‘ఈ దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవ అపారం. రాజ్యసభకు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాజ్యసభలో ఇటీవల ఓ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ట్రెజరీ బెంచ్ (అధికార పక్షం) గెలుస్తుందని తెలిసినా ఆయన వీల్‌చైర్‌లో వచ్చి ఓటేశారు. ఓ సభ్యుడిగా తన విధుల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారనేదానికి ఇదొక ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో ఉన్నా పని చేశారు. ఎంపీలందరికీ ఆయన ఆదర్శం’ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా రిటైరవుతున్న సభ్యులకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. మన్మోహన్ సింగ్…
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కడపకు చెందిన మేడా రఘునాధరెడ్డి, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిలను ఎంపిక చేసింది. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. గతంలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పేర్లను పరిశీలించారు.. దాదాపు ఫైనల్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ అన్యూహంగా ఆరణి శ్రీనివాసులు స్థానంలో కడపుకు చెందిన మేడా రఘునాథరెడ్డిని ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. గురువారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరుగనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్…
తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి తమకు అప్పగించారని, ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గురువారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని పేర్కొంటూ దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామని ఆమె తెలిపారు. “ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు. ప్రగతిభవన్ ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం. ప్రజాపాలనలో కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తాం. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం” అంటూ గవర్నర్ భరోసా ఇచ్చారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అములుకు కట్టుబడి ఉన్నామని చెబుతూ దశాబ్ధకాంలో…
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు రాత్రి పొద్దుపోయిన తర్వాత 11.30గంటలకు అమిత్ షా నివాసానికి చేూరుకున్నారు. దాదాపు గంట పాటు ఈ చర్చలు జరిగాయి భేటీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. అమిత్ షాతో భేటీ పూర్తైన తర్వాత ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు టీడీపీ వర్గాలు సంకేతాలను ఇచ్చాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. సుమారు గంటపాటు జరిగిన చర్చల్లో ఏపీలో ఇరుపార్టీలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది . దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమిని తిరిగి బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం…
దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సరికొత్త చరిత్రను లిఖించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇటీవలె ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించగా.. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును సీఎం పుష్కర్ సింగ్ ధామీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రస్తుతం అమలు కావడంతో దేశంలో యూసీసీ ఆమోదం పొందిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ మారింది. ఉత్తరాఖండ్ కంటే ముందు గోవా రాష్ట్రంలో బ్రిటీష్ పాలకుల కాలంలోనే ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లుకు సభ ఆమోదం కల్పించింది. ఉత్తరాఖండ్‌కు ఇది చాలా ముఖ్యమైన రోజు అని ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు చాలా కాలంగా డిమాండ్…
కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ ఆలోచనలన్నీ అవుట్ డేటెడ్. దేశాన్ని ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తోంది, విభజించి పాలించటం కాంగ్రెస్ పార్టీకి అలవాటే, ఎంత అల్లరి చేసినా తన గొంతు మూగబోదని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో విరుచుకు పడ్డారు. కేంద్ర బడ్జెట్ పై రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగి రాజ్యసభలో అలజడి సృష్టించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చివర దశలో ఉందని, తమకున్న 40 స్థానాలను కాపాడుకునేందుకు తపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కనీసం 40 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ నాయకులు స్పష్టం చేశారని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అయిదు ఆర్థికాంశాల్లో బలహీన పాడగా, గడచిన పదేళ్లల్లో ఈ అయిదు ఆర్థికాంశాల్లో అగ్రస్థానానికి చేరుకున్నామని, ఇందుకు ఎంతో కష్టపడ్డామని తెలిపారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు…
భారత ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పార్టీ పేరు, గుర్తును కోల్పోయిన శరద్ పవార్ ”నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ” ఇక నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్ గా పోటీలోకి దిగుతుంది. కొత్త పేరుకు ఈసీఐ ఆమోదం తెలిపింది. కొత్త పేరుతోనే శరద్ పవార్ వర్గం మహారాష్ట్ర నుంచి ఫిబ్రవరి 27న జరిగే 6 రాజ్యసభ స్థానల్లో పోటీ చేయనుంది. ఈసీ ఆదేశాల మేరకు మూడు పేర్లను శరద్ పవార్ వర్గం అందచేసింది. ”నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్చంద్ర పవార్”, ”నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్‌రావ్ పవార్”, ”ఎన్‌సీపీ-శరద్ పవార్” పేర్లను ప్రతిపాదించింది. దీంతో మొదటి పేరుకే భారత ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్‌సీపీ శరద్ పవార్, ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గాలు పార్టీ తమదేనంటూ ఈసీని ఆశ్రయించడంతో ఈసీ మంగళవారంనాడు సంచలన తీర్పునిచ్చింది. అజిత్ పవార్ వర్గానికి ఎన్‌సీపీ పేరు, గుర్తు కేటాయించింది. మహారాష్ట్ర నుంచి రాజ్యసభ…
రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. అయితే పోలింగ్‌కు ముందు రోజు పేలుడు సంఘటనలు జరిగాయి. పాకిస్థాన్ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాల సమీపంలో జరిగిన పేలుళ్లలో 25 మంది మరణించారు. నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. గురువారం పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. సరిగ్గా దానికి ఒక రోజు ముందు బాంబు పేలుళ్లు సంభవించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నివాసాల సమీపంలో ఈ బాంబు పేలుళ్లు జరగడం సంచలనంగా మారింది. ఈ బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సంతాపం తెలిపారు. అయితే మొత్తం ఇప్పటివరకు రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లు జరిగినట్లు పాక్ మీడియా వెల్లడించింది. పాక్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ నివసించే పిషిన్ జిల్లాలో జరిగిన…