Author: Editor's Desk, Tattva News

రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. యుద్ధ ఖైదీలతో వెళ్తోన్న సైనిక విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని బెల్గోరాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉక్రెయిన్‌కు చెందిన 65 మంది యుద్ధ ఖైదీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.  ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాల్లో ఎగురుతున్న రష్యా సైన్యానికి చెందిన ఐఎల్-76 విమానం ఒక్కసారిగా అదుపుతప్పి.. భూమిని ఢీకొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోవడం వల్ల నివాస ప్రాంతాలకు సమీపంలో కూలిపోవడం వీడియోలో కనిపిస్తోంది. విమానం కుడి రెక్కపై కూలిపోయి మంటలు చెలరేగాయి. ‘స్థానిక కాలమానం ప్రకారం దాదాపు ఉదయం 11 గంటల సమయంలో ఐఎల్-76 యుద్ధ విమానం బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయింది’ అని రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘విమానంలో 65 మంది ఉక్రెయిన్‌కు చెందిన యుద్ధ ఖైదీలు ఉన్నారని, సైనికులు మార్పిడి…

Read More

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బలమైన బీజేపీని ఎదుర్కొడానికి ‘ఇండియా’ పేరుతో ఏర్పడిన ప్రతిపక్ష కూటమిలో పశ్చిమ్ బెంగాల్ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటనలు కలకలం రేపుతున్నాయి. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బెంగాల్‌లో ఒంటిరిగానే పోటీ చేస్తామని ఆమె ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది.  సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని మమతా బెనర్జీ వెల్లడించారు. “నేను వారికి (కాంగ్రెస్‌కి) చాలా ప్రతిపాదనలు ఇచ్చాను… కానీ వారు వాటిని తిరస్కరించారు. దేశంలో మిగతా చోట్ల ఏమి జరుగుతుందనే దాని గురించి నాకు ఆందోళన లేదు… కానీ మాది సెక్యులర్ పార్టీ.. బెంగాల్‌లో మేము ఒంటరిగా బీజేపీని ఓడిస్తాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం” అని మమత స్పష్టం చేశారు. బెంగాల్‌లోని మొత్తం 42 పార్లమెంట్ స్థానాలకుగానూ రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌కు…

Read More

అయోధ్యలోని రామాలయం మంగళవారం భక్తజన సంద్రంగా మారింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్టతో తెరుచుకున్న ఆలయం తలుపులు సోమవారం విఐపిల దర్శనాలకే పరిమితం కాగా మంగళవారం నుంచి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో అర్ధరాత్రి నుంచే ఆలయ ప్రధాన ద్వారం వెలుపల వేచి ఉన్న భక్తులకు మంగళవారం ఉదయం నుంచి దర్శనానికి అనుమతి లభించింది.  అయితే క్రమ క్రమంగా భక్తుల తాకిడి పెరిగిపోయి మధ్యాహ్నానికి ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. అయోధ్య పట్టణ భక్తజనసంద్రంగా మారిపోయి రామనామ స్మరణతో ఆథ్మాత్మిక వాతావరణం అలుముకుంది. ఉదయం 6 గంటల నుం చి సామాన్య భక్తులను ఆలయ సముదాయంలోకి అనుమతించడం ప్రారంభమైందని, మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు 2.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని ఉంటారని అంచనా వేస్తున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ తెలిపారు.  మంగళవారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల…

Read More

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నేత, బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ వరించింది. రాష్ట్రపతి కార్యాలయం మంగళవారంనాడు ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన చేసింది.  దివంగత నేత కర్పూరి ఠాకూర్ శతజయంతికి ఒకరోజు ముందే ఆయనకు భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీహార్‌‌ని సమస్తిపూర్‌లో 1924 జనవరి 24న ఠాకూర్ జన్మించారు. నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే జాతీయోద్యమంలో పాల్గొన్నారు.  1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. అనంతరం రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ తొలిసారి 1952లో సోషలిస్ట్ పార్టీ టిక్కెట్టుపై బీహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1968లో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా, 1970లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పనిచేశారు. సామాజిక న్యాయం, పేదలు, దళితుల సంక్షేమానికి ఆయన విశేషంగా పాటుపడ్డారు. 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంను కలిసినవారిలో ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగానే కలిసినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వీరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. బొటాబొటి ఆధిక్యతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండే ఈ ప్రభుత్వం తొందరలోనే కూలిపోవడం ఖాయం అంటూ పలువురు బిఆర్ఎస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఇటువంటి వాఖ్యలపై ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటువంటి ప్రయత్నాలు చేస్తే…

Read More

గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దళాలపై హమాస్ మంగళవారం జరిపిన దాడిలో 24 మంది సైనికులు హతులయ్యారని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. అంత అధిక సంఖ్యలో సైనికులు మరణించడం ఇదే మొదటిసారి. రెండు పక్షాల మధ్య కాల్పుల విరమణ కోసం అభ్యర్థనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి విఘాతం కలిగించే అవకాశం ఉన్నది. కొన్ని గంటల తరువాత గాజా దక్షిణ ప్రాంతంలో రెండవ పెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌ను తమ సాయుధ దళాలు చుట్టుముట్టాయని మిలిటరీ ప్రకటించింది. ఆ ప్రాంతంలో ఇటీవలి కాలంలో భారీ యుద్ధంలో డజన్ల కొద్దీ పాలస్తీనియన్లు మరణించారని, గాయపడ్డారని మిలిటరీ తెలియజేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైనికుల మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. హమాస్‌పై ‘సంపూర్ణ విజయం’ సాధించేంత వరకు తాము దాడులు కొనసాగిస్తామని నెతన్యాహు శపథం చేశారు. గాజాలో బందీలుగా ఉన్న 100 మందిని తిప్పి పంపిస్తామని ఆయన వాగ్దానం చేశారు. అయితే, అలా చేయడం సాధ్యమేనా…

Read More

భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాంలో ప్రవేశించగానే మూడు రోజులుగా అడుగడుగున అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రాహుల్ యాత్ర అస్సాంలోకి ప్రవేశించగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రూట్ మ్యాప్ మార్చుకోవాలని సూచించారు. ట్రాఫిక్ కారణాలతో పాటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో రూట్ మ్యాప్ మార్పు చేసుకోవాలని తెలిపారు. గౌహతి నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు రాహుల్ యాత్రకు అడ్డుగా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం బారీకేడ్లను తొలిగించి ముందుకు సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇదే మార్గంలో బజ్‌రంగ్ దళ్, బిజెపి చీఫ్ నడ్డాజీ ర్యాలీ చేపట్టారని, అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను మాత్రమే దాటమని, ఎక్కడ చట్టాన్ని అతిక్రమించలేదని స్పష్టం చేశారు. బారికేడ్లను తొలగించటంపై అస్సాం…

Read More

టిఎంసి నేత మహువా మొయిత్రా అవినీతి ఆరోపణలపై మంగళవారం సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్‌ దేహద్రారుకి సిబిఐ సమన్లు జారీ చేసింది. గురువారం సిబిఐ ఎదుట విచారణకు హాజరుకావల్సిందిగా పేర్కొంది. నగదు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ నివేదికను అనుసరించి గతేడాది లోక్‌సభ నుండి మహువా మొయిత్రాను బహిష్కరించిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుండి మొయిత్రా రూ.2 కోట్ల నగదుతో పాటు ఖరీదైన బహుమతులను తీసుకున్నారని బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే ఆరోపించారు. ఆమె పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను దుబారు నుండి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన నిషికాంత్‌ దూబే, న్యాయవాది దెహద్రారును కమిటీ విచారించింది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ క్రమంలోనే ఆమెను లోక్‌సభ…

Read More

గత 42 రోజులుగా సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సోమవారం సాయంత్రం లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. లేదంటే ఉద్యోగుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.  కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అంగన్‌వాడీలను డ్యూటీ నుంచి తొలగిస్తున్నామని సర్క్యులర్ కూడా జారీ చేశారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అంగన్‌వాడీ సంఘాలను అత్యవసర చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది.  మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , మహిళా శిశు సంక్షేమశాఖ డైరక్టర్‌ జయలక్ష్మి పాల్గొన్నారు. అంగన్‌వాడీ సంఘాల తరపున మూడు సంఘాల…

Read More

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్తర ఘట్టం పూర్తి కావడంతో  తెలంగాణలోని రామ భక్తుల కోసం బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా రామ భక్తులను ఉచితంగా అయోధ్య రామయ్య దగ్గరకు తీసుకెళ్తేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జనవరి 29 నుంచి తెలంగాణ నుంచి అయోధ్యకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.  తెలంగాణలోని ఆయా పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మంది చొప్పున అయోధ్యకు తీసుకెళ్లనున్నారు బీజేపీ నేతలు. ఈ స్పెషల్ ట్రైన్‌లలో 20 బోగీలుండనున్నాయి. దీంత ఒక్కో రైలులో సుమారు 1,400 మంది భక్తులు ప్రయాణించే అవకాశం ఉంది. ఒక్కో బోగీకి ఒక్కో ఇంఛార్జ్ ఉండనున్నారు. కాగా అయోధ్య యాత్రకు వెళ్లి రావడానికి 5 రోజుల సమయం పడుతుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు 17 రోజుల పాటు ఈ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు. అయితే, ఈ ప్రత్యేక…

Read More