అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించిన అనంతరం ఢిల్లీకి తిరిగి రాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద ఓ కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు లభిస్తాయని మోదీ చెప్పారు. “భారతీయుల ఇళ్లపై వారి సొంత సోలార్ రూఫ్ టాప్ సిస్టెమ్ ఉండాలన్న నా సంకల్పం. ఈరోజు అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మరింత బలపడింది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది,” అని మోదీ ప్రకటించారు. “పేద, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లులను తగ్గించడానికి ఈ పథకం…
Author: Editor's Desk, Tattva News
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు అస్సాంలో అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నగావ్ జిల్లాలోని బోర్దువాలో ఉన్న శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు గాను రాహుల్‌ని అధికారులు అనుమతించలేదు. రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను సైతం హైబోరాగావ్ వద్ద అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రాహుల్ గాంధీ.. తనని అడ్డుకోవడానికి గల కారణాలేంటని ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. అటు.. మహిళా కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. రాహుల్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ‘‘మేము ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకున్నాం. కానీ.. మమ్మల్ని అడ్డుకున్నారు. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేం చేశాను?’’ అని రాహుల్ గాంధీ తారాస్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు ఆలయంలోకి ఎవరు ప్రవేశించాలనేది కూడా ప్రధాని మోదీ నిర్ణయిస్తారా?…
తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా 4.08 కోట్ల ఓటర్లున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. వీరిలో పురుషులు 2,00,09,275 మంది కాగా, మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482, సర్వీస్ ఓటర్లు 67,434 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను 45,951 నుంచి 46,165కు పెంచారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే 5.85 లక్షల ఓటర్ల మేర పెరిగారని ఆయన చెప్పారు. 18-19 మధ్య వయస్సున్న యువ ఓటర్లు- 8.13 లక్షల మంది ఉన్నారని తెలిపారు. అయితే, యువ ఓటర్ల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉందని చెబుతూ దీనిపై ప్రచారం చేపడతామని తెలిపారు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పరిష్కరించామని ఈ సందర్భంగా చెప్పారు. ఒకే ఇంట్లో పది మందికి పైగా ఓటర్లున్నారనే ఫిర్యాదులను సుమారు 98 శాతం వరకు పరిష్కరించామని వెల్లడించారు. 14 లక్షల…
ఆయోధ్యలో మంగళవారం నుంచి నీల మేఘ శ్యాముడు సామాన్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు అనుమతించనున్నారు. రామాలయంలో రాంలాలా ఆరతి రోజుకు మూడు సార్లు నిర్వహిస్తారు. మొదటిది – ఉదయం 6:30 గంటలకు, దీనిని జాగ్రన్ లేదా శృంగార్ ఆర్తి అంటారు. రెండవది – మధ్యాహ్నం 12:00 గంటలకు భోగ్ ఆరతి అని.. మూడవది రాత్రి 7:30 గంటలకు సంధ్యా ఆరతి అని పిలుస్తారు. అయోధ్యలోని రామ మందిరంలో ఆరతికి హాజరు కావడానికి శ్రీ రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుండి పాస్ తీసుకోవచ్చు. పాస్ కోసం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండటం అవసరం. ఆరతిలో ఒకేసారి 30 మంది మాత్రమే అవకాశం కల్పించనున్నారు.…
మన రాముడు మళ్లీ వచ్చాడని, గుడారం కింద ఉన్న రాముడు దివ్వమైన మందిరంలోకి వచ్చాడని, ఈ రోజు దేశానికి ఎంతో శుభదినమని అయోధ్య మందిర ప్రాణప్రతిష్ఠ అనంతరం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రోజు కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్లకు ఈ కల సాకారమైందని చెప్పారు. భారతీయులు బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారని, ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందని ప్రధాని చెప్పారు. పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నానని మోదీ పేర్కొన్నారు. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారని, స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని మోదీ ప్రధాని చెప్పారు. దేశమంతా నేడు దీపావళి జరుపుకుంటోందని, ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలని ప్రధాని అభిలషించారు. రాముడి రూపంలో దేశం చైతన్య మందిరంగా…
అయోధ్యలోని రామ మందిరంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది . రాముని జన్మస్థలం లో 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామయ్య కొలువు తీరారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన చారిత్రాత్మక ఘట్టం పూర్తయ్యింది. అయోధ్య గర్బాలయంలో బాలరాముడికి ప్రధాని నరేంద్ర మోదీ తొలిపూజ చేసి, దర్శించుకున్నారు. మోదీతో పండితులు పూజలు చేయించారు. . స్వామివారికి మొదటి హారతి ప్రధాని మోదీ ఇచ్చారు. సరిగ్గా 12.29 గంటలకు ప్రారంభమైన ప్రతిష్ఠ 84 సెకెన్ల పాటు జరిగింది. అభిజిత్ లగ్నంలో ఈ క్రతువు నిర్వహించారు. ఈ మహా క్రతువు కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలోని 121 మంది వేద పండితులు, రుత్విజుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ శుభ సందర్భాన అయోధ్య నగరమంతా రామనామ స్మరణతో మార్మోగిపోయింది.రామయ్య దర్శన భాగ్యంతో యావత్తూ భారతదేశం పులకించిపోతోంది. బాల రాముడిని చూడడానికి రెండు కళ్లు సరిపోవడంలేదు.…
అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నితమైన అన్ని ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ గా ఉండాలని పోలీసు కమిషనర్లు తెలిపారు. అలాగే, పక్కాగా బందోబస్త్ ప్లాన్ చేయాలని ఆదేశించారు. స్థానిక పోలీసులకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, గ్రే హౌండ్స్, రిజర్వ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేంద్ర బలగాలు సహాయం అందిస్తాయని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. గత వారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయిలో వరుస శాంతి సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిజిపి ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. హైదరాబాద్‌లో స్థానిక పోలీసులకు సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కమిషనర్…
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత 17 కోట్ల మంది సభ్యత్వంతో బిజెపి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని భరోసా వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు రూ. 12 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ రిపోర్టు, సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చాయని పేర్కొన్నారు. 9 సంవత్సరాల మోదీ పాలనలో రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నీతివంతమైన పాలన అందిస్తుని థెయ్లిపారు. ప్రపంచంలోనే…
తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల జవాన్లు పహారాకాస్తున్నారు. ఉగ్రవాద బెదిరింపుల నేపథ్యంలో బాంబు విచ్ఛిత్తి దళాలు సర్వం సన్నద్ధం అయ్యాయి. భద్రతా బలగాలో ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు, యాంటిబాంబు స్కాడ్స్ వీటికి తోడుగా సుశిత శిక్షణ పొందిన జాగిలాల బృందాలు, ఆర్‌పిఎఫ్ సిబ్బంది పారాహుషార్‌గా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం అయ్యారు. అయోధ్య రామాలయ ముఖద్వారం వద్ద పోలీసు సిబ్బంది కాపలాకాస్తోంది. బహుళ అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఇప్పుడు అయోధ్య కనులపండుగగా ప్రతిష్టాపనకు సిద్ధమైంది. ఇప్పటికే బాంబు స్కాడ్స్ తనిఖీలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగం (ఎన్‌డిఆర్‌ఎఫ్) క్యాంప్ ఒకటి అయోధ్య క్షేత్రం వద్ద ఏర్పాటు అయింది. అవాంఛనీయ శక్తుల కదలిలకను పసిగడుతూ , వీటిని తిప్పికొట్టేందుకు సమాయత్తం అయింది. ఆలయం…
రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూ ప్రసాదాలను కానుకగా పంపించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ పంచిపెడుతున్నది. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు. ప్రతి ఒక్కరికీ రెండు శ్రీవారి ప్రసాదంగా అందిస్తుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్- 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్‌లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానంలో అవి అయోధ్యకు చేరుకున్నాయి. వాటిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆహ్వానితులకు లడ్డూ ప్రసాదాలను పంచి పెట్టే కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం అయోధ్యకు చేరుకున్నారు. లడ్డూ పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు.