Author: Editor's Desk, Tattva News

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్య ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న రామ్ లల్లా విగ్రహాన్ని బుధవారం మందిరంలోకి తీసుకున్నారు. రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకురానున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది. కర్ణాటక శిల్పి చెక్కిన రాముడి విగ్రహం అయోధ్యలో కొలువుదీరనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ట్రస్ట్ ఆ ఫోటోను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. మంగళవారం నుంచే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు మొదలయ్యాయి. ఇక బుధవారం  రామ్‌లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకోనుంది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆహ్వాన పత్రికలపై బాలరాముడి రూపాన్ని ముద్రించారు.  మరోవైపు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఇటీవల సీతారామ, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అదే విగ్రహాన్ని అయోధ్య…

Read More

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వాలే ప్ర‌జా సేవ‌కులని ప్ర‌ధాని నరేంద్ర మోదీ అభివ‌ర్ణించారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో నెలకొల్పిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్‌)ని ప్రధాని మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. పరిపాలనా దక్షతకు శ్రీరాముడు మారుపేరు అని, ఆయన పాలన ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని చెబుతూ రామరాజ్యం మనందరికీ ఆదర్శప్రాయం అని ప్రధాని తెలిపారు. రామరాజ్యం గురించి మహాత్మాగాంధీ అనేక సార్లు ప్రస్తావించారు. ప్రజలకు సుపరిపాలన అందాలని గాంధీ చెప్పారని గుర్తు చేసారు. ఐఆర్ఎస్ అభ్యర్థుల శిక్షణ కోసం రూ 900కోట్ల‌తో పాలసముద్రం వద్ద నాసిన్ క్యాంప‌స్ నిర్మించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా ప్ర‌ధాని అనంతరం సీఎం జగన్ తో కలిసి భవనాలను పరిశీలించారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖిగా…

Read More

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర‌లో ఉన్న షాహి ఈద్గా మ‌సీదులో స‌ర్వే చేప‌ట్టేందుకు సుప్రీంకోర్టు అనుమ‌తి నిరాక‌రించింది. స‌ర్వే కోసం క‌మీష‌న‌ర్‌ను నియ‌మించాల‌ని అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై సుప్రీం స్టే ఇచ్చింది. శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థ‌లంలో మ‌సీదును నిర్మించిన‌ట్లు కొంద‌రు పిటీష‌న‌ర్లు కేసు దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ల‌క్నోకు చెందిన అడ్వ‌కేట్ రంజ‌నా అగ్నిహోత్రి 2020లో ఆ కేసును దాఖలు చేశారు. 13.37 ఎకరాల వివాదాస్ప‌ద స్థ‌లంలో మ‌సీదును నిర్మించిన‌ట్లు ఆరోపించారు. అక్క‌డే క‌ట్రా కేశ‌వ్ దేవ్ ఆల‌యం ఉన్న‌ది. ఈ స్థ‌లంలోనే కృష్ణుడు జ‌న్మించిన చెర‌శాల ఉన్న‌ట్లు పిటీష‌న్‌లో వాదించారు. ఈద్గాలో స‌ర్వే చేప‌ట్టాల‌ని హిందువులు వేసిన పిటీష‌న్‌ను ముస్లింలు వ్య‌తిరేకించారు. మసీదులో సర్వే నిర్వహిస్తే గతంలో గుడిపై దీన్ని నిర్మించిన విషయం తేలుతుందంటూ హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అలాహాబాద్ హైకోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. అయితే దీన్ని మంగళవారం సుప్రీంకోర్టు నిలిపేసింది.…

Read More

గతేడాది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వాల్సిన తరుణంలో ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.  ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. స్కిల్ కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, అరెస్టు, రిమాండ్ కు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని వాదిస్తూ గతంలో ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు.. హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  అయితే దీనిపై గతేడాదే విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును మాత్రం సుదీర్ఘంగా రిజర్వు చేసింది. ఇవాళ తీర్పు వెలువరించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా…

Read More

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.  పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో చోటు కల్పించారు.  తెలంగాణ వేదికగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని రెండేళ్ళ క్రితం స్థాపించిన వైఎస్ షర్మిల కొద్దిరోజుల కిందటే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేశారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారని బావించినా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి ఉండేలా ఆమెను ఒప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించిన నెల రోజుల్లోపే ఢిల్లీ వేదికగా ఆమె హస్తం కండువా కప్పేసుకున్నారు. తాజాగా ఆమెను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు చూసిన గిడుగు రుద్రరాజు సోమవారం తన పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పీసీసీ పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ పంపారు. అమలాపురం పట్టణానికి…

Read More

దేశవ్యాప్తంగా పలు చోట్ల మంచు కారణంగా విమానాలు ఆలస్యం, రద్దవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకూ, విమానయాన సంస్ధల సిబ్బందికీ మధ్య వాగ్వాదాలు, దాడులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి గోవా వెళ్లే ఇండిగో విమానంలో పైలట్ పై విమాన ఆలస్యానికి ఆగ్రహం చెందిన ఓ ప్రయాణికుడు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.  ఈ నేపథ్యంలో కేంద్రం కూడా స్పందించి ప్రయాణికులు సంయమనం పాటించాలని కోరింది. దీనికి కొనసాగింపుగా డీజీసీఏ కూడా విమానయాన సంస్ధలకు తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించిన సమాచారాన్ని సక్రమంగా ప్రయాణికులకు అందించాలని విమానయాన సంస్ధల్ని ఆదేశించింది.  మూడు గంటలకు మించి విమానాలు ఆలస్యమైతే వాటిని రద్దు చేసుకునేందుకు కూడా విమానయాన సంస్ధలకు డీజీసీఏ వీలు కల్పించింది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది.విమానయాన సంస్థలు తమ విమానాల జాప్యాలకు సంబంధించి రియల్ టైం సమాచారాన్ని వెల్లడించాలని కూడా డీజీసీఏ…

Read More

భారత్- రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు అంగీకరించారు. జనవరి 15న రెండు దేశాల మధ్య భవిష్యత్ కార్యక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు.  రెండు దేశాల మధ్య  అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక సహకారానికి, ప్రపంచ సమస్యలకు సంబంధించిన అనేక అంశాలపై మోదీ, పుతిన్‌లు సమీక్షించారు. 2024లో రష్యా బ్రిక్స్ అధ్యక్ష పదవికి మోదీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు పూర్తి మద్దతుకు హామీ ఇచ్చారు.  జనవరి 1, 2024 నుండి రష్యా బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపట్టింది. గత నెలలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రష్యాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆధునిక ఆయుధాల తయారీతో సహా సైనిక, సాంకేతిక సహకారాన్ని పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇటీవల అత్యున్నత స్థాయిలో ఇరు దేశాల…

Read More

మకర సంక్రాంతి పర్వదినాన శబరి గిరుల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. సోమవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాల సమయంలో పొన్నాంబలమేడు నుంచి మకర జ్యోతి మూడుసార్లు దర్శనం ఇచ్చింది. మహా హారతి అనంతరం మకర జ్యోతి కనిపించింది. దీంతో అయ్యప్ప భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి. మకర జ్యోతిని అయ్యప్ప స్వామి దివ్య స్వరూపంగా విశ్వసించే అయ్యప్ప భక్తులు జ్యోతి ప్రత్యక్ష దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు. దాదాపు 4 లక్షల మంది భక్తులు మకర జ్యోతి దర్శనంతో పులకించారు. మకర జ్యోతి వీక్షణ కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం 50 చోట్ల వ్యూ పాయింట్లను ఏర్పాటు చేసింది.  గరిష్టంగా 70 వేల మంది భక్తులనే అనుమతిస్తామని దేవస్థానం, కేరళ ప్రభుత్వం చెప్పినప్పటికీ దానికి ఐదు రెట్లు ఎక్కువ సంఖ్యలో భక్తులు శబరిమల తరలి వెళ్లారు.  అయ్యప్ప దీక్ష చేపట్టే భక్తులు…

Read More

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి ఏర్పడింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు.  మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. విచారణలో భాగంగా ఉదయం తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని సూచించారు. అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు విషయమై తాను దాఖలు చేసిన పిటీషన్ గురించి తేలేవరకు తాను విచారణకు హాజరుకాబోమని కవిత స్పష్టం చేశారు. ఆ మేరకు ఆమె ఈడీకి లేఖ కూడా వ్రాసారు. ఈ కేసులో కల్వకుంట్ల కవిత ఇదివరకు దర్యాప్తును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండు సార్లు ఆమె ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. విచారణకు హాజరయ్యారు.  ఆ తరువాత ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో విచారణ నెమ్మదించినట్టే కనిపించింది. ఈ మధ్యకాలంలో…

Read More

ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్) కింద లక్ష మంది లబ్ధిదారులకు గ్రామీణ గృహనిర్మాణ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ (పీఎంఏవై-జీ) మొదటి విడతను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. మొదటి విడతగా రూ. 540 కోట్లను విడుదల చేసిన ప్రధాని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్ల పాలనను పేదల సంక్షేమానికి అంకితం చేసిందని తెలిపారు. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికీ అందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెబుతూ తమ ప్రభుత్వం పదేళ్లను పేదలకు అంకితం చేసిందని మోదీ పేర్కొన్నారు. గత దశాబ్దంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ పథకాల బడ్జెట్ ఐదు రెట్లు పెరిగిందని, గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలు రెండున్నర రెట్లు పెరిగాయని ప్రధాని తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం గతంలో 90గా ఉన్న ఏకలవ్య మోడల్ స్కూళ్లను 500కు పైగా నిర్మించేందుకు…

Read More