Author: Editor's Desk, Tattva News

ఖమ్మం నగరంలో మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మంకు చేరుకున్న బిఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం వాహనాలపై మంగళవారం రాళ్ళ దాడి జరిగింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి కార్లతోపాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరో కారుపై కూడా రాళ్ళ దాడి జరిగింది. మున్నేరు వరదలో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు హరీశ్ రావు నాయకత్వంలో నాయకులు మంగళవారం మధ్యాహ్నం ఖమ్మం చేరుకున్నారు. పొలేపల్లిలోని రాజీవ్ స్వగృహ కాలనీలోని వరద బాధితులను పరామర్శించిన అనంతరం ఖమ్మం నగరంలోని 48వ డివిజన్లో బొక్కల గడ్డ ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించారు. ఇదే సమయంలో సమ్మక్క సారక్క ఆర్చికి సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలు వరద బాధితులకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం…

Read More

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా పై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమెపై మరో ఐదు హత్య కేసులు నమోదయ్యాయి. హసీనాతోపాటు మాజీ మంత్రులు, అనుచరులపై ఈ కేసులు నమోదైనట్లు స్థానిక మీడియా నివేదించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత ఆందోళనల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆ అల్లర్ల సమయంలో ఐదుగురిని చంపినందుకు పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనా, ఆమె కేబినెట్‌లోని మాజీ మంత్రులపై ఈ హత్య కేసులు నమోదైనట్లు సదరు మీడియా వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 89కి పెరిగింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో.. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ప్రాణాలను దక్కించుకునేందుకు సోదరితో కలిసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె…

Read More

సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులను వరుసగా చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా నియమించాలన్న నిబంధనతో మూడేళ్ల కాలపరిమితితో 23వ లా కమిషన్‌ను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జఠిలమైన న్యాయపరమైన అంశాలపై కమిషన్ ప్రభుత్వానికి సలహాలు అందచేస్తుంది. న్యాయ కమిషన్ ఏర్పాటు పూర్తయిన వెంటనే కమిషన్ చైర్‌పర్సన్, సభ్యుల నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుంది. 22వ లా కమిషన్ కాల పరిమితి ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కొత్త లా కమిషన్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏర్పడినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ సోమవారం రాత్రి జారీచేసిన తన ఉత్తర్వులో పేర్కొంది. 21వ లా కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ 2015 సెప్టెంబర్‌లో, 22వ లా కమిషన్ నోటిఫికేషన్ 2020 ఫిబ్రవరిలో జారీ కాగా కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులుగా సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులను నియమించాలన్న నిబంధనను ప్రభుత్వం పొందుపరిచింది. అయితే ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు,…

Read More

కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై అరెస్టయిన మాజీ ప్రిన్సిపల్‌ ప్రొ. సందీప్ ఘోష్‌కు కోర్టు 8 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. ఈ మేరకు కోల్‌కతాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇవే ఆరోపణలపై సోమవారం ప్రొ. సందీప్ ఘోష్‌‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరో ముగ్గురు.. బిప్లవ్ సింఘా, సుమన్ హజారా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సైతం సీబీఐ అరెస్ట్ చేసింది. మంగళవారం ప్రత్యేక కోర్టులో వీరిని సీబీఐ ప్రవేశపెట్టగా వారికి 8 రోజుల సీబీఐ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసును సెప్టెంబర్ 10వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. అయితే ఈ కేసులో విచారించేందుకు 10 రోజులపాటు వీరిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును సీబీఐ అభ్యర్థించింది. కానీ కోర్టు మాత్రం కేవలం 8…

Read More

అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన ‘అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను పశ్చిమబెంగాల్ అసెంబ్లీ మంగళవారంనాడు  ఆమోదించింది. ఇది ‘చరిత్రాత్మిక బిల్లు’ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.  అత్యాచారం, లైంగిక నేరాలపై కొత్త ప్రొవిజన్స్‌తో రూపొందించిన ఈ బిల్లు మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పిస్తుందని తెలిపారు.  ఆగ‌స్టు 9వ తేదీన లేడీ డాక్ట‌ర్ మృతిచెందిన త‌ర్వాత‌.. ఆ రోజే ఆమె పేరెంట్స్‌తో మాట్లాడిన‌ట్లు చెప్పారు. వాళ్ల ఇంటికి వెళ్ల‌డానికి ముందే.. ఆడియో, వీడియో, సీసీటీవీ ఫూటేజ్‌ను అంద‌జేసిన‌ట్లు చెప్పారు.  ఆదివారం వ‌ర‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని ఆ డాక్ట‌ర్ పేరెంట్స్‌ను కోరామ‌ని, ఒక‌వేళ దోషిని ప‌ట్టుకోకుంటే అప్పుడు కేసును సీబీఐకి అప్ప‌గిస్తామ‌ని చెప్పామ‌ని గుర్తు చేశారు. కానీ పోలీసులు 12 గంట‌ల లోపే నిందితుడిని పట్టుకున్నార‌ని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా…

Read More

చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీతీర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజీకి 11.4లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. బెజవాడ గజగజ లాడుతూనే ఉంది. కృష్ణమ్మ ఉగ్రరూపం, బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది. భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది. గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 11 లక్షల 40 వేల నుంచి గంట గంటకు తగ్గుతూ వరద తాకిడి తగ్గుముఖం పడుతోంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 8 లక్షల 94 వేలకు వరద చేరుకుంది. కృష్ణమ్మ శాంతించడంతో బ్యారేజి దిగువన ఉన్న గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పలు గ్రామాలను వరద ముంపు వెంటాడుతోంది.ఇప్పటికే జలావాసాలుగా మారిన నగరం, ఇంకా తేరుకోలేదు. అనేక…

Read More

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు పలు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. వాటిలో 303 సెల్ఫ్ లోడింగ్ రైపిల్స్‌తోపాటు 12 తుపాకులున్నాయని వివరించారు. బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారంటూ మంగళవారం ఉదయం సమాచారం అందిందని తెలిపారు. దీంతో ఆ యా ప్రాంతాల్లో పోలీసులు కూబింగ్ చేపట్టారన్నారు. ఆ క్రమంలో మావోయిస్టులు.. పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ఆ వెంటనే పోలీసులు సైతం స్పందించి.. ఎదురు కాల్పులకు దిగారని పేర్కొంది. ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల కూబింగ్ ఇంకా కొనసాగుతుందన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా మావోయిస్టులను నిర్మూలించే కార్యక్రమానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా.. గత వారం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టులను అంతమొందించేందుకు కీలక సమీక్ష సమావేశం…

Read More

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తన వంతు సహాయంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెరో రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. తన వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూపాయలు ఐదు లక్షల చొప్పున సహాయం అందజేసినట్లు తెలిపారు. కుండపోత వర్షాలు, ఉధృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలచివేసిందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపార. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్‌లో ఉన్నారని ప్రధానమంత్రి చెప్పినట్లు వెంకయ్యనాయుడు వివరించారు. తన వంతు సహకారంగా నా వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలు, లంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలు…

Read More

తాను నిర్మించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్ర విడుదలకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) జాప్యం చేస్తున్నట్లు కనపడుతోందని ప్రముఖ నటి, బిజెపి ఎంపి కంగనా రనౌత్ ఆరోపించారు. తన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా సిబిఎఫ్‌సి నిలిపివేసిందని ఆమె ఆరోపించారు. మాజీ ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించిన ఈ చిత్రం వచ్చే శుక్రవారం విడుదల కావలసి ఉండగా కట్స్ లేకుండా చిత్రానికి సర్టిఫికెట్ ఇంకా జారీ కాలేదు. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని సిబిఎఫ్‌సి తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌ నిలిపివేయడానికి కారణాలు తెలియజేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్వివరించింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది. తన చిత్రంపై కూడా ఎమర్జెనీ విధించారంటూ ఆమె ఒక ఇంటర్వూలో ఆమె సెన్సార్ బోర్డుపై ఆరోపణలు గుప్పించారు. పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని, ఈ దేశంలోని పరిస్థితులపై తాను తీవ్రంగా నిరాశ చెందుతున్నానని…

Read More

  దేశవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన వెబ్ సిరీస్.. ఐసీ 814 ది కాందహార్ హైజాక్. కిందటి నెల 29వ తేదీన టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన థ్రిల్లర్ డ్రామా. 1999లో పాకిస్తాన్‌కు చెందిన హర్కత్-వుల్-ముజాహిదీన్ ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814ను హైజాక్ చేసిన ఉదంతం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అనుభవ్ సిన్హా దర్శకుడు. ఆ ఫ్లైట్ కేప్టెన్ దేవీ శరణ్, కోపైలెట్ సృంజన్ చౌదరి అనుభవాలను ఆధారంగా చేసుకుని దీన్ని చిత్రీకరించాడు దర్శకుడు. నేపాల్‌లోని ఖాట్మండూ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానాన్ని ముజాహిదీన్ టెర్రరిస్టులు హైజాక్ చేశారు.  భారత్‌లో ఖైదీలుగా ఉన్న అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, మసూద్ అజర్, ముష్తాక్ అహ్మద్‌ను విడిపించాలనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్న‌లోని కాందహార్ ఎయిర్‌పోర్ట్‌కు ఫ్లైట్‌ను తీసుకెళ్లారు. ఆ ఉదంతాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చేలా ఈ సిరీస్ తెరకెక్కింది. నజీరుద్దీన్ షా,…

Read More