లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బంగ్లాదేశ్ జర్నలిస్ట్‌తో పాటు దేశానికి ఓ న్యూస్‌పోర్ట్‌కు చెందిన ఉద్యోగిపై బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జర్నలిస్ట్ సలా ఉద్దీన్ షోయబ్ చౌదరి, అతిధిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోనియా గాంధీని విదేశీ గూఢచారి అంటూ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ షోయబ్ చౌదరి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారని.. అలాగే రెండుమతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో జర్నలిస్ట్ ఈ పోస్ట్‌ని షేర్ చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీపై సైతం ఆరోపణలు చేసినట్లు శ్రీనివాస్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. 196, 353 (2)…
Author: Editor's Desk, Tattva News
కాంగ్రెస్ పార్టీ కేరళ శాఖలో పెద్ద వివాదం నెలకొంది. సినిమా పరిశ్రమలో మాదిరిగానే కాంగ్రెస్‌లోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ బెడద ఉందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు సిమీ రోస్‌బెల్ జాన్ ఆరోపించడంతో దుమారం చెలరేగింది. పార్టీలో మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఆమె విమర్శించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆమెను బహిష్కరించింది. ఎర్నాకుళానికి చెందిన రోస్‌భెల్ శనివారం ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. పార్టీలో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత వి.డి.సతీశన్ సహా పలువురిపై ఆరోపణలు చేశారు. నాయకుల మెప్పు పొందేవారికే ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయని ఆమె విమరించారు. రోస్‌బెల్ ఆరోపణలను సతీశన్ ఖండించారు. ఆమెకు ఏఐసీసీ పదవులు దక్కాయని గుర్తు చేశారు. మీడియా ముందు మహిళా నేతలను కించపరిచినందుకు రోస్‌బెల్‌ను ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ‘క్యాస్టింగ్ కౌచ్’ ఆరోపణలు మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించగా, కాంగ్రెస్ పార్టీలో…
కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లోని ‘వాయిదాల సంస్కృతి’ని మార్చాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. దీనిపై తొలుత దృష్టి పెట్టాలని న్యాయవ్యవస్థకు సూచించారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి న్యాయవ్యవస్థ జాతీయ సదస్సు ముగింపు ఉత్సవంలో ఆమె ఆదివారం ప్రసంగించారు. పెండింగ్ కేసులు ‘మనందరికీ’ పెద్ద సవాలుగా మారాయని చెబుతూ ఈ సమస్యను పరిష్కరించాలంటే తొలుత కేసుల విచారణను వాయిదా వేసే విధానంలో మార్పులు రావాలని ఆమె చెప్పారు. అత్యాచారం వంటి కేసుల్లోనూ తీర్పులు ఆలస్యమవుతున్నాయని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అత్యాచారం వంటి కేసుల్లోనూ తీర్పులు వచ్చేసరికి తరం మారుతోంది. న్యాయ ప్రక్రియలో సున్నితత్వం లోపించిందని సామాన్యులు అనుకుంటున్నారు’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. గ్రామాల్లోని ప్రజలు న్యాయాలయాలను దేవాలయాలుగా భావిస్తున్నారని ఆమె చెప్పారు. ‘‘దేవుని ఇంట్లో ఆలస్యం జరుగుతుందేమోగానీ, అన్యాయం మాత్రం జరగదని నమ్ముతుంటారు. కానీ ఈ అలస్యం ఎంత కాలం?…
అమరావతి నుండి సిఎం చంద్రబాబు నాయుడు ఇంటి వైపుగా ఉండే కృష్ణా కరకట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కృష్ణ, గుంటూరు జిల్లా వాసులు భయం గుప్పెట్లో ఉన్నారు. దీని ప్రభావంతో రాజధాని ప్రాంతంలో ముంపు పెరగనుంది. ఇప్పటికే గంటగంటకు పెరుగుతున్న ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లోతో అధికారులు ఆందోళనలో ఉన్నారు. సాయంత్రానికి 12 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత 120 సంవత్సరాల్లో రికార్డులను అధిగమిస్తూ భారీగా వరద నీరు వచ్చింది. 1903, 2009లో వచ్చిన వరద రికార్డులను అధిగమిస్తూ 11.37 లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరింది. ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుకుంది. బ్యారేజి మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు. బ్యారేజి చరిత్రలో తొలిసారిగా…
రాష్ట్రంలో నెలకొన్న వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించాయిరు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సోమవారం లేఖ రాస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తెల్లవారుజామున 4 గంటల వరకూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వరదల నేపథ్యంలో తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులతో కలిసి ఆదివారం తొలుత సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడలోని సింగ్‌నగర్ ప్రాంతంలో నీటమునిగిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. అనంతరం ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టరు కార్యాలయం, అంతకుముందు విపత్తు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడానని చెప్పారు. 10 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, 40 పవర్ బోట్లు, 10 హెలికాఫ్టర్లు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని హెలికాఫ్టర్ ద్వారా తీసుకొస్తామని చెబుతూ…
వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రొటోటైప్ వెర్షన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఎమ్‌ఈఎల్) ఫెసిలిటీలో వీటిని ప్రారంభించారు. బీఎమ్‌ఈఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత, వందే భారత్ స్లీపర్ తయారీ ఇప్పుడే పూర్తయిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పది రోజుల పాటు వీటిపై కఠినమైన ట్రయల్స్, టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇవి మరిన్ని పరీక్షల కోసం పట్టాలెక్కనున్నాయి. ఈ పరీక్షలు విజయవంతమైతే వీటి ఉత్పత్తి ప్రారంభంకానుంది. ఏడాదిన్నర తర్వాత నెలకు రెండు నుంచి మూడు చొప్పున వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వందే భారత్ స్లీపర్ కోచ్‌ల్లో రీడింగ్ ల్యాంప్స్, ఛార్జింగ్ అవుట్‌లెట్‌లు,…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలతో ముంచెత్తుతోంది. వర్షాల ధాటికి నదులు, వాగులు, వంకల పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. పంటలు నీట ముగిని తీవ్రనష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12:30నుంచి 2:30 మధ్య వాయుగుండం తీరం దాటింది. క్రమంగా బలహీనపడుతూ వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా వాయుగుండం పయనిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొంతవరకు వర్షాలు తగ్గుముఖం పడతాయని, చాలా చోట్ల చెదురు మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుంచి విజయవాడలో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. అనేక కాలనీల్లో నాలుగు అడుగుల…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ విద్యార్థినులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా లేఖ రాసింది. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలు, నమ్మకంతో బయటకు పంపుతున్నారని, బయట జరుగుతున్న పరిణామాలు తెలిసి బాధపడుతున్నానని తెలిపింది. ఇటీవల మీకు జరిగిన పరిస్థితి దారుణమని పేర్కొంటూ విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితో నిజానిజాలు బయటకు వస్తాయని తాను చెప్పాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. చట్టం బలహీనులకు బలంగా, బలవంతులకు బలహీనంగా వర్తించబడుతుందనే నానుడి మనదేశంలో ఇటీవల జరిగిన అనేక సంఘటనల్లో గుర్తుకు తెచ్చాయన్నాయని ఆమె గుర్తు చేశారు. ‘నిందితులు ఎలా రక్షించబడతారు.. బాధితులు ఎలా అవామీ.. ఎలా అవమానించబడతారు’ అనేది తనకు బాగా అనుభవమని చెబుతూ ఇలాంటి చర్యలతో తాను మానసికంగా అలసిపోయాయని చెప్పింది. కాలేజీలు డిగ్రీ సర్టిఫికెట్లను రద్దు చేసి స్టూడెంట్స్‌ని బయటకు పంపిన సంఘటనలు అనేకం ఇక్కడ ఉన్నాయని ఆమె…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు సవరించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ తేదీని అక్టోబర్ 5వ తేదీకి మార్చింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లెక్కించే తేదీని కూడా అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8వ తేదీకి మార్చింది. బిష్ణోయ్ కమ్యూనిటీ ఓటింగ్ హక్కులను, శతాబ్దాలుగా వారు అనుసరిస్తున్న అసోజ్ అమావాస్య ఫెస్టివల్ సెలబ్రేషన్లను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల తేదీని సవరించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ పోలింగ్‌ను రీషెడ్యూల్ చేయాల్సిందిగా ఆల్ ఇండియా బిష్ణోయ్ మహాసభ, బికనీర్ (రాజస్థాన్) జాతీయ అధ్యక్షుడు తమకు లేఖ రాసినట్టు తెలిపింది. ఈ ఏడాది బిష్ణోయ్ కమ్యూనిటీ ఫెస్టివల్ అక్టోబర్ 2న జరుగనుందని, ఇందుకోసం సిర్సా, ఫతేబాద్, హిసార్‌లోని వేలాది కుటుంబాలు రాజస్థాన్ వెళ్తారని, అక్టోబర్ 1న ఎన్నికలైనందున వారు తమ ఓటింగ్ హక్కును వినియోగించుకోలేరని తెలిపారు.…
దేశంలో సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అలాగే వాయువ్య భారతదేశం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీర్ఘకాల సగటు వర్షపాతం 167మి.మీలో 109 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర వివరాలు వెల్లడించారు. “సెప్టెంబరులో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పరిసర ప్రాంతాలు సహా వాయువ్య భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వరదలు రావొచ్చు” అని తెలిపారు. “కొండచరియలు, మట్టి దిబ్బలు విరిగి పడే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సెప్టెంబరులో ప్రతివారానికొకసారి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణుల ఏర్పడే అవకాశం ఉంది. ఇవి పశ్చిమ వాయువ్య దిశగా…