Author: Editor's Desk, Tattva News

ఉత్త‌రాకాండ్ రాష్ట్రంలోని ఉత్త‌రకాశిలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల‌ను ర‌క్షించేందుకు రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొనేందుకు అంత‌ర్జాతీయ ట‌న్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ ఉత్త‌రాఖండ్‌కు వ‌చ్చారు. సిల్కియారా ట‌న్నెల్ వ‌ద్ద ఆయ‌న ప్ర‌త్యేకంగా రెస్క్యూ ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ట‌న్నెల్ లో చిక్కుకున్న కార్మికుల‌ను ర‌క్షించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ బాగానే సాగుతోంద‌ని, తమ బృందం మొత్తం ఇక్క‌డే ఉంద‌ని, స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని చూప‌నున్న‌ట్లు చెప్పారు. ఇక్క‌డ చాలా ప‌ని జ‌రుగుతోంద‌ని, చిక్కుకున్న కార్మికులే కాదు, రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న‌వాళ్లు కూడా సుర‌క్షితంగా ఉండాల‌ని అర్నాల్డ్ తెలిపారు. ఆహారం, వైద్యం క్ర‌మంగా అందుతోంద‌ని చెప్పారు. టన్నెల్ కుప్పకూలిన ఘటన జరిగి నేటికి 9 రోజులు. టన్నెల్లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల ప్రాణాలు దక్కుతాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా యంత్రాల సాయంతో కార్మికులను చేరుకోవాలనే ప్రయత్నాలు ఆశించినమేర ఫలించలేదు. దీంతో సోమవారం అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు…

Read More

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట దక్కింది. ఆయనకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. స్కిల్‌ కేసులో టీడీపీ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ మేరకు చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. రెగ్యులర్ బెయిల్ రావడంతో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న కొన్ని నిబంధనలు కూడా తొలగిపోయినట్లే అని లాయర్లు అంటున్నారు. కేసుకు సంబంధించిన అంశాలపై కోర్టు ఎలాంటి షరతులు విధించింది అన్నది స్పష్టత రావాల్సి ఉంటుంది. ఈ పిటిషన్‌పై వాదనలు ఈనెల 17న ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయంగా పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు…

Read More

విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో మంటలు చెలరేగడం ఈ ప్రమాదానికి కారణమైంది. బోట్లలో నిద్రపోతున్నవారు మంటల్లో చిక్కుకున్నారేమోనని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తేలింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బోట్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఇదిలావుండగా ఈ అగ్నిప్రమాదంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయి ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఈ ఘోర అగ్ని ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగలేదని కావాలనే కొందరు బోట్లకు నిప్పు పెట్టినట్టు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి ఒకటో నంబర్ జెట్టీ వద్ద ఓ యూట్యూబర్‌కు, బాలాజీ అనే వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగినట్టు గుర్తించారు. లంగరు వేసిన బోటులో యూట్యూబర్‌‌తో పాటు మరో వ్యక్తికి మధ్య ఘర్షణ…

Read More

2023 ప్రపంచ కప్‌లో ఫైనల్స్ వరకు అజేయంగా నిలిచిన భార‌త్.. కీలక సమయంలో చతికిలపడింది. వన్డే వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీ మొత్తం అద్భుతమైన బౌలింగ్‌, బ్యాటింగ్‌తో ఇరగదీసిన భారత్‌.. ఫైనల్‌లో ఎప్పటిలాగే తడబడింది. వరుసగా పది మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్‌ చేరినా అభిమానుల్లో ఏ మూలనో ఉన్న అనుమానాలను నిజం చేస్తూ రోహిత్‌ సేన తుది మెట్టుపై బొక్క బోర్లా పడింది. బ్యాటింగ్‌ వైఫల్యానికి తోడు నాసిరకమైన బౌలింగ్‌తో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్‌ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ట్రావిస్‌ హెడ్‌ (120 బంతుల్లో 137, 15 ఫోర్లు, 4 సిక్సర్లు), సెంచరీతో చెలరేగగా మార్నస్‌ లబూషేన్‌ (110 బంతుల్లో 58 నాటౌట్‌, 4 ఫోర్లు)రాణించి…

Read More

తెలంగాణ చరిత్రలో తొలిసారి బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించిన పార్టీ తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆదివారం నారాయణపేట, చేవెళ్లలలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలకు ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ దేశంలో కుటుంబ పాలన లేకుండా చేయాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని ధ్వజమెత్తారు. ఇలాంటి పార్టీలను అడ్రస్సు లేకుండా చేయాలని కోరారు. జమ్మూ కశ్మీర్, బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, బీహార్‌లో లాలు ప్రసాద్ యాదవ్, ఏపీలో వైఎఎస్సార్, ఆ తర్వాత జగన్ కుటుంబం, తమిళనాడులో కరుణానిధి కుటుంబం ఉందని తెలిపారు. తెలంగాణలోని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్…

Read More

కర్నాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వరుసగా స్కామ్‌ల ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ ఫోన్‌సంభాషణ ఆడియో క్యాసెట్‌ను సామాజిక మాధ్యమంలో పొందుపరచడం కలకలం రేపింది. ఇందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రతో మాట్లాడుకున్నట్లుగా ఉంది. బదిలీల వ్యవహారం దేనికెంత విషయంపై ఇద్దరూ మాట్లాడుకున్నట్లు కుమారస్వామి ఈ నేపథ్యంలో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. యతీంద్ర కూడా దీనిని కొట్టిపారేశారు. తండ్రీకొడుకులు కలిసి పెద్ద ఎత్తున చివరికి పోలీసు అధికారుల బదిలీలకు కూడా పాల్పడుతున్నారని, ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని కుమారస్వామి ఆరోపించారు. యతీంద్ర ఇప్పుడు సూపర్ సిఎంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే సిఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సి ఉందని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు యతీంద్ర కరప్ట్ సన్ ఆఫ్ సిద్ధరామయ్య (సిఎస్‌ఆర్) అని ఘాటైన పదజాలంతో తిట్టిపోశారు. రాష్ట్రంలో 224 నియోజకవర్గాలకు ఈ సిఎస్‌ఆర్ పర్యవేక్షకులు…

Read More

ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని నికరాగ్వూ భామ గెలుపొందించింది. 72 మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ నికరాగ్వూ షెన్నిస్ పలాసియోస్‌ విజేతగా నిలిచింది. గతేడాది విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ఆమెకు కిరీటాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.  ఆఖరి రౌండ్‌లో జీవితంలో ఎవరిని మార్గదర్శిగా ఎంచుకుంటారని న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు 18వ శతాబ్దపు బ్రిటిష్ తత్వవేత్త, స్త్రీవాది మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్‌ అని సమాధానం ఇచ్చారు. ‘ఆమె సరిహద్దులను ఉల్లంఘించి చాలా మంది మహిళలకు అవకాశం ఇచ్చింది.. ఈ రోజు మహిళలకు ఎటువంటి పరిమితులు లేవు’ అని చెప్పారు.  మిస్ యూనివర్స్‌ కిరీటం దక్కించుకున్న మొట్టమొదటి నికరాగ్వూ యువతిగా షేనిస్ రికార్డులకెక్కారు. ఇక, భారత్ తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న శ్వేతా శార్దా టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయారు. సెమీ-ఫైనల్స్‌లో ఆమె టాప్-20లో నిలిచారు.ఎల్ సాల్వెడార్ వేదికగా జరిగిన ఈ పోటీలు జరిగాయి. 2012 మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో,…

Read More

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో గత ఆదివారం కుప్పకూలిన సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికుల పరిస్థితి వారం రోజులైనా అగమ్యగోచరంగా మారింది. తొలుత వీరిని బయటికి తీసేందుకు ఓ డ్రిల్లింగ్‌ యంత్రంతో రెస్యూ నిర్వహించారు. అది నెమ్మదిగా పనిచేస్తుండటంతో అమెరికాకు చెందిన ఆగర్‌ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ప్రత్యేకంగా వాయుసేన విమానాల్లో తరలించారు.  దాంతో డ్రిల్లింగ్‌ పూర్తిచేసి పైపులైను ద్వారా కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావాలని భావించారు. కానీ, ఆ ఆశలూ ఫలించలేదు. శుక్రవారం మధ్యాహ్నం ఐదో పైపును అమరుస్తున్న సమయంలో పెద్దగా పగుళ్లు వచ్చి, భారీ శబ్దం వినిపించింది. దీంతో ఆగర్‌తో డ్రిల్లింగ్ నిలిపివేశారు.  ఇదిలా ఉండగా, సొరంగ నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం బయటపడింది. నిర్మాణ సంస్థ తీవ్రమైన లోపాన్ని సూచించే మ్యాప్ బయటకు వచ్చింది.  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం 3 కి.మీ పొడవున్న అన్ని సొరంగాలు విపత్తు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి తప్పించుకునే మార్గాన్ని కలిగి ఉండాలి.…

Read More

డీప్‌ఫేక్ సమస్య పై ప్రభుత్వం త్వరలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సమావేశమవుతుందని కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైషవ్ వెల్లడించారు. డీప్‌ఫేక్ ఫొటోలను, వీడియోలను మీడియా తొలగించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు గనుక పక్షంలో సేఫ్ హార్బర్ ఇమ్యూనిటీ క్లాజ్ వర్తించబోదని మంత్రి స్పష్టం చేశారు. డీప్‌ఫేక్ అంశంపై ప్రభుత్వం ఇటీవల కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా దీనికి సానుకూలంగా స్పందించాయని మంత్రి చెప్పారు. అయితే అలాంటి వాటిపై చర్యలు తీసుకోవడానికి కంపెనీలు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ‘కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి.. అయితే మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. రాబోయే మూడు నాలుగు రోజుల్లో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సమావేశం కానున్నాం. డీప్‌ఫేక్‌లను నిరోధించడానికి, తమ వ్యస్థలను ప్రక్షాళన చేయడానికి అవి తగు చర్యలు తీసుకునేలా సమస్యపై ఆ సంస్థలను మానసికంగా సిద్ధం…

Read More

‘‘ కేసీఆర్‌.. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణలో బీజేపీ అఽధికారంలోకి వస్తోంది. ఆ వెంటనే అవినీతి, కుంభకోణాలకు బాధ్యులైన వారిని జైలుకు పంపిస్తాం’’ అని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ అంటే భ్రష్టాచార్‌ రాష్ట్ర సమితి అని విమర్శించారు. తెలంగాణ బీజేపీ మ్యానిఫెస్టోను “సకల జనుల సౌభాగ్య తెలంగాణ” పేరుతో అమిత్‌షా విడుదల చేశారు. అందులో 10 అంశాల కార్యాచరణను బీజేపీ ప్రకటింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్నారు. బీసీ అభ్యర్థినే సీఎంను చేస్తామని ప్రకటించారు. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.కేసీఆర్‌ ప్రభుత్వం…

Read More