తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 4,810 నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 145 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ నియోజకవర్గంలో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. అతి తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలుకు తుది గడువైన శుక్రవారం ఒక్కరోజే మొత్తం 2,327 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 13వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అసంపూర్తిగా నామినేషన్ పత్రాలు నింపితే, అలాంటి అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తారు. అదే రోజు నామినేషన్ల తుది జాబితా విడుదల అవుతుంది. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత అసలు బరిలో ఉండే మొత్తం అభ్యర్థుల సంఖ్య ఖరారవుతుంది. 30వ తేదీ పోలింగ్, డిసెంబర్ 3వ తేదీ ఫలితాలు వెల్లడయ్యే విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న పత్రికా ప్రకటనలు, వీడియోలు కాకుండా,…
Author: Editor's Desk, Tattva News
నామినేషన్ల దాఖలు ఘట్టం పూర్తి కావడంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారిస్తున్న సమయంలో పలు రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ తెలంగాణాలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని ఛానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ లేఖలు రాశారు. అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈవో వెల్లడించారు. రాజకీయ పార్టీలు ప్రచారంలో భాగంగా పత్రికలు, టీవీ ఛానెళ్ళలో ముద్రించే, ప్రసారం చేసే యాడ్‌లను తొలుత స్టేట్ లెవల్ సర్టిఫికేషన్ కమిటీకి స్క్రూటినీ నిమిత్తం పంపుతాయి. వాటిని పరిశీలించిన తర్వాతే ప్రకటనలు అనుమతి పొందుతాయని, కానీ అలా అనుమతి పొందిన తర్వాత వాటికి ఇష్టానుసారం మార్పులు చేర్పులు చేసి ప్రసారం చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది. ఇష్టానుసారంగా మార్చి ప్రసారం చేస్తూ…
ఇజ్రాయేల్ – హమాస్ దాడులతో గాజాలో మృత్యు ఘోష కొనసాగుతోంంది. ఇజ్రాయేల్ దాడుల కారణంగా ఓ ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముగ్గురు పసికందులు మృతి చెందారు. శనివారం అల్ షిఫా హాస్పిటల్‌లోని చిన్న పిల్లల సంరక్షణ యూనిట్ కు కరెంట్ కట్ అయింది. దాంతో, అప్రమత్తమైన డాక్లర్లు కృత్రిమ పద్ధతుల్లో పసికందులకు ఊపిరి అందించేందుకు ప్రయత్నించినా, ముగ్గురు చిన్నారులు ప్రాణాలు వదిలారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాదు అక్కడ చికిత్స పొందుతున్న 39 మంది పిల్లలు మృత్యువుతో పోరాడుతున్నారని వెల్లడించింది. ఇజ్రాయేల్ దళాలు అల్ షిఫా హాస్పిటల్ లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. దాంతో, ఆస్పత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్దరణ చేద్దామంటే జనరేటర్‌కు ఇంధనం అందుబాటులో లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన డాక్టర్ అష్రఫ్ అల్ ఖిద్రా పేర్కొన్నాడు. ఈ ఆస్పత్రిలో దాదాపు 4 వేల మంది చికిత్స పొందుతున్నారు. అంతేకాదు ఇజరాయేల్ –…
వెండితెరపై తమ అందచందాలతో, నటనా నైపుణ్యంతో మెరిసిపోయి, తెలుగు వారిలో మంచి పేరు తెచ్చుకున్న పలువురు సినీ తరాలకు తెలంగాణ ఎన్నికల సందర్భంగా బిజెపి మాత్రం మొండిచెయ్యి చూపోయించింది. ఎన్నికలలో పోటీచేయాలని ఉబలాటపడిన కనీసం ఐదుగురు ప్రముఖ హీరోయిన్ ల ఆశలను నిరాశ పరిచింది. అయితే, సీటు ఇచ్చినా పోటీ చేయనని మీడియా ముందు పార్టీ నాయకులను దుమ్మెత్తి పోసిన మాజీ మంత్రి బాబూమోహన్ కు మాత్రం గెలిచే అవకాశం లేదని తెలిసినా మరోసారి సీటు ఇచ్చింది. బిజెపి అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించిన విజయశాంతి, జయసుధ, జీవిత, మాధవీలత, రేష్మత్ రాథోడ్ లను మాత్రం పార్టీ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. 1998లోనే బీజేపీలో చేరి, మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉంటూ 1999 ఎన్నికలలో పార్టీ కోసం విశేషంగా ప్రచారం చేసిన విజయశాంతి తెలంగాణ ఉద్యమం కోసం పార్టీని వదిలి టిఆర్ఎస్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్…
గత 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం ఎస్సీలు చేస్తున్న పోరాటాన్ని తాము గుర్తించామని చెబుతూ మాదిగల వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’ లో శనివారం పాల్గొంటూ మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం హామీ ఇవ్వగలదని చెబుతూ తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసే సత్తా బీజేపీకే ఉందని భరోసా వ్యక్తం చేశారు. మీ న్యాయపరమైన పోరాటంలో తాను తోడుగా ఉంటానని మోదీ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగను తన చిన్న తమ్ముడిగా ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో చాలా ప్రభుత్వాల్ని చూశామని, తమ ప్రభుత్వ ప్రాధాన్యత మాత్రం సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే నినాదంతో…
సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేని శూన్యతను కలిగించిందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘ప్రముఖ తెలుగు నటుడు శ్రీ చంద్ర మోహన్ గారు మృతి చెందడం అత్యంత బాధాకరం. సినీ ప్రపంచంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. వారి ఉత్తమమైన నటన మరియు ప్రత్యేకమైన తేజస్సు తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వారి నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేన ఒక శూన్యతను కలిగించింది. నా ఆలోచనలు వారి కుటుంబం మరియు అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి’’ అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాని ఇంగ్లిష్‌లోనూ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, మహేశ్…
ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందూతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్త చేస్తున్నారు. చంద్రమోహన్ కు భార్య ప్రముఖ రచయిత్రి జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1943 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన చంద్రమోషన్ తెలుగులో ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్ తొలి నాళ్లలో హీరోగా చాలా సినిమాల్లో నటించి అలరించారు. శ్రీదేవీ, జయప్రద, జయసుధ, సుహాసినీ, విజయశాంతి లాంటి హీరోయిన్లతో చంద్రమోహన్ హీరోగా నటించారు. తర్వాత హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆయన తన సినీ ప్రయాణంలో మొత్తం 932 సినిమాలు…
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని గణపతి ప్లాజాలో ఉన్న 1,100 ప్రైవేట్ లాకర్ల గుట్టు రట్టవుతుంది. గడిచిన మూడు వారాల్లో ఐదు లాకర్లను తెరిచిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటివరకూ రూ.7 కోట్ల నగదు, 12 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. మరికొన్ని లాకర్లను తెరవాల్సి ఉన్నది. గణపతి ప్లాజాలోని ఓ ఫ్లాట్‌లో ప్రైవేట్ లాకర్లు ఉన్నాయని, వాటిలో రూ.500 కోట్ల నల్లధనం, 50 కిలోల బంగారం ఉన్నదని బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా గత నెలలో సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు లాకర్లు తెరిచే వరకు తాను గేటు వద్దే కూర్చొని ధర్నా చేస్తానని ప్రకటించారు. లాకర్లలో ఉన్నదంతా అధికార కాంగ్రెస్‌కు చెందిన డజనుకు పైగా ఎమ్మెల్యేలు, ఆరేడు మంది మంత్రులకు చెందిన అవినీతి సొమ్మేనని ఆరోపించారు. పేపర్ లీక్, జల్‌జీవన్ మిషన్‌లో అక్రమంగా దోచుకొన్న సొమ్మే ఇక్కడ దాచుకొన్నట్టు మండిపడ్డారు. పదేైండ్లెనా లాకర్లను ఇప్పటివరకూ తెరువలేదని ధ్వజమెత్తిన కిరోడి…
‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఎలా చెప్పగలరు? పంజాబ్‌లో జరుగుతున్న దానిని బట్టి మేము ఏ మాత్రం సంతృప్తిగా లేము. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొనసాగుతున్నామా?’ అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం పంజాబ్, తమిళనాడు గవర్నర్ల తీరుపై విరుచుకుపడింది. తమ ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు తొక్కిపెడుతున్నారంటూ పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై ఇక ఎంతమాత్రం జాప్యం చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తమిళనాడు, పంజాబ్ గవర్నర్లను ఆదేశించింది. ‘చట్టబద్ధంగా ఎన్నికైన అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను దయచేసి పక్కదారి పట్టించకండి. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశం’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. స్థాపిత సంప్రదాయాలు, సూత్రాల ఆధారంగా భారతదేశం ముందుకు సాగుతున్నదని, వాటిని తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని ఆవమా స్పష్టంచేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాష్ట్ర గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ తొక్కి పెట్టారని,…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం 2023-2024 ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూటమి ఆఫిస్ బేరర్స్ పోస్టులను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసి ఎబివిపి కూటమిపై ఘన విజయం సాధించింది. అధ్యక్ష స్థానానికి మహ్మమద్ అతిక్ అహ్మద్ (ఎస్ఎఫ్ఐ) -1880, షేక్ ఆయేషా (ఎబివిపి) -1409, ఉమేష్ అంబేద్కర్ (ఏ ఎస్ డి) -424, అమల్ జోష్ ఫిలిప్ (ఎన్ ఎస్ యు ఐ) -345, ఓట్లు పోందగా 471 ఓట్ల మెజారిటీతో ఎస్ఎఫ్ఐఅభ్యర్థి మహ్మమద్ అతిక్ అహ్మద్ అధ్యక్షుడిగా గెలుపోందారు. ఉపాధ్యక్ష స్థానానికి జలి ఆకాష్( ఎస్ఎఫ్ఐ కూటమిలో భాగస్వామి ఎఎస్ ఎ)- 1671, తరుణ్ (ఎబివిపి) -1283, రనియా జులైక ( ఏ ఎస్ డి ) – 729, ముకుంద్ కుమార్ (ఎన్ ఎస్ యు ఐ) -253 ఉపాధ్యక్ష స్థానంలో ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి జలి ఆకాష్ 388 ఓట్ల మెజారిటీ తో గెలుపోందారు. ప్రధాన కార్యదర్శి…