సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌తో పాటు భార్య తంజీమ్ ఫాతిమా, తనయుడు అబ్దుల్లా ఆజంకు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల కేసులో జైలుశిక్షతో పాటు రూ.15వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించిందని మాజీ డీజీసీ (క్రైమ్) సక్సేనా తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని నేరుగా జైలుకు తరలించనున్నారు. శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా రాంపూర్‌లో పోలీసు భద్రతను పెంచారు. రెండు జనన ధ్రువీకరణపత్రాలు ఉన్నాయంటూ 2019లో అబ్దుల్లా ఆజంపై బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా కేసు పెట్టారు. ఆ తర్వాత ఈ కేసులో తంజీమ్ ఫాతిమాను సైతం నిందితులుగా చేర్చారు. ఐపీసీ సెక్షన్ 420, 467, 468, 471 కింద అబ్దుల్లాతో పాటు తల్లిదండ్రుపై కేసు నమోదైంది. అయితే, అబ్దుల్లా తన సౌలభ్యం మేరకు ఎప్పటికప్పుడు రెండు బర్త్ సర్టిఫికెట్లను…
Author: Editor's Desk, Tattva News
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నవంబర్ 18న తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఉత్తరాఖండ్‌లోని కోర్టు సమన్లు జారీచేసింది. డాక్టర్ గణేష్ ఉపాధ్యాయ అనే కాంగ్రెస్ పార్టీ అభిమాని ఉధంసింగ్ నగర్ జిల్లా కోర్టు, రుద్రాపూర్ సెషన్స్ జడ్జి కోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావాకు సంబంధించి హింత బిశ్వ శర్మకు కోర్టు సమన్లు జారీ చేసింది. 2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కిచ్చా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని డాక్టర్ గణేష్ ఉపాధ్యాయ ఆరోపించారు. నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందిన మూడు తరాలు స్వాతంత్య్ర ఉద్యమం నుంచి దేశాభివృద్ధి వరకు దేశం…
కర్ణాటకలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కన్నడ భాషను నేర్చుకుని మాట్లాడాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పిలుపునిచ్చారు. మైసూరు స్టేట్‌ను కర్నాటకగా పేరు మార్చి 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా కర్ణాటక సంబ్రమ-50 చిహ్నాన్ని ఇక్కడి విధాన సౌథలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఏకీకరణ తర్వాత వివిధ భాషలు మాట్లాడేవారు రాష్ట్రంలో స్థిరపడ్డారని, అయితే కర్ణాటకలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కన్నడ భాషలోనే మాట్లాడాలని కోరారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో స్థానిక భాష నేర్చుకోకుండా జీవించడం అసాధ్యమని ఆయన తెలిపారు. కాని కర్నాకటలో కన్నడ మాట్లాడకుండానే బతకవచ్చని, అదే కర్నాటకకు ఇతర పొరుగు రాష్ట్రాలకు మధ్య తేడా అని ఆయన చెప్పారు. కర్ణాటక ఏకీకరణ జరిగి 68 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా రాష్ట్రంలో కన్నడ వాతావరణం సృష్టించకపోవడం తగదని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఇతరులకు మన భాషను నేర్పించాల్సిన కన్నడిగులు…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మళ్లీ పెరిగింది. ఈసారి మరో 4 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కరవు భత్యం 42 శాతంగా ఉండగా.. తాజా పెంపుతో కలిపి 46 శాతానికి చేరింది. దీపావళికి ముందు ఈ ప్రకటనతో ఉద్యోగులకు పండగ ముందే వచ్చినట్లయింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం డీఏ పెంచింది. సాధారణంగా డీఏను (డియర్‌నెస్ అలవెన్స్) ఏటా కేంద్రం రెండు సార్లు సవరిస్తుంటుంది. జనవరి, జులైల్లో సవరించాల్సి ఉన్నప్పటికీ.. దీనిని మార్చి, అక్టోబర్‌లో పెంచుతూ వస్తుంది. అయితే ఇదే క్రమంలో బకాయిల్ని కూడా చెల్లిస్తుంది. ఉద్యోగులకు డీఏ పెరగగా.. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ పెరుగుతుందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఉద్యోగులకు కాలానుగుణంగా డీఏ పెంచుతూ ఉంటుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం వరుసగా పెరుగుతున్న వేళ డీఏ పెంచుకుంటూ పోతోంది. గతేడాది మొదట…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. బుధవారం జనసేనానితో కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బీజేపీకి మద్దతు విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను బీజేపీ నేతలు పవన్ మద్దతును కోరారు. జనసేన ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి దగ్గరైంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని పవన్ భావిస్తుండగా, బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేదు. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ దూరంగా ఉంటోన్న నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీకి పవన్ కల్యాణ్ మద్దతిచ్చే అంశంపై పార్టీలో చర్చిస్తానని చెప్పడం గమనార్హం. …
రాష్ట్రపతి భవన్ లో మంగళవారం అత్యంత ఘనంగా జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విజేతలు హాజరు కాగా, జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ అవార్డుతో చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నా, ఇప్పటి వరకు ఎవరికీ ఆ అవకాశం దక్కలేదు. పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకకు అల్లు అర్జున్…
హమాస్‌పై ఇజ్రాయేల్ ప్రతీకార దాడులతో వణికిపోతున్న గాజా నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఓ ఆసుపత్రిలో పేలుడు సంభవించి కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇజ్రాయేల్, హమాస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. పేలుడుకు ఇజ్రాయేల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపించగా, అది ఇస్లామిక్ జిహాదీల చర్యేనని టెల్ అవీవ్ ప్రత్యారోపణలు చేసింది. గాజా నగరంలోని అల్ అహ్లి ఆసుపత్రిలో జరిగిన ఈ దుర్ఘటన దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయేల్, పాలస్తీనా ఘర్షణల్లో అత్యంత ఘోరమైంది. ‘గాజాలోని ఆసుపత్రిలో పేలుడుకు ఇస్లామిక్ జిహాద్ కారణమని విశ్వసనీయ వర్గాల ద్వారా లభించిన సమాచారం సూచించింది’ అని ఇజ్రాయేల్ సైన్యం తెలిపింది. ఆసుపత్రికి సమీపంలో వైమానిక కార్యకలాపాలు, ఉపయోగించిన రాకెట్లు వాటి దాని పరికరాలతో సరిపోలడం లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు, హమాస్ మిత్రపక్షం ఇస్లామిక్ జిహాద్ సైతం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గాజాలోని బాప్టిస్ట్ అరబ్ నేషనల్ హాస్పిటల్‌పై బాంబు దాడి…
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఇరువైపుల వాదనలను విన్నది. మంగళవారం విచారణ ముగియడంతో తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారని, ఆయన ఎలాంటి నేరానికి పాల్పడలేదని, ఈ నేపథ్యంలో 73 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వాలని హరీశ్ సాల్వే కోరారు. అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని ఆయన విజ్ఞప్తి చేశారు. సాల్వే విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. చంద్రబాబు వయస్సు రీత్యా ఇదే కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న…
స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధంగా గుర్తించలేమని సుప్రీంకోర్టు మంగళవారం తెలియచేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ అనుమతి కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించి తగిన చట్టాలను రూపొందించే బాధ్యతను పార్లమెంట్‌కే సుప్రీంకోర్టు వదిలిపెట్టింది. లైంగిక ప్రత్యేకత ఆధారంగా సహజీవనం చేయడాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కులను సహజీవనం చేసే హక్కుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వివక్ష చూపలేవని కోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కులు ఉమ్మడిగా శిశువును దత్తత తీసుకోవచ్చని కూడా కోర్టు తెలిపింది. ప్రస్తుత చట్టాల ప్రకారం ట్రాన్స్‌జెండర్లతోపాటు స్వలింగ సంపర్కులకు వివాహం చేసుకునే హక్కు ఉందని కోర్టు తెలిపింది. అటువంటి జంటలకు కల్పించే హక్కులను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ఇదివరకే తెలిపారని సిజెఐ డివై చంద్రచూడ్ తన తీర్పులో వెల్లడించారు. ప్రధాన…
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ తీసుకొన్న నిర్ణయం ఆ పార్టీలో సంక్షోభం సృష్టిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్ణాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం పార్టీలో చీలిక సంకేతాలు ఇచ్చారు. కొంత మంది పార్టీ నేతలతో ఆయన సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో కలిసి వెళ్లొద్దని పార్టీ సుప్రీం దేవెగౌడను కోరారు. సెక్యులర్‌గా ఉన్న తన వర్గమే అసలైన జేడీఎస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ‘వారు(దేవెగౌడ, కుమారస్వామి) బీజేపీతో వెళ్లాలనుకొంటే వెళ్లొచ్చు. తాము మాత్రం ఆ పని చేయలేం’ అని తేల్చి చెప్పారు. బీజేపీతో వెళ్లకూడదని తాము ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నామని చెబుతూ తనతో చాలా మంది…