Author: Editor's Desk, Tattva News

మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో 2024లో లోక్‌సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అ సెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ స్పష్టం చేస్తున్నది. దీంతో 2029నుంచి లోక్‌సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఓ ఫార్ములాను రూ పొందిస్తున్నట్లు లా కమిషన్ వర్గాలు వెల్లడించాయి. వివిధ రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని కుదించడం, లేదా పెంచడం ద్వారా ఒకే సారి ఎన్నికల నిర్వహణకు సిఫార్సులు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా లోక్‌సభ, అ సెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఉమ్మడి ఎన్నికల జాబితా ఉండేలా చూడడానికి లా కమిషన్ ఓ యంత్రాంగాన్ని రూపొందిస్తున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఓటర్ల జాబితాలను…

Read More

దసరా, దీపావళి పండుగల సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు వివిధ ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. దానాపూర్ టు సికింద్రాబాద్ (03225) ప్రత్యేక రైలును అక్టోబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రతి గురువారం పాట్నా టు సికింద్రాబాద్ (03253) స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు.   అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రతి సోమ, మంగళవారాల్లో సికింద్రాబాద్ టు పాట్నా (07255) అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రతి శుక్రవారం హైదరాబాద్ టు పాట్నా(07255) అక్టోబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.  ఇక సికింద్రాబాద్ టు దానాపూర్(03226) ప్రత్యేక రైలు అక్టోబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు, విశాఖపట్నం టు సికింద్రాబాద్(08579)…

Read More

పార్లమెంట్‌ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టం రూపం దాల్చినట్టయ్యింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నూతన చట్టం ప్రకారం లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చినా మహిళా రిజర్వేషన్‌ ఎప్పటి నుంచి అమలవుతుందన్న సందిగ్ధత నెలకొనివుంది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో పొందుపరచడమే సందిగ్ధతకు కారణం.  జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సివుంది. కోవిడ్‌ కారణంగా 2021 జనాభా లెక్కలు వాయిదా వేయడంతో ఈ విషయంలో ఇప్పటికీ గందరగోళం నెలకొన్న సంగతి విదితమే. 2024లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాభా గణన ప్రక్రియ మళ్లీ…

Read More

బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఇస్కాన్‌ రూ.100 కోట్లకు పరువు నష్టం నోటీసును శుక్రవారం పంపించింది. ఇస్కాన్‌ను దేశంలోనే అతిపెద్ద మోసకారి సంస్థ అని ఆరోపించడంతో పాటు ఇస్కాన్‌కు చెందిన గోశాలల్లోని ఆవులను వధ్యశాలలకు విక్రయిస్తున్నారంటూ మేనకా గాంధీ విమర్శించడంతో ఇస్కాన్‌ ఆమెకు నోటీసు పంపించింది. ”ఇస్కాన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసిన మేనకా గాంధీకి రూ.100 కోట్లకు పరువు నష్టం నోటీసును నేడు మేము పంపించాం. ఆమె చేసిన దారుణమైన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్‌ భక్తులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులను తీవ్రంగా బాధించాయి. ఇస్కాన్‌కు వ్యతిరేకంగా జరిగే దుష్ప్రచారంపై న్యాయ పోరాటం చేయడంలో అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని మేం జారవిడుచుకోం” అని ఇస్కాన్‌ కోల్‌కతా కేంద్రం ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి రాధారమణ్‌దాస్‌ పేర్కొన్నారు. మేనకా గాంధీ ఇస్కాన్‌పై చేసిన ఆరోపణలతో కూడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఇస్కాన్‌ చర్యకు ఉపక్రమించింది. సదరు వీడియోలో…

Read More

విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయ్యింది. విశాఖ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోన్న ఈ బెట్టింగ్‌లో వందలాది మంది యువకులు కోట్లాది రూపాయాలు పోగొట్టుకుంటున్నారు. స్పందన కార్యక్రమంలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టి.. పక్కా ప్లాన్‌తో బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.  పట్టుబడిన మహాదేవ్ అన్‌లైన్ బెట్టింగ్ ముఠా సభ్యులు విచారణలో కీలక విషయాలను వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రా సత్తిబాబు అనే యువకుడు బెట్టింగులో రూ.8 లక్షలు పొగొట్టుకున్నాడని, అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. సూరిబాబు అనే ప్రధాన బుకీ ఖాతాకు నగదు వెళ్తున్నట్టు గుర్తించామని డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. అనకాపల్లి జిల్ల అచ్చుతాపురానికి చెందిన రెడ్డి సూరిబాబు, దినేష్ అలియాస్ మోను, వాసుదేవరావు ప్రధాన బుకీలుగా గుర్తించారు. ఈ ముగ్గురి సహా 11 మందిని అరెస్ట్ కోర్టులో హాజరుపరిచారు.  11 రకాల ఆన్‌లైన్ సైట్‌లు,…

Read More

తమిళనాడుతో తలెత్తిన కావేరి జలవివాదంతో ఆందోళనలతో కర్ణాటక అట్టుడికిపోతోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌ నేపథ్యంలో రాష్ట్రమంతా స్తంభించింది. అన్ని రంగాలు, రవాణాలు, ప్రయాణాలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి. పలు చోట్ల ఆందోళనకారులు నిరసనకు దిగగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ విధించారు. కర్నాటక ప్రభుత్వం పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ, రైతు సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. గత మంగళవారం బెంగళూరులో ఉధృతంగా బంద్‌ కొనసాగింది. మళ్లీ రోజుల వ్యవధిలోనే ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. కర్నాటక రక్షణ వేదిక, జయ కర్ణాటక సంఘం, ఇతర కన్నడ సంఘాలు, రైతు సంఘం, హసిరుసేన, చెరకు సాగుదారుల సంఘం, ట్యాక్సీ- ఆటోరిక్షా సంఘాలు, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, సినిమా కళాకారుల సంఘం తదితర వందకు పైగా సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం ఆరు గంటల నుంచే బంద్‌ మొదలైంది. మైసూరులో బస్టాంట్‌…

Read More

స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేశ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్‌ చేయవద్దని ఉత్తర్వులను జారీ చేసింది.  దీంతో లోకేశ్ కు స్వల్ప ఊరట దక్కినట్లు అయింది. స్కిల్ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌నెట్‌ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం లోకేశ్ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవంక, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.  అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంపై 2022 ఏప్రిల్‌లో నమోదుచేసిన కేసులో ఏ14గా లోకేష్‌ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది. దీంతో సిఐడి అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్‌ దాఖలు…

Read More

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌ సరిహద్దులోని ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ పూర్వీకుల ఇంటిపై గురువారం రాత్రి ఓ గుంపు దాడికి ప్రయత్నించింది. భద్రతా బలగాలు గాల్లోకి తుపాకీ కాల్పులు జరపటంతో దుండగుల గుంపు అక్కడ్నుంచి వెళ్లిపోయిందని సమాచారం. సీఎం పూర్వీకుల ఇల్లు ఖాళీగా ఉందని, అందులో ఎవ్వరూ నివసించటం లేదని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.  ఇంటి చుట్టూ నిరంతరం పోలీసు పహారా ఉందని తెలిపారు. లోయలో భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ ఈ దాడి జరగటం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. గుంపును పోలీసులు చెదరగొట్టారని తెలిపారు.  మరోవైపు, ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యపై మణిపూర్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి.  ఆందోళనకారులు గురువారం ఉదయం పశ్చిమ ఇంఫాల్‌లో డిప్యూటీ కమిషనర్‌ (కలెక్టర్‌) కార్యాలయంలో విధ్వంసానికి దిగారు. అక్కడున్న రెండు ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు. రాష్ట్ర సర్కార్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్న విద్యార్థుల గుంపు ఒకటి తౌబాల్‌ జిల్లాలో బీజేపీ కార్యాలయానికి నిప్పు…

Read More

పదకొండు రోజుల పాటు ఆ బాల గోపాలంతో పూజలందుకొని భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన గణపయ్యలు గురువారం వీడ్కోలు తీసుకున్నారు. భక్తిశ్రద్ధలతో నగరవాసులు ధూప దీప నైవేద్యాలను సమర్పించి లంబోదరులను నిమజ్జనం చేశారు. నగరవ్యాప్తంగా ప్రతిష్టితమైన దాదాపు 90వేల గణపతుల నిమజ్జనం శుక్రవారం ఉదయం వరకు జరిగింది. 63 అడుగుల ఎైత్తెన ఖైరతాబాద్‌ మహాగణపతి మధ్యాహ్నం ఒంటిగంట 27 నిమిషాలకు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. బాలాపూర్‌ నుంచి ప్రారంభమై చార్మినార్‌, ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ చేరిన శోభాయత్ర ఉత్సవ విగ్రహాలు, భక్తులతో పోటెత్తింది. ‘కత్తులు బల్లెము చేతబట్టి.. దుష్టుల తలలు మూటగట్టి.. నువ్వు పెద్దపులి నెక్కిరావమ్మో… గండిపేట ఓ మైసమ్మ… ఓ మైసమ్మో’ అంటూ ఊపున్న పాటలకు ఊగిపోతూ నగర యువకులు సందడి చేశారు. తీన్మార్‌ డప్పుల మోతకు చిన్నా పెద్ద, మహిళలు లయబద్ధంగా స్టెప్పులు వేశారు. గణేశ నిమజ్జనం సందర్భంగా ఆధ్యాత్మిక పారవశ్యంలో హైదరాబాద్ నగరం ఓలలాడింది. గల్లీ నుంచి…

Read More

త‌మిళ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్టు స‌భ్యుల లంచావ‌తారాల పేర్ల‌ను, ఆధారాల‌తో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి కలకలం రేపారు. విశాల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల కోసం తాను కేంద్ర సెన్సార్ బోర్డులోని కొందరు వ్యక్తులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చిందని హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు ఆయన ఎక్స్ లో వివరంగా స్పందించారు.  “వెండితెరపై అవినీతిని చూపించడం బాగానే ఉంటుంది. కానీ నిజ జీవితంలో అవినీతి దారుణంగా ఉంటుంది. ఏమాత్రం జీర్ణించుకోలేం. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి హేయమైన చర్య. మరీ ముఖ్యంగా ముంబయిలోని సీబీఎఫ్ సీ (కేంద్ర సెన్సార్ బోర్డు) ప్రధాన కార్యాలయంలోనే అవినీతి జరిగితే ఇంకేం చెప్పాలి?” అంటూ ప్రశ్నించారు.  “నేను నటించిన మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ విడుదల చేసేందుకు రూ.6.5 లక్షలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.…

Read More