దేశంలో మహిళలకు రాజ్యాధికారంలో పెద్దపీట వేసి మహిళలను గౌరవించాలని ఒక ఆలోచనతో బీజేపీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ జాతీయ ఓబిసి అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ తెలిపారు. అక్టోబర్ 1న ప్రధాని మోదీ బహిరంగ సభ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశానికి మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుత గత ప్రభుత్వాలు పాలకులు మహిళా బిల్లు విషయంలో అనేక ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం కాలేదని గుర్తు చేశారు. 1996లో దేవగౌడ, వాజపేయి, అద్వానీ ఇలాంటి వారు పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించినా సాధించలేకపోయారని పేర్కొన్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ నవభారత నిర్మాణంలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంలో మొదటి బిల్లు మహిళా బిల్లు ప్రవేశపెట్టారని, రాజ్యసభలో కూడా మొదటి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టామని…
Author: Editor's Desk, Tattva News
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. డిల్లీ లిక్కర్ కేసులో కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కు వాయిదా వేసింది. అక్టోబర్ 18న పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తెలిపారు. ఈ విచారణ అనంతరం కవిత పిటిషన్ పై విచారణ చేపడతామని పేర్కొంటూ అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20 వరకు ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలవబోమని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఏ స్థాయిలో ఉన్నారనేది పక్కనబెడితే అసలు విచారణకు పిలవద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. అయితే మహిళల…
తెలంగాణాలో విష జ్వరాలతోపాటు డెంగ్యూ ప్రమాదకరస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అయితే చాలా మంది అది సాధారణ విషజ్వరంగానే భావిస్తూ సాధారణ చికిత్సతో సరిపెడుతుండడంతో రోజుల తరబడి తీవ్ర జ్వరంతో ఆసుపత్రులకు వెళుతుండడంతో డెంగ్యూగా నిర్దారిస్తున్న వైద్యులు రోగిని కాపాడేందుకుతీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో మూడు రోజులకు మించి విడవని జ్వరం ఉంటే సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయొద్దని రెనోవా ఆసుపత్రుల వైరాలజీ విభాగం వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3వేల డెంగ్యూ కేసులు నమోదు కాగా అందులో సగానికి పైగా అంటే 1600 కేసుల దాకా ఒక్క హైదరాబాద్‌లో నమోదైనవే. ఆగస్టు నెల నుంచి రాష్ట్రంలో డెంగ్యూ ఉధృతి కొనసాగుతోంది. అంతకుముందుతో పోల్చుకుంటే ఒక్క ఆగస్టులో నెలలోనే డెంగ్యూ కేసులు పదిరెట్లు మేర అధికంగా పెరిగాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డెంగీ దోమకాటు ద్వారా వ్యాపించే వైరల్ జ్వరం. డెంగీకి…
ప్రముఖ బహుభాషా నటి వహిదా రెహమాన్ 2021 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక అయ్యారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ సినిమాకు చేసిన విశిష్ఠ సేవలకు గాను వహిదా రెహమాన్‌ను ఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేసినట్టు చెప్పారు. వహీదా రెహమాన్ 1955లో వచ్చిన రోజులు మారాయి అనే తెలుగు సినిమాతో తన నటన కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత బాలీవుడ్ కు మారి నటిగా రాణించి అక్కడే స్థిరపడ్డారు. రేష్మ ఔర్ షేరా సినిమాలో పాత్రకు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్, పద్మశ్రీ, పద్మ భూషణ్ సైతం ఆమెను వరించాయి. కృషితో తన కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న భారతీయ వనితకు వహీదా నిదర్శనమని కేంద్ర మంత్రి ఠాకూర్ పేర్కొన్నారు. చారిత్రక మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన తరుణంలోనే ఫాల్కే అవార్డుకు వహిదా రెహమాన్…
తెలంగాణాలో కొన్ని రాజకీయ పార్టీలు, అధ్యక్షులు అబద్ధాల పునాదుల మీద అధికారం లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయని బిజెపి ఎమ్మెల్యే రఘనందన్‌రావు కాంగ్రెస్ నాయకులపై ఆరోపించారు. బీజేపీ మీద బట్ట కాల్చి పడేసే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సిడబ్య్లూసి సమావేశం నుంచి కొత్త కొత్త అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కవిత అరెస్ట్ అవుతుందని రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ ఈడి, సిబిఐలు మీ జేబు సంస్థలా? మీకు సమాచారం ఎట్లా వచ్చిందని బిజెపి నేత ప్రశ్నించారు. అప్రూవర్‌గా మారిన వారిలో మీ చుట్టాలు ఉన్నారు కదా? ఆయన చెప్పాడా? వాళ్ళు మీకు చెప్పారా? అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా.. మీకు సమాచారం ఎట్లా వచ్చింది? ఢిల్లీ కేసుల గురించి మాట్లాడుతున్నారు, మరి గల్లీ కేసులు ఎందుకు మాట్లాడుతలేరని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఎందుకు ట్రయల్ నిర్వహిస్తాలేదు? ప్రపంచం అంతా చూస్తుండగా…
దేశంలో తొలి సీ-295 మధ్యశ్రేణి రవాణా విమానం హిండన్ ఎయిర్‌బేస్‌లో సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ 20న సీ-295 విమానం గుజరాత్‌లోని వదోదరలో ల్యాండ్ అయింది. స్పెయిన్‌లో ఈ విమానాలను వాయుసేనకు అప్పగించిన అనంతరం కొద్దిరోజులకే ఇవి దేశానికి చేరుకున్నాయి. ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో ఈ విమానాల సేకరణకు రూ. 21,935 కోట్ల ఒప్పందం జరిగిన రెండేండ్ల తర్వాత ఈనెల 13న ఎయర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి తొలి విడతలో 56 సీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను రిసీవ్ చేసుకున్నారు. కాలం చెల్లిన అవ్రో-748 విమానాల స్ధానంలో అత్యాధునిక సీ-295 విమానాలు ఐఏఎఫ్ అమ్ములపొదిలో చేరాయి. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో వదోదరలో 295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్ధాపన చేశారు. ప్రైవేట్ కన్సార్టియం ఆధ్వర్యంలో భారత్‌లో తయారయ్యే తొలి…
కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్-ఎన్డీఏ నుండి నిష్క్రమిస్తున్నట్లు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం-అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ మేరకు పార్టీ సమావేశంలో అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగిలిన నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారని ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, తమిళనాడు మాజీ మంత్రి కేపీ మునుస్వామి ప్రకటించారు. తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశం తర్వాత అన్నాడీఎంకే బీజేపీతో పొత్తును తెంచుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ లేకుండానే ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు అన్నాడీఎంకే స్పష్టం చేసింది. గత కొన్ని రోజుల నుంచి అన్నాడీఎంకే, బీజేపీ నేతలు బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. దీంతో ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే బయటికి వస్తుందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. తమ పార్టీని, పార్టీ నాయకులను నిరంతరం అవమానిస్తున్న బీజేపీతో పొత్తు ఉండబోదని ఇప్పటికే చాలామంది అన్నాడీఎంకే నేతలు బహిరంగంగానే ప్రకటించగా, …
తెలంగాణ గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్త్ర మంత్రివర్గం సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను ఆమె తిరస్కరించారు. కేబినెట్ సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని ఆమె స్పష్టం చేశారు. నామినేటెడ్ కోటాకు తగిన అర్హతలు లేని అభ్యర్థులను నామినేట్ చేయడం తగదని ఆమె హితవు చెప్పారు. తగిన అర్హతలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారని ఆమె తెలిపారు. అర్హుల పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ కారణాలతో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను సిఫార్సు చేయడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. ఇలా చేయడంతో ఆయా రంగాల్లో పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించనట్లే అవుతుందని ఆమె పేర్కొన్నారు. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరిని ఎంపిక చేయాలో…
ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఐరాస 78వ సర్వసభ్య సమావేశాల్లో పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. దీనికి భారత్ దీటుగా జవాబిచ్చింది. సమావేశంలో ఆదివారం నాడు పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ కాకర్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కాశ్మీర్‌లో అక్రమ ఆక్రమణలను భారత్ ఖాళీ చేయాలని అన్నారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై ఐరాసలో భారత ప్రతినిధి పటేల్ గెహ్లట్ స్పందిస్తూ ‘నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. మానవ హక్కుల విషయంలో తన దారుణమైన రికార్డు నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చడానికే ఈ కుయుక్తులని అందరికీ తెలుసు’ అంటూ ఎదురు దాడికి దిగారు. “జమ్ముకాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు భారత్‌లోని అంతర్భాగాలని మేం పునరుద్ఘాటిస్తున్నాం. అక్కడి విషయాలు మా అంతర్గత వ్యవహారం. ఆ విషయాలపై…
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లాలో ఈ దఫా యాత్ర నిర్వహిస్తారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర మొదలవుతుంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక సిద్ధమైంది. పూర్తి షెడ్యూల్ ను తదుపరి సమావేశంలో ఖరారు చేయాలని నిర్ణయించారు.దాదాపు నెల రోజులుగా పవన్ కళ్యాన్ పొలిటికల్ యాక్టివిటీ లేదు. వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన పొత్తుతో పోటీ చేస్తాయని రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా సంచలన ప్రకటన చేసిన అనంతరం ఈ యాత్ర జరుగుతూ ఉండడంతో కీలక ప్రాధాన్యత లభించనుంది. వైసీపీని గద్దె…