తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు , ఏఐటియుసి, ఐఎఫ్‌టియు మూడు సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన ‘చలో విజయవాడ’ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విజయవాడ ధర్నా చౌక వద్ద అంగన్వాడీలు సోమవారం సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అరెస్టు చేస్తున్నారు. బలవంతపు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ అంగన్వాడీల ధర్నాను భగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఉదయం నుండి రైల్వే స్టేషన్‌లు, బస్టాండుల నుండి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విజయవాడలో గుజ్జుల సరళా దేవి కళ్యాణ మండపంలో 150 మందిని, సింగ్‌నగర్ వడ్డెర కళ్యాణమండపంలో 100 మందిని, కండ్రిక లగడపాటి రాజగోపాల్ కళ్యాణ మండపంలో వందమందిని, ఆటోనగర్ టెక్నీషియన్ హాల్లో 50 మందిని, నక్షత్ర కన్వెన్షన్ లో 100 మందిని విజయవాడ ధర్నా చౌక్ నుండి 80 మందిని పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఈ నిర్బంధ చర్యలను…
Author: Editor's Desk, Tattva News
రైల్వేల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. స్వయం ఆధారిత స్వయం సుస్దిరతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రైలు ప్రయాణం, రైలు మౌలిక సదుపాయాల నవీకరణకు సంబంధించి 2023 ఎంతో కీలకమైందని ఆమె పేర్కొన్నారు. విజయవాడ – చెన్నై మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆమె విజయవాడ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేలో తాజాగా ప్రారంభిస్తున్న వందేభారత్ రైలు మూడోదని చెప్పారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రయాణికులు, పిల్లలతో ఆమె మాట్లాడారు. రైలులో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను డాక్టర్ భారతితోపాటు విజయవాడ ఎంపి కేశినేని నాని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిఆర్‌ఎం నరేంద్ర ఎ పాటిల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎడిఆర్‌ఎం…
రెండో వన్డేలో భారత్ భారీ విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శతకాల మోత మూగించారు. శుభ్‌మన్‌గిల్, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో కదంతొక్కగా వీరికి తోడు చివర్లో సూర్యా కుమార్ యాదవ్ సునామీ ఇన్నింగ్స్, కెప్టెన్ కెఎల్ రాహుల్ అర్ధ శతకంలో చెలరేగండం పాటు బౌలింగ్ దళం సయితం రాణించడంతో రెండో వన్డేల్లో టీమిండియా 99 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే సరీస్‌ను సొంతం చేసుకుంది భారత్. శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6×4, 4×6 : 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11×4, 3×6 : 105) శతకాలతో చెలరేగడంతో పాటు సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6×4, 6×6: 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3×4, 3×6 : 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా నిర్ణీత 50…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెండు రోజుల పాటు సాగిన సీఐడీ విచారణ ఆదివారం ముగిసింది. విచారణ అనంతరం చంద్రబాబును వర్చువల్‌గా విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పరచగా చంద్రబాబును మరికొన్ని రోజులు కస్టడీకి అనుమతించాలంటూ సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయమూర్ రిమాండ్‌ను మరో 11 రోజులు, అంటే అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చారు. ఇప్పుడే అంతా అయిపోయిందని భావించాల్సిన అవసరం లేదని చంద్రబాబుతో న్యాయమూర్తి పేర్కొన్నారు. మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని చంద్రబాబుతో చెప్పిన న్యాయమూర్తి ఈ కేసులో విచారణ ప్రక్రియ ఇంకా ఉందని తెలిపారు. స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ కోర్టుకు సమర్పించిందని ఆమె తెలిపారు. విచారణ సమయంలో అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా ?అని చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి అడగగా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని…
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను వేధించేందుకు ఏ అవకాశాన్ని వదులుకోలేదని ఢిల్లీ పోలీసులు ఆదివారం కోర్టుకు తెలిపారు. అతనిపై అభియోగాలకు తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతోంది. తజకిస్తాన్‌లో జరిగిన ఓ సంఘటనను ఉటంకిస్తూ బ్రిజ్ భూషణ్‌కు ఏమి చేస్తున్నాడో అతనికి పూర్తిగా తెలుసునని వాదించారు. మహిళా రెజ్లర్ ఫిర్యాదును ప్రస్తావిస్తూ తజికిస్తాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నిందితుడు ఫిర్యాదుదారు (మహిళా రెజ్లర్)ని గదిలోకి పిలిచి బలవంతంగా కౌగిలించుకున్నారని పేర్కొన్నారు. ఆమె నిరసన వ్యక్తం చేయగా తండ్రిలా చేశాడని చెప్పారు. దీంతో అతనికి తన చర్యలపై పూర్తి అవగాహన ఉందనడానికి ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోందని పోలీసులు నిర్ధారించారు. బాధితురాలు స్పందించిందా లేదా అన్నది ప్రశ్న కాదని, ఆమెకు అన్యాయం…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆదివారంనాడు ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ దేశవ్యాప్తంగా రైళ్లను అనుసంధానించే లక్ష్యంలో భాగంగా ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రదాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వేగం, మౌలిక వసతుల కల్పనల సమతూకంతో ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. వందేభారత్ రైళ్లకు ప్రజాదరణ పెరుగుతోందని, ఒక కోటి 11 లక్షల మంది ప్రయాణికులు ఇప్పటికే ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారని ప్రధాని తెలిపారు. ఇప్పటికే 25 వందే భారత్ రైళ్లు నడుస్తున్నానని, ఇప్పుడు మరో 9 రైళ్లు ప్రవేశపెడుతున్నామని చెబుతూ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఈ రైళ్లు అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. ”గత చాలా సంవత్సరాలుగా పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి కాలేదనే విషయం మన అందరికీ…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టిఎస్‌పిఎస్‌సిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెల్లడించింది. మొత్తం 503 గ్రూప్- 1 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించడంతో పాటు ఫలితాలను కూడా వెల్లడించింది. అయితే గ్రూప్- 1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం లీకైనట్లు దర్యాప్తులో తేలడంతో అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి ఈ ఏడాది జూన్ 11వ తేదీన తిరిగి నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 2,33,506 మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని విడుదల చేయడంతో పాటు అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లనూ టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు…
మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైకోర్టు ఆదేశాలతో టాలీవుడ్ నటుడు నవదీ్‌పకు నోటీసులు జారీ చేశారు. సెంట్రల్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న టీ న్యాబ్ కార్యాలయంలో నవదీప్ శనివారం విచారణకు హాజరయ్యారు. టీ న్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి, ఏసీపీ నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్ రాజేష్ బృందం నవదీ్‌పను విచారించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో నవదీ్‌పకు తన స్నేహితుడు రామ్‌చంద్‌తో ఉన్న సంబంధాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డికి, రామ్‌చంద్‌కు మధ్య ఉన్న పరిచయంపై కూడా పోలీసులు వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. మరోవైపు, ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత కేపీ చౌదరితో నవదీ్‌పకు ఉన్న లింకులు కూడా పోలీసుల విచారణలో బయటపడ్డట్లు విశ్వసనీయంగా తెలిసింది. నవదీ్‌పను ప్రశ్నించిన క్రమంలో 81…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియానికి శనివారంనాడు శంకుస్థాపన చేశారు. మహదేవుని నగరంలో శివతత్వం ఉట్టిపడే డిజైన్‌తో నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని మహదేవునికే అంకితం చేయనున్నట్టు మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. కాశీలోని అంతర్జాతీయ స్టేడియ నిర్మాణంతో స్థానిక క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని చెప్పారు. పూర్వాంచల్ ప్రాంతానికే ఈ స్డేడియం తలమానికమని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేర్కొన్నారు. దీనికి ముందు స్టేడియానికి చేరుకున్న ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ప్రముఖ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, మదన్ లాల్, దిలీప్ వెంగ్‌సర్కార్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జే షా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. ‘నమో’ …
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు మూడు నెలల సమయం మాత్రమే ఉందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని పేర్కొన్నారు. అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామని వికాస్ రాజ్ వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చిరునామాల మార్పుపై ఫిర్యాదులు అందాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి 15 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. వారిలో 6.99 లక్షల మంది యువ ఓటర్లని తెలిపారు. మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామని వికాస్ రాజ్ పేర్కొన్నారు. వచ్చే నెలలో 3,4,5 తేదీల్లో ఈసీ తెలంగాణ పర్యటన ఉంటుందని, కేంద్రం, రాష్ట్రానికి చెందిన 20 ఏజెన్సీ లతో సమావేశాలు ఉంటాయని వివరించారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాలో సిబ్బందికి శిక్షణ ఉంటుంది. …