మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందగా, తాజాగా రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సుదీర్ఘంగా 10 గంటలపాటు చర్చ జరిగింది. అనంతరం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఈ బిల్లుకు అనుకూలంగా 215 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందింది. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడినట్లు అయింది. నియోజకవర్గలా డీలిమిటేషన్ అనంతరం చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 19న లోక్‌సభలో కేంద్ర…
Author: Editor's Desk, Tattva News
సైన్స్ విభాగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి గుర్తింపుగా ఇంతవరకు ప్రదానం చేస్తున్న దాదాపు 300 అవార్డులను రద్దు చేసి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ పేరున కొత్త జాతీయ అవార్డులను ప్రభుత్వం ఆవిష్కరించింది. సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఇవి అత్యున్నత గుర్తింపు కలిగిన అవార్డులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు విభాగాల్లో విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్, విజ్ఞాన్ టీమ్ అనే నాలుగు కేటగిరీల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుల ప్రదానానికి ప్రభుత్వ ప్రధాన సైన్సు సలహాదారు నేతృత్వంలో కమిటీ దేశం మొత్తం మీద 13 ప్రాంతాల నుంచి సైంటిస్టులను ఎంపిక చేస్తుంది. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను 1958 నుంచి ఇస్తున్నప్పటికీ ఇంతవరకు దేశం లోని ఏడు ప్రాంతాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేసేవారు. ఇప్పుడు సైన్స్, టెక్నాలజీలకు సంబంధించి ఏ రంగమైనా 13 కేటగిరీలలో…
భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. నిజ్జర్‌ను కెనడా భూభాగంలో భారత్ హత్య చేసిందని కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కెనడా ఆరోపణలు అన్ని రాజకీయ ప్రేరేపిత ఆరోపణలే అని భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదులు, అతివాదులకు కెనడా సురక్షిత స్వర్గథామంగా మారిందని దుయ్యబట్టింది. ఇక భద్రతాపరమైన పరిస్థితుల కారణంగానే కెనడియన్ల వీసా దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయలేక పోతున్నామని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. తమకు ఎలాంటి నిర్ధిష్ట సమాచారం అందించినా పరిశీలించేందుకు సిద్ధమని చెప్పామని, ఇప్పటివరకూ కెనడా నుంచి నిర్ధిష్ట సమాచారం, ఆధారాలు అందలేదని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి పేర్కొన్నారు. కెనడా భూభాగం నుంచి వ్యక్తుల నేర కార్యకలాపాలకు…
భారత్ కెనడాకు ఊహించని షాక్ ఇచ్చింది. కెనడా వాసులకు వీసాల జారీని భారత్ నిరవధికంగా నిలిపివేసింది. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ రేపిన చిచ్చు మరింత తీవ్రతరం దాలుస్తున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కెనడా కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, భారత్ కు చెందిన ఇంటెలిజెన్స్ హెడ్ ను తమ దేశం నుంచి బహిష్కరించడం తెలిసిందే. దీంతో భారత్ సైతం కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. దీనికి కొనసాగింపుగా భారత్ లోని కశ్మీర్లో కిడ్నాప్ లు, అల్లర్లు, అశాంతి, ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే కెనడా పర్యాటకులు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కెనడా సూచనలు చేసి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కెనడాలో మారిన పరిణామాల నేపథ్యంలో భారత సంతతి వారు తమ భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ భారత్…
చంద్రుడిపై పక్షం రోజుల చీకటి తర్వాత పగటి కాంతులు పర్చుకుంటున్నాయి. ఇది భారతదేశపు ఇస్రో చంద్రయాన్ 3కు నిజంగానే ఉషోదయం అయింది. చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రాణ స్థితి నుంచి తట్టిలేపి, తిరిగి ప్రయోగాల కార్మోన్ముఖం చేసేందుకు ఇస్రో భూ కేంద్రం నుంచి సశాస్త్రీయ ప్రక్రియలు చేపట్టారు. చంద్రుడి ఉపరితలంపై అత్యంత తీవ్రస్థాయి గడ్డకట్టిన వాతావరణంలో విక్రమ్, ప్రజ్ఞాన్‌లు నిద్రావస్థలోకి వెళ్లాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఇవి తిరిగి చంద్రుడిపై పగటి కాంతి విస్తరించుకునే పక్షం రోజుల వ్యవధిలో మునుపటి చేతనావస్థకు చేరాలి. చీకటి దశ తరువాత పదిహేను రోజులు విస్తరించుకుని ఉండే సూర్యుడి కాంతి కిరణాల సాయంతో ఈ రెండు ప్రక్రియలు తిరిగి పనిచేస్తాయి. రోవర్, ల్యాండర్‌లు వీటికి అమర్చి ఉండే పలు రకాల బ్యాటరీ ఇంధన ఛాలక పరికరాల పునఃచైతన్య ప్రక్రియను ఆరంభించినట్లు, గ్రౌండ్ స్టేషన్ నుంచి ఈ దిశలో…
కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుపై 60 ఎంపీలు మాట్లాడారు. బిల్లుపై దాదాపు 8 గంటల పాటు చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు వచ్చాయి. కొత్త పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు మరో ఎంపీ జలీల్ ఈ బిల్లును వ్యతిరేకించిన వారిలో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికల్లో అమలు కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కల అనంతరం 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలవుతుందని తెలిపారు. 2024 ఎన్నికలు పూర్తయిన తరువాత జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తరువాత డిలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. ఇవి పూర్తయిన తరువాత 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలవుతుందని చెప్పారు.…
కెనడా లోని భారతీయ హిందువులు భారత్ కు వెళ్లిపోవాలని నిషేధిత ఖలిస్థాన్ అనుకూల గ్రూప్ , సిక్స్‌ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జె) నాయకుడు, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూస్ బెదిరించాడు. ఈ మేరకు వీడియో వైరల్ అయింది. కెనడా పట్ల, ఆ దేశ రాజ్యాంగం పట్ల విధేయతను భారతీయ హిందువులు తిరస్కరించారని పన్నూన్ ఆరోపించాడు. ఖలిస్థాన్ అనుకూల సిక్కులు కెనడాకు ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్నారని, అలాగే వారెప్పుడూ కెనడా వైపు ఉంటారని, ఆ దేశ చట్టాలను రాజ్యాంగాన్ని ఎల్లప్పుడూ సమర్థించారని పేర్కొన్నాడు. “మీ గమ్యం భారత్. కెనడా విడిచిపెట్టి భారత దేశానికి వెళ్లండి” అని కెనడా లోని భారతీయ హిందువులను తాజా వీడియోలో బెదిరించాడు. కెనడాలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపించిన తరువాత ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులు వీడియోలో వైరల్ అయ్యాయి.…
ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. అనంతరం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కినేనితో తనకు ఉన్న అనుబంధాన్ని వెంకయ్య నాయుడు గుర్తుచేసుకున్నారు. ‘నాకు నాగేశ్వరరావు అంటే చాలా అభిమానం. ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోంది. ఆయనే నిల్చున్నారా అనేలా ఉంది. ఏఎన్నార్ మహానటుడు. అలాగే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి. నేను, ఆయన అనేక విషయాలపై మాట్లాడుకునే వాళ్లం. ఆఖరి రోజు వరకూ నటించిన నటుడు నాకు తెలిసి మరొకరు లేరు. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావు’ అంటూ కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడం ఆయనకు మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు. అక్కినేని నుండి స్ఫూర్తి పొంది కొంతైనా అందరూ అమలు పరిస్తే వారి జీవితాలు బాగుంటాయని వెంకయ్య నాయుడు తెలిపారు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అశ్లీలం,…
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు వల్లె వేశారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రూ. 5 లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తమ ఆరోగ్య శ్రీ పథకంగా మంత్రి ప్రచారం చేసుకోవడంపై సంగప్ప మండిపడ్డారు. తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో నారాయణఖేడ్‌లో చెక్ డ్యాంలు, నూతన చెరువులు, కాలువలు నిర్మించినట్లు హరీశ్ రావు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఇప్పటిదాకా ఒక్క కొత్త చెరువును గాని, కాలువను గాని తవ్వించినట్లయితే తాను ఎక్కడికంటే అక్కడ చర్చకు సిద్ధమని పేర్కొంటూ దమ్ముంటే రమ్మని హరీశ్ రావుకు సవాల్ విసిరారు. సిద్ధిపేటలో కట్టించిన చెక్ డ్యాంలు, చెరువులు, రంగనాయకసాగర్ నిర్మాణాలు రాష్ట్రమంతా ఉన్నట్లు హరీశ్ రావు భ్రమ పడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నారాయణఖేడ్ మారిందని విమర్శించారు. గత ఉపఎన్నికల్లో గట్టులింగంపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తామని, హెలీకాప్టర్‌ను…
దసరా నుండి విశాఖ నుండి పరిపాలన ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ సమావేశంలో మంత్రులను, అధికారులను ఆదేశించారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని నిర్ణయించారు. అలాగే ముందస్తు, జమిలి ఎన్నికలు పై కేంద్రం నిర్ణయం ప్రకారం ముందుకు వెళతామని చెబుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఈ సమావేశంలో పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని.. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రిటైరైన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలకు ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలని నిర్ణయించారు. రిటైరైన…