Author: Editor's Desk, Tattva News

జాబిల్లి ఉపరితలంపై నిద్రపోతున్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను నాలుగేళ్ల కిందట ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ఆర్బిటర్ ఫోటోలు తీసింది. ఈ ఫోటోలను తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం విడుదల చేసింది. ఇస్రో అధికారిక ఎక్స్ (ట్విట్టర్‌) లో ఈ ఫోటోలను షేర్ చేసిన ఇస్రో.. సెప్టెంబరు 6న చంద్రయాన్-2 ఆర్బిటర్ వీటిని తీసినట్టు పేర్కొంది. ‘చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు చెందిన డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చూర్ రాడార్ చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను సెప్టెంబరు 6న తీసిన ఫోటోలు ఇవి’ అని తెలిపింది. సెప్టెంబర్ 2019లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండింగ్ సమయంలో విఫలమైన విషయం తెలిసిందే. ల్యాండర్ విఫలమైనా ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్ష్య చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్‌తో ఈ ఆర్బిటర్‌ను విజయవంతంగా ఇస్రో అనుసంధానించింది. ల్యాండర్ ఫోటోలు తీసిన పరికరం గురించి ఇస్రో…

Read More

ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 దేశాల కూటమిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు కలిసి జీ20గా 1999లో ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఈ కూటమిలో ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించలేదు. జీ20 సమావేశాలు శని, ఆదివారాల్లో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మాట్లాడుతూ, అందరితో కలిసి (సబ్‌కా సాథ్) అనే భావానికి అనుగుణంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత దేశం ప్రతిపాదిస్తోందని తెలిపారు. ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నానని చెప్పారు. ‘‘మీ అంగీకారంతో…’’ అని చెప్తూ, జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్‌ ప్రవేశించినట్లు తెలియజేస్తూ, ఆయన ఓ చిన్న సుత్తితో మూడుసార్లు కొట్టారు. ‘‘మనం పని ప్రారంభించే ముందు, శాశ్వత సభ్యునిగా తన స్థానాన్ని స్వీకరించవలసినదిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్‌ను ఆహ్వానిస్తున్నాను’’…

Read More

ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నాలుగేళ్ళుగా పరిశీలిస్తున్నానని, ఆయన సమర్థుడైన క్షేత్రస్థాయి ముందు చూపు ఉన్న నేత అన రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఆయనతో గాని, ప్రగతి భవన్‌తో గాని ఎలాంటి గ్యాప్ లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా నాలుగేళ్ళ పదవీ కాలం పూర్తి చేసుకొని ఐదవ ఏట అడుగిడిన సందర్భంగా ఆమె రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ తనకు తెలంగాణ ప్రజలకు సేవ చేయడమనేదే ఏకైక లక్ష్యమని, తనకెలాంటి రాజకీయ ఎజెండా లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. తాను సవాళ్ళకు, కోర్టు కేసులకు, సోషల్ మీడియా విమర్శలకు, ప్రొటోకాల్ ఉల్లంఘనలకు భయపడే వ్యక్తిని కాదని, ఈ తరహా ప్రచారాలతో తననెవరూ కట్టడి చేయలేరని తమిళి సై తేల్చి చెప్పారు. వైద్య రంగంలో తెలంగాణలో ప్రగతి ప్రశంసనీయంగా ఉందని పేర్కొంటూ మెడికల్ కళాశాలల విషయంలో కేంద్ర, రాష్ట్ర…

Read More

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు శనివారం ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేశారు.1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులో స్పష్టం చేశారు.  చంద్రబాబు పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. అరెస్ట్ సమయంలో అర్ద్రరాత్రి నుంచి పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపో, మాపో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు.  చంద్రబాబు చెప్పినట్లుగానే శుక్రవారం అర్ద్రరాత్రి నుంచి నంద్యాలలో చంద్రబాబు మకాం చేసిన క్యాంపు వద్ద పలు ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున క్యాంపు వద్దకు చేరుకున్న పోలీసు అధికారులు బస్సులో ఉన్న చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో అరెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు…

Read More

దేశవ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురుచూసిన 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై పోరాటానికి కొత్తగా విపక్షాల ఇండియా కూటమి ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడంతో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. సెప్టెంబర్ 5న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి 3 స్థానాల్లో గెలుపొందగా, ‘ఇండియా’ కూటమి 4 స్థానాలు కైవసం చేసుకుంది. విపక్ష ‘ఇండియా’ కూటమి పక్షాలైన కాంగ్రెస్, జేఎంఎం, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ చెరో సీటు చొప్పున మొత్తం నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. త్రిపురలో ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాలో కమలనాథులు విజయం సాధించారు. బాక్సానగర్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హొస్సేన్ 30,237 ఓట్లతో గెలుపొందారు. ఆయనకు 34,146 ఓట్లు పోల్ కాగా, ఆయన సమీప సీపీఎం ప్రత్యర్థికి 3,909…

Read More

రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు విపక్ష కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రెండు డిఎన్‌ఏ ఒక్కటేనని, హిందూ వ్యతిరేకత వాటి విధానమని శుక్రవారం ఆపార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మజ్లిస్ ఆధిపత్యానికి ఓటు వేసినట్టేనని స్పష్టం చేశారు. ఈపార్టీలు ఎన్నికల తర్వాత ఒక్కటవడం ఖాయమని చెబుతూ కుటుంబ, రాచరిక పార్టీలకు, అవినీతి ప్రభుత్వాలకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఒక్క బిజెపికి మాత్రమే ఉందని తెలిపారు. గత ఐదేళ్లుగా జాతీయ రాజకీయాల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ నిర్వహించిన అన్ని సమావేశాలకు మద్దతు ఇచ్చి పాల్గొన్నదని ఆయన గుర్తు చేశారు. ప్రజలు అరాచక, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రజలు నిజాయితీతో కూడిన…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ మాగుంట కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవ ఇప్పటికే అప్రూవర్‌గా మారిపోగా ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్‌గా మారిపోయారు. తాజాగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్ మారడంతో ఆయన నుంచి ఈడీ కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిలో సౌత్‌ గ్రూపునకు చెందిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రా రెడ్డికి బెయిల్ లభించింది. ఈ కేసుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన సౌత్ గ్రూప్‌లో మాగుంట తండ్రీ కొడుకులు కీలకంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే…

Read More

లోక్‌సభ ఎన్నికలు-2024 లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నవేళ రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికలు-2024 కోసం జేడీఎస్‌తో బీజేపీ అవగాహన కుదుర్చుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటకలోని నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు. మాండ్యా, హసాన్, బెంగళూరు(రూరల్), చిక్‌బల్లాపూర్ సీట్లను జేడీఎస్ కోరుతోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2019లో ఈ నాలుగు స్థానాల్లో మూడింట బీజేపీ గెలవగా, కేవలం హసాన్‌లో మాత్రమే జేడీఎస్ గెలిచింది. జేడీఎస్ వ్యవస్థాపకుడు హెచ్‌డీ దేవే గౌడ తుమ్‌కూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక దేవెగౌడ మనువడ, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి మాండ్యా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో జేడీఎస్ 10 శాతం కంటే తక్కువ ఓటు షేరును పొందింది. ఈ ఏడాదే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీఎస్‌కి…

Read More

నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలో రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. వర్షాభావం కారణంగా ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీరు అందించలేమని తేల్చి చెప్పారు. సాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఉన్న ఆయకట్టుకు ఈ ఏడాది నీరు విడుదల కాలేదు. జలాశయాల్లోకి నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఈ సీజన్‌లో వరి వేయవద్దని కోరారు.  వాటి స్థానంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని పేర్కొంటూ సాగర్‌లో నీటిమట్టం తక్కువగా ఉన్నందున సాగునీరు రోజువారీగా విడుదల చేయడం కుదరదని స్పష్టం చేశారు.  అవసరాలకు అనుగుణంగా వారబందీని అమలు చేస్తామని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా పడితే వారబందీని రద్దు చేస్తామని వెల్లడించారు.  ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ఆగస్టులో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అంబటి కోరారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువ నుంచి నీటి ప్రవాహం…

Read More

స్వేచ్ఛ, పారదర్శకతలతో కూడిన ఇండో-పసిఫిక్‌ ప్రాంతం దిశగా సాధించాల్సిన పురోగతి, అంతర్జాతీయ పేద దేశాల వాణిని వినిపించాల్సిన ఆవశ్యకత గురించి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇవి అవశ్యమని స్పష్టం చేస్తూ ఆసియాన్‌, భారత్‌ మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవాల్సి వుందని చెప్పారు. జకార్తాలో జరిగిన ఆసియాన్‌ సదస్సులో ప్రధాని ప్రసంగిస్తూ 12 అంశాలతో కూడిన ప్రతిపాదనలనుసదస్సుకు అందచేశారు. అనుసంథానత, వాణిజ్యం నుండి డిజిటల్‌ పరివర్తన వరకు వివిధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి కేంద్రంగా ఆసియాన్‌ వుందని, భారత్‌, ఆసియాన్‌ గ్రూపుతో కలిసి పనిచేయడానికి కట్టుబడి వుందని మోదీ చెప్పారు. ”21వ శతాబ్ద ఆసియా శతాబ్దం. ఇది మన శతాబ్దం. ఇందుకోసం, మానవాళి సంక్షేమం కోసం కోవిడ్‌ అనంతర కాలంలో నిబంధనల ప్రాతిపదిక వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు. ఆసియాన్‌, భారత్‌లు విలువలను, ప్రాంతీయ సమైక్యతను, శాంతి,…

Read More