Author: Editor's Desk, Tattva News

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ ఎప్పుడూ తటస్థంగా లేదని, ఎల్లప్పుడూ శాంతి వైపే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న ప్రధాని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, ఫార్మా, వ్యవసాయం, విద్య తదితర అంశాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంశంలో భారత్‌ ఎప్పుడూ తటస్థంగా లేదని, ఎల్లప్పుడూ శాంతి వైపే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న ప్రధాని ఆ దేశ అధ్యక్ష భవనం మారిన్‌స్కీ ప్యాలెస్‌లో ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీత భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీకి విదేశాంగ మంత్రి జైశంకర్‌,జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌తో సహా ఇరుదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కోరారు.…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన పట్ల మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూలు ఎస్పీకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద లేఖ రాశారు.  నిందితులపై తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. కొండారెడ్డిపల్లెలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులు సరిత, విజయా రెడ్డి శుక్రవారం నేరెళ్ల శారదను కలిశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.  తమపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారంటూ ఈ జర్నలిస్టులు గురువారం స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి వీరిద్దరు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 150 మంది తమను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపించారు. ‘ఇక్కడ మీకేం పని?’ అంటూ తమపై దౌర్జన్యానికి దిగారని ఆ జర్నలిస్టులు…

Read More

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో  ఉన్న పిన్నెల్లికి శుక్రవారం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసిన పిన్నెల్లికి ప్రతిసారీ హైకోర్టు షాకివ్వగా.. శుక్రవారం మధ్యాహ్నం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 50 వేల రూపాయలతో రెండు పూచికత్తులు సమర్పించాలని పిన్నెల్లిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పూచీకత్తులతో పాటు.. పాస్ పోర్టును సరెండర్ చేయాలని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది. ప్రతి వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని కూడా క్లియర్ కట్‌గా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్…

Read More

కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వ‌ద్ద‌ బీజేపీ రైతు ధర్నా చేపట్టింది. ఈ ధర్నా కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడం నగేష్ తో పాటు రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభా పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ లోపు రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయకుంటే హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 60లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉంటే కేవలం 22లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం విడ్డూరమని…

Read More

వ్యాపార‌వేత్త అనిల్ అంబానీపై మార్కెట్ రెగ్యులేట‌ర్ సెబీ అయిదేళ్ల నిషేధం విధించింది. రిల‌య‌న్స్ హోం ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొంత మంది అధికారుల‌పై కూడా ఆ నిషేధం వ‌ర్తించ‌నున్న‌ది. కంపెనీకి చెందిన నిధుల‌ను అక్ర‌మంగా త‌ర‌లించిన కేసులో సెబీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అనిల్ అంబానీపై 25 కోట్ల ఫైన్ కూడా వేసింది సెబీ.  లిస్టెడ్ కంపెనీలో డైరెక్ట‌ర్ పోస్టు నుంచి కూడా ఆయ‌న్ను త‌ప్పించారు. సెబీ మొత్తం 222 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది. అనిల్‌ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ నిధులను మళ్లించారని సెబీ తమ నివేదికలో ఆరోపించింది. ఇందుకోసం కంపెనీకి చెందిన కీలక నిర్వహణాధికారులతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది.  ఆర్‌ఎఫ్‌హెచ్‌ఎల్‌ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ, వాటిని యాజమాన్యం ఏమాత్రం ఖాతరు చేయలేదని తెలిపింది. అనిల్‌ అంబానీ ఆదేశాలతోనే, కీలక అధికారులు కావాలని నిబంధనలను అతిక్రమించారని సెబీ ఆరోపించింది. 2018-19…

Read More

కాళేశ్వరం బ్యారేజీల డిజైన్‌లు/డ్రాయింగ్‌లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్‌సీ, సెంట్రల్‌ డి జైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి వెల్లడించారు. హడావుడిగా డిజైన్లు/డ్రాయింగ్‌లపై సంతకాలు చేయాలని కేసీఆర్‌, హరీశ్‌రావు, రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్‌సీ బి.హరిరాం తనపై ఒత్తిడి చేశారని ఆరోపించారు.  3 డీ అధ్యయనం తర్వాత డి జైన్లు/డ్రాయింగ్‌లు రూపొందించాల్సి ఉండగా… 2 డీ అధ్యయనం తర్వాతే వీటిని తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా నెలకొందని వెల్లడించారు.  కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణలో భాగంగా గురువారం నరేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. డిజైన్లు/డ్రాయింగ్‌లతో ముడిపడిన పలు అంశాలపై కమిషన్‌ ప్రశ్నలు సంధించింది. తమను తొందరపెట్టి, ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా ఆమోదించాల్సిన అనివార్యతను కల్పించారని నరేందర్‌రెడ్డి కమిషన్‌కు చెప్పారు.  ‘‘కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్‌ డి జైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో)కు అధిపతిగా…

Read More

జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, ఎలర్జీలు.. చాలా మందికి తరచుగా వచ్చే సమస్యలు. వీటికి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని.. అప్పటికి దాని నుంచి విముక్తి పొందుతాం. జ్వరం కానీ, జలుబు కానీ, ఏవైనా నొప్పులు గానీ, ఎలర్జీలు రాగానే.. దగ్గర్లో ఉన్న మెడికల్ షాప్‌కు వెళ్లి ఏదో ఒక మెడిసిన్ తీసుకుని వాడటం చాలా మందికి అలవాటే.  అయితే ఇలా ఏది పడితే ఆ మెడిసిన్ వేసుకుని ఉన్న రోగం నయం కావడం పక్కన పెడితే లేని కొత్త రోగాన్ని కొని తెచ్చుకోవడమే అని డాక్టర్లు, ప్రభుత్వాలు ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి. ఇక ఇలా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  రోగులకు ముప్పు తీసుకువచ్చే అవకాశం ఉన్న మందులపై నిషేధం విధించింది. ఈ క్రమంలోనే 156 రకాల ఔషధాలను నిషేధిస్తూ తాజాగా ఒక…

Read More

* ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతో శాంతిప్రతిపాదన ఏ సమస్యకు అయినా యుద్ధ రంగంలో పరిష్కారాలు దొరకవని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా ఘర్షణల నేపథ్యం, అవిరామంగా శాంతి విచ్ఛిన్నం దశలో ఆయన పోలండ్‌లో స్పందించారు. ఇది యుద్ధాల కాలం కాదని, సామరస్యపు యుగం కావాల్సి ఉందని గతంలో వెలువరించిన సందేశాన్ని మరోసారు విన్పించారు. ఉక్రెయిన్‌లో ఆయన శుక్రవారం పర్యటించనున్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఉద్రిక్తతలు ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య పోరు సాగుతోంది. మరో వైపు మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, గాజాస్ట్రిప్‌లో నరమేధం వంటి పలు హింసాత్మక సంఘటనలు దేనికి సంకేతం అని ప్రశ్నించారు. రగిలే వివాదాలను పరస్పర సంప్రదింపులు, సామరస్యంతో పరిష్కరించుకోవల్సి ఉంటుంది. యుద్ధం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదు. ఇది చివరికి సమస్యలను జటిలం చేస్తుంది. పైగా ప్రాంతీయ ఘర్షణలు విస్తరించి అంతర్జాతీయ సంఘర్షణలకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలు చోట్ల ఘర్షణలు…

Read More

తాజాగా రాజ్యసభకు 12 సీట్లకు జరిగిన ఉపఎన్నికలలో 11 సీట్లను ఏకగ్రీవంగా గెల్చుకోగలగడంతో మొదటిసారిగా ఈ సభలో ఎన్డీయేకి పూర్తి మెజారిటీ లభించనుంది. దానితో ఇప్పటి వరకు ఎన్డీయేలో భాగస్వాములు కాకపోయినప్పటికీ అన్ని బిల్లుల విషయంలో బేషరతుగా మద్దతు అందిస్తున్న వైసిపి, బిజెడిల మద్దతు బిజెపికి అవసరం లేకుండా పోతుంది. లోక్ సభలో నరేంద్ర మోదీ ప్రభుత్వ మనుగడకు టిడిపి మద్దతు కీలకంగా మారడంతో వైసీపీతో అందం తెంచుకోవలసిన పరిస్థితి బిజెపికి ఏర్పడింది. మరోవంక, ఒడిశాలో అధికారం కోల్పోయిన తర్వాత బిజెడి సహితం ఇక తమకు బిజెపికి ప్రతిపక్షంలో ఉంటామని ప్రకటించింది. రాజ్యసభలో వైసీపీకి 11, బిజెడికి 9 మంది సభ్యులు ఉన్నారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలుగా అండగా నిలిచింది. ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గరి నుంచి వ్యవసాయ బిల్లులు, ఇతర వివాదాస్పద బిల్లులకు సైతం బీజేపీ అడక్కముందే మద్దతు…

Read More

కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ తీరుపై దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధమున్న నలుగురు వైద్యులకు పాలీగ్రాఫ్‌ టెస్టు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సీబీఐ చేసిన విజ్ఞప్తిని కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యార్థినిపై అత్యాచార, హత్య ఘటన చోటుచేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న సందీప్‌ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులను సీబీఐ విచారిస్తోంది. ఈ సమయంలో సందీప్ ఘోష్‌ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది.  దీంతో ఆయనకు లై-డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగానే న్యాయస్థానం అనుమతి పొందిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. వీరికి లై డిటెక్టర్‌ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు, సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. “దేశంలో మహిళలపై…

Read More