Author: Editor's Desk, Tattva News

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై దృష్టి సారిస్తున్నది. ఇందులో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆగస్టు 27న ఖమ్మం వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ సభతోనే ఎన్నికల యుద్ధంలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. ఆగస్టు 27వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి హెలికాప్టర్లో 2 గంటల 10 నిమిషాలకు కొత్తగూడెంకు వస్తారు. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకుంటారు. 2.25 గంటల నుంచి 2.40 గంటల వరకు భద్రాద్రి రాములోరి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొత్తగూడెం నుంచి 2.55 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఆ తర్వాత ‘రైతు గోస-బీజేపీ భరోసా’లో…

Read More

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఒడిశా రైలు దుర్ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని వెల్లడించింది. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు గానీ, సర్క్యూట్ చిత్రం గానీ తీసుకోకుండానే  సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ అరుణ్‌ కుమార్‌ మహంత క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించారని ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ వివరించింది.  మహంత సమక్షంలోనే బహానగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ క్రాసింగ్‌ లెవెల్‌ గేట్‌ వద్ద మరమ్మతు పనులు జరిగాయన,  గేట్‌ నెంబరు 79 వద్ద మరమ్మతులకు ఉపయోగించిన సర్క్యూట్‌ చిత్రం ఆధారంగానే ఇక్కడ మరమ్మత్తులు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. ఈ పనులు జరుగుతున్నప్పుడు మహంత అక్కడే ఉన్నారని స్పష్టం చేసింది. కాగా.. ఈ కేసులో సీబీఐ ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒకరైన అరుణ్ కుమార్…

Read More

తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ప్రార్ధనామందిరాలు గుడి, మసీదు, చర్చిలను గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఉద్యోగుల కోసం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ఆలయాలు, ప్రార్థనా మందిరాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌తో కలిసి దర్శించుకున్నారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వాగతం తెలిపారు. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం పంపకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఆలయాల ప్రారంభోత్సవానికి గవర్నర్‌, ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి హాజరయ్యారు. వారివెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పలువురు మంత్రులు ఉన్నారు. మసీదులో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణలో మతసామరస్యం, శాంతిభద్రతలను కాపాడేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చెప్పారు. గతంలో నిజాం కాలంలో నిర్మించిన మసీదు కంటే మెరుగైన మసీదు నిర్మించామని ఆయన పేర్కొన్నారు. మూడు…

Read More

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ జైలు వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు.  దీంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. జైలులో 20 నిమిషాలపాటు గడిపారు. అనంతరం 2 లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదలయ్యారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇదీ ఒకటి.  గురువారం రాత్రి 7 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ట్రంప్‌ ఆట్లాంటాకు వెళ్లారు. ఆయన అరెస్ట్​, విడుదలకు సంబంధించిన ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం. అయితే జైలు అధికారులు ట్రంప్‌కు సంబంధించి పలు వివరాలు తీసుకున్నారు. 77 ఏండ్ల ట్రంప్‌ 6 అడుగుల 3 ఇంచ్‌ల ఎత్తు, 215 పౌండ్ల బరువు ఉన్నట్లు తమ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఆయనకు స్ట్రాబెరీ లేదా బ్లాండ్ జట్టు…

Read More

ఐదు దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్‌’ మరింతగా విస్తరించనున్నది. ప్రస్తుతం బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్‌’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే సభ్య దేశాల సంఖ్యను పెంచాలని ఈ గ్రూప్‌ నిర్ణయించింది.  దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో  రెండు రోజులపాటు జరిగిన ‘బ్రిక్స్‌’ సమ్మిట్‌లో దీని గురించి ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్‌ గ్రూప్‌లోకి ఆరు దేశాలను శాశ్వత సభ్యులుగా ఆహ్వానిస్తున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా తెలిపారు. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు ‘బ్రిక్స్‌’ గ్రూప్‌లో చేరుతాయని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఆరు దేశాల సభ్యత్వం అమలులోకి వస్తుందని అన్నారు. కాగా, ‘బ్రిక్స్‌’ సమ్మిట్‌లో పాల్గొన్న భారత ప్రధాని మోదీ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఆరు దేశాలను ఈ గ్రూప్‌లోకి ఆహ్వానించడాన్ని స్వాగతించారు. ఈ ఆరు దేశాలతో భారత్‌కు…

Read More

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2021 ఏడాదికి గాను 69వ జాతీయ పురస్కారాలను కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘పుష్పః ది రైజ్’ సినిమాలో నటనకుగానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు.  ఈ సినిమాలో ‘తగ్గేదేలే…’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్, చూపించిన మేనరిజమ్స్, ‘పుష్ప రాజ్’గా చేసిన నటన అతడిని జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. దీంతో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో సాధించలేకపోయిన జాతీయ అవార్డును టాలీవుడ్‌కు అల్లు అర్జున్ సాధించి పెట్టి చరిత్ర సృష్టించాడు. ఇక ఉత్తమ సంగీతం (పాటలు) విభాగంలో కూడా…

Read More

ఎన్నికలు సమీపిస్తున్న వేళ గద్వాల ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి గట్టి షాక్ తగలింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయనపై హైకోర్టు వేటు వేసింది. ఎంఎల్‌ఎగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించింది. రెండో స్థానంలో ఉన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణను ఎంఎల్‌ఎగా ప్రకటించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరపున గెలిచిన కృష్ణ మోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ డికె అరుణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరపిన హైకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. తప్పుడు సమాచారం ఇచ్చిన కృష్ణ మోహన్ ఎన్నికల చెల్లదని ప్రకటించింది. అంతేకాకుండా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2.5 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ డికె అరుణకు పిటిషన్ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది. 2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,415 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న డికె అరుణకు 72,155…

Read More

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ)కు ప్రపంచ వేదికగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య సభ్యత్వాన్ని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ రద్దు చేసింది. ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ వెల్లడించింది. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ‘డబ్ల్యూఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూఎఫ్‌ఐ అడహాక్‌ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం ఇచ్చింది’ అని భారత ఒలిపింక్‌ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో ఇండియన్ రెజ్లర్లు రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున పాల్గొనే వీలుండదు. సెప్టెంబరు 16 నుంచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీ జరగనుంది. అయితే ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పోటీ పడే అవకాశం లేకపోవడంతో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీపడాల్సి ఉంటుంది. భారత్ ట్యాగ్లైన్ లేకుండానే వారు ఆడాల్సి వస్తుంది. ఇటీవలే మాజీ…

Read More

బ్రిక్స్‌ కూటమిలో మరో ఆరు దేశాలు సభ్యులుగా చేరనున్నాయి. బ్రిక్స్‌ కూటమిలో మరో ఆరు దేశాల కొత్త సభ్యులను చేర్చుకోనున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా గురువారం ప్రకటించారు. ”మేము బ్రిక్స్‌లో పూర్తి సభ్యులు కావడానికి అర్జెంటీనా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా మరియు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాము. 2024 జనవరి నుండి ఆయా దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుంది ” అని రమాఫోసా జోహెన్స్‌ బర్గ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పేర్కొన్నారు.  బ్రిక్స్‌ 15వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా.. బ్రిక్స్‌ను విస్తరించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్‌ విస్తరణ సభ్య దేశాల సహకారానికి కొత్త ఉత్సాహాన్నిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తెలిపారు. ఈ విస్తరణ బ్రిక్స్‌ ఐక్యత, సహకారం సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమిలో బ్రెజిల్‌, రష్యా, చైనా, భారత్‌, దక్షిణాప్రికాలు సభ్యదేశాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

Read More

రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించినట్టు రష్యాకు చెందిన టాస్‌ న్యూస్‌ ఏజన్సీ పేర్కొన్నది. మాస్కో నుంచి సెయింట్‌ పీట్స్‌బర్గ్‌ వెళుతున్న ఒక ప్రైవేట్‌ విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్‌ రీజియన్‌లో కూలిపోయింది. ప్రమాదంలో 10 మంది మరణించారు. వీరిలో ప్రిగోజిన్‌ పేరు కూడా ఉందని రష్యా వైమానిక సంస్థ రోసావియాట్సియా నిర్ధారించినట్టు టాస్‌ వెల్లడించింది. అందులో మరణించిన ప్రయాణికుడి పేరు ప్రిగోజిన్‌ ఇంటిపేరుతో సహా సరిపోయిందని రోసావియాట్సియా తెలిపింది. ప్రిగోజిన్‌ మరణమే కనుక నిజమైతే అది ప్రమాదం కాకపోవచ్చునని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యేవ్‌జెని ప్రిగోజిన్ ఒక‌ప్పుడు హాట్ డాగ్స్ అమ్మేవాడు. క్యాట‌రింగ్ కంపెనీ న‌డిపాడు. క్రెమ్లిన్‌కు ఫుడ్‌ను స‌ర‌ఫ‌రా చేసేవాడు. పుతిన్ చెఫ్ అన్న నిక్‌నేమ్‌ను అత‌ను సంపాదించుకున్నాడు. ఓ ద‌శ‌లో పుతిన్‌కు స‌న్నిహితంగా ఉన్నారు. ఆ సమయంలోనే…

Read More