Author: Editor's Desk, Tattva News

చిరుత దాడి నేపథ్యంలో నడకదారిలో వెళ్లే యాత్రికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. యాత్రికుల రక్షణ కోసం టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యాత్రికుల భద్రతకు టిటిడి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భరోసా ఇచ్చారు.  ఇకపై కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి ఒక ఊతకర్రను ఇవ్వనున్నామని, ఘాట్‌రోడ్‌లో వెళ్లే టూవీలర్స్‌కు సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతిస్తామని,  భక్తులను గుంపులుగా పంపాలని నిర్ణయించామని తెలిపారు. నడకదారిలో సాధుజంతువులకు కూడా ఎలాంటి ఆహారం ఇవ్వొద్దని సూచించారు. ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతిస్తామని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో పిల్లను అనుమతించమని స్పష్టం చేశారు. భద్రత కోసం డ్రోన్లు కూడా వాడాలని నిర్ణయించామని తెలిపారు. భక్తులపై చిరుత దాడుల గురించి చర్చించామని,…

Read More

భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు భీభత్స పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.  హిమాచల్​ ప్రదేశ్​పై వరుణుడు మళ్లీ ప్రతాపం చూపిస్తున్నాడు! అతి భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాజా పరిణామాలతో 22మంది ప్రాణాలు కోల్పోయారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్టు సమాచారం.   శిమ్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 22మందిలో శిమ్లా నుంచే తొమ్మిది మంది ఉన్నారు! ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శివాలయం కూలి వీరు మరణించారు. వీరి మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. ఫగ్లి ప్రాంతంలో అనేక ఇళ్లు మట్టి, బురదలో కూరుకుపోయాయి. సోలన్​ జిల్లాలో క్లౌడ్​ బరస్ట్​ కారణంగా.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం సాయంత్రం సంభవించిన క్లౌడ్​ బరస్ట్​తో రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. జడోన్​ గ్రామంలో ఆరుగురిని అధికారులు రక్షించగా.. ఏడుగురు మరణించారు. వీరి వయస్సు…

Read More

ఆగ‌స్ట్ 15న ఢిల్లీలోని బ‌హిరంగ ప్ర‌దేశాలు, భ‌ద్ర‌తా సంస్ధ‌లే ల‌క్ష్యంగా పాకిస్తాన్‌కు చెందిన ల‌ష్క‌రే తోయిబా, జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర సంస్ధ‌లు విధ్వంస‌ కుట్ర‌కు తెర‌లేపాయ‌నే వార్త‌లు క‌ల‌క‌లం రేపాయి. దేశ రాజ‌ధాని ప్రాంతంలోని రైల్వే స్టేష‌న్లు, విదేశీ సంస్ధ‌లు స‌హా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో దాడుల‌కు ఉగ్ర సంస్ధ‌లు టార్గెట్‌గా ఎంచుకున్నాయ‌ని వార్తా క‌ధ‌నాలు వెల్ల‌డించాయి.  ప్ర‌ముఖ రోడ్లు, రైల్వే ఆస్తులు, ఢిల్లీ పోలీసుల కార్యాల‌యాలు, ఎన్ఐఏ ప్ర‌ధాన కార్యాల‌యం వంటి ల‌క్ష్యాల‌ను ల‌ష్క‌రే, జైషేలు ఉగ్ర దాడుల కోసం ఎంచుకున్నాయ‌ని తెలిసింది. ఉగ్ర సంస్ధ‌ల కుట్ర స‌మాచారం వెల్ల‌డికావ‌డంతో నిఘా సంస్ధ‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. నిఘా సంస్ధ‌ల హెచ్చ‌రిక‌ల‌తో ఢిల్లీ అంత‌టా భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను క‌ట్టుదిట్టం చేయ‌డంతో న‌గ‌రవ్యాప్తంగా ఢిల్లీ పోలీసులు ముమ్మ‌రంగా పెట్రోలింగ్ చేప‌ట్టి వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు.  దాదాపు 10000 మంది పోలీసులు బందోబ‌స్తు విధుల్లో ఉండ‌గా, వేయి ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ కెమెరాలు, యాంటీ డ్రోన్ సిస్ట‌మ్‌లు, ఇత‌ర నిఘా…

Read More

స్వాతంత్య్ర వేడుకల దృష్ట్యా రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు మణిపూర్‌ పోలీసులు ఆదివారం తెలిపారు. ఐదు జిల్లాల్లోని ప్రమాదకర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఇంఫాల్‌ లోయకు చెందిన కొన్ని నిషేధిత సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇంఫాల్‌ – పశ్చిమ, ఇంఫాల్‌-తూర్పు, తౌబాల్‌, బిష్ణుపూర్‌ మరియు చురచంద్‌పూర్‌ జిల్లాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు వెల్లడించాయి. 12 ఆయుధాలు, ఆరు మందుగుండు సామగ్రి, ఎనిమిది పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని మణిపూర్‌ పోలీసులు తెలిపారు. ఆగస్ట్‌ 15న జరగనున్న మార్చ్‌ ఫాస్ట్‌ కోసం బిఎస్‌ఎఫ్‌, పోలీస్‌, అస్సాం రైఫిల్స్‌ సిబ్బంది మరియు విద్యార్థులు రిహార్సల్స్‌ చేపడుతున్నాయని ప్రకటించారు. చురాచంద్‌పూర్‌ జిల్లా తురుబౌంగ్‌ ప్రాంతంలోని పీస్‌ గ్రౌండ్‌లో శనివారం రిహార్సల్స్‌ జరిగాయని అన్నారు. ఆగస్ట్‌ 15న కో ఆర్డినేటింగ్‌ కమిటీ (కార్కామ్‌) సమ్మెకు పిలుపునివ్వడంతో రాష్ట్రంలో భద్రతా…

Read More

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చింది. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి స్వామి దర్శనం కోసం నడకదారిలో వెళ్తున్న చిన్నారిపై చిరుత దాడి చేయడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తుల భద్రత విషయంలో టీటీడీ అప్రమత్తమైంది.  అయితే, మొక్కుబడి నేపథ్యంలో చాలా మంది భక్తులు నడకదారిన వెళ్తుంటారు.  చిరుత దాడి ఘటన నేపథ్యంలో కొత్తగా భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంక్షలు తీసుకువచ్చింది. అలిపిరి–తిరుమల మార్గంలో ఇకపై వంద మంది భక్తులను ఒక్కో బృందంగా దర్శనానికి తరలించాలని నిర్ణయించింది. అలాగే వారికి రక్షణగా ముందు వెనుకలా రోప్‌, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది. అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 సంవత్సరాలలోపు పిల్లలకు అనుమతి నిలిపివేసింది.  15 ఏళ్లపై బడిన భక్తులను మాత్రం అలిపిరి కాలిబాట మార్గంలో…

Read More

ప్రతిష్టాత్మకమైన ఆసియా పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ట్రోఫీని సాధించింది. శనివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్ 43 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించింది. చివరి వరకు సమరం హోరాహోరీగా సాగింది. ఒక దశలో 13 తేడాతో వెనుకబడిన ఆతిథ్య భారత్ అసాధారణ పోరాట పటిమతో మళ్లీ పైచేయి సాధించింది. కీలక సమయంలో మూడు గోల్స్ సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆట ఆరంభంలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. 9వ నిమిషంలో జుగ్‌రాజ్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసి భారత్‌కు తొలి గోల్ అందించాడు. అయితే ఈ ఆనందం భారత్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. 14వ నిమిషంలో మలేసియా ఆటగాడు అబు కమాల్ అద్భుత ఫీల్డ్ గోల్‌తో స్కోరును సమం చేశాడు. ఆ వెంటనే రహీం మలేసియాకు రెండో గోల్ అందించాడు. 28వ నిమిషంలో అమీనుద్దీన్ మలేసియాకు మరో గోల్ సాధించి పెట్టాడు. దీంతో ప్రథమార్ధంలో…

Read More

అలిపిరి నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఆరేళ్ల లక్షితను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. చిరుతదాడిలో తీవ్రంగా గాయపడిన లక్షిత మృతి చెందింది. శ్రీనివాసుడికి చెల్లించుకోవాల్సిన మొక్కును తీర్చుకోవడానికి బయల్దేరింది లక్షిత ఫ్యామిలీ. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వాసులు దినేష్, శశికళ కుటుంబం ఏడు కొండల వేంకటేశ్వర స్వామిని చూసేందుకు వచ్చారు. పదిమంది కలిసి వెళ్తున్నందున కాలినడకన కొండకు వెళ్లాని నిర్ణయించుకున్నారు. అలిపిరిలోని నడక మార్గంలో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఫ్యామిలీలో ఎప్పుడూ హుషారుగా ఉండే లక్షిత వడివడిగా అడుగులు ఆడుతూ పాడుతూ ముందుకెళ్లింది. సిసి కెమెరాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఆనందంగా అందరి కంటే చురుగా మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలా రాత్రి 11 గంటల సమయానికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకునే సరికి పాప కనిపించలేదు.…

Read More

తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో శనివారం బిజెపి మహాధర్నా నిర్వహించింది. జిహెచ్‌ఎంసితో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 23, 24వ తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు. సెప్టెంబరు 4న హైదరాబాద్లో విశ్వరూప ధర్నా ఉంటుందని ప్రకటించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తారా.. గద్దె దిగుతారా? అని ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీశ్రేణులకు ఆయన పిలుపునిస్తూ 18న అన్ని మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని, ఈ నెల 23, 24వ తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు. సెప్టెంబరు 4న హైదరాబాద్లో విశ్వరూప ధర్నా ఉంటుందని ప్రకటించారు. బిఆర్‌ఎస్…

Read More

నిబంధనలను ఉల్లంఘించిన యూజర్లపై ట్విటర్ (ప్రస్తుత x) కఠిన చర్యలకు దిగుతోంది. జూన్‌జులై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 ఖాతాలను బ్లాక్ చేసినట్టు తాజాగా ట్విటర్ వెల్లడించింది. చిన్నారులపై లైంగిక దోపిడీ, అశ్లీలతను ప్రోత్సహించేలా పోస్ట్‌లు చేసిన ఖాతాలే ఇందులో ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు మే 26 నుంచి జూన్ 25 మధ్య నెల రోజుల వ్యవధిలో 5,44,473 ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూన్న 1772 అకౌంట్లను నిషేధించినట్టు వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో జూన్ 26 నుంచి జులై 25 మధ్య కాలం లోనే 18,51,022 ఖాతాలను బ్లాక్ చేసినట్టు ట్విటర్ అప్పట్లో పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న 2865 అకౌంట్లను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. భారత్ తీసుకొచ్చిన నూతన ఐటీ చట్టాలకు అనుగుణంగా ట్విటర్ ప్రతినెలా సమ్మతి నివేదికలను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే అనైతిక చర్యలకు…

Read More

ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును ఎప్పటికీ క్లియర్‌ చేయబోనని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ఈ బిల్లుకు క్లియరెన్స్‌ ఇచ్చే చివరి వ్యక్తిని తానేనని, అందుకే ఎప్పటికీ దానిని క్లియర్‌ చేయనని తెలిపారు. అలాగే దేశమంతా నీట్‌ పరీక్ష ఉంటుందని చెప్పారు. నీట్‌ 2023లో టాప్‌ స్కోర్‌ సాధించిన అభ్యర్థులు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని రాజభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తమిళనాడులో నీట్‌ను మినహాయించాలని కోరుతూ ప్రభుత్వం తెచ్చిన బిల్లు క్లియరెన్స్‌ గురించి నీట్‌ టాపర్‌ తండ్రి గవర్నర్‌ను అడిగారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి దీనికి సమాధానమిస్తూ.. ‘నేను మీకు చాలా స్పష్టంగా చెబుతున్నా. నీట్ (బిల్లు)కు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వను. ఇది చాలా స్పష్టం. ఏది ఏమైనప్పటికీ అది రాష్ట్రపతికి వద్దకు వెళ్ళింది. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం…

Read More