Author: Editor's Desk, Tattva News

విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని, వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చురకలంటించారు. బహుశా ఆ భగవంతుడే దిగొచ్చి ప్రతిపక్షాలకు అవిశ్వాసం పెట్టమని చెప్పి ఉంటాడంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మూడు రోజులపాటు జరిగిన చర్చకు గురువారం సాయంత్రం ప్రధానమంత్రి జవాబు చెబుతూ విపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం తమకు అదృష్టమేనన్న ప్రధాని స్పష్టం చేశారు. తాము మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని విపక్షాలు నిర్ణయించాయని, అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం స్పీకర్ ఓం బిర్లా మూజువాణీ ఓటింగ్ నిర్వహించగా.. అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే లోక్‌సభలో విపక్షాలు వాకౌట్ చేయడంతో.. ఓటింగ్ లేకుండానే అవిశ్వాసం వీగిపోయింది.ఈ సందర్భంగా 2018లో ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు.…

Read More

ఇటీవల ఓ చిత్రంలోని (బ్రో) సన్నివేశాల వల్ల వివాదం చెలరేగిందని, దీని వల్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, పిల్లలు సహా వ్యక్తిగత విషయాలపై సినిమా తీస్తామని  కొందరు ప్రకటిస్తుండటం పట్ల ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లోకి మహిళలను, పిల్లలను లాగొద్దని ఆమె అభ్యర్ధించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, రాజకీయంగా ఎదుర్కోండి అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఆమె హితవు చెప్పారు.  ఆమె ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో “ఫిల్మ్ ఫ్యామిలీలో పిల్లలు పుట్టారు.. వాళ్ల తండ్రి (పవన్ కల్యాణ్) రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పిల్లలు అయినందున వారిపై దృష్టి ఉంటుంది. కానీ వారు ఇంకా పిల్లలు. రాజకీయాలతో వారికి ఏం సంబంధం?  ఏం జరుగుతుందో వారికి ఏం సంబంధం? అందుకే ఒక తల్లిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను” అంటూ ఆమె వీడియోలో విజ్ఞప్తి చేశారు.  “ఫ్యాన్స్,…

Read More

రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కరీంనగర్ బీజేపీ ఎంపి బండి సంజయ్ సవాల్ విసిరారు. గురువారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ… కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో వారికే స్పష్టత లేదని మండిపడ్డారు.  `ప్రతిపక్ష పార్టీ నాయకుడి వ్యవహారం చూసిన తర్వాత ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు. ముద్దులు పెడతారు.. ప్లైయింగ్ కిస్లు ఇస్తారు.. మరో సారి కౌగిలించుకుంటారు… ఒకసారి కన్ను కొడతారు. ఆయన వ్యవహార శైలి చూస్తే గజినీ గుర్తొస్తాడు’  అంటూ ధ్వజమెత్తారు.  `భరతమాతను హత్య చేశారంటున్నారు. భరతమాత వైపు కన్నెత్తి చూస్తే.. కళ్లు పీకి బొందపెట్టే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో లేరు’ అంటూ సంజయ్ హెచ్చరించారు.  `ఏ కాంగీ, బెంగాల్ కా దీదీ, దిల్లీ కా కేజీ, బిహార్…

Read More

పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఎపి బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద బిజెపి నేతలు గురువారం మహానిరసన కార్యక్రమం చేపట్టారు. ఒంగోలులో జరిగే నిరసన కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొంటూ నిధుల లేమి వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనుగులు జరగడంలేదని, సొంత డబ్బులు పెట్టి సర్పంచులు పనులు చేశారని, బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న గుత్తేదారులు కూడా ఇబ్బంది పడుతున్నారని, బిల్లులు రాక చిన్న గుత్తేదారులు కూడా రోడ్డున పడ్డారని, సర్పంచుల ఆత్మహత్యల పాపం సిఎం జగన్‌ది కాదా? అని పురందేశ్వరి ప్రశ్నించారు. ఏనాడైనా సర్పంచులపై జగన్ మాట్లాడారా? అని నిలదీశారు. గ్రామ సచివాలయాలు, ఆర్‌బికేలపైనే జగన్ మాట్లాడుతున్నారని, సర్పంచుల వ్యవస్థను అవమానపరుస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. గ్రామాల్లో పనుల కోసం ఇచ్చిన నిధులు…

Read More

మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చెరుకూరిరామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు విచారణకు హాజరయ్యేందుకు మరో అవకాశం కల్పించారు. ఈసారి విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని చెరుకూరిరామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజా కిరణ్‌లకు సీఐడీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 16న సీఐడీ అధికారుల ఎదుట హాజరు కావాలని రామోజీరావును ఆదేశించగా, ఆగస్టు 17న శైలజా కిరణ్‌కు హాజరుకావాల్సి ఉంది. ఈ ఏడాది జూలై 5న గుంటూరులోని సీఐడీ ఎదుట హాజరు కావాలని గతంలో వారికి సమన్లు పంపారు. అయితే ఆనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రామోజీరావు నిధులను ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు సీఐడీ విచారణలో తేలిందని  అంటున్నరు. రామోజీ రావు మార్గదర్శి నుండి పబ్లిక్ డిపాజిట్లను తన ఇతర వ్యాపార సంస్థలకు మళ్లించారు. మార్గదర్శి నుంచి ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలను సీఐడీ జప్తు…

Read More

మహిపూర్‌లో హింసను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ మణిపూర్‌లో హింస తగ్గుముఖం పడుతూ ఉందని అంటూ అగ్నికి ఆజ్యం పోయవద్దని విపక్షాలకు హితవు చెప్పారు. ‘మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు జరిగాయన్న విపక్షాల వాదనలతో నేను అంగీకరిస్తున్నాను. మణిపూర్‌లో హింస సిగ్గుచేటు. అయితే దాన్ని రాజకీయం చేయడం మరింత సిగ్గుచేటు’ అని మణిపూర్ ఘర్షణలపై మాట్లాడుతూ అమిత్ షా ధ్వజమెత్తారు. మణిపూర్‌లో రాజకీయం చేయడానికే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారని అమిత్ షా విమర్శించారు. హెలికాప్టర్ ద్వారా చురచంద్‌పూర్ వెళ్లాలని తాము ఆయనకు చెప్పామని, అయితే ఆయన అందుకు నిరాకరించి రోడ్డు మార్గం ద్వారా వెళ్లడానికి, అందుకే పోలీసులు ఆయనను అడ్డుకున్నారని చెప్పారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు తనను ఎంతగానో…

Read More

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర గురువారం నుంచి విశాఖలో ప్రారంభంకానుంది. అయితే పవన్ వారాహి యాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొన్ని నిబంధనలతో యాత్రకు అనుమతి ఇస్తామని తేల్చేశారు. నగరంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా రాకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనంపై నుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని స్పష్టం చేశారు. విశాఖ జగదాంబ జంక్షన్ లో పవన్ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే భవనాలపైకి అభిమానులు ఎక్కకుండా చూసుకోవాలని, ఆ బాధ్యత జనసేనదేనని పేర్కొన్నారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తే బహిరంగసభకు అనుమతి తీసుకున్న వారిదే బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసుల ఆంక్షల జనసైనికులు మండిపడుతున్నారు. వైసీపీ నేతల ఒత్తిడితో పోలీసులు ఆంక్షలు విధించారని ఆరోపిస్తున్నారు. మరోవంక, పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో గజమాలలు వద్దంటూ జనసేన అభిమానులకు సూచించింది. భద్రతా కారణాల దృష్ట్యా నాయకులు, శ్రేణులు…

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు సంబంధించిన డేటాను తస్కరించే చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కాలంలో ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతాలు అనేకం వెలుగుచూస్తున్న నేపధ్యంలో దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. డేటా ప్రొటెక్షన్‌ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేయాలంటే సర్వీసు ప్రొవైడర్‌ లేదా మొబైల్‌ టవర్‌ సహాయం అవసరం లేకుండా మొబైల్‌ ఫోన్‌లోని స్పీకర్‌, కెమెరా ద్వారా సంభాషణలను ట్యాప్‌ చేయడం, ఆ ఫోన్‌లోని డేటాను తస్కరించే సామర్ధ్యంతో అనేక విదేశీ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను కేవలం ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాల వినియోగానికి మాత్రమే విక్రయించాలన్న షరతు ఉందని, ఈ సాఫ్ట్‌వేర్‌ 50 నుంచి 100 కోట్ల…

Read More

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో పలు కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. సభలో బిగ్గరగా నవ్వరాదు. పత్రాలు చించకూడదు. మొబైల్‌ ఫోన్లు తీసుకురావద్దు. స్పీకర్‌కు వెన్ను చూపేలా నిల్చోవడం లేదా కూర్చోవడం చేయరాదు.  ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ శాసనసభ విధివిధానాలు, సభలో ప్రవర్తనకు సంబంధించిన కొత్త నియమాల బిల్లు 2023ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బుధవారం చర్చ జరిపిన తర్వాత ఈ బిల్లును ఆమోదించినట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్‌ సతీష్ మహానా తెలిపారు. కాగా, కొత్త నిబంధనల ప్రకారం, శాసనసభ్యులు సభలో ఎలాంటి పత్రాలను చించే వీలుండదు. అలాగే వారు మాట్లాడుతున్నప్పుడు గ్యాలరీలో ఎవరి వైపైనా చూడటం లేదా ప్రశంసించడం చేయకూడదు. సభ్యులు వంగి స్పీకర్‌ స్థానాన్ని గౌరవించాలి. ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు లేదా కూర్చున్నప్పుడు లేదా వారి సీట్ల నుంచి లేచేప్పుడు స్పీకర్‌కు వీపు చూపకూడదు. అలాగే సభలోకి ఆయుధాలు తీసుకురావడం లేదా ప్రదర్శించడం నిషేధం. సభ్యులు…

Read More

అంగళ్లు ఘర్షణల విషయంలో తనపై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అంగళ్లులో తనను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నానికి పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు. టిడిపి కేడర్‌‌పైనా దాడులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. పైగా ఇప్పుడు తనపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. అసమర్థ నాయకుడు ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఇలాగే ఉంటాయని ఫైరయ్యారు. ఈ రోజు విజయనగరంలో మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. “మమ్మల్ని చంపి రాజకీయాలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అంగళ్లు అల్లర్లపై సీబీఐతో విచారణ జరిపించాలి. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరో విచారణలో తేలాలి” అని డిమాండ్ చేశారు. ‘‘తంబళ్లపల్లి, అంగళ్లులో నాపై హత్యాయత్నం చేశారు. కానీ ఇప్పుడు నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇలాంటిది ఎక్కడా చూడలేదు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నన్ను తిరగనివ్వడంలేదు. ప్రజల తరఫున పోరాడకుండా అడ్డుకుంటున్నారు” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఒక…

Read More