ఇప్పటికే భూమి నుంచి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం దాటుకుని చంద్రుడి కక్షలోకి ప్రవేశించిన చంద్రయాన్ 3 వాహకనౌక ఇప్పుడు చంద్రుడి చుట్టూ చక్కర్ల దశకు చేరుకుంది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహించిన ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతం అయింది. ఇస్రోకు చెందిన టెలీమెట్రి ట్రాకింగ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్‌ట్రాక్) నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియకు బెంగళూరుకు సమీపంలోని బ్యాలాలూలోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (ఐడిఎస్‌ఎన్) ఆంటెన్నాల నుంచి సరైన మద్దతు దక్కింది. భూమి నుంచి చంద్రుడికి మొత్తం దూరంలో ఇప్పుడు చంద్రయాన్ ప్రయాణం మూడింట రెండొంతులు ముగిసింది. ఇప్పుడు చంద్రుడి కక్షలో ముందుకు సాగి , చంద్రుడి చుట్టూ తిరిగేందుకు శనివారం అత్యంత కీలకమైన లూనార్ ఆర్బిట్ ఇంజెక్షన్ (ఎల్‌ఒఐ)ను దాదాపు ఏడు గంటల ప్రాంతంలో నిర్వహించారు. చంద్రయాన్ 3 ఇప్పుడు పూర్తిగా చంద్రుడి గురుత్వాకర్షక శక్తికి లోనయిందని మాక్స్ ఇస్ట్రాక్…
Author: Editor's Desk, Tattva News
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్ కోర్టు ఇమ్రాన్‌ని దోషిగా తేల్చుతూ తీర్పునిచ్చింది. ఈ అవినీతి కేసుపై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి హుమయూన్ దిలావర్ ఇమ్రాన్‌ఖాన్‌కి మూడేళ్లపాటు జైలు విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. ఈ కేసులో కోర్టు తీర్పు అనంతరం శనివారం ఇమ్రాన్ అరెస్టయ్యారు. అయితే కోర్టు తీర్పును ఇమ్రాన్‌ఖాన్ ఖండించారు. ఈ కేసులో అతని తరపున వాదించే న్యాయవాదబృందం వెంటనే అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఇమ్రాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తరపున వాదించిన న్యాయవాది ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ కేసులో సాక్షులను హాజరు పరచడానికి మాకు అవకాశం ఇవ్వలేదు. వాదనలను పూర్తి చేయడానికి సమయం కేటాయించలేదు. మావైపు వాదనల్ని వినకుండానే కోర్టు తీర్పునిచ్చింది.’ అంటూ ఆరోపించారు. మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన కోర్టు అరెస్టు వారెంట్…
గత ఎనిమిదేళ్లలో కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింద దాదాపు రూ. 3వేల కోట్ల నిధులు విడుదల చేస్తే ఇప్పటి వరకు సగానికిపైగా ఖర్చు చేయకుండా దారి మళ్లించారని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఆ నిధులతో ఎంత మంది రైతులకు సాయం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల చెరువు గండిని పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలు, అకాల వరదలతో 9 ఏళ్లుగా తెలంగాణ రైతాంగం నష్టపోతుంటే పైసా ఖర్చు చేయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేయడమేంటని ప్రశ్నించారు. ఫసల్ బీమా పథకంపై వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన విమర్శలనూ సంజయ్ తిప్పికొట్టారు. ఫసల్ బీమా పథకం బాగాలేకుంటే 9 ఏళ్లుగా సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారని నిలదీశారు. ఫసల్ బీమా స్కీం కోసం…
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నటువంటి వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం మరో వారం రోజుల్లో ముగియనుండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. టీటీడీ చైర్మన్ పదవి రేసులో మొదట్నుంచి ముగ్గురు పేర్లు గట్టిగా వినిపించినప్పటికి చివరకు కీలక పదవి భూమన కరుణాకర్‌రెడ్డిని వరించింది. భూమన గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ సీఎం ఉండగా రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవిని చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ రేసులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్లు కూడా వినిపించాయి. చివరకు భూమనకు పదవి వరించింది. సీఎం వైఎస్ జగన్ తత్తగారైన వైఎస్ రాజారెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన కరుణాకర్ రెడ్డి చివరి వరకు…
కేసీఆర్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీసి ప్రభుత్వ విలీనం బిల్లుపై అయోమయం నెలకొన్నది. ఈబిల్లు పరిశీలనకు న్యాయ సలహా కోసం సమయం కావాలని గవర్నర్ కార్యాలయం ప్రకటించడంతో బిల్లు ఆమోదంపై చీకట్లు కమ్ముకున్నాయి. ఆర్టీసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి తీర్మానం చేసి 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. తాజాగా నడుస్తున్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలనే ధృడ సంకల్పంతో, ఇందుకు సంబంధించి కార్యాచరణను యుద్దప్రాతిపదికన చేపట్టి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్‌కు పంపింది. సాంకేతికపరంగా చూస్తే ఇది ఆర్ధిక పరమైన కావడంతో ఆమోదంకోసం రాష్ట్ర గవర్నర్‌కు ఇప్పటికే పంపించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ నుంచి ఆమోదం రావడం తప్పనిసరి. కాగా రెండు రోజులుగా రాష్ట్ర గవర్నర్ బిల్లుపై…
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. చేపట్టిన రాయలసీమ జిల్లాల పర్యటన పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. కడప జిల్లా పులివెందుల ఆయన నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్తత తలెత్తగా ఇప్పుడు తాజాగా అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో అలాంటి వాతావరణమే నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని అంగళ్లు గ్రామానికి చేరుకున్నప్పుడు చంద్రబాబు రోడ్ షోను వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు రాకను వ్యతిరేకిస్తూ నల్లజెండాలను ఎగురవేశారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పరస్పరం బాహాబాహికి దిగారు. దాడులకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలతో రెండు పార్టీలకు చెందిన కొందరికి గాయాలయ్యాయి. కొందరికి తలలు పగిలాయి.…
జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) శాస్త్రీయ సర్వేపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తవ్వకాలు లేకుండా, నిర్మాణానికి నష్టం వాటిల్లకుండా మొత్తం సర్వేను పూర్తి చేస్తామని ఏఎస్‌ఐ స్పష్టం చేసినట్లు ధర్మాసనం తెలియజేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీకి చుక్కెదురైంది. ఏఎస్‌ఐ శాస్త్రీయ సర్వేను నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వలేమని దేశ అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) నిపుణులు శుక్రవారం నుంచి ఈ సర్వేను ప్రారంభించారు. కాశీ విశ్వనాథుడి ఆలయానికి పక్కనే ఉన్న ఈ మసీదును.. హిందూ ఆలయం స్థానంలో నిర్మించారని, శాస్త్రీయ సర్వే నిర్వహించి ఈ విషయాన్ని తేల్చాలని…
బాంబే హైకోర్టు న్యాయమూర్తి రోహిత్ డియో శుక్రవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా తాను పని చేయలేనని ఆయన అన్నారు. బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌కు న్యాయమూర్తిగా ఉన్న రోహిత్ డియో, శుక్రవారం ఉదయం కోర్టులో అందరి ముందు తన రాజీనామా విషయాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. ‘నేను రాజీనామా సమర్పించా. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నా. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నేను పని చేయలేను. మీరు కష్టపడి పని చేయండి’ అని కోర్టులో ఉన్న న్యాయవాదులతో ఆయన చెప్పారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్టు తెలిపారు. రాష్ట్రపతి ముర్ముకు రాజీనామా లేఖను పంపినట్లు వెల్లడించారు. కాగా, తన రాజీనామాకు ఎలాంటి కారణాలను న్యాయమూర్తి రోహిత్ వెల్లడించలేదు. అయితే కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించడంపై న్యాయవాదులకు క్షమాపణలు చెప్పారు. ‘కోర్టుకు హాజరైన వారికి, ప్రతి ఒక్కరికి నేను క్షమాపణలు చెబుతున్నా. మీరు బాగుపడాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని…
రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై సభలో గందరగోళం కారణంగా రాజ్యసభ శుక్రవారం ఎలాంటి కార్యకలాపాలు జరపకుండానే వాయిదా పడింది. తొలుత సభ ప్రారంభం కాగానే అధికార పక్ష సభ్యులు రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చ జరగాలని పట్టుబట్టగా, ప్రతిపక్ష సభ్యులు ‘మణిపూర్, మణిపూర్’ అంటూ నినాదాలు చేయసాగారు. ఇరు పక్షాలు కూడా తాము లేవనెత్తిన అంశాలపైనే చర్చ జరగాలని పట్టుబట్టడంతో చైర్మన్ జగదీశ్ ధన్‌కర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే అధికా పక్ష సభ్యులు రాజస్థాన్‌లో మైనర్ బాలిక హత్య ఘటనను ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సభ చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో 14 ఏళ్ల బాలికను హత్యచేసిన అనంతరం బొగ్గు బట్టీలో తగులబెట్టిన విషయం తెలిసిందే. ఆ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని కూడా స్థానికులు అంటున్నారు. రాజస్థాన్‌లో పరిస్థితి చాలా…
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే విధించింది. ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. అలాగే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు వీలు కల్పించింది. శిక్షపై స్టే కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీఎస్ నరసింహ, సంజయ్ కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రాహుల్‌ను దోషిగా నిర్ధారించడం విస్తృతమైందని, ఇది ఒక వ్యక్తిపైనే కాకుండా ఎన్నుకున్న ఓటర్ల హక్కుపై కూడా ప్రభావం చూపుతుందని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ట్రయిల్ కోర్టు గరిష్ఠ శిక్షను విధించడంపైనా ధర్మాసనం సంశయం వ్యక్తం చేసింది. అలాగే మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని రాహుల్ గాంధీకి కూడా చురకలు వేసింది.…