ఆంధ్ర ప్రదేశ్ లో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, ఎక్కడా శాంతి కనిపించదని, భద్రత వినిపించదని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ధ్వజమెత్తారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పాలన 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన ‘జనసంపర్క్ అభియాన్’లో భాగంగా శ్రీకాళహస్తిలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో నప్రసంగిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు మోదీ నిరంతరం శ్రమిస్తుంటే.. ఆంధ్రలో మాత్రం దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని విమర్శించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే… అది వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని నడ్డా స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలను మోదీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఎండగడుతుందని హెచ్చరించారు. ల్యాండ్, ఇసుక, మద్యం, విద్య, వైద్యం అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ ఆయన ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం నడుస్తోందంటే జగన్ దిగజారుడు పాలనకు ఇంతకన్నా ఏమి నిదర్శనం…
Author: Editor's Desk, Tattva News
కేంద్ర ప్రభుత్వానికి రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోకపోతే ఈ ఏడాది జరిగే ఏషియన్ గేమ్స్‌ను బాయ్‌కాట్ చేస్తామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పోటీల్లో పాల్గొనేదే లేదని తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారానికిజూన్ 15 వరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమయం ఇచ్చారని, తర్వాత ఏం చేయాలన్న దానిపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తాము రోజు రోజుకూ మానసికంగా ఎంత తీవ్రంగా బాధపడుతున్నామో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని ఆరోపించారు. ఈ మేరకు హర్యాణాలోని సోనిపట్‌లో రైతులు నిర్వహించిన ఖాప్ పంచాయత్‌లో పాల్గొన్న రెజ్లర్లు స్పష్టం చేశారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగాట్ కూడా ఈ ఖాప్ పంచాయత్‌కు హాజరయ్యారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలకు సంబంధించిన విషయాలను ఖాప్ పంచాయత్ లో రైతులతో పంచుకుంటామని బజ్‌రంగ్ పూనియా వెల్లడించారు.…
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే కార్యక్రమం సందర్భంగా పార్టీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ అధినేత శరద్ పవార్ నియమించారు. వారిలో ఒకరు తన కూతురు సుప్రియా సూలె కాగా, మరొకరు సీనియర్ నేత ప్రఫుల్ పటేల్. పార్టీలో మరో ప్రధాన అధికార కేంద్రమైన అజిత్ పవార్ సమక్షంలోనే శరద్ పవార్ ఈ ప్రకటన చేయడం విశేషం. అజిత్ పవార్, సుప్రియా సూలె మధ్య ఎన్సీపీపై ఆధిపత్య పోరు నడుస్తోందన్న వార్తల నేపథ్యంలో శరద్ పవార్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. సుప్రియ సూలె, ప్రఫుల్ పటేల్ లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా నియమించాలన్న నిర్ణయంలో అజిత్ పవార్ కూడా ఒక భాగస్వామేనని శరద్ పవార్ తెలిపారు. దశాబ్దాల అనుబంధం ఉన్న కాంగ్రెస్ ను వీడి, ఎన్సీపీ ని స్థాపించిన నాటి నుంచి.. గత 24…
మువ్వన్నెల జెండాల రెపరెపల నడుమ భారతీయ నౌకాదళం ఇటీవలే అరేబియా సముద్రం వేదికగా తన పోరాట పటిమను చాటుకుంది. విన్యాసాలకు దిగింది. నౌకాదళానికి చెందిన రెండు యుద్ధవిమాన వాహకాలు, వీటిపై 35కు పైగా పోరాట పటిమల యుద్ధ విమానాల ప్రదర్శనతో ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని స్థాయి మెగా ఆపరేషన్ చేపట్టింది. ఈ విషయాన్ని భారతీయ నౌకదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపారు. నిర్థిష్టంగా ఈ శక్తిసామర్థ ప్రదర్శన ఎప్పుడు ? ఏ నిర్థిష్ట ప్రాంతంలో జరిగిందనేది అధికార వర్గాలు వెల్లడించలేదు. అయితే బహుళ సంఖ్యలో యుద్ధ నౌకలు. జలాంతర్గాములు, 35కు పైగా క్షేత్రస్థాయి యుద్ధ విమానాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ మధ్య కాలంలో పొరుగున ఉన్న శక్తివంతమైన చైనా తరచూ హిందూ మహాసముద్రంలో తన దూకుడును పెంచడం, పలుసార్లు ఈ దిశలో తమ అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను, సబ్‌మెరైన్‌లను ఈ ప్రాంతంలో తిప్పడం వంటి పరిణామాల…
గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటిఎస్) భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. పోర్బందర్ పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్ గుట్టు రట్టు చేసింది. ఓ మహిళతో సహా నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఓ విదేశీయుడికి సంబంధించిన ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ నలుగురూ ఐసిఎస్ మాడ్యూల్ లో భాగమేనని అందిన సమాచారం మేరకు ఏటిఎస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నిందితులు ఏడాది నుంచి ఈ సంబంధాలు కొనసాగిస్తున్నారని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. దేశం విడిచి వెళ్లడానికి, ఐసిఎస్ ఉగ్రవాద సంస్థలో చేరడానికి వీరు వ్యూహం పన్నినట్టు తేలింది. నిందితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి చివరకు అరెస్టు చేయగలిగారు. డిఐజి దీపన్ భద్రన్, ఎస్పీ సునీల్ జోషి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో సుమేర అనే మహిళతోపాటు ముగ్గురు పురుషులను పోర్బందర్ పట్టణంలోశుక్రవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి అనేక నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌లో…
అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన పిల్లలు నలుగురూ దొరికారని కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో ప్రకటించారు. పిల్లలంతా క్షేమంగా ఉన్నారని ఆయన వెల్లడించడంతో దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. వందలాది మంది సైనికులతో చేపట్టిన ఆపరేషన్ హోప్ ముగిసిందని, సైనికులతో పాటు పిల్లలను వెతికేందుకు స్వచ్చందంగా అడవుల్లోకి వెళ్లిన వారికి ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన పిల్లల ఫొటోతో ట్వీట్ చేశారు. 40 రోజుల తర్వాత పిల్లలంతా క్షేమంగా దొరకడంతో దేశమంతా సంతోషం వ్యక్తమవుతోందని అందులో పేర్కొన్నారు. పిల్లలు దొరికిన విషయాన్ని వారి తాతయ్య కూడా నిర్ధారించారు. వారిని వెంటనే ఇంటికి తెచ్చేసుకోవడానికి అర్జెంటుగా తనకో విమానం కానీ, హెలికాప్టర్ కానీ కావాలని ఫిడెన్సియో వాలెన్సియా చెప్పారు. మే నెల 1వ తేదీన ఈ నలుగురు పిల్లలూ ప్రయాణిస్తున్న చిన్న విమానం అమెజాన్ అడవుల్లో కూలిపోయింది. అందులో పైలట్, ఆ పిల్లల తల్లి, మరొక బంధువు.. మొత్తం ముగ్గురూ చనిపోయారు. పిల్లలు…
బిపార్జోరు తుఫాను రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) శనివారం వెల్లడించింది. ఈ తుఫాను ప్రస్తుతం గోవాకు పశ్చిమాన 690 కిలోమీటర దూరంలో, ముంబైకి పశ్చిమ – నైరుతి దిశలో 640 కిలోమీటర్ల దూరంలో, గుజరాత్‌లోని పోర్‌బందర్‌కి 640 కిలోమీటర్ల దూరంలో దక్షిణ నైరుతి దిశలో ఉన్నట్లు ఐఎండి వెల్లడించింది. ఈ తుఫాను కారణంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నట్లు ఐఎండి పేర్కొంది. దీంతో తీర ప్రాంతాలైన కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశముందని ఐఎండి హెచ్చరించింది. ఈ తుఫాను వల్ల అరేబియా సముద్ర తీరంలోని గుజరాత్ వల్సాద్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన తితాల్ బీచ్‌ని జూన్ 14 వరకు మూసివేయనున్నట్లు వల్సాద్ తహసీల్దార్ టిసి పటేల్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పటేల్ మీడియాతో మాట్లాడుతూ ‘తుఫాను కారణంగా మేము…
ఒడిశా రైలు ప్రమాద ఘటన బాలాసోర్ ప్రజలను వెంటాడుతోంది. ప్రమాద దృశ్యాలు, మృతదేహాలు ఇంకా వారి కళ్ల ముందే కదలాడుతున్నాయి. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో 288 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. మృతదేహాలను భద్రపరిచేందుకు అక్కడికి సమీపంలోని బహానగా ప్రభుత్వ పాఠశాల గదిని తాత్కాలిక శవాగారంగా మార్చారు. రెండు రోజుల తర్వాత భువనేశ్వర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, త్వరలో పాఠశాలలు పున:ప్రారంభం కానున్న తరుణంలో ఆ స్కూల్‌కు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కూడా పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. మృతదేహాలను వరుసగా భద్రపరిచిన దృశ్యాలే తమ కళ్ల ముందు కదలాడుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాల భవనాన్ని కూల్చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఐతే ఇది జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే మృతదేహాలు ఉంచిన పాఠశాలకు రావడానికి విద్యార్ధులు బయపడుతున్నట్లు వారి తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చనిపోయిన వారి…
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్న సిట్ ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 36 మంది నిందితుల వివరాలను ఇందులో పేర్కొంది. 98 పేజీల చార్జ్‌షీట్‌లో 49 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రస్తావించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టు సిట్ వివరించింది. న్యూజిలాండ్‌లో ఉన్న ఒక నిందితుడు మినహా 49 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. అరెస్ట్ అయిన వారిలో 16 మంది దళారులు కాగా మిగతా వాళ్లు వివిధ పరీక్షలు రాసిన వారిగా తెలిపింది. ఏఈఈ ప్రశ్నపత్రం లీకైన తర్వాత 13 మందికి, డీఏవో పేపర్ 8మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ నలుగురికి చేరినట్లు గుర్తించినట్లు ప్రకటించింది. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతుల మారిన నగదు వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. మరికొంత మందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ…
“తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు.. కమ్యూనిస్టుల పనైపోయింది. సూది దబ్బడం పార్టీలని అవమానించిన వారి పంచనే చేరిన సిగ్గు, శరంలేని పార్టీల నేతలు కమ్యూనిస్టులు” అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బిజెపి సింహంలాంటి పార్టీ అని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. ఈ నెల 15న జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిందుకు శుక్రవారం ఖమ్మం వచ్చిన ఆయన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. “ఖమ్మంలో బిజెపి సత్తా ఏందో “నిరుద్యోగ మార్చ్” ద్వారా చూపించాం. రేపు అమిత్ షా సభను సక్సెస్ చేసి మరోసారి దమ్ము చూపిస్తాం” అంటూ భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన…