Author: Editor's Desk, Tattva News

అత్యాచార బాధితురాలి జాతకాన్ని పరిశీలించాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్‌ మండిపడ్డారు. విదేశాల్లో ఉన్న ఆయన అలహాబాద్‌ ఆదేశాల గురించి తెలుసుకుని, ఈ అంశంపై మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించినట్లు సుప్రీంకోర్టులోని ఉన్నత వర్గాలు మీడియాకు తెలిపాయి. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కావడంతో పాటు శనివారం, ఆదివారం కేసుల విచారణ జరగనప్పటికీ సిజెఐ స్పందించడం విశేషమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో శనివారం న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, పంకజ్‌ మిథాల్‌లు మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసిందని ఫిర్యాదు దారు తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ ఆదేశాలు సమస్య నుండి తప్పించే విధంగా ఉన్నాయని, కేసుకి, దీనికి సంబంధం ఏమిటని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం…

Read More

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదంలో మూడు రైళ్లు ఢీకొనలేదని, లేవలం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైందని రైల్వే బోర్డు ఆపరేషన్, బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యురాలు జయ వర్మ సిన్హా స్పష్టం చేశారు. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఆమె తెలిపారు. ముడి ఇనుముతో ఉన్న గూడ్స్‌ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో తీవ్రత ఎక్కవైందని ఆమె చెప్పారు. ఒడిశాలోని బహనగ బజార్ స్టేషన్‌లో నాలుగు రైల్వే లైన్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో రెండు స్ట్రెయిట్ మెయిన్ లైన్స్ అని, మిగిలిన రెండూ ఇరువైపులా ఉన్న లూప్ లైన్స్ అని చెప్పారు. మెయిన్ లైన్స్ రెండూ లూప్ లైన్లకు మధ్యలో ఉన్నాయని, ఏదైనా రైలును ఈ స్టేషన్లో ఆపాలంటే లూప్ లైన్‌లో ఆపుతామని చెప్పారు. ఈ ప్రమాదం జరిగినపుడు రెండు మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయని ఆమె వివరించారు. ఆ…

Read More

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఆనంద్‌ అలియాస్‌ కటకం సుదర్శన్‌ మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సుదర్శన్‌ స్వస్థలం ఆదిలాబాద్‌  జిల్లా బెల్లంపల్లిలోని కన్నాలబస్తి. వరంగల్‌లో పాలిటెక్నిక్‌ విద్యను అభ్యసించిన ఆయన కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్శితులయ్యారు. దీంతో 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో గడుపుతున్నారు. మావోయిస్టు పార్టీలో అంచలంచలుగా ఎదిగిన ఆయన సెంట్రల్‌ కమిటీ  మెంబర్‌గా ఉన్నారు. ఆయనను ఆనంద్‌, మోహన్‌, వీరేందర్‌జీ అని వివిధ పేర్లతో పిలుస్తారు. సుదర్శన్‌పై హత్య కేసు సహా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 17 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. రెండేండ్ల క్రితం ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్‌ హస్తం ఉన్నది. ఈ దాడిలో 70 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఇక గత నెల 28న ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నాయకులపై జరిగిన…

Read More

2018లో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకొని, కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలలో అధికారాన్ని పంచుకోవడానికి స్వస్తి పలికిన తర్వాత  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొదటిసారిగా శనివారం రాత్రి బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డలతో భేటీ జరపడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కలకలం రేపుతున్నది. ఐదేళ్ల క్రితం తెంచుకున్న పొత్తులకు రెండు పార్టీలు తిరిగి తెర ఎత్తుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, ఇవి ప్రాధమిక చర్చలే అని, ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదని రెండు పార్టీల నేతలు స్పష్టం చేతున్నా రెండు రాస్త్రాలలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే వారి భేటీ జరిగిన్నట్లు మాత్రం స్పష్టం అవుతున్నది.  మరికొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల పొత్తులపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ బిజెపి నేతలు అమిత్‌ షా, జెపి నడ్డాతో సమావేశం కావడం, అంతకముందు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..…

Read More

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం పది గంటల సమయంలో ఆయన సీబీఐ ఆఫీసుకు వచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రశ్నించారు. సీబీఐ ఆఫీసుకు వచ్చిన వెంటనే ఆయన వద్ద ఉన్న ఫోన్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని, విచారణ పూర్తయ్యాక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని ప్రధానంగా వివేకా హత్య జరిగిన రోజున చేసిన వాట్సాప్ కాల్స్ వివరాల గురించి ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కోర్టులోనూ ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది సీబీఐ. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడంతో అవినాష్ రెడ్డికి అరెస్ట్ చేస్తారనే ఉద్రిక్తత లేకపోయింది. అందుకే ఈ సారి హైదరాబాద్ సీబీఐ ఆఫీసు వద్ద పెద్దగా ఆయన అనుచురుల గుమికూడలేదు. గతంలో సీబీఐ చెప్పిన ప్రకారం 6 అంశాలకు సంబంధించి అవినాశ్ రెడ్డి నుంచి స్పష్టత…

Read More

రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు చికిత్స, మృతదేహాలను వారి కుటుంబాలకు చేరవేయడంతోపాటు అత్యవసరంగా ట్రాక్ పునరుద్ధరణ పనులపై దృష్టిపెడుతున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా గాయపడినట్టు అధికారికంగా వెల్లడించారు. కాగా, అనేక ప్రతిపక్ష పార్టీలు కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో వైష్ణవ్ ఇది రాజకీయం చేయాల్సిన సమయం కాదని ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఈ పెను విషాదానికి సంబంధించి ప్రతిపక్షాలు రైల్వే మంత్రిని తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘ప్రస్తుతం నా దృష్టి అంతా రెస్క్యూ రిలీఫ్‌పై పెట్టాలి.’ అని అశ్విని వైష్ణవ్‌ బదులిచ్చారు. ‘రైలు ప్రమాదంపై విచారణ జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాము. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ని పిలిపించి, ఆయనతో కూడా విచారణ జరిపి ప్రమాదానికి గల…

Read More

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోదీ… రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని, ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమన్న మోదీ ఈ ఘటనలో చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. బాలాసోర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను స్వయంగా కలుసుకున్నానని, వారికి అన్నివిధాల వైద్యసాయం అందించి ఆదుకుంటామని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని, ఏ ఒక్క కోణం వదలి పెట్టకుండా సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఈ ఘటనకు కారణకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.…

Read More

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక రూపొందించింది. సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఆ నివేదికలో వెల్లడించింది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిందని వివరించింది. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని ప్రాథమిక రిపోర్ట్ తేల్చింది. ఈ మానవతప్పిదం కారణంగానే గూడ్స్ ట్రైన్ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశించిందని, 3 రైళ్లు ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని సీనియర్ అధికారులతో కూడిన నిపుణుల బృందం తేల్చిందని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. మరోవైపు ప్రమాదం జరిగిన లైన్ పాక్షికంగా తుప్పుపట్టి ఉందని నిర్ధారణ అయ్యింది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి పొరపాటున సిగ్నల్ రావడంతో శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో బాలాసోర్‌లోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. గంటకు 120 కిలోమీటర్ల…

Read More

ఒడిశాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. మరో 900 మంది గాయపడగా.. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశ ఉందని పేర్కొన్నాయి. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవలి దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని భావిస్తున్నారు. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది తొలుత బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంతపూర్ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. దీంతో పలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయి. ఈ సమయంలో వచ్చిన షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ వాటిని ఢీకొట్టింది.…

Read More

రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరన్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న భారత మహిళా రెజ్లర్లకు 1983లో క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ జట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీలో భారతదేశపు ఛాంపియన్‌లు అయిన మహిళా రెజ్లర్లను మ్యాన్‌ హ్యాండిల్‌ చేసిన తీరును చూసి మేం చాలా వేదనకు, వ్యాకులతకు గురయ్యాం. ఎంతో కష్టపడి సాధించిన పతకాలను వారు గంగానదిలో పడేయాలనే ఆలోచనకు రావడం ఎంతో బాధపెట్టింది. ఎందుకంటే ఆ పతకాల్లో ఏళ్ల తరబడి చేసిన శ్రమ, త్యాగాలు, సంకల్పం దాగి ఉంటుంది. అంతేగాక వారు గెలిచిన పతకాలు వారికే కాదు, దేశానికే గర్వకారణం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తాము రెజ్లర్లను కోరుతున్నాం. వారి సమస్య సాధ్యమైనంత త్వరలో పరిష్కారమవుతుందని భావిస్తున్నాం.’…

Read More