Author: Editor's Desk, Tattva News

మానవతా దృష్టితో 200 మంది భారతీయ జాలర్లు, మరో ముగ్గురు పౌర ఖైదీలను విడుదల చేస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిల్వాల్ భుట్టో జర్దారీ ప్రకటించారు. గత నెల పాకిస్థాన్ కరాచీ జైల్లో మగ్గుతున్న 198మంది భారతీయ జాలర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. పాక్ సముద్ర జలాల్లో చేపలు పడుతున్నారన్న ఆరోపణపై వీరిని అరెస్టు చేశారు. వారిని వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించారు.‘ ఇప్పుడు 200 మంది భారత జాలర్లు, మరో ముగ్గురు పౌర ఖైదీలను పాక్ విడుదల చేస్తోంది. ఇంతకు ముందు మే 12న 198 మంది భారత జాలర్లను భారత్‌కు అప్పగించడం జరిగిందని భుట్టో జర్దారీ ఒక ట్వీట్‌లో తెలిపారు. మానవతా అంశాలను రాజకీయం చేయరాదన్న పాక్ విధానానికి అనుగుణంగా వీరిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా భారత ఖైదీలను విడుదల చేయడాన్ని కరాచీనుంచి లాహోర్‌కు వారి ప్రయాణ ఖర్చుల కోసం నిధులను అందజేస్తున్న…

Read More

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైందని, ఈనెల 14 నుంచి పవన్ వారాహి వాహనం రోడ్డెక్కుతుందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పీఏసీ సభ్యులతో నాదెండ్ల మనోహర్ సమావేశమై పవన్ పర్యటనపై చర్చించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… వారాహి వాహనం ద్వారా యాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. జనసేన యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారైందని తెలిపారు. తొలి విడతగా తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు. అన్నవరం క్షేత్రంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. ప్రారంభ యాత్ర అన్నవరం నుంచి భీమవరం వరకు సాగుతుందని… ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో పవన్ తొలివిడత యాత్ర సాగుతుందని నాదెండ్ల వెల్లడించారు. యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో కార్యక్రమాలు ఉంటాయని…

Read More

వైఎస్సార్‌ యంత్ర సేవా-పథకం మెగా మేళా-2 ను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌ వద్ద ట్రాక్టర్లు, కం­బైన్డ్‌ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్‌ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సిఎం బటన్‌ నొక్కి నేరుగా జమచేశారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తున్నారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను సిఎం పంపిణీ చేశారు. రూ. 361 కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్‌ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సిఎం జగన్‌ పంపిణీ చేశారు. సిఎం జగన్‌ మాట్లాడుతూ రైతులకు…

Read More

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు  జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులు అర్పించారు. ఒకసారి పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్తానాన్ని తలచుకుందామని, భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామని పేర్కొన్నారు.  ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభసందర్భంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం” అని తెలిపారు.ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్రాప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు. 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైందని, దారుణమైన అణచివేతకు గురైందని పేర్కొన్నారు. 1971…

Read More

అలుపెరగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, కేవలం ఒక్క కుటుంబం, పార్టీ ద్వారానే తెలంగాణ రాలేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సకలజనులు పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, ఆనాడు బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున గోల్కండ కోటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకం ఆవిష్కరించి ప్రారంభిస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌లో గట్టిగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది అని పేర్కొంటూ తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని.. 1200 మంది అమరులయ్యారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ…

Read More

భారత్, నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయ శిఖరాలంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని, సరిహద్దు అంశాలను ఇదే స్ఫూర్తితో పరిష్కరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం భారత్ కు వచ్చిన నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు. తర్వాత ఇద్దరు నేతలు కలిసి మీడియాకు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు వర్చువల్​గా వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని “సూపర్ హిట్” చేయడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. సరిహద్దు పెట్రోలియం పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ విస్తరణ, ఇంటిగ్రేటెడ్ చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల అభివృద్ధి, జలవిద్యుత్‌‌‌‌‌‌‌‌లో సహకారం తదితర ఏడు అగ్రిమెంట్లపై సంతకాలు చేశారు. వీటిలో ఇండియా–నేపాల్ ట్రాన్స్​పోర్ట్ సవరణ ఒప్పందం కూడా ఉంది. ఇండియాలోని రుపైదిహా, నేపాల్‌‌‌‌‌‌‌‌లోని నేపాల్‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌లో ఇంటిగ్రేటెడ్ చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులను, బీహార్‌‌‌‌‌‌‌‌లోని బత్నాహా నుంచి నేపాల్…

Read More

ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడానికి రౌస్ అవెన్యూ కోర్టు గురువారం అనుమతించింది. ఈ మేరకు శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను స్పెషల్ జడ్జి ఎంకె నాగ్‌పాల్ అనుమతించారు. ‘ఈ కేసు గురించి స్వచందంగా వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కేసులో అప్రూవర్‌గా ఉండాలనుకొంటున్నాను’ అని శరత్‌చంద్రారెడ్డి తన దరఖాస్తులో పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డికి ఇటీవల ఢిల్లీ హైకోర్టు వైద్య కారణాలపై బెయిలు మంజూరు చేసింది. హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా అధినేత అయిన శరత్ చంద్రారెడ్డి వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ ఏర్పాటు చేసుకుని అవినీతి మార్గంలో సొమ్ము కూడగట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అభియోగాలు చేసింది. దీంతో పాటుగా నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు…

Read More

రెండు తెలుగు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం,- విజయవాడ,- తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం ,- విజయవాడ, కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కలిసి లేఖలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి…

Read More

మ‌ణిపూర్‌లో చెల‌రేగిన హింస‌పై జుడిషియ‌ల్ విచార‌ణ‌కు కేంద్రం ఆదేశించింది. ప్ర‌త్యేక సీబీఐ బృందం చేప‌డుతున్న విచార‌ణ‌ను ప‌ర్య‌వేక్షించేందుకు హైకోర్టు రిటైర్డ్ జ‌డ్జీ నేతృత్వంలో ఓ క‌మిటీని నియ‌మించిన‌ట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న వ‌ర్గ పోరును ద‌ర్యాప్తు చేసేందుకు ప‌లు ఏజెన్సీలు ఇప్ప‌టికే ప‌నిచేస్తున్నాయ‌ని, ఆరు సంఘ‌ట‌న‌ల్లో కుట్ర ఉన్న‌ట్లు సీబీఐ ఉన్న‌త స్థాయి ద‌ర్యాప్తులో తేలింద‌ని, అయితే విచార‌ణ నిష్ప‌క్ష‌పాతంగా నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని షా తెలిపారు. మ‌ణిపూర్ సంక్షోభాన్ని చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్క‌రించే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. సుమారు నెలరోజులుగా అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్ లో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న అమిత్ షా గురువారం మీడియాతో మాట్లాడుతూ మ‌ణిపూర్‌లో హింస‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. హింస‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్రం రూ. 5 ల‌క్ష‌లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ 5 లక్షలు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్…

Read More

పేదోళ్లను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానం అని ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులూ పేదలను తప్పుదారిపట్టిస్తూ అణిచివేతకు పాల్పడిందని విమర్శించారు. ‘‘పేదరికాన్ని నిర్మూలిస్తామని 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా పేదరికాన్ని ఎందుకు రూపుమాపలేదు? అబద్ధాలు చెప్పి మోసం చేయడమే కాంగ్రెస్ పని. రాజస్థాన్ ప్రజలు కూడా కాంగ్రెస్ విధానాలతో నష్టపోయారు” అని మోదీ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టిన నెలరోజుల ప్రచార కార్యక్రమాన్ని బుధవారం రాజస్థాన్ లోని అజ్మీర్ ర్యాలీలో పాల్గొని ప్రధాని ప్రారంభించారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్, ఇతర ప్రజలు దేశ ప్రజలను, ఆ భవన నిర్మాణంకోసం శ్రమించిన 60,000 మంది కార్మికులను అవమానంపై గురిచేసిందని ప్రధాని మండిపడ్డారు. భారత దేశం సాధిస్తున్న విజయాలను…

Read More