పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్ కు లెప్టోస్పైరోసిస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు శనివారం నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రొటీన్ చెకప్ కోసం బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు, వైద్య పరీక్షలు నిర్వహించగా, లెప్టోస్పిరోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలింది. లెప్టోస్పైరోసిస్ ఇన్ఫెక్షన్ బారిన పడిన ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్ కు యాంటీబయాటిక్స్ తో చికిత్స ప్రారంభించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన గణనీయంగా కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఫోర్టిస్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఆర్కే జస్వాల్ తెలిపారు. కాగా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్ కు ప్రమాదకర ఇన్ఫెక్షన్ సోకడంపై రాష్ట్రంలోని విపక్ష నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ ఒక సీఎం తన ఆరోగ్యం తాను చూసుకోలేకపోతే, పంజాబ్ ను ఎలా చూసుకుంటారని…
Author: Editor's Desk, Tattva News
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్నది. మొన్నటి వరకు గాజాపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్నది. హిజ్బొల్లాను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో లెబనాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పౌరులు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. దాడుల్లో ఇప్పటికే హెజ్బొల్లా అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చింది. అలాగే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరూషన్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. నస్రల్లా మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయత్లులా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా ఇజ్రాయెల్ మరో కీలక విజయం సాధించింది. హిజ్బొల్లా కమాండ్ నబిల్ కౌక్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. నబిల్ కౌక్ మరణాన్ని హిజ్బొల్లా ధ్రువీకరించనప్పటికీ.. మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడిలో నస్రల్లా…
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. సీమాంతర తీవ్రవాదాన్నే ఆయుధంగా మార్చుకుని పొరుగు దేశాలపై దాడి చేసే ఆ దేశం ఈనాడు హింస గురించి, భారత్ గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన తీవ్రవాద దాడుల్లో పాక్ జాడలు, మూలాలు వున్నాయని భారత్ పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర తీవ్రవాదానికి పాల్పడితే విపత్కర పర్యవసానాలు తప్పవని ఆ దేశం గుర్తించాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ శుక్రవారం చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను భారత్ తిప్పికొట్టింది. ఇందుకు గాను రైట్ టు రిప్లై ను ఉపయోగించుకుంది. శుక్రవారం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, జమ్ము కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. 370వ అధికరణ రద్దును భారత్ వెనక్కి తీసుకోవాలన్నారు. కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి చర్చలు జరపాలని కోరారు. పాక్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ భారత్ ప్రతినిధి భవికా…
ఐక్యరాజ్యసమితి సర్వసాధారణ సభలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్, ఇరాన్ దేశ పటాలను చెరో చేతపట్టుకుని ఒకటి వరమైతే, మరోటి శాపం అన్నారు. రెచ్చగొడితే తిప్పి కొడతాం అంటూ ఇరాన్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో బెంజామిన్ నెతన్యాహు ప్రసంగిస్తూ ఈ విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మధ్య ప్రాచ్య దేశంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నెతన్యాహు ఈ విధంగా పేర్కొనడం గమనార్హం. ఇజ్రాయెల్, అరబ్ భాగస్వామ్య దేశాలు కలిసి ఆసియా, యూరొప్ లను కలపాలన్న విజన్ తో ‘వరం’(బ్లెస్సింగ్) పటాన్ని ఆయన తన చేతిలో చూపారు. హిందూ మహాసముద్రం, మధ్యదరా సముద్రం మధ్య భూ అనుసంధానం చేయాలన్న ఆలోచనను ఆయన వ్యక్తపరిచారు. అలాగే హిందూ మహా సముద్రం, మధ్యదరా ప్రాంతం మధ్య ఇరాన్ ఉగ్రవాద ఆర్క్ రూపొందిస్తోందన్న పటం ‘శాపం’(కర్స్) ను ఆయన మరో చేతిలో చూపారు. ఆ పటంలో పాలస్తీనా ప్రాంతాలైన వెస్ట్ బ్యాంక్, గాజా, సిరియా తాలూకు…
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రద్దైన ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు. కతువా జిల్లాలోని బని అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలని ఎన్సీ, కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్లపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆజాద్ స్పందించారు. ‘ఆర్టికల్ 370, రాష్ట్ర హోదాపై నేషనల్ కాన్ఫరెన్స్ లేదా పీడీపీ పార్లమెంటులో మాట్లాడలేదు. వాటి గురించి నేను మాట్లాడా. రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ప్రధాని, కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలదు. ఏ రాష్ట్రమూ కాదు’ అని ఆయన తెలిపారు. కాగా, పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుతున్నందున ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తున్నదని…
జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఒక పోలీస్ మృతి చెందగా, నలుగురు అధికారులకు గాయాలయ్యాయి. ఆదిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో వెంటనే ఆర్మీ, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్మీ, పోలీసులను గమనించిన టెర్రరిస్టులు కాల్పులు జరపడం ప్రారంభించారు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు, సైన్యం ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు, ఓ పోలీస్ అధికారి గాయపడినట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారిని కుల్గామ్ అదనపు ఎస్పీ ముంతాజ్ అలీ భట్టి, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్లు మోహన్ శర్మ, సోహన్ కుమార్, యోగిందర్, మహ్మద్ ఇస్రాన్‌లుగా గుర్తించారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం శ్రీనగర్‌లోని 92 బేస్…
లెబనాన్ రాజధాని బీరుట్ పై జరిపిన దాడిలో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రుల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది. హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్ పై బీకర దాడులు చేస్తోంది. శుక్రవారం రాత్రి జరిపిన దాడిలో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రుల్లా చనిపోయాడని శనివారం ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, దీనిపై హెజ్బొల్లా నుంచి ఇంకా ఎలాంటి స్పందన వెలువడలేదు. లెబనాన్ రాజధాని బీరుట్ పై శుక్రవారం జరిపిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షోషాని ప్రకటించారు. ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి కెప్టెన్ డేవిడ్ అవ్రాహామ్ కూడా ఈ వార్తను ధృవీకరించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లేదా ఐడీఎఫ్ కూడా ‘‘హసన్ నస్రుల్లా ఇకపై ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేయలేడు’’ అని పోస్ట్ చేసింది. లెబనాన్ లోని దక్షిణ బీరుట్ కోటపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో చీఫ్…
హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. కేటీఆర్‌ను కలిసి తమ గోడు ఏళ్ళబోసుకుంటామని చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నది. దీనికితోడు ఆపరేషన్ మూసీ పేరుతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. హైడ్రా, మూసీ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఈ పదాలు తమకు కంటిపై కునుకు లేకుండా చేసి, మనోవేదనకు కారణం అవుతున్నాయని హైడ్రా బాధితులు బీఆర్ఎస్ భవన్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని హైడ్రా బాధితులు బీఆర్‌ఎస్ నాయకులను కలిసేందుకు తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు కూల్చేస్తామనడం సరికాదన్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అసలు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాచారం ఉండడం లేదని, అధికారులతో మాట్లాడిన…
ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా శనివారం అట్టహాసంగా జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నటులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఏఆర్ రెహమన్, వెంకటేశ్, బాలకృష్ణ, సమంత, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. ఐఫా 2024కు గాను ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ చేతుల మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకున్నారు. మరోవైపు ఉత్తమ చిత్రం విభాగంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు అవార్డు దక్కగా.. ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో దసరా సినిమాకు నాని అవార్డు అందుకున్నాడు. నందమూరి బాలకృష్ణ గోల్డెన్ లెగసీ అవార్డు సొంతం…
చిన్నారుల ఆరోగ్యం విషయంలో కేరళ ఆదర్శంగా నిలుస్తోందని కేరళ ఆరోగ్య రంగాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డా.వినోద్ కె పాల్ అభినందించారు. మాతా మరియు శిశు మరణాల రేటు తగ్గింపు ఒక విజయమని కొనియాడారు. దేశంలోనే అతి తక్కువ మాతాశిశు మరణాల రేటు కేరళలో ఉందని చెప్పారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో కేరళ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సచివాలయంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌తో జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు కేరళ సాధించిన విజయాలను ప్రశంసించారు. కేరళ ఆరోగ్య రంగంలో పెను అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వ్యాధుల నివారణకు కూడా కేరళ ఎంతో ప్రాధాన్యతనిస్తోందని ఆమె చెప్పారు. తగిన కేంద్ర కేటాయింపు సకాలంలో అందుబాటులో ఉంటే మరిన్ని కార్యకలాపాలు చేయవచ్చని మంత్రి తెలిపారు. సమర్థవంతమైన క్షేత్ర స్థాయి కార్యకలాపాలకు ఈ మొత్తం అవసరమావుతున్నాదని ఆమె పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల అభివృద్ధి కార్యకలాపాలకు…