దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా మహా పంచాయత్ నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్‌మంతర్ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడ్డారు.…
Author: Editor's Desk, Tattva News
ఐఫా-2023లో ఉత్తమ నటుడిగా నిలిచారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఈ అవార్డుల వేడుకకు యూఏఈ రాజధాని అబుదాబి వేదిక అయింది. బాలీవుడ్ తారల తళుకు బెలుకులు, నృత్య ప్రదర్శనల మధ్య అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇరవై మూడవ ఐఫా అవార్డుల్లో ఉత్తమ నటుడుగా హృతిక్ రోషన్ నిలిచాడు. విక్రమ్ వేద సినిమాకు గానూ హృతిక్ ఈ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ నటిగా అలియాభట్ ఎంపికైంది. గంగూబాయి కతియావాడి సినిమాలో తన నటనకు ఈ అవార్డు వరించింది. కాగా ఈ అవార్డుల ఫంక్షన్‌కు అలియా రాకపోవడంతో ప్రముఖ నిర్మాత జయంతీలాల్ ఈ అవార్డును స్వీకరించాడు. ఉత్తమ చిత్రంగా దృశ్యం-2 నిలిచింది. భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకు గానూ కమల్ హాసన్ అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియా సినిమా పురస్కారాన్ని అందుకున్నాడు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధం అయ్యింది. నావిగేషన్ శాటిలైట్ ఎన్‌వీఎస్-1ను సోమవారం నింగిలోకి పంపనుంది. గతంలో నావిగేషన్ సర్వీసెస్ కోసం పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల్లో నాలుగింటి జీవిత కాలం ముగిసింది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ ఎన్‌వీఎస్ ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) పేరుతో ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇది. కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం కాగా.. ఇది గ్రౌండ్ స్టేషన్‌లతో కలిసి పని చేయనుంది. ఇక.. నెట్‌వర్క్ సాధారణ వినియోగదారులు, వ్యూహాత్మక వినియోగదారులకు నావిగేషనల్ సేవలను కూడా ఈ శాటిలైట్ అందిస్తుంది. సాయుధ దళాలు, మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ అండ్ టైమింగ్ కోసం దేశంలో పౌర విమానయాన రంగానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్…
కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ 75 ఏళ్ల తరువాత కొత్త పార్లమెంట్‌ను నిర్మించుకున్నామని చెప్పారు. పవిత్రమైన సెంగోల్‌ను పార్లమెంట్‌లో ప్రతిష్టించుకున్నామన చెబుతూ భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్… కొత్త భారత్‌కు కొత్త జోష్ తీసుకొచ్చిందని ప్రధాని ప్రశంసించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని, 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని, అధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుందని ప్రధాని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్‌కు పార్లమెంట్ సాక్షంగా నిలుస్తుందని ప్రశంసించారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని పేర్కొంటూ అమృత్ కాల్‌లో అన్ని కఠిన సవాళ్లను అధిగమిస్తామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను కొత్త పార్లమెంట్ గౌరవిస్తుందని చెప్పారు. ‘‘ప్రపంచ ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి.. పునాది కూడా. ప్రజాస్వామ్యమే మన ఆలోచన, సంప్రదాయం’’ అని…
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఉదయం పాత పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద పూజలతో ప్రారంభోత్సం మొదలైంది. ఉదయం 7.30 నిమిషాలకు తొలుత గణపతి హోమం నిర్వహించారు. అనంతరం అధీనంల నుంచి స్వీకరించిన చరిత్రాత్మక రాజదండానికి సాష్టంగ ప్రమాణం చేశారు. స్పీకర్, అధీనంలతో కలిసి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించిన నరేంద్ర మోదీ.. లోక్‌సభలో సభాపతి ఛైర్ పక్కన ఆ రాజదండాన్ని ప్రతిష్టాపన చేశారు. భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, సిబ్బందిని మోదీ ఘనంగా సత్కరించారు. వారికి శాలువలు కప్పి, జ్ఞాపికలను అందజేశారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో ప్రధాని పాల్గొన్నారు. అంతకు ముందు శనివారం సాయంత్రం, అధికారిక రాజదండం సెంగోల్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి తిరువవదుతురై మఠాధిపతులు,…
నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఐటీశాఖ అధికారులమని చెప్పి ఓ గోల్డ్ షాపులోకి వెళ్లి తనిఖీలు చేపట్టిన ముఠా 2 కిలోల బంగారంతో ఉడాయించింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ మోండా మార్కెట్ పోలీసులను ఆశ్రయించారు. శనివారం ఉదయం ఐదుగురు వ్యక్తులు మోండా మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెలరీ దుకాణానికి వెళ్లారు. బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ దుకాణం వద్దకు వచ్చి సిబ్బందిని, యాజమాన్యాన్ని బెదిరించారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని సిబ్బందిని పక్కన కూర్చోబెట్టారు. షాపులో ఉన్న 17 బంగారం బిస్కట్లు (ఒక్కోటి 100 గ్రాములు)కు సంబంధించి ఎలాంటి ట్యాక్స్ చెల్లించలేదని చెప్పి బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడి నుంచి బంగారంతో వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని బాలాజీ జ్యూవెలరీ దుకాణ యజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగతా జ్యూవెలరీ షాపుల యజమానులక చెప్పాడు.…
అమెరికాలో దీపావళిని దేశవ్యాప్త సెలవుగా ప్రకటించేందుకు కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మేంగ్ ప్రతినిధుల సభలో ‘దివాళి డే యాక్ట్’ పేరిట తాజాగా ఓ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై అమెరికాలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ప్రపంచంలోని కోట్లాది మందికి దీపావళి ఎంతో ముఖ్యమైన పర్వదినం. అమెరికాలోనూ కొన్ని వేల కుటుంబాలు ఈ పండుగ జరుపుకుంటాయి’’ అని మేంగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ‘‘ఈ రోజుకున్న ప్రాముఖ్యతపై అమెరికన్లలో అవగాహన పెంచేందుకు తొలి అడుగుగా ఈ బిల్లును సిద్ధంగా చేశాను’’ అని ఆమె తెలిపారు. ఈ బిల్లుపై న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘దీపావళి ప్రాముఖ్యాన్ని, దక్షిణాసియా వారిని గుర్తిస్తూ ఓ రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఏకతాటిపైకి రావడం మనం చూశాం. ఈ స్ఫూర్తిని కాంగ్రెస్ సభ్యురాలు మెంగ్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దీపావళిని జాతీయ సెలవుదినంగా ప్రకటించేందుకు చారిత్రక బిల్లును ప్రవేశపెట్టారు’’ అని కొనియాడారు.…
దేశంలో హింసాత్మక జిహాద్ కోసం ప్రయత్నిస్తున్న ఓ ఉగ్రవాద మాడ్యూల్ గుట్టు రట్టయింది. మధ్య ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంయుక్తంగా జబల్పూరులో నిర్వహించిన దాడుల్లో ఈ దారుణం బయటపడింది. వీరికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. జబల్పూరులోని ఓమ్టి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 చోట్ల శుక్ర-శనివారాల మధ్య రాత్రి నిర్వహించిన దాడుల్లో ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సానుభూతిపరులు సయ్యద్ మమూర్ అలీ, మహమ్మద్ అదిల్ ఖాన్, మహమ్మద్ షాహిద్‌లను అరెస్ట్ చేశారు. అదిల్ ఖాన్ నిర్వహిస్తున్న ఐసిస్ అనుకూల కార్యకలాపాల గురించి 2022 ఆగస్టులో ఎన్ఐఏ దృష్టికి వచ్చింది. ఎన్ఐఏ అతనిపై రెండు రోజుల క్రితం కేసును నమోదు చేసింది. అరెస్టయిన ముగ్గురిని భోపాల్‌లోని ఎన్ఐఏ కోర్టులో శనివారం ప్రవేశపెట్టారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 120బీ, 295ఏ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ…
కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన సిద్ధరామయ్య సర్కార్ తన మంత్రి వర్గాన్ని శనివారం విస్తరించింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో 24 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో 34మంది మంత్రులు ఉండొచ్చు. వీరిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సహా 10 మంది మే 20న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన వారం రోజుల తర్వాత క్యాబినెట్ విస్తరణ జరిగింది. కొత్త మంత్రులైన ఎమ్మెల్యేల జాబితాలో దినేష్ గుండూరావు, కృష్ణ బైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, శివరాజ్ తంగడి, ఆర్‌బి.తిమ్మాపూర్, బి.నాగేంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్, మధు బంగారప్ప, డి. సుధాకర్, చెలువరాయ స్వామి, మంకుల్ వైద్య, ఎంసీ, సుధాకర్, రహీం ఖాన్, సంతోష్ లాడ్, కెఎన్.రాజన్న, కె. వెంటకేశ్, హెచ్‌సీ మహదేవప్ప, బైరతి సురేష్ ఉన్నారు. తాజాగా ప్రమాణస్వీకారం చేసిన 24 మందిలో తొమ్మిది మంది…
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను హైదరాబాద్ మహా నగర్ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సీరియస్‌గా తీసుకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది. నోటీసు అందిన 48 గంటల్లోగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఏం మాట్లాడినా ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది కాబట్టి చేసే ప్రతి ప్రకటన, మాట్లాడే మాటకు బాధ్యత ఉండాలని హితవు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఓఆర్‌ఆర్‌ను లీజుకు తీసుకున్నట్లు హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 9న టీవీఓటీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించేందుకు టెండర్ల ప్రక్రియ…