Author: Editor's Desk, Tattva News

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘పపువా న్యూ గినియా’ దేశ ప్రధాని జేమ్స్ మరాపె పాదాభివందనం చేశారు. జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ ఆదివారం పపువా న్యూ గినియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపె ఘన స్వాగతం పలికారు. విమానం దిగి వస్తున్న ప్రధాని మోదీకి ఆత్మీయ ఆలింగనం చేసిన జేమ్స్ మరాపె.. ఆయన పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రధాని మోదీ జేమ్స్‌ను పైకి లేపి భుజం తట్టి కౌగిలించుకున్నారు. అనంతరం ప్రధాని మోదీకి తమ దేశ అధికారులు, రాజకీయ నేతలను జేమ్స్ మరాపె పరిచయం చేశారు. మరోవైపు పాపువా న్యూ గినియాలో ప్రవాస భారతీయులు సైతం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. వారు మోదీతో సెల్ఫీలు దిగి తమ ఆనందం వ్యక్తం చేశారు. పపువా న్యూ గినియాను సందర్శించిన తొలి భారత ప్రధాని నరేంద్ర…

Read More

వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బిజెపికి వ్యతిరేకంగా విఓక్షాల ఐక్యతపై వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరుగుతున్న బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లిన నితీశ్ కేజ్రీవాల్‌తో సమావేశం అయ్యారు. బెంగళూరులో సిద్దరామయ్య ప్రమాణస్వీకారంకు హాజరై వీరిద్దరూ ఢిల్లీకి వచ్చారు. అయితే, సిద్దరామయ్య ప్రమాణస్వీకారంకు కేజ్రీవాల్ ను ఆహ్వానించలేదు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా ఓ ‘రాజ్యసభ ప్లాన్’ను కేజ్రీవాల్ ఆయన వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ పాలనా వ్యవహారాల విషయంలో ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకునేందుకు కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకు రావడం‘రాజ్యాంగ విరుద్ధం’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో నితీశ్ కుమార్ తనకు పూర్తి మద్దతు ప్రకటించారని, విషయంలో కలిసి…

Read More

‘‘కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా? ఆ ప్రాంతంలో గజం లక్షకుపైగా పలుకుతుంటే రూ.7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు?” అంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. అదే ప్రాంతంలో సర్కారు భూమిని హెచ్ఎండీఏ అధికారులు గజానికి లక్ష పదివేలకు చొప్పున మార్కెట్ లో అమ్మకానికి పెడుతూ పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. మరి అదే ప్రాంతంలో రూ.550 కోట్ల విలువైన భూమిని రూ. 40 కోట్లలోపే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు? అంటూ ధ్వజమెత్తారు. వాస్తవానికి ఓపెన్ మార్కెట్ లో కోకాపేటలో ఎకరం ధర వంద కోట్ల రూపాయలకుపైగా పలుకుతోందని, ఈ లెక్కన బీఆర్ఎస్ కు కట్టబెట్టిన భూముల విలువ రూ. 1100 కోట్లకు పైమాటేనని తెలిపారు. ఈ భూమిని ధారాదత్తం చేసుకునేందుకు ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. అయినప్పటికీ మీడియాకు మాత్రం…

Read More

తెలుగు జాతి ఆస్తి, వారసత్వమైన నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కైత్లాపూర్‌ మైదానంలో జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలలో పలువురు డిమాండ్ చేశారు. మహా నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు వచ్చేదాకా తెలుగు జాతి పోరాడుతుందని, ఆయనకు పురస్కారం సాధించి తీరతామని ముఖ్యఅతిధిగా పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎన్‌టిఆర్‌ ఒక శక్తి, స్ఫూర్తి అని, ఆయనను గౌరవించుకోవడమంటే దేశాన్ని గౌరవించుకున్నట్లేనని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు.. ప్రపంచంలోని ప్రతి తెలుగువాడి మనసు గెలుచుకున్న నాయకుడు ఎన్టీఆర్‌ అని హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. ‘‘రాజకీయాలకు క్రమశిక్షణ తెచ్చిన నాయకుడు. రాజకీయాలు ప్రజల కోసమే అని నిరూపించారు. నీతి, నిజాయతీకి మారు పేరుగా నిలిచారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదనం గురించి ఢిల్లీకి చాటారు’’ అని తెలిపారు. భావి తరాలకు ఎన్టీఆర్‌…

Read More

కొన్ని దేశాలు శక్తుల విస్తరణ ధోరణితో మానవాళికి అత్యవసరం అయిన ఆహార, ఇతరత్రా కీలక సరఫరా వ్యవస్థకు ప్రమాదం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్‌లో జి 7 సదస్సులో ఆయన ఈ విషయం ప్రస్తావించారు. అణగారిన వర్గాలను కేంద్రీకృతంగా చేసుకుని సమ్మిశ్రిత ఆహార వ్యవస్థ అవసరం ఉందని ఆయన తెలిపారు. సాంకేతిక అత్యవసరం దీని విషయంలో ప్రజాస్వామికత కీలకం అని తెలిపిన ప్రధాని సాంకేతికత ప్రగతికి ప్రజాస్వామ్యానికి మధ్య సముచిత వారధిగా ఉండటం వల్లనే మానవాళికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ఆహార వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోంది. ప్రత్యేకించి సన్నకారు రైతుల ప్రయోజనాలు కీలకం అని తెలిపారు. కానీ ఎరువుల మార్కెట్లను కంట్రోలు చేసే దేశాలు, శక్తులు ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు విధాలుగా ఆహార భద్రత సంబంధిత సరఫరా వ్యవస్థలో లోపాలు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఏ దేశం పేరు…

Read More

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేలా వ్యూహాత్మక భాగస్వామి అయిన రష్యాపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా చైనాను జి-7 దేశాల నేతలు కోరారు. చైనాకు హాని కలిగించాలని తాము కోరుకోవడం లేదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పైగా బీజింగ్‌తో నిర్మాణాత్మకమైన, సుస్థిరమైన సంబంధాలు కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు వారు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ”చైనాతో నిజాయితీగా వుండడం, పైగా చైనాకే నేరుగా తమ ఆందోళనలు తెలియచేయడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించామని” ఆ ప్రకటన పేర్కొంది. ఉక్రెయిన్‌ నుండి తక్షణమే, పూర్తిగా, బేషరతుగా బలగాలను ఉపసంహరించాలని రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని చైనాను కోరుతున్నామని ఆ ప్రకటన పేర్కొంది. ఐక్యరాజ్య సమితి నిబంధనావళి, ప్రాదేశిక సమగ్రత ఆధారంగా సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత శాంతికి చైనా మద్దతివ్వాలని కోరారు. అంతర్జాతీయంగా చైనా పోషిస్తును పాత్ర, దాని ఆర్థిక వ్యవస్థ పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని చైనాతో సహకారం అవసరమని జి-7 దేశాలు అభిప్రాయపడ్డాయి. వాతావరణ మార్పులు,…

Read More

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలి మంత్రివర్గ సమావేశంలోనే పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై మాట నిలుపుకొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీల అమలుకు నిర్ణయిస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేశారు. విధాన సౌధలో మధ్యాహ్నం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఐదు హామీల అమలుకు సంబంధించి ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. వారం రోజుల్లోగా రెండో క్యాబినెట్ సమావేశం జరుపుతామని, ఈ వెంటనే తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలిచ్చిన ఐదు హామీల్లో ‘గృహజ్యోతి’ పథకం కింద గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందజేస్తారు. ‘గృహలక్షి పథకం’ కింద ఇంటి పెద్ద అయిన మహిళలకు రూ.2,000 నెలసరి సాయం. ‘అన్న భాగ్య’ పథకం కింద బీపీఎల్ హౌస్‌హోల్డ్ సభ్యులు ఒక్కొక్కరికి రూ.10 కేజీల ఉచిత బియ్యం సరఫరా చేస్తారు. ‘యువ నిధి’ పథకం…

Read More

35 ఏండ్ల త‌ర్వాత హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించిన‌ట్లు హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో జూన్ 2వ తేదీ నుంచి కొత్త పోలీసు స్టేష‌న్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు. న‌గ‌రంలో పెరుగుతున్న జ‌నాభా మేర‌కు కొత్త పీఎస్‌లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. 35 ఏండ్ల కింద క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 25 ల‌క్ష‌ల జ‌నాభా ఉండేది. ఇప్పుడు న‌గ‌ర జ‌నాభా 85 ల‌క్ష‌ల‌కు పెరిగింద‌న్నారు. శాంతి భ‌ద్ర‌త‌లకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ చెప్పార‌ని సీపీ గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలోనే క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 2 కొత్త డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజ‌న్లు, 11 కొత్త లా అండ్ ఆర్డ‌ర్ పీఎస్‌లు, 13 ట్రాఫిక్ పోలీసు స్టేష‌న్ల‌తో పాటు 5 కొత్త ఉమెన్ పోలీసు స్టేష‌న్లు ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. స‌చివాల‌యం కోసం కొత్త పీఎస్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సెక్ర‌టేరియ‌ట్ పీఎస్‌ను బీఆర్‌కే భ‌వ‌న్‌లో…

Read More

రాజస్థాన్ ప్రభుత్వ సచివాలయంలో క్లెయిమ్ చేయని రూ. 2.31 కోట్ల నగదు, 1 కిలో బంగారు బిస్కెట్లను రాజస్థాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ లో జరిగిన ఈ ఘటనలో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రికవరీ చేసిన నగదులో కేవలం రూ.2వేలు, రూ.500 నోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమీషనర్ సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రూ 2,000 నోట్లను ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించిన కొద్దీ గంటలకే ఇవి కంటబడటం గమనార్హం. శుక్రవారం సాయంత్రం రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన రిలీజ్ చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయంలో దాడులు జరిపిన పోలీసులకు కళ్లు చెదిరిపోయేలా బంగారం, కోట్లలో నగదు కనిపించింది. శుక్రవారం రాత్రి దాడులు చేసిన పోలీసులు.. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న…

Read More

కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత గవర్నర్ థావర్‌ చంద్ గెహ్లాట్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్‌, ప్రియాంక సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం విశేషం. కర్ణాటక మంత్రులుగా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. జి. పరమేశ్వర(దళిత), కేహెచ్‌ మునియప్ప(దళిత), కేజే జార్జ్(క్రిష్టియన్), ఎంబీ పాటిల్(లింగాయత్), సతీష్ జార్కలి(ఎస్టీ), జమీర్ అహ్మద్(ముస్లిం మైనార్టీ), రామలింగా రెడ్డి(రెడ్డి), సతీష్ జార్కిహోలి(ఎస్టీ) ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉండటం గమనార్హం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సీఎంలు, పలు పార్టీల నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తమిళ నటుడు కమల్‌హాసన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, ఛత్తీస్‌గర్…

Read More