Author: Editor's Desk, Tattva News

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డిఎ)ను 4 శాతం పెంచింది. దీంతో ఇప్పుడు 38 శాతం ఉన్న ఉద్యోగుల డిఎ 42 శాతానికి పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.12,815 కోట్ల భారం పడుతుందని కేబినెట్ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాగా ప్రస్తుత డిఎ పెంపు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని ఆ ప్రకటన తెలిపింది. 2022 సెప్టెంబర్‌లో చివరగా కేంద్రం డిఎను సవరించింది. ఏడాదిలో రెండు సార్లు డిఎ సవరించడం జరుగుతుంది. కాగా ఉజ్వల పథకం లబ్ధిదారులకు వంటగ్యాస్ సిలిండర్‌పై ఇప్పుడిస్తున్న రూ.200 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే…

Read More

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్‌ మరో వాణిజ్యపరమైన రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ‘ఎల్‌విఎం3-ఎం3’ రాకెట్‌ను ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్‌ ద్వారా యుకెకు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. వన్‌ వెబ్‌ ఇండియా-2 మిషన్‌ ద్వారా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఇప్పటికే ఒకసారి ఇస్రో 36 యుకె ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలో నిలిపింది. ఇప్పుడు రెండవసారి మరో 36 ఉపగ్రహాలను భూమికి సమీపంలోని 450 కిలోమీటర్ల దూరంలో గల లియో ఆర్బిటల్‌ వృత్తాకారపు కక్ష్యలో ప్రవేశపెట్టబోతుంది. మొత్తం ఈ ఉపగ్రహాల బరువు 5805 కిలోల వరకు ఉంటుంది. ప్రయోగం అనంతరం ఈ రాకెట్‌ 20 నిమిషాలపాటు అంతరిక్షం వైపు ప్రయాణించిన అనంతరం 36 ఉపగ్రహాలను ఒకదాని…

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైసీపీ చర్యలు చేపట్టింది. ఆనం రామనారయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్టుగా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ చేశామని, దర్యాప్తు తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశామని సజ్జల తెలిపారు. దర్యాప్తులో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా పార్టీ గుర్తించిందని సజ్జల చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేను చంద్రబాబు రూ. 15 నుంచి రూ. 20 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చెప్పి ఉండవచ్చునని సజ్జల పేర్కొన్నారు. కాగా, ఈ నలుగురు టీడీపీలోకే వెళ్తారనే ప్రచారమూ సాగుతోంది. కొంతకాలంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై చాలా అసంతృప్తితో ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా పార్టీపై ప్రత్యక్షంగాను,…

Read More

తెలంగాణాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కొత్త విద్యుత్ ఛార్జీలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా విద్యుత్ సంస్థలకు అవసరమైన నిధులు, ఆదాయం, ఖర్చులకు సంబంధించి కూడా ఈఆర్‌సి ఆమోదం తెలిపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రంగానికి రూ 54.58 వేలకోట్ల నిధులు అవసరం కాగా, మొత్తం రూ. 52,006 కోట్ల నిధులను ఖర్చు చేసుకోవడానికి వీలుగా ఈఆర్‌సి అనుమతించింది. కాగా వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు యాధావిధిగా అమలవుతాయి. ఇటు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగానికి మొదటి 50 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్ ధర ఒక రూపాయి 95 పైసల ఛార్జీని వసూలు చేస్తారు. 51వ యూనిట్ నుంచి 100…

Read More

ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా చట్టసభలలో జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. మొన్నటివరకు కేవలం శాసనమండలిలో బిజెపికి ఒక సభ్యుడు – పివిఎన్ మాధవ్ ఉండేవారు. అయితే ఆయన కూడా తాజాగా జరిగిన పట్టభద్రుల నుండి ఎమ్యెల్సీ ఎన్నికలలో ఓటమి చెండంతో ఆ పార్టీకి ప్రాతినిధ్యం కోల్పోతుంది. ఇప్పటికే శాసనసభలో వైసిపి, టిడిపి తప్ప మరో పార్టీకి ప్రాతినిధ్యం లేదు. ఏపీ నుండి ఎంపీలు సహితం ఆ రెండు పార్టీలకు చెందినవారే. బీజేపీకి నుండి జివిఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పటికీ ఆయన ఉత్తర ప్రదేశ్ నుండి ఎన్నికయ్యారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58గా ఉంది. వీరిలో అధికార వైసిపి సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 33 నుంచి, గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన వారితో కలిపి 45కు చేరుకోనుంది. ప్రతిపక్ష టిడిపి సభ్యుల సంఖ్య 17 నుంచి…

Read More

మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. ‘‘ కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దోషిగా తేల్చడంతో లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడింది. దోషిగా తేలిన 23 మార్చి 2023 నుంచి నుంచి అనర్హత వర్తిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్…

Read More

దేశంలోని 16.8 కోట్ల మంది పౌరుల రహస్య వ్యక్తిగత డేటా, ప్రభుత్వ, ముఖ్యమైన సంస్థల సున్నితమైన డేటాను దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. నోయిడా, పూణే నుంచి దొంగతనం, సున్నితమైన, రహస్య డేటాను సేకరించి విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా రక్షణ, సైనిక సిబ్బందికి సంబంధించిన కీలక డేటాను సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. డేటా చోరీ కేసులో తదుపరి విచారణ కోసం హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని చెప్పారు. నిందితులు రక్షణ సిబ్బంది, బ్యాంకు కస్టమర్లు, ఇంధన రంగ వినియోగదారులు, నీట్ విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్యాస్ ఏజెన్సీలు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు(హై నెట్‌వర్త్ ఇండివిజ్యూవల్స్), డీమ్యాట్ హోల్డర్లు సహా 140 కేటగిరీల వ్యక్తుల సమచారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇతర…

Read More

హిండెన్‌బ‌ర్గ్ రీస‌ర్చ్ సంస్థ త్వ‌ర‌లో కొత్త రిపోర్ట్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ సంస్థ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపింది. ఇటీవ‌ల అదానీ స్టాక్స్ అంశంపై అమెరికాకు చెందిన హిండెన్‌బ‌ర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ వ‌ల్లే.. ఆ కంపెనీ షేర్లు ప‌త‌న‌మైన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు హిండెన్‌బ‌ర్గ్ ఎవ‌ర్ని టార్గెట్ చేసింద‌న్న కోణంలో పుకార్లు సాగుతున్నాయి. ఓ అతిపెద్ద విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేయ‌నున్న‌ట్లు హిండెన్‌బ‌ర్గ్ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించింది. జ‌న‌వ‌రి 24వ తేదీన అదానీ గ్రూపుపై హిండెన్‌బ‌ర్గ్ సంస్థ 106 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది. అదానీ సంస్థ ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆ నివేదిక‌లో ఆరోపించింది. ఆ రిపోర్టు వ‌ల్ల అదానీ కంపెనీ ట్రేడింగ్‌లో సుమారు 86 బిలియ‌న్ల డాల‌ర్లు న‌ష్ట‌పోయింది. త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌బోయే రిపోర్టులో ఎవ‌రి గురించి ఉంటుంద‌న్న విష‌యాన్ని ఆ సంస్థ చెప్ప‌లేదు. కానీ ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన బ్యాంకుల మూసివేత గురించి కొత్త…

Read More

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్పీ) పేప‌ర్ లీకేజీ వ్యవహారంపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ల‌కు తెలంగాణ ఐటీ, మున్సిప‌ల్ శాఖ‌ల మంత్రి కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు ఇచ్చారు. త‌న‌పై రేవంత్‌రెడ్డి, బండి సంజ‌య్ నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు తెలిపారు. టీఎస్ పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నందుకు వారికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా టీఎస్పీఎస్సీ ఏర్పాటైందని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఈ వాస్తవాలు అన్నిటినీ పక్కనపెట్టి…

Read More

దేశంలో కరోనా వైరస్‌ కేసులు మళ్లి పెరుగుతున్నాయి.గత ఐదు రోజులుగా సగటున వెయ్యేసి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 89,078 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,300 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 140 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 4,46,99, 418కి చేరింది. ప్రస్తుతం దేశంలో 7,605 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక , గుజరాత్‌ , మహారాష్ట్ర లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,30,816కి చేరింది. ఇక కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,41,60,997 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం…

Read More