Author: Editor's Desk, Tattva News

మందుబాబులకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మందు బాటిళ్లపై కౌ సెస్ (ఆవుల సుంకం) వసూలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఒక్కో బాటిల్ పై రూ. 10 సెస్ విధిస్తున్నట్టు బడ్జెట్ లో పేర్కొంది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి ఏటా అదనంగా రూ. 100 కోట్లు వస్తాయని అంచనా వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సెస్ ను విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు తెలిపారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు, పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుకు ఆవు, గేదె పాలను కొనుగోలు చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ క్రమంలోనే మద్యంపై కౌ సెస్ వసూలు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదించింది. ఇక హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ వివరాల్లోకి వెళ్తే రూ. 53,413 కోట్లుగా బడ్జెట్ ఉంది. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ‘హిం-గంగా’ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీని…

Read More

శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి తీవ్రమైన ఎదురుగాలి వీచింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల్లో టిడిపి అభ్యర్థులు భారీ ఆధిక్యతలో విజయం సాధించగా, పశ్చిమ రాయలసీమలో ఆ రెండు పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది. కాగా, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోనూ వైసిపి గెలుపొందింది. ఉత్తరాంధ్ర శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓటుతో విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి చిరంజీవిరావుకు 82,958 ఓట్లు దక్కాయి. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు, పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌కు కేవలం 10,884 ఓట్లు పోలయ్యాయి. తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో రెండో ప్రాధాన్య ఓట్లతో…

Read More

ప్రపంచ టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో భారత్‌ను బలమైన భాగస్వామిగా చేసేందుకు  తెలంగాణతో పాటుఏడు రాష్ట్రాల్లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరల్‌ (పీఎం మిత్ర) పథకం ముఖ్య ఉద్దేశం ఆత్మనిర్భర్ భారత్‌ నిర్మాణం అని మోదీ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 9ని సాధించడం కోసం దీన్ని రూపొందించినట్లు చెప్పారు. దీంతో టెక్స్‌టైల్‌ రంగంలో స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఆవిష్కరణలు, పారిశ్రామికీకరణ ప్రోత్సాహం సాధ్యమని తెలిపారు. పీఎం మిత్ర పథకంలో మెగా టక్స్‌టైల్‌ పార్కులను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లలో  ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. వీటి నిర్మాణానికి మొత్తం రూ. 4,445 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణానికి అనుకూలంగా అత్యాధునిక సౌకర్యాలతో వీటిని…

Read More

కేంద్రమంత్రి అమిత్ షా తో మెగాస్టార్ చిరంజీవి , ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఓ ఛానల్ కాంక్లేవ్‌కు హాజరయ్యేందుకు వచ్చిన వీరు హోటల్‌లో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన నేపథ్యంలో రామ్ చరణ్‌కు హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఆస్కార్ వచ్చాక తొలిసారిగా ఢిల్లీకి వచ్చిన రామ్ చరణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. కేంద్ర మంత్రిని చిరంజీవి శాలువాతో సత్కరించారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనిసాగినట్లు తెలుస్తోంది. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని అంటోన్న సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇదిలావుండగా ఇండియా టుడే కాన్ క్లేవ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ను ఆహ్వానించారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీతో…

Read More

టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కీలక సూత్రధారి రాజశేఖరేనని సిట్ తేల్చింది. టీఎస్ పీస్సీకి అందజేసిన నివేదికలో సిట్ కీలక విషయాలు వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. టెక్నికల్ సర్వీస్‌ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన రాజశేఖర్ కారుణ్యానియమకంలో ఉద్యోగంలో చేరాడని గుర్తించారు. ప్రవీణ్ తో రాజశేఖర్ సంబంధాలు కొనసాగించాడని తెలిపారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసి పాస్ వర్డ్ ని దొంగిలించాడని పేర్కొన్నారు. పాస్ వర్డ్ ని శంకర్ లక్ష్మి ఎక్కడా రాయలేదని, ఆమె చెప్పినదాంతోనే రాజశేఖర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పెన్ డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేసిన రాజశేఖర్ పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడని వెల్లడించారు. ఫిబ్రవరి 27నే రాజశేఖర్ ఏఈ పేపర్ ను కాపీ చేశాడని, ఆ పేపర్ ను ప్రవీణ్ రేణుకకు అమ్మినట్లు గుర్తించారు. గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు సిట్…

Read More

విజయనగరం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ పద్మావతి సహిత భూదేవి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం టీటీడీ విలీనం చేసుకుంది. ఇప్పటిదాకా ఆలయాన్ని నిర్వహిస్తున్న బాలాజీ ట్రస్టు సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.30 గంటల మధ్య టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి ఆలయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఇకమీదట ఈ ఆలయంలో టీటీడీ పద్ధతి ప్రకారం సేవలన్నీ నిర్వహిస్తారు. అంతే కాకుండా ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అభివద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ గ్రంథి మల్లిఖార్జునరావు నిర్మించిన ఈ ఆలయాన్ని బాలాజీ ట్రస్టు పర్యవేక్షణలో, జీఎంఆర్‌ వరలక్ష్మి పౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఆలయాన్ని టీటీడీ నిర్వహించాలని గ్రంథి మల్లిఖార్జునరావు కోరారని ఈవో తెలిపారు. టీటీడీ పాలకమండలి ఇందుకు ఆమోదించడంతో ఆలయాన్ని విలీనం చేసుకున్నామని చెప్పారు. పాంచరాత్ర ఆగమయుక్తంగా ఆలయ నిర్వహణ జరుగుతుందని…

Read More

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ నోటీసులను పంపించినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్ర భారత్ జోడో యాత్ర జనవరిలో కశ్మీర్ లో ముగిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కశ్మీర్లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ లైంగిక హింసకు గురైన బాధితుల వివరాలను ఇస్తే, వారి నుంచి వివరాలు తీసుకుని, దోషులను పట్టుకుంటామని పేర్కొంటూ, రాహుల్ గాంధీకి నోటీసులు పంపించారు. లైంగిక దాడికి గురైన బాధితులకు న్యాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత్ జోడో యాత్రలో చేసిన ప్రసంగంతో పాటు, సోషల్ మీడియా పోస్ట్ లను ఉటంకిస్తూ, రాహుల్ గాంధీకి ఒక ప్రశ్నావళిని ఢిల్లీ పోలీసులు పంపించారు. లైంగిక హింసకు గురైన మహిళల…

Read More

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. సమీప పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. చెన్నకేశరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి గెలిచారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రేరణతో  విద్య రంగంలో జాతీయవాద భావజాలాన్ని  విస్తరించడానికి, భారతీయ సాంస్కృతిక వైభవ పునరుజ్జీవనానికి పనిచేస్తున్న అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్  మహాసంఘ్ (ఎబిఆర్ఎస్ఎస్)కు అనుబంధంగా పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ టిపియుఎస్) అభ్యర్థిగా ఎవిఎన్ రెడ్డి గెలుపొందారు.  గురువారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు లెక్కింపు పూర్తయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా.. ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ దక్కలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థుల్లో ఎవరికీ గెలుపునకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్‌ పద్దతిలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు…

Read More

ఈడీ విచారణను ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని కవిత నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ హితవు చెప్పారు. ‘‘ఈడీ నోటీసులు జారీ చేసినప్పుడు విచారణకు సహకరిస్తామని కవిత చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న తప్పించుకునే మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు” అని ఆయన హెచ్చరించారు. తప్పు చేసిన వారు తప్పించుకునే మార్గాలు వెతుకుతారని అంటూ తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో అనేకమంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ ఏసీబీ నెంబర్ వన్ గా ఉందని లక్ష్మణ్ విమర్శించారు. ఈ విషయాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన ‘క్రైం ఇండియా’ రిపోర్టులో వెల్లడించిందని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం ఏసీబీ, పోలీసులు, ఇంటెలిజెన్స్ ను వాడుకోవడం బీఆర్ఎస్ సర్కార్కు పరిపాటి అయిందని ఆరోపించారు. స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం(సిట్) అంటే తెలంగాణలో…

Read More

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న కాల్‌ సెంటర్‌లో పని చేస్తున్న వారు మంటలు చెలరేగిన వెంటనే తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఓ గదిలో దాక్కున్నారు. మంటల తీవ్రతతో పాటు పొగకు ఉక్కిరిబిక్కిరైన వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసిన తర్వాత ఫైర్, రెస్క్యూ సిబ్బంది భవనాన్ని తనిఖీ చేస్తుండగా ఓ గదిలో ఆరుగురు స్పృహ కోల్పోయి ఉండటన్ని గుర్తించారు. వారికి సిపిఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఎనిమిది అంతస్తుల్లో ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌‌ ఏడో అంతస్తులో మొదట మంటలు వెలువడ్డాయి. అవి క్రమంగా నాలుగో అంతస్తు వరకు విస్తరించాయి. ఐదో అంతస్తులో పేలుడు జరగడంతో మంటలు భారీగా ఎగిసి పడ్డాయి. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు, కాల్ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉంటుంది.…

Read More