Author: Editor's Desk, Tattva News

అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌విబి) సంక్షోభంతో మూతపడింది. ఈ బ్యాంక్‌ను మూసివేస్తూ.. పూర్తిగా తమ ఆధినంలోకి తీసుకున్నామని అమెరికా రెగ్యూలేటరీ ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డిఐసి) ప్రకటన చేసింది. ఆ బ్యాంక్‌కు సంబంధించిన ఆస్తుల్ని సీజ్‌ చేసింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికాలో అతిపెద్ద రిటైల్‌ బ్యాంకింగ్‌ ఎస్‌విబి కుప్పకూలడంతో ఆనాటి పరిస్థితులు ఎక్కడ పునరావృతం అవుతాయేనని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ బ్యాంక్‌ 2 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.16వేల కోట్లు) నష్టాలు చవి చూసింది. ఎస్‌విబి ప్రధానంగా టెక్‌, స్టార్టప్‌ సంస్థలకు నిధులను సమకూర్చుతుంది. ఎస్‌విబిలో సంక్షోభం నెలకొనడం.. రెండు రోజుల్లోనే ఆ బ్యాంక్‌ సూచీ భారీగా పడిపోవడంతో అక్కడి రెగ్యూలేటరీ సంస్థ వేగంగా స్పందించింది. ఆ బ్యాంక్‌ మూత పడిన తర్వాత ఇందులోని 175 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్లు) వినియోగదారుల డిపాజిట్లను ఎఫ్‌డిఐసి…

Read More

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం లోని ప‌రీక్ష‌ల సంబంధిత కంప్యూట‌ర్ హ్యాక్ కావడంతో సోమవారం  జ‌ర‌గాల్సిన టీపీబీవో పోస్టుల‌కు నిర్వ‌హించాల్సిన రాత‌ప‌రీక్ష‌ను, ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ రాత‌ప‌రీక్ష‌ను వాయిదా వేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది. ఈ పరీక్షలకు సంబంధిత కంప్యూటర్ హ్యాక్ అయిందని అనుమానం ఉందని, ఈ మేరకు హ్యాకింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టార‌ని స్ప‌ష్టం చేసింది. వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల తేదీల‌ను మ‌ళ్లీ ప్ర‌క‌టిస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది. అధికారిక వెబ్‌సైట్లతో పాటు.. పరీక్ష రాసే అభ్యర్థులందరికీ మెస్సేజ్‌లు పంపించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు హామీ ఇచ్చారు. కాగా.. టీఎస్‌పీఎస్సీ చరిత్రలో ఇలా జరగటం ఇదే మొదటి కావటం గమనార్హం. అయితే.. నిజంగానే పేపర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Read More

గత గురువారం ఢిల్లీలో మృతిచెందిన బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ ఆకస్మిక మరణంపై పలు అనుమానాలు చోటుచేసుకొంటున్నాయి. దానితో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన గుండెపోటుకు గురైన ఫామ్‌ హౌజ్‌లో పోలీసులకు నిషేధ ఉత్పేరిత డ్రగ్స్‌ లభ్యమయ్యాయి. హోలీ వేడుకలు చేసుకుంటూ సతీష్ కౌశిక్ గుండెపోటుకు గురైనట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఫామ్‌హౌస్‌లో హోలీ పార్టీకి వచ్చిన అతిథుల జాబితాను కూడా పోలీసులు సిద్ధం చేశారు. మొత్తం 10 నుంచి 12 మంది పార్టీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ సతీష్ కౌశిక్ స్నేహితుడు వికాస్ మాలూది కాగా అక్కడ లభ్యమైన అభ్యంతరకరమైన ఔషధాలు ఎవరికోసం, ఎందుకు తీసుకొచ్చారనేది మిస్టరీగా మారింది. దీని గుట్టువిప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సతీష్ కౌశిక్‌కి ఏమైనా సంబంధం ఉందా? అనేది…

Read More

చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా క్సీ జిన్‌పింగ్‌ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. 69 ఏళ్ల ఈ చైనా కమ్యూనిస్టు పార్టీ నేత మిలిటరీ కమిషన్‌ చైర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను పలు దేశాల నేతలు అభినందించారు. బీజింగ్‌లోని గ్రేట్‌హాల్‌ ఆఫ్‌ పీపుల్స్‌లో జరుగుతున్న పద్నాల్గవ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (జాతీయ పార్లమెంటు) సమావేశం శుక్రవారం ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. చైనా కొత్త ఉపాధ్యక్షుడిగా సిపిసి మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు 68 ఏళ్ల హాన్‌ జెంగ్‌ను ఎన్‌పిసి ఎన్నుకుంది. ఇంతకుముందు ఈ బాధ్యతలను వాంగ్‌కి షాన్‌ నిర్వహించారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మిలిటరీ కమిషన్‌ చైర్మన్‌ ఎన్నికతోబాటు పీపుల్స్‌ కాంగ్రెస్‌ కొత్త చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, వివిధ స్టాండింగ్‌ కమిటీల ఎన్నిక కూడా జరిగింది. గత అక్టోబరులో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సిపిసి) మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్‌ తిరిగి ఎన్నికైన సంగతి…

Read More

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన, బీజేపీలతో పొత్తు ఏర్పరచుకొని పోటీచేయాలని ప్రయత్నిస్తూ వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అందుకు బిజెపి విముఖంగా ఉండటం, జనసేనలో సహితం స్పష్టత లోపించడంతో వామపక్షాలతో పొత్తుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి ఐదు ఎమ్యెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో వామపక్ష అభ్యర్థులకు ఓట్లు వేయమని పిలుపు ఇవ్వడం ప్రాధాన్యత సంతరింపచేసుకుంది. టిడిపి మూడు గ్రాడ్యుయేట్ల స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలబెట్టగా, రెండు ఉపాధ్యాయ స్థానాలలో ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలని, రెండో ప్రాధాన్యత ఓటు పీడీఎఫ్‌ అభ్యర్థికి వేయాలని పిలుపునిచ్చారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఎలాంటి ఓటు వేయొద్దని చెప్పారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను ఏపీటీఎఫ్, పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని సూచించారు. సీబీఎన్ కనెక్ట్…

Read More

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏపీలో రాజకీయ వలసలు పెరుగుతున్నాయి. గతంలో సొంతపార్టీ ని కాదని వైస్సార్సీపీ లో చేరిన నేతలంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కొంతమంది సొంత గూటికి చేరుతుంటే, మరికొంతమంది జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా, బిజెపి కీలక నేత కన్నా లక్ష్మి నారాయణ టీడీపీలో చేరగా, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ సైతం టీడీపీ లో చేరారు. ఈ క్రమంలో అధికార పార్టీ వైస్సార్సీపీ కీలక నేత , కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఈయన జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొవ్వూరులో తన అభిమానులు, అనుచరులతో సమావేశమైన రామారావు, వైస్సార్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో, తమను నమ్ముకున్న అనుచరులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాను.. తీవ్ర మనస్థాపంతోనే వైస్సార్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా…

Read More

బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీ జెండాలను చూస్తేనే తెలంగాణ మహిళలు భయపడే పరిస్థితి నెలకొందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘మహిళా గోసా బిజెపి భరోసా’ దీక్షలో పాల్గొంటూ మహిళా సమస్యలపైనా, అన్యాయంపైనా, మహిళా బిల్లుపైన ఏనాడూ నోరు మెదపని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో దీక్ష చేయడం సిగ్గు చేటని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై దీక్ష చేసే నైతిక హక్కు బిఆర్‌ఎస్‌కు లేదని పేర్కొంటూ లిక్కర్ దందాపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుండి దారి మళ్లించేందుకే మహిళా దీక్ష పేరిట డ్రామాలు చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. మహిళల జీవితాలను నాశనం చేసే మద్యం వ్యాపారంలో నిమగ్నమై ఉన్న కవిత మహిళల కోసం దీక్ష చేపట్టడం సిగ్గుచేటని, ఆమె కారణంగా దేశం మొత్తం సిగ్గుతో తల దించుకుంటోందని విమర్శించారు. పార్టీ సంస్థాగత పదవుల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న…

Read More

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం, ద్రవ్యోల్భణం ఎదుర్కొంటున్న పాకిస్థాన్ లో 33 రకాల వస్తువులపై అమ్మకపు పన్నును 17 శాతం నుండి 25 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దిగుమతి చేసుకున్న ఆహారంతో పాటు అలంకార వస్తువులు, అత్యాధునిక మొబైల్‌ ఫోన్స్‌, ఇతర ఉత్పత్తులపై ఈ పన్ను విధిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుండి రుణం కోసం పాక్‌ యత్నిస్తోంది. అయితే 7 బిలియన్‌ డాలర్ల రుణం సదుపాయం కింద 1.1 బిలియన్‌ డాలర్లను విడుదల చేయాలంటే పాక్‌ ప్రభుత్వం ఐఎంఎఫ్‌ సూచనలను పాటించాల్సి వుంది. దీంతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్‌ ప్రభుత్వం ఈ రుణాన్ని పొందేందుకు ప్రజలపై భారాలు మోపేందుకు సిద్ధమైంది. ఈ పెంచిన పన్ను బుధవారం నుండి అమల్లోకి వస్తాయని పాకిస్తాన్‌ ఫెడరల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ (ఎఫ్‌బిఆర్‌) ఓ ప్రకటనలో తెలిపింది. 33 రకాల వస్తువులతో పాటు స్థానికంగా తయారైన లేదా అసెంబుల్‌…

Read More

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు కీలక నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ మనీలాండరింగ్ ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల మొదటి వారంలోనే నలుగురిని ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 4న నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం వైజాగ్ జైల్లో నిందితులు ఉన్నారని, నిందితుల కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. నిందితుల తరపున వాదించేందుకు ఢిల్లీ, కలకత్తా, ముంబై నుంచి న్యాయవాదులు వచ్చారు. విచారణ సోమవారానికి వాయిదా వేసినట్లు న్యాయస్థానం తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ఎండీ ఆర్జా శ్రీకాంత్ రెండోవ రోజు విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటలకు విచారణ పూర్తి కావడంతో శ్రీకాంత్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఈడీ పేర్కొంది. ఈ కేసులో మొత్తం…

Read More

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నామని జరుగుతున్న ప్రచారంపై బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెరదించారు. శుక్రవారం జ‌రిగిన రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఆగ‌స్టు-సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావొచ్చ‌ని తెలిపారు. ప్ర‌జాప్ర‌తినిధులంద‌రూ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర‌ల‌కు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవాల‌ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు లేవని.. షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారాయన. ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రతి ఎమ్మెల్యే పాదయాత్ర చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కోరారు కేసీఆర్. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కీలక నేతలకు సూచించారు. అదే విధంగా ఎమ్మెల్యేలు.. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు, సభలు నిర్వహించి ప్రజా…

Read More