Author: Editor's Desk, Tattva News

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో జగిత్యాల పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి అంజన్న వెండి విగ్రహం సహా మొత్తం 5 కిలోల వెండి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని జగిత్యాల ఎస్పీ భాస్కర్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా కొండగట్టు ఆలయంలో చోరీకి పాల్పడిందని వెల్లడించారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా..చోరీకి ప్లాన్ చేసిందని..ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 23న రాత్రి ఒంటి గంట సమయంలో నలుగురు దొంగలు అంజన్న ఆలయంలో చొరబడి గర్భాలయంలో ఉన్న సుమారు రూ.9 లక్షల విలువ చేసే 15 కిలోల వెండి సామాగ్రిని దొంగిలించుకుపోయారు. 24న తెల్లవారుజామున స్వామి వారికి పూజలు నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు, ఆలయ అధికారులు దొంగతనం జరిగినట్లు గుర్తించి…

Read More

వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు ఫిబ్రవరి నెలలో 12 శాతం పెరిగి, రూ.1.49లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికంగా రూ. 11,931 కోట్ల సెస్‌ వసూలైనట్లు ఆర్థికశాఖ బుధవారం ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో మొత్తం జిఎస్‌టి వసూళ్లు రూ.1,49,577 కోట్లు కాగా అందులో సిజిఎస్‌టి కింద రూ.27,662 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.34,915 కోట్లు, ఐజిఎస్‌టి కింద రూ.75,069 కోట్లు సమకూరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సెస్సుల రూపంలో రూ.11,931 కోట్లు (వస్తువుల దిగుమతి నుంచి వసూలు చేసిన సుంకాలు కలిపి) వసూలైనట్లు పేర్కొంది. అయితే ఈ వసూళ్లు జనవరిలో నమోదైన రెండవ అత్యధిక వసూళ్లు రూ.1.57 లక్షల కోట్ల కన్నా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. జిఎస్‌టి అమలు చేసిన తర్వాత అత్యధికంగా రూ. 1.68 లక్షల కోట్ల వసూళ్లతో గతేడాది ఏప్రిల్‌ నెల వసూళ్లు ఆల్‌ టైమ్‌ రికార్డుగా ఉన్నాయి. సాధారణంగా ఫిబ్రవరి…

Read More

దేవుని ముందు అందరూ సమానులే అని, కొత్త ప్రభుత్వం వచ్చాక దేవాలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ బాగా జరిగింద‌ని త్రిదండి చిన్న‌ జీయర్ స్వామి చెప్పారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఉదయం నుండి యంత్ర ప్రతిష్ఠాపన, మూర్తి స్థాపన, ప్రాణ ప్రతిష్ట, ధ్వజ స్తంభ, ఆలయ గోపురం ప్రతిష్ఠ, ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల వితరణ వంటి కార్యక్రమాలతో గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహ పున: ప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా త్రిదండి చిన్న‌ జీయర్ స్వామి మాట్లాడుతూ.. ప్రతిష్ఠాపన పూర్తి కావడంతో ఇక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ప్రజలకు దర్శనం ఇస్తారని చెప్పారు. అందరూ ఆ దేవుడిని దర్శించుకొని, తరించాలని సూచించారు.…

Read More

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) విషయంలో టెక్‌ కంపెనీల మధ్య పోటీ ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్‌ ఏఐ అధారిత చాట్‌ జీపీటీను తీసుకు వచ్చింది. దీనికి విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో మిగిలిన టెక్‌ కంపెనీలు ఇదే తరహా సేవలు అందించేందుకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ బార్డ్‌ పేరుతో చాట్‌ జీపీటీ తరహా ఏఐ టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు ఇదే బాటలో ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఇందు కోసం కంపెనీలో ఓ ఉన్నత స్థాయి ప్రొడక్ట్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్గ్‌ జుకర్‌ బర్గ్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత వాట్సాప్‌, ఇన్‌స్టాలో చాట్‌ జీపీటీ తరహా సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. కృత్రి మేథకు సంబంధించిన ఓ టీమ్‌ను ఏర్పాటు చేశామని, దీనికి మెటా చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ క్రిస్‌ కాక్స్‌ నేతృత్వం వహిస్తారని జుకర్‌…

Read More

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజు రోజుకు మరింత పెరుగుతున్నది. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో మంగళవారం డిమాండ్‌ ఏర్పడింది. మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా 14,794 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. గతేడాది ఇదే రోజున గరిష్ఠంగా 12,966 మెగావాట్ల వినియోగం ఉండడం గమనార్హం. రాబోయే రోజుల్లో కరెంటు వినియోగానికి మరింత డిమాండ్‌ ఉండే అవకాశం ఉందని ట్రాన్స్‌కో అధికారులు భావిస్తున్నారు.  పెరిగిన సాగు విస్తీర్ణం, పారిశ్రామిక అవసరాల వల్ల డిమాండ్‌కు కారణాలు పేర్కొంటున్నారు. అయితే, మొత్తం విద్యుత్‌ వినియోగంలో వ్యవసాయానికే 37శాతం వినియోగిస్తున్న రాష్ట్రంగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు వ్యవసాయానికే కేవలం 35 శాతమే వినియోగించే వారని పేర్కొంటున్నారు. వేసవికాలం సమీపిస్తుండడంతో డిమాండ్‌ పెరిగి 37శాతానికి పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.  తెలంగాణవ్యాప్తంగా పంటలకు నీటిని అందించడం పెరిగిందని, అలాగే ఉద్యాన పంటలకు సైతం నీటి వాడకం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బోరుబావులపైనే…

Read More

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు టెక్నాలజీ సహాయపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలిపారు. డిజిటల్ విప్లవం ప్రయోజనాలు పౌరులందరికీ చేరేలా చూసేందుకు రూపొందించనున్న భారీ, ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాల గురించి ప్రధాని వివరించారు. అన్‌లీషింగ్ ది పొటెన్షియల్. ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీపై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రధాని మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తగ్గించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిన్న వ్యాపారాల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి కంపెనీ చేసే వ్యయం తగ్గించాలని కోరారు. చిన్న వ్యాపారాల వ్యయాన్ని తగ్గించాలనుకుంటున్నామని చెబుతూ ఈ మేరకు జాబితాను రూపొందించాలని చెప్పారు. భారతదేశం ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోందని, డిజిటల్ విప్లవం ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చూస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు. 5జి, ఆర్టిఫిషియల్…

Read More

అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, మంత్రి సత్యేందర్‌ జైన్‌ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వారి రాజీనామాలను ఆమోదించారు. ‘నాపై వారు చేసిన ఆరోపణలన్నీ నిజం కాదని కాలం వెల్లడిస్తుంది. నకిలీవనీ నిరూపితమవుతాయి. కానీ ప్రస్తుతానికి వారు అన్ని హద్దులు దాటారు. తప్పుడు, ఆధారాలు లేని ఆరోపణలతో ఒక కుట్రతో నన్ను జైల్లో పెట్టారు. మంత్రిగా నేను కొనసాగకూడదని కోరుకుంటున్నాను’ అని రాజీనామా లేఖలో సిసోడియా తెలిపారు. రద్దయిన ఢిల్లీ మద్యం పాలసీ 2021-22 కేసులో ఆదివారం సిసోడియాను సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్‌ కేసులో సత్యేందర్‌ జైన్‌ను గత ఏడాది మేలో ఇడి అరెస్టు చేసింది. జైన్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. అలాగే, మంగళవారం తనను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మనీష్‌ సిసోడియా దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిసోడియాకు ఫలితాన్ని ఇచ్చే…

Read More

టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీచేశారు. అమరావతి భూముల వ్యవహారంలో నారాయణకు సిఆర్పిసి 41ఏ కింద అధికారులు నోటీసులిచ్చారు. మార్చి 6న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్‌ ఎండీ అంజనీకుమార్‌, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్‌, వరుణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు నోటీసులో అధికారులు పేర్కొన్నారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం సందర్భంగా తయారు చేసిన అలైన్ మెంట్లో మార్పులు చేసి లబ్ది పొందారన్న ఆరోపణల్ని మాజీ మంత్రి నారాయణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా కోర్టు అనుమతితో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆ కేసుకు తోడు నారాయణపై పదో తరగతి పరీక్షాపత్రం…

Read More

అమెరికా అధ్యక్ష్య అభ్యర్థి నిక్కీ హేలీ మరోసారి చైనాపై మండిపడ్డారు. కరోనా వైరస్‌ ఆ దేశ ల్యాబ్‌ నుంచే వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని అమెరికా నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ‘కరోనా వైరస్‌ బహుశా చైనా ల్యాబ్‌ నుంచే వచ్చింది. అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలి. కమ్మూనిస్ట్‌ దేశమైన చైనాకు ఒక్క సెంట్‌ కూడా ఇవ్వొద్దు’ అని ఇండో అమెరికన్‌ అయిన నిక్కీ ట్వీట్‌ చేశారు. రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి ఇండో అమెరికన్‌గా నిక్కీ హేలీ నిలించింది. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల ప్రచారాన్ని ఆమె ఇప్పటికే ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను అధ్యక్షురాలినైతే అమెరికాతో ద్వేషభావంతో వ్యవహరిస్తున్న దేశాలన్నింటికీ విదేశీ నిధులను నిలిపివేస్తానని ప్రకటించారు. తమ సహాయం పొందుతూనే, తమపై ద్వేషం, శత్రుత్వంతో ఉన్న కొన్ని దేశాల వైఖరిని ఆమె ఎండగట్టారు. ద్వేష వైఖరిని ప్రదర్శించే…

Read More

మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. త్రిపురలో బిజెపి తమ అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నేషనల్ డెమోక్రటిక్ ప్రొగెసివ్ పార్టీతో కలిసి బిజెపి అధికారాన్ని పంచుకోనుంది. అయితే మేఘాలయలో ఏ పార్టీకి తగిన మెజార్టీ లభించక హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందని సోమవారం రాత్రి వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఎన్నికలు జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల్లోని త్రిపురలో ఈ నెల ఎన్నికలు ముగిశాయి. రెండు రాష్ట్రాలు మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్ సోమవారంతో ముగిసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర మూడింట ఒక్కో రాష్ట్రంలో 60అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇండియాటుడేయాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం త్రిపురలో బిజెపి, ఐపిఎఫ్‌టి కూటమి 45 స్థానాల్లో గెలుపొందనుంది. లెఫ్ట్ కూటమి 6నుంచి 11స్థానాల్లో విజయం సాధించనుంది. కాంగ్రెస్ వరుసగా రెండోసారి అయితే టైమ్స్ నౌఈటిజి రిసెర్చ్, జీన్యూస్‌మెట్రిజ్ మిశ్రమ ఫలితాలను వెల్లడించాయి. బిజెపి మెజార్టీకి కొద్దిదూరంలో…

Read More