ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 28న విచారణ జరగనుంది. ఫిబ్రవరి 23న ఈ కేసు విచారణ చేపట్టాల్సినప్పటికీ, ఆ రోజు లిస్టులో కేసును చేర్చలేదు. బుధ, గురువారాల్లో ఆఫ్టర్ నోటీస్ కేసులను చేపట్టరాదంటూ ప్రధాన న్యాయమూర్తి సర్క్యులర్ జారీ చేయడంతో కేసు జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. తదుపరి విచారణ ఎప్పుడన్న విషయంపై స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో కేసును ప్రస్తావించింది. త్వరితగతిన విచారణ చేపట్టాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనాన్ని కోరింది. ఈ క్రమంలో కేసును మార్చి 28న విచారణ జరిపే కేసులో జాబితాలో చేర్చుతామని ధర్మాసనం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబడుతూ అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం…
Author: Editor's Desk, Tattva News
దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 2న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా చైత్రశుధ్ద ఏకాదశి పర్వదినం రోజు సింహాద్రినాధుడు కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఏప్రిల్ 1న కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 2న కళ్యాణాన్ని పురస్కరించుకొని సాయంత్రం ఎదురు సన్నాహం, కొట్నాల ఉత్సవం, రాత్రి 8 గంటలకు రధోత్సవం, 9.30 గంటలకు కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిపించనున్నారు. మరో వైపు ఏప్రిల్ 23న అప్పన్న నిజరూపదర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఏడాది పొడవున సుగంద భరిత చందనంలో కొలువుండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్రగా, చందనోత్సవంగా పిలవడం జరుగుతుంది. ఆ రోజు తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తులకు స్వామి నిజరూపదర్శన భాగ్యం కల్పించి తదుపరి వివిధ రకాల…
కేంద్రం సైనిక నియామకాలకు తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీం సమర్థనీయమే అని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. జాతీయ ప్రయోజనాల కోణంలో దీనిని ప్రవేశపెట్టారని, సవాళ్లను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఎదుర్కొనేందుకు సైన్యాన్ని సిద్ధం చేసేందుకు ఈ ఏర్పాటు జరిగిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సైనిక రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన అగ్నిపథ్ స్కీం సముచితంగా లేదని దాఖలు అయిన పలు పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. అంతా బాగానే ఉందని తాము భావిస్తున్నామని, ఇక ఇందులో తమ జోక్యం అవసరం లేదని పేర్కొంటూ తమ ముందుకు వచ్చిన ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించడం లేదని తెలిపారు. అగ్నిపథ్ స్కీంను సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్లపై హైకోర్టు గత ఏడాది తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. ఇప్పుడు దీనిని వెలువరించింది. అగ్నిపథ్ స్కీంతో పాటు ఇంతకు ముందటి అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారా జరిగిన…
రాజకీయవేత్తగా మారిన సినీనటి ఖుష్భూ సుందర్‌కు జాతీయస్థాయిలో కీలక పదవి లభించింది. బిజెపి నేత ఖుష్భూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లూ) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఖుష్భూ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. జాతీయ మహిళా హక్కుల కమిషన్ సభ్యురాలిగా నియమితులైనట్లు ఖుష్భూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆమెకు అభినందనలు తెలిపారు. మహిళా హక్కుల కోసం ఖుష్భూ అలుపెరగని పోరాటానికి గుర్తింపుగా పదవి లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖుష్భూ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. “మీ నాయకత్వంలో నారీశక్తి పరిరక్షణకు, అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తాను” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా తొలుత డిఎంకెలో చేరిన ఖుష్భూ చేరారు. తర్వాత కాంగ్రెస్ లో చేరి జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రస్తుతం…
తెలంగాణాలో ప్రసిద్ధి పొందిన పేరిణి నృత్య కళ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. పేరిణి నాట్యం కాకతీయుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన నాట్యం అని, అటువంటి పేరిణి నాట్యానికి రాజ్‌కుమార్ నాయక్ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారని కొనియాడారు. రాజ్‌కుమార్ నాయక్ తెలంగాణలోని 31 జిల్లాల్లో 101 రోజుల పాటు పేరిణి ఒడిస్సీ నిర్వహించారని, పేరిణి రాజ్‌కుమార్ పేరుతో ఆయన ప్రజలకు సుపరిచితులయ్యారని ప్రధాని పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో పేరిణి నాట్యం బాగా ప్రాచుర్యం పొందిందని, ఈ నాట్య కళను శివునికి అంకితమిచ్చారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. కాకతీయ రాజవంశ మూలలు నేటి తెలంగాణకు సంబంధించినవేనని తెలిపారు. చరిత్రను, సంస్కృతిని కళాకారులను కాపాడాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. కళను, కళాకారులను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలు ఇచ్చి సంగీత ప్రదర్శన రంగంలో…
పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థకు, మరణాలకు ముగింపు పలకడానికి గత పదేళ్లలో ఏం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్కు ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ వ్యవస్థకు ముగింపు పలకాలని, అత్యవసర పరిస్థితుల్లో కూడా తగిన భద్రత లేకుండా మురుగు కాల్వల్లోకి ప్రవేశించే ఈ ‘అమానవీయ పద్ధతి’ నుంచి భవిష్యత్ తరాలను నిరోధించాలని పదేళ్ల క్రితమే ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డ్రై లెట్రిన్స్ (నిషేధం) చట్టం 1993, మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధిని నిషేధించడం, వారి పునరావాస చట్టం 2013 ఉన్నా దేశంలో పారిశృధ్య కార్మికులుగా పనిచేయడం, మురుగు కాల్వల్లో చిక్కుకున్న వ్యక్తుల మరణాలు ఇప్పటికీ కొనసాగుతుండటంపై జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల జ్యుడీషియల్ నోటీసు తీసుకుంది. 2014లో సఫాయి కరంచారి ఆందోళన్, ఇతరులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పులో మాన్యువల్…
తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. మార్చ్ 9 నుండి చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రతిసారీ మంత్రుల బృందంతో మాటలు.. చాయ్ బిస్కెట్ చర్చలే తప్ప ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 13వ తేదీన ఏపీ జేఏసీ అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 50 పేజీల వినతిపత్రం ఇచ్చాం. అయినా ఎలాంటి స్పందన లేదు. ఉద్యోగులు చట్టబద్ధంగా దాచుకున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని.. న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగులను ప్రభుత్వం చులకనగా భావిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తుంటే ప్రభుత్వం దాన్ని చేతగానితనంగా చూస్తోందని విచారం…
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన పీజీ విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచింది. విద్యార్థిని ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యుల ప్రత్యేక బృందం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు ప్రీతి తుదిశ్వాస విడిచినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. రాత్రి 9.10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రీతి మృతి నేపథ్యంలో నిమ్స్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రీతీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ రూ. 30 లక్షల తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రీతి మృతి తర్వాత అర్ధరాత్రి వరకు హైదరాబాద్ నిమ్స్ వద్ద…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. ఆయనను విచారణకు పిలిపించిన సీబీఐ అధికారులు అనంతరం అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. సిసోడియాను దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. సిసోడియా విచారణ, అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా, మనీశ్ సిసోడియాకు సోమవారం మధ్యాహ్నం అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం విధానం ఖరారు చేయడం వెనుక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని, లిక్కర్ కుంభకోణం జరగడానికి మార్గం సుగమం చేశారని సిసోడియాపై ఆరోపణలున్నాయి. సిసోడియా అరెస్టుతో ఆమ్ఆద్మీ పార్టీ నిరసనలు చేసే అవకాశం ఉందన్న అంచనాలతో ఢిల్లీలో పోలీసులు, కేంద్ర బలగాలతో కేంద్రం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఉదయం సీబీఐ కార్యాలయానికి సిసోడియా ర్యాలీగా వెళ్లిన సమయంలోనే ఆమ్ఆద్మీ శ్రేణులు ఆందోళన…
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే రోజు ఉభయసభలను ఉద్దేశించి నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉండనుంది. ఇక కీలకమైన బడ్జెట్ ను మార్చి 17వ తేదీన ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్చి 15వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మాట్లాడే అకాశం ఉంది. అయితే ఆయా తేదీలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తి అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ సర్కార్ యోచించింది. ఎన్నికలతో సంబంధం లేకుండా… సభను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా మార్చి 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జీ-20 సదస్సులు జరగనున్నాయి. వీటికంటే ముందే శాసనసభ సమావేశాలను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.…