బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన డాటా కాపీలు తీసుకొన్నారు. సంస్థ ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలపై ఉద్యోగులను ప్రశ్నించారు. సీనియర్ ఉద్యోగుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడంతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో పలు డిజిటల్ రికార్డ్లు, ఫైల్స్ని సర్వే చేశారు ఆదాయపు పన్నుశాఖ అధికారులు. బీబీసీ ఢిల్లీ ఆఫీసుకు చెందిన సీనియర్ ఎడిటర్లతో పాటు మొత్తం మీద 10 మంది ఉద్యోగులు.. మూడు రోజుల తర్వాత ఇళ్లకు చేరుకున్నారు. అయితే సోదాల గురించి ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. “ఢిల్లీ, ముంబైల్లోని మా కార్యాలయాలను ఐటీశాఖ అధికారులు విడిచిపెట్టి వెళ్లిపోయారు.…
Author: Editor's Desk, Tattva News
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసిన పాతబస్తీకి చెందిన అబ్దుల్ కలీమ్ అనే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో జాహీద్‌తో పాటు ముగ్గురిని గతంలోనే అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు జాహీద్‌కు రూ.40 లక్షలు అబ్దుల్ కలీమ్ ఆర్ధిక సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కలీమ్ ఇచ్చిన రూ.40 లక్షలతో జాహీద్ కార్లు, బైకులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. హ్యాండ్ గ్రానైట్లతో పేలుళ్లకు జాహీద్ ముఠా కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో గతంలో ఉగ్రవాదంకు సంబంధించి పలు కేసులలో అరెస్టులు జరిగినా, భారీగా ఆర్ధిక సహాయం చేసాడని అరెస్ట్ జరగడం బహుశా ఇదే ప్రధమం కావడం గమనార్హం. హ్యాండ్ గ్రానైట్లు పెట్టి పేల్చడానికి కుట్ర పన్నారని, దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాల్లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. గతంలోనే ఈ పేలుళ్ల కుట్రను పోలీసులు…
ప్రఖ్యాత తీర్థ స్థలం షిర్డీ క్షేత్రానికి ఇక రాత్రిపూట కూడా విమానంలో వెళ్లవచ్చు. సంబంధిత నైట్ ల్యాండింగ్ లైసెన్సును అక్కడి విమానాశ్రయానికి పౌర విమానాయాన అధీకృత సంస్థ (డిజిసిఎ) మంజూరు చేసింది. దీని వల్ల మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని విమానాశ్రయంలో రాత్రిపూట కూడా విమానాల రాకపోకలు ఉంటాయి. షిర్డీకి యాత్రికుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, కాలయాపన లేకుండా షిర్దీ సాయిబాబా ఆలయ సందర్శనకు వీలు కల్పించేందుకు ఇప్పటి విమాన రాత్రి పూట సౌకర్యం వీలు కల్పిస్తుంది. షిర్డీ ఇప్పటికే పలు విధాలుగా రైళ్ల సౌకర్యంతో ఉంది. అక్కడికి ముంబై నాగ్‌పూర్ సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే మార్గం ఉంది. ప్రతిష్టాత్మక వందేభారత్ రైలు సర్వీసు కూడా అందుబాటులో ఉంది. సాయి భక్తులకు ఇది మంచి శుభవార్త అని , షిర్డీ ఎయిర్‌పోర్టుకు నైట్ ల్యాండింగ్ సౌకర్యం ఏర్పాటుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర పౌర…
కన్నబిడ్డ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు కన్నీటిని దిగమింగుతూనే 120 కిలోమీటర్లు స్కూటీపైనే మృతదేహంతో ప్రయాణించారు. ఎపిలోని విశాఖ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ చిన్నారి చికిత్స కోసం అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడ గ్రామానికి చెందిన ఓ గిరిజన దంపతులు విశాఖలోని కెజిహెచ్ ఆసుపత్రికి వచ్చారు. చికిత్స పొందుతున్న క్రమంలో చిన్నారి మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని తరలించేందుకు విశాఖలోని కెజిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోడం, ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించే స్తోమత లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు విశాఖ నుంచి పాడేరు వరకు స్కూటీపైనే మృతదేహాన్ని తరలించారు. అంబులెన్స్ కోసం ఎంతలా ప్రాధేయపడినా కెజిహెచ్ సిబ్బంది కనికరించలేదని, అందువలనే గత్యంతరం లేక స్కూటీపై బిడ్డ మృతదేహాన్ని తరలించినట్లు బాధిత తల్లిదండ్రుల చెబుతున్నారు. కెజిహెచ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షం వలనే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ సంఘటన పట్ల ఆగ్రహం…
ప్రముఖ సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ కు నీల్ మోహన్ సీఈవోగా నియమితులయ్యారు. సంస్థకు అత్యధిక కాలం సీఈవోగా పని చేసిన సూసన్ వొజిసికి పదవి నుంచి వైదొలిగారు. దీంతో యూట్యూబ్ యాజమాన్యం నీల్ మోహన్‌ను కొత్త సీఈవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నీల్ మోహన్ ఇండియన్-అమెరికన్. నీల్ మోహన్ ప్రస్తుతం ఆ సంస్థలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గాపని చేస్తున్నారు. నీల్ మోహన్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2008లో ఆయన గూగుల్‌లో చేరారు. భారతీయులకు టాప్ కంపెనీల్లో అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తుండడం విశేషం. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ పని చేస్తున్నాను. వీరి సరసన ఇప్పుడు నీల్ మోహన్ చేరారు. యూట్యూబ్ నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న నీల్‌మోహన్‌కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు. సుసాన్ వొజిసికి…
బీఆర్‌ఎస్, కల్వకుంట్ల కుటుంబం నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో తాము లేమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీబీసీపై ఐటీ దాడులతో దేశ ప్రతిష్ట దిగజారుస్తున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గురువారం ఢిల్లీ అశోక హోటల్‌లో జరిగిన టూరిజం ఇన్ మిషన్ మోడ్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మీడియా సంస్థలపై నిషేధం విధించిన వారు నీతులు చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా రాస్తున్నారంటూ తెలంగాణలో వివిధ మీడియా సంస్థలపై నిషేధం విధించి ముప్పుతిప్పలు పెట్టిన కల్వకుంట్ల కుటుంబం పత్రికా స్వేచ్ఛ విషయంలో తమకు నీతులు బోధించాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. పత్రికా స్వేచ్ఛను కాలరాసిన కల్వకుంట్ల కుటుంబం చేసే పనుల గురించి, వారి వ్యవహార శైలి ఎలాంటిదో తెలంగాణ సమాజానికి తెలుసునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మీడియా సంస్థలపై దాడులు చేయడం లేదని స్పష్టం చేశారు. అది బీఆర్ఎస్ పార్టీకి…
దేశంలో వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల బహుళార్థక వ్యవసాయ పరపతి కేంద్రాలు (పిఎసిఎస్) ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పటిష్టవంతమైన పాల, మత్స సహకార సంఘాలను వచ్చే ఐదేళ్లలో ఏర్పాటు చేసేందుకు దీనితో వీలేర్పడుతుందని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. దేశంలో సహకార రంగాన్ని అట్టడుగు స్థాయిలోకి విస్తరింపచేయడం, ఇదే క్రమంలో దీని పటిష్టతకు చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 13 కోట్ల మంది రైతులు ప్రాధమిక సహకార సంఘాలతో వివిధ స్థాయిల్లో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. ఈ సొసైటీల పరిధిలో వివిధ పథకాలను మరింత వేగవంతంగా అమలు చేసేందుకు వీలేర్పడుతుంది. ప్రభుత్వ సంపూర్ణ ప్రమేయం కల్పించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. దేశంలో ఇప్పుడు 63000 పిఎసిలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు పిఎసిలు లేని ప్రతి పంచాయతీలో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు అవుతాయి. ప్రత్యేకించి పాడి, మత్స పరిశ్రమపైనే…
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి బలమైన నియోజకవర్గంగా భావించే కైకలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. వైసిపిలో చేరిన టిడిపి మాజీ ఎమ్యెల్యే జయమంగళ వెంటకరమణను వెంటనే పార్టీ ఎమ్యెల్సీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఆయనతో పాటు టిడిపికి చెందిన పలువురు సీనియర్ నేతలు జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు వెంకట రమణ, గుర్రాజుకు కండువాలు కప్పి పార్టీలోకి సీఎం వైయస్ జగన్ ఆహ్వానించారు. 2009లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకట రమణ, ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆయన బుధవారమే టీడీపీ సభ్యత్వానికి,…
గ్రామాల అభివ్రుద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కరానికి నిధులివ్వాలని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం అమీర్ పేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలోని పంచాయతీల అభివ్రుద్ధికి నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే. మీ లెక్క (బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి) నరేంద్రమోదీ గారు బీజేపీలోనే చేరితేనే పంచాయతీలకు నిధులిస్తామని చెబితే… బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా?’’అంటూ ప్రశ్నించారు.. బీఆర్ఎస్ పార్టీ ముంచిన ఫైనాన్స్ కొత్త దుకాణమే అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు కార్యవర్గమే లేదు. ఇతర రాష్ట్రాల నుండి బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులంతా చెల్లని కాసులు. మునుగోడు ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో బూత్ కు ఒక్కో ఎమ్మెల్యే, మంత్రిని నియమించిన టీఆర్ఎస్ కు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ చాలని స్పష్టం చేశారు.…
ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 7వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. బుధవారం జరిగిన గ్రూప్‌ాబి రెండో లీగ్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 118పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియా 18.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 119పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో గ్రూప్‌ాబిలో భారత్ 4పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. తొలుత టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ(3/15) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. ఆ తర్వాత రేణుక, పూజా ఒక్కో వికెట్‌తో చెలరేగడంతో విండీస్ జట్టు భారీస్కోర్ చేయలేకపోయింది. ప్రత్యర్ధి జట్టులో ఓపెనర్ టేలర్(42), క్యాంప్‌బెలె(30) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. కెప్టెన్ హేలీ మాథ్యూస్(2), హెన్రీ(2), ఫ్లెచర్(0) నిరాశపర్చారు. స్టాఫానీ టేలర్, షెమైన్ రాణిండంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు…